సివిల్స్‌లో భారత స్వాతంత్రోద్యమ ప్రాధాన్యం ఏమిటి?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఈ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి?
- టి.ఉమారాణి, సికింద్రాబాద్
సివిల్స్ సిలబస్‌లో భారత స్వాతం త్య్రోద్యమం ముఖ్య పాఠ్యాంశం. గాంధీయుగం, స్వాతంత్య్రం అనంతరం యుగాలపై అభ్యర్థులకు అవగాహన అవసరం. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో వచ్చిన గ్రంథాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కింది ప్రశ్నను పరిశీలించండి.
1. List–I, List–IIలలో గ్రంథాలు, గ్రంథకర్తలను జతపర్చండి?
(2001, 2008, 2011 సివిల్స్)
List–I
a) సుభాష్ చంద్రబోస్
b) అబుల్ కలాం ఆజాద్
c) రాజేంద్రప్రసాద్
d) జవహర్ లాల్ నెహ్రూ
List–II
1) భారతదేశం స్వాతంత్య్రం సాధిస్తుంది.
2) భారతదేశం ఎందుకంటే?
3) భారతదేశం స్వాతంత్య్రానికై పోరాటం
4) భారతదేశ విభజన
A B C D
1) 1 4 3 2
2) 3 2 4 1
3) 3 1 4 2
4) 4 1 2 3
సమాధానం - 3
- వివరణ: ఆజాద్ రాసింది ‘భారతదేశం స్వాతంత్య్రం సాధిస్తుంది’ (ఇండియా విన్‌స ఫ్రీడం). ఏప్రిల్ 15, 1946లో రచించాడు. సుభాష్ చంద్రబోస్ - భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాటం, రాజేంద్రప్రసాద్ - భారతదేశ విభజన, నెహ్రూ - భారతదేశం ఎందుకంటే’ గ్రంథాలు రచించారు. ఇవన్నీ ‘ఇండియా’పై వచ్చాయి. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం, ఇండియా డివెడైడ్, వైదర్ ఇండియా. కాబట్టి ఇలా ఇండియాతో ముడిపడి ఉన్న గ్రంథాలన్నీ ఒకే చోట రాసుకోవడం ముఖ్యం.
- 2000, 2007లలో స్వాతంత్య్ర ఉద్యమ కాలం నాటి సాంస్కృతిక కట్టడాలపై అడిగిన ప్రశ్న చాలా లోతైందిగా గమనించాలి.
2. వీటిలో సరైంది ఏది?
1) విక్టోరియా మెమోరియల్ హాల్ (కలకత్తా) - హార్బర్‌ట బేకర్
2)సెంట్రల్ సెక్రటేరియట్ (న్యూఢిల్లీ) - ఎమర్సన్ డబ్ల్యూ
3) గేట్ వే ఆఫ్ ఇండియా (ముంబాయి) - ఆర్.ఎఫ్. చిస్లోమ్
4) మద్రాస్ విశ్వ విద్యాలయ సెనేట్ హాల్ -ఆర్.ఎఫ్. చిస్లోమ్
5) ‘చండీగడ్’ నగర నిర్మాత - ఎడ్విన్ లూయీటిక్స్
సమాధానం - 5
వివరణ: ఎడ్విన్ లూయీటిక్స్ ఢిల్లీలోని ‘పార్లమెంట్ భవనం, చండీగడ్ పట్టణం నిర్మించాడు. విక్టోరియా మెమోరియల్ హాల్‌ను (డబ్ల్యూ ఎమర్సన్), సెంట్రల్ సెక్రటేరియట్ భవనాన్ని (హార్బర్‌ట బేకర్), గేట్ వే ఆఫ్ ఇండియా (జార్జీ క్లార్‌క), మద్రాస్ విశ్వ విద్యాలయం (ఆర్.ఎఫ్. చిస్లోమ్)లు నిర్మించారు. దీన్ని బట్టి ప్రశ్నలను ఎంత లోతుగా అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి.
- స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో వచ్చిన గిరిజన, రైతు, సాయుధ పోరాటాలపై(20వ శతాబ్దంలో) కూడా సంపూర్ణ అవగాహన ఉండాలి.
ఉదా: 2009, 1999, 2011, 2001(సివిల్స్)లో అడిగిన కింది ప్రశ్నను పరిశీలించండి.
3. వీటిలో సరైంది ఏది?
1) పత్తర్‌ఘట్ ఉద్యమం -
1898 హైదరాబాద్
2) తెభాగా ఉద్యమం - 1924 బీహార్
3) ఏకా ఉద్యమం - 1912 పంజాబ్
4) మోప్లా ఉద్యమం - 1921 కేరళ
సమాధానం - 4
వివరణ: మోప్లా ఉద్యమం సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా కేరళలో 1921లో హాజి మహ్మద్ నాయకత్వంలో ముస్లిం రైతులు చేసిన గొప్ప తిరుగుబాటు. ఇందులో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని గాంధీ సందర్శించకపోవటం అనేక విమర్శలకు తావిచ్చింది. పత్తర్‌ఘాట్ ఉద్యమం 1898-99లలో ‘అస్సాం’ ప్రాంతంలోని గిరిజనులు ఎల్జిన్-2 రాజప్రతినిధి కాలంలో తిరుగుబాటు చేశారు. 368మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. గొప్ప గిరిజన ఉద్యమంగా ‘పత్తర్‌ఘాట్’ సంఘటన చరిత్రలో నిల్చిపోయింది.
‘తెబాగా’ ఉద్యమం 1945-1946లో బెంగాల్ రాష్ర్టంలో వచ్చిన సాయుధ రైతాంగ పోరాటం, ‘తెలంగాణలో’ కూడా ఇదే తరహా ఉద్యమం 1946-51 మధ్య కాలంలో జరిగింది. ‘ఏకా ఉద్యమం’ 1921లో ఉత్తరప్రదేశ్‌లో వచ్చింది. దీన్ని ‘మాదరిపాసి’ సితాపూర్ జిల్లాలో నిర్వహించారు. డాక్టర్ అజయ్ రాయ్ 1971 తెబాగా ఉద్యమంపై ముఖ్య విషయాలు సేకరించాడు. గాంధీ కూడా ఈ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు.
4. వీటిలో సరైంది?
1) బార్డోలి సత్యాగ్రహం - 1928 గుజరాత్ (వల్లభాయ్ పటేల్)
2) ఉత్కల్ ప్రోవెన్షియల్ కిసాన్ సభ (మాలతీ చౌదరి)
3) ఏటియాల నో-రెంట్ స్ట్రగుల్ - భగవాన్ సింగ్ ఉద్యమం
4) బీహారీ కిసాన్ సభ (యదునందన్ శర్మ)
సమాధానం - 1
వివరణ: 1928లో గుజరాత్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ‘బార్డోలి’ సత్యాగ్రహం జరిగింది. ఈ సందర్భంగానే పటేల్‌కు ‘సర్దార్’ అనే బిరుదును గాంధీజీ ఇచ్చారు. మాలతీ చౌదరి -ఉత్కల్ కిసాన్ సభ, కరుణసింధు రాయ్ ‘సుర్మావ్యాలీ’ ఉద్యమంలో భాగంగా నో-రెంట్ ఉద్యమం నిర్వహించారు. భగవాన్‌సింగ్ లాంగోవాలా ‘ముజారా’ ఉద్యమం, యదునందన్ శర్మ ‘బీహారీ కిసాన్ సభ’లు స్థాపించారు.
5. ‘ముస్లింలీగ్’ పార్టీ స్థాపకులెవరు?
(1999, 2002 - సివిల్స్)
1) హస్రఫ్ మొహానీ
2)యూసుఫ్ మెహారోలి
3)ఫజుల్-హుక్
4)చౌదరి ఖాతి ఖ్వాజామన్
సమాధానం: 4
వివరణ: హస్రఫ్ మొహానీ ప్రసిద్ధ గజల్స్ కవి ‘పూర్ణ స్వరాజ్, ఇంక్విలాబ్ జిందాబాద్’ మొదలైన పదాల సృష్టికర్త. యూసుఫ్ మొహారోలి కాంగ్రెస్‌సోషలిస్ట్ స్థాపకులు. ఫజుల్ హుక్ బెంగాల్ ప్రజాపార్టీ స్థాపకులు. పార్టీలు -స్థాపకులు, వాటి ముఖ్య నాయకులు లాంటి ప్రశ్నలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే తీవ్రవాద సంస్థలు వాటి స్థాపకులు, వారు పాల్గొన్న కుట్ర కేసులపై కూడా కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి.
6. ‘అరబిందోఘోష్’కు సంబంధించిన కుట్రకేసు ఏది?(2000, 2001 సివిల్స్)
1) అలీపూర్ కుట్రకేసు
2) లాహోర్ కుట్రకేసు
3) కాకోరి కేసు
4) చిట్టగాంగ్ కేసు
సమాధానం: 1
వివరణ: అరబిందో ఘోష్ ‘భందేమాతరం’ పత్రిక ఎడిటర్, సావిత్రి అనే గ్రంథ రచన చేశాడు. ఇంకా ‘న్యూలాంప్స్ ఫర్ ఓల్డ్’ వ్యాసాలు రచించాడు. అలీపూర్ కుట్రకేసులో ముద్దాయిగా ముద్రపడి, చివరికి పాండిచ్చేరిలో (1908) సన్యాస జీవితం గడుపుతూ మరణించాడు. (1929) లాహోర్ కుట్రకేసులో ప్రధాన ముద్దాయిలు 12 మంది. అందులో ముఖ్యమైన వారు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భతుకేశ్వర్‌దత్‌లు. చివరికి భతుకేశ్వర్ మినహా మిగతా వారికి 1931 మార్చి 23న ఉరిశిక్ష విధించారు. కాకోరి రైల్వే దోపిడీ కేసులో అశ్వయుల్లాఖాన్ ముద్దాయి. చిట్టగాంగ్ దోపిడీలో ‘మాస్టర్’గా ప్రసిద్ధి చెందిన సూర్యసేన్ ప్రధాన ముద్దాయి. ఇతడు ‘పోగ్రామ్ ఆఫ్ డేత్’ పేరుతో అనేక వ్యాసాలు రచించాడు.
- - ఇన్‌పుట్స్: డా॥పి. మురళీ,
ప్రొఫెసర్ నిజాం కాలేజీ,
హైదరాబాద్