దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక? | which magazine was launched by Gandhi in South Africa ? | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక?

Published Wed, Jul 9 2014 10:19 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక? - Sakshi

దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక?

గాంధీజీ ప్రాభవం
స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ తిరుగులేని నాయకునిగా ఆవిర్భవించారు.  ప్రతికూల పరిస్థితులన్నింటినీ అధిగమించారు. సమకాలీన రాజకీయ, ఆర్థిక పరిస్థితులతోపాటు  గాంధీజీ వ్యక్తిత్వం కూడా  ఇందుకు దోహదపడింది.
 
సమకాలీన రాజకీయ పరిస్థితులు
1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చేనాటికి భారతదేశంలో నాయకత్వ సమస్య ఏర్పడింది. 1915లో మితవాద నాయకుడైన గోపాలకృష్ణ గోఖలే కన్నుమూశారు. ఆరేళ్లు కారాగారవాసం అనుభవించిన అతివాదుల నాయకుడు తిలక్‌లో మునుపటి ఉత్సాహం కొరవడింది. కాంగ్రెస్ పార్టీలో అనిబీసెంట్ నాయకత్వాన్ని బహిర్గతంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏ నాయకునికీ రాజకీయ అనుభవం లేదు. ఈ పరిస్థితుల్లో వలసవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలతో ప్రజాస్వామ్య పోరాటాన్ని నడిపిన ఏకైక నాయకుడు గాంధీజీ.
 
గాంధీజీ భారతదేశానికి వచ్చిననాటి  నుంచి సామాన్య ప్రజల్లో ఒకరిగా మెలిగారు. కార్మికుల, కర్షకుల సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీని సామాన్య ప్రజల వద్దకు చేర్చడంలో సఫల మయ్యారు. అహ్మదాబాద్ మిల్ వర్కర్‌‌స ఉద్యమాలు  గాంధీజీని తిరుగులేని నాయకునిగా మలిచాయి.
 
ఆర్థిక కారణాలు
గాంధీజీ నాయకునిగా బలపడడానికి మొదటి ప్రపంచ యుద్ధం(1914-18) తర్వాత ఏర్పడిన పరిస్థితులు  కారణమయ్యాయి. గాంధీజీ భారతదేశం వచ్చే నాటికి  మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది.  భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పన్నుల భారం ఎక్కువైంది. పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగ సమస్య ప్రబలింది. ఈ ఆర్థికపరమైన నిస్పృహను గాంధీజీ చక్కగా వినియోగించుకోగలిగారు.
 
వ్యక్తిత్వం - మేధస్సు
తన రాజకీయ జీవితం ప్రారంభం అయినప్పటి నుంచి సమకాలీన రాజనీతి సిద్ధాంతాల న్నింటిలోనూ గాంధీజీ ఆరితేరారు.  లియోటాల్ స్టాయ్ మానవతా వాదం, మాగ్జిమ్ గోర్కి విశ్వజనీన భావనలు, హెర్బర్‌‌ట స్పెన్సర్‌లో ఉన్న వ్యక్తి శ్రేయోవాదం, కార్‌‌ల మార్‌‌క్స సామ్యవాద సిద్ధాంతాలు గాంధీజీని ప్రభావితం  చేశాయి. థోరో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు రస్కిన్ పెట్టుబడిదారీ విధానం గాంధీజీని గొప్పగా ప్రభావితం చేశాయి. ఇంతగా సమకాలీన రాజకీయ సిద్ధాంతాలపై అవగాహన ఆ కాలంలో ఏ ఒక్క నాయకునికీ లేదు. టాల్‌స్టాయ్ ’The kingdom of god is with in you' , Æý‡íÜP¯Œæ 'Unto this last', ఎడ్విన్ ఆర్నాల్డ్ ’Song Celestial’, ఫ్రెంచి తాత్వికుడైన థోరో ’Civil disobedience', మార్‌‌క్స ‘దాస్ కాపిటల్’ లాంటి గ్రంథాలు గాంధీజీలో  విశిష్ట లక్షణాలు పెంపొందడానికి కారణ మయ్యాయి.

భిన్న దృక్పథాలు కలిగిన వాదాల మధ్య గాంధీజీ సమతూకం సాధించగలడం ఆయన వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం. పలువాదాల మధ్య సమతూకాన్ని సాధించడం వల్ల మితవాదులకు మితవాదిగా, అతివాదులకు అతివాదిగా, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నాయకునిగా గాంధీజీ గుర్తింపు పొందారు. ఇది గాంధీజీ వ్యక్తిత్వానికి సంబంధించిన అద్భుత విజయం. భారతదేశంలోని విభిన్నమతాలు, సంస్కృతులు,  వర్గాల మధ్య  గాంధీజీ చక్కని సమతౌల్యాన్ని సాధించగలిగారు. రామరాజ్యం గురించి ఎక్కువగా ప్రస్తావించడం, భగవద్గీతను నిరంతరం పఠించడం వల్ల గాంధీజీ హిందువుల మద్దతును కూడగట్టుకోగలిగారు. అదేవిధంగా ఖిలాఫత్ సమస్యలో భారతీయ ముస్లింలను బలపర్చి వారి  అభిమానాన్ని పొందగలిగారు. భిన్న మతాలకు చెందిన అఖిల భారత ఖిలాఫత్ సమావేశానికి (కమిటీ) అధ్యక్షుడు కాగలిగారు.
 
ఈ విధంగా హిందువులు, ముస్లింలకు మధ్య గాంధీజీ సమతౌల్యాన్ని సాధించగలిగారు.  భూస్వాములు, పెట్టుబడిదారీ వర్గాలకు కూడా గాంధీజీ నాయకత్వం సమ్మతమైంది. ఇందుకు కారణం  వర్గ పోరా టం, రక్తపాతం లేని సామ్యవాదం గురించి గాంధీజీ మాట్లాడటం. దీన్నే ట్రస్టీషిప్ అంటారు. స్వచ్ఛందంగా భూస్వాములు తమ మిగులు భూమిని ఇవ్వాలని,  పెట్టుబడిదారులు తమ లాభాన్ని సమాజంతో పంచుకోవాలని  గాంధీజీ పిలుపు నిచ్చారు.  అందువల్ల భూస్వాములకు, పెట్టుబడిదారులకు గాంధీ అనుకూలమైన నాయకుడు కాగలిగారు. అహ్మదాబాద్ మిల్ వర్కర్‌‌స పోరాటంలో పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య సంధి కుదిర్చారు. ఈ విధంగా అన్ని వర్గాల నాయకునిగా గాంధీజీ ఆమోదం పొందారు.
 
పోరాట విధానం
గాంధీజీ తన పోరాటంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేశారు. ఈ పోరాట విధానంలో మితవాదం ఉంది. అతివాదమూ ఉంది. గాంధీజీ తనదైన శైలిలో కొత్త పంథాను ప్రవేశపెట్టారు. ఈ విధానాన్నే పోరాటం - విరామం - తిరిగి పోరాటం అని నిర్వచించారు.  ఉధృతంగా ఉద్యమాన్ని ప్రారంభించడం, ఒకదశలో నిలిపివేయడం, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాన్ని ప్రారంభించడం గాంధీజీ పోరాట విధానంలో భాగమైంది.
 
 రాజకీయ పోరాటంలో చైనా నాయకుడు ‘మావో’ సూత్రాన్ని గాంధీజీ ఆచరించారు. జాతీయోద్యమం ఒక దశ నుంచి మరో  దశకు బలపడేలా చేశారు. పోరాటాన్ని ఆపి బలహీనతలు ఎక్కడ  ఉన్నాయో గుర్తించి, కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకువచ్చారు.  దాంతో కాంగ్రెస్‌లో గాంధీజీ తిరుగులేని నాయ కునిగా చెలామణి అయ్యారు.
 
 మాదిరి ప్రశ్నలు
 
 1.    గాంధీజీ సిద్ధాంతం ఆధారంగా నిరాటం కంగా కొనసాగిన ఉద్యమం ఏది?
     1) సహాయ నిరాకరణోద్యమం
     2) స్వదేశీ ఉద్యమం
     3) క్విట్ ఇండియా ఉద్యమం
     4) శాసనోల్లంఘన ఉద్యమం
 
 2.    స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి కింది సంఘటనల్లో వాస్తవం కానిది?
     1) 1905లో బెంగాల్ విభజన  
     2) 1907లో ముస్లింలీగ్ ప్రారంభం
     3)    1909లో మింటో-మార్లే సంస్కరణ లు, ముస్లింల డిమాండ్లను ఆమోదిం    చడం
     4)    1910 భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటన
 
 3.    దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆసియన్ల హక్కుల కోసం పోరాడడానికి కారణం?
     1) నల్లజాతి పౌరుల రిజిస్ట్రేషన్ చట్టం
     2) ఆసియన్ల రిజిస్ట్రేషన్ చట్టం
     3) ది కలర్‌‌డ లెసైన్‌‌స చట్టం
     4) ది అపర్థీడ్ చట్టం
 
 4.    గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రాముఖ్యత?
     1) పెద్ద ఎత్తున కొనసాగడం
     2)    {పజలు పెద్ద మొత్తంలో భాగస్వా ములు కావడం
     3) తొలిసారిగా అహింసా పద్ధతిని శక్తిమం తమైన ఆయుధంగా ప్రయోగించడం
     4) ఏవీకావు
 
 5.    ‘చాలా కాలం నుంచి మనం అదృష్టంపై విశ్వాసం ఉంచాం. ప్రస్తుతం మనం కష్టపడి పనిచేసి అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనిస్తున్నాం’.  అని ఎవరు అన్నారు?
     1)    జవహర్ లాల్ నెహ్రూ 1947  ఆగస్టు    15న
     2)    మొదటి స్వాతంత్య్ర వార్షికోత్సవం రోజున జవహర్ లాల్ నెహ్రూ
     3)    భారత్ రిపబ్లిక్‌గా అవతరించిన సందర్భంలో రాజేంద్రప్రసాద్
     4)    పార్లమెంట్ ఉభయసభల తొలి సంయుక్త సమావేశం రోజున డాక్టర్ రాధాకృష్ణన్
 
 6.    కింది సంఘటనలను వరుస క్రమంలో సూచించండి?
     1) సహాయ నిరాకరణోద్యమం
     2) లక్నో ఒప్పందం
     3) మాంటేగ్ సంస్కరణలు
     4) మొదటి ప్రపంచ యుద్ధం
     1) ఎ, బి, సి, డి    2) డి, సి, బి, ఎ
     3) డి, సి, ఎ, బి    4) డి, బి, సి, ఎ
 
 7.    1915లో సత్యం, అహింస పాటించడానికి మహాత్మాగాంధీ ఏం చేశారు?
     1) సత్యాగ్రహ ఆశ్రమం స్థాపన
     2) భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరడం
     3) సత్యాగ్రహం ప్రారంభించడం
     4) సబర్మతి ఆశ్రమం ప్రారంభం
 
 8.    క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కింది ప్రకటనలో వాస్తవమైంది?
     1)    పూర్తిగా అహింసాయుతంగా కొన సాగిన ఉద్యమం
     2)    పై స్థాయిలోని మధ్య తరగతి ప్రజలు ఉద్యమం పట్ల ఉత్సాహం చూపలేదు
     3)    ముస్లింలు ఉద్యమంలో పాల్గొనలేదు
     4)    ఉద్యమ స్వరూపాన్ని గమనించి భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని బ్రిటిషర్లు నిర్ణయించారు
 
 9.    దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ ప్రారంభిం చిన పత్రిక?
     1) ఇండియా గెజిట్    
     2) నవజీవన్
     3) ఇండియన్ ఒపీనియన్
     4) ఆఫ్రికనీర్
 
 10.    1931 మార్చి 5న గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి సంబం ధించనిది ఏది? (2002 సివిల్స్)
     1) కాంగ్రెస్ ఉప్పు సత్యాగ్రహాన్ని ఆపాలి
     2) రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కావాలి
     3) అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయాలి
     4) రైతుల నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఎమ ర్జెన్సీ రెవెన్యూను డిమాండ్ చేయరాదు
 
 11.    సహాయ నిరాకరణోద్యమంలో కార్మికుల పాత్రపై ‘ఇండియా టుడే’ అనే గ్రంథాన్ని రచించినవారు?          (1999 సివిల్స్)
     1) రమేష్ చంద్రదత్
     2) రజనీ పామెదత్
     3) రమేష్ అరోరా    4) రమేష్ టాండన్
 
 12.    ‘బెంగాల్ రాష్ట్రాన్ని చీల్చి, మన పాలనని ప్రతిఘటించే గట్టి ప్రత్యర్థుల్ని బలహీన పర్చడమే మన ధ్యేయం’ అని తన డైరీలో రాసిందెవరు?         (1998 సివిల్స్)
     1) లార్‌‌డ కర్జన్    2) రాబర్‌‌ట సన్
     3) థామస్‌ర్యాలీ    4) రిస్లే
 సమాధానాలు
 1) 2;    2) 3;    3) 2;    4) 4;    5) 4;    6) 1;    7) 1;    8) 4;    9) 2;    10) 4;11) 2;    12) 4.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement