paddy crop dried
-
ఈ ఆటో చాలా కూల్ గురూ.. సమ్మర్ స్పెషల్
ఆటో పైకప్పు నిండా పచ్చని పూల మొక్కలు, గడ్డి మొక్కలను పెంచాడు. మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీరు పోస్తున్నాడు. ఆటో ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ప్రయాణికులకు చల్లదనాన్ని పంచేందుకు.. మహబూబాబాద్ మండలం దర్గా తండాకు చెందిన భూక్యా హ్యాంజ్యా అలియాస్ ఆటో అంజి వినూత్న ఆలోచనకు దృశ్య రూపమిది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్చెరువు ఎండింది.. చేప చిక్కింది మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నిజాం చెరువు నీరు అడుగంటిపోయింది. దీంతో కొద్దిపాటి నీటిలోని చేపలను మాధవాపురం గ్రామానికి వలస వచ్చిన సైబీరియన్ కొంగలు (Siberian Cranes) సునాయాసంగా వేటాడుతున్నాయి. కోరుకున్న చేపను కొంగలు పట్టేసుకుని గుటుక్కుమనిపిస్తున్నాయి. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్ కళ తప్పిన ప్రకృతి ఆకురాలే సమయం వచ్చేసింది. వానాకాలం, చలికాలంలో పచ్చదనంతో ప్రకృతి ప్రేమికులను మురిపించిన గుట్టలు.. ఇప్పుడు ఎండ తీవ్రతతో మాడిపోతున్నాయి. తీవ్రమైన ఎండలతో చెట్లు ఆకురాల్చి మోడువారి కనిపిస్తున్నాయి. రాత్రివేళ కార్చిచ్చుతో మంటల్లో కాలిపోతున్నాయి. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) పాలకుర్తి మండలం జయ్యారం శివారు, అంతర్గాం మార్గంలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఎండిన చెట్లతో గుట్టలు బోసిపోయి కనిపించాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిపైరు ఎండి.. పశువులకు తిండిహనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ఎండల తీవ్రతకు భూగర్బ జలాలు అడుగంటిపోయాయి. బావులలో నీళ్లు తగ్గి పంటలకు సరిపడా సాగునీరు అందక పంటలు (Crops) ఎండిపోతున్నాయి. దిక్కుతోచని రైతులు కొంత పంటనైనా కాపాడుకుందామని నీరున్నంత వరకు పారించుకుని.. మిగతా పంటను మూగజీవాలకు వదిలేశారు. – ధర్మసాగర్ఎడ్లకు మేత.. గుండె కోత.. ఎస్సారెస్పీ కాలువ నీరు రాలేదు.. వ్యవసాయ బావిలో నీరు అడుగంటింది. పొట్టదశకు వచ్చిన వరి పైరు ఎండిపోతోంది. పంట చేతికొస్తే పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు తీర్చుతామనే రైతు గంపెడాశ ఆవిరైపోయింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మద్దిర్యాలకు చెందిన ఎండీ షరీఫ్.. తనకున్న నాలుగెకరాల్లో యాసంగి వరి వేశాడు. నీళ్లు అందక రెండెకరాల్లో పంట ఎండిపోయింది. దీంతో రైతు కుటుంబ సభ్యులు.. ఎండిన పైరును ఎద్దులకు మేతగా వినియోగిస్తూ ఇలా కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిభగీరథ ప్రయత్నంఆదిలాబాద్ జిల్లాలో భానుడి భగభగలకు చేతిపంపులు, చేద బావుల్లో భూగర్భ జలమట్టం అడుగంటుతోంది. బిందెడు నీటి కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు భగీరథ ప్రయత్నమే చేయాల్సి వస్తోంది. దీంతో ఎప్పుడు వస్తుందో తెలియని మిషన్ భగీరథ నీరే దిక్కవుతోంది. ఆదిలాబాద్ (Adilabad) రూరల్ మండలంలోని పోతగూడ–2 గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి అవసరాల కోసం మిషన్ భగీరథ పైపులైన్ ద్వారా సరఫరా అయ్యే పైపువాల్ వద్ద చుక్కనీటిని ఒడిసిపట్టేలా ప్రత్యేకంగా ఓ రేకును అమర్చి బొట్టుబొట్టు నీరు డ్రమ్ముల్లో పడేలా ఏర్పాట్లు చేసుకోవడం నీటి సమస్యకు నిదర్శనంగా నిలుస్తోంది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్చదవండి: బిందెడు నీటికి బావిలోకి.. భగవంతుడా! -
ఒంటికాలితో విజయం సాధించి..
అన్ని అవయవాలు సవ్యంగా ఉన్నా చాలా మంది ఆటలు ఆడటానికి ఆసక్తి చూపరు. కానీ ఒక కాలు లేకపోయినా ఓ యువకుడు కుస్తీ పోటీలో పాల్గొనడమే కాకుండా, విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తానెవరికీ తీసిపోనని క్రీడాభిమానుల సాక్షిగా నిరూపించాడు. సంకల్ప బలానికి వైకల్యం అడ్డురాదని చాటిచెప్పాడు.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు దివ్యాంగ మల్లయోధుడు యు. సాయిలు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో బేడీల మైసమ్మ ఉత్సవాల్లో భాగంగా సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం మల్లయోధులు తరలి వచ్చారు. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) నారాయణఖేడ్ పట్టణానికి చెందిన దివ్యాంగ మల్లయోధుడు (Divyang Wrestler) సాయిలు కూడా ఈ కుస్తీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆయన రూ.500 కుస్తీ పోటీల్లో ఓ మల్లయోధునితో కుస్తీ పట్టి విజయం సాధించాడు. దీంతో సాయిలు పోరాటానికి మెచ్చిన ప్రేక్షకులు రూ.3 వేల వరకు విరాళాలు అందజేశారు. వివిధ విభాగాల్లో కుస్తీపోటీల్లో గెలుపొందిన మల్లయోధులకు నిర్వాహకులు నగదును బహుమానంగా అందజేశారు. కట్టె కాసులు తెచ్చి పెట్టెతెల్లబంగారం (White Gold) సాగులో ఆదిలాబాద్ జిల్లాది ఆసియాలోనే ప్రథమ స్థానమని చెప్పొచ్చు. జిల్లాలో 90 శాతం మంది రైతులు పత్తి పంటనే సాగు చేస్తున్నారు. పత్తితీత అనంతరం మిగిలిన చెట్లను గతంలో ట్రాక్టర్ల సాయంతో పెరికేసి చేలల్లోనే కాల్చేసేవారు. అయితే ఇప్పుడు పరిశ్రమల్లోని బాయిలర్లలో ఉపయోగించే బ్రికెట్లను ఈ పత్తి కట్టెతో తయారు చేస్తుండటంతో పత్తికట్టె కూడా అన్నదాతకు లాభసాటిగా మారింది. రైతులు పత్తి ఏరివేసిన అనంతరం మిగిలిన పత్తి కట్టెకు వ్యాపారులు ఎకరాకు రూ.300 చెల్లించి.. వారే ట్రాక్టర్ల ద్వారా తొలగించి జిల్లా కేంద్రంలోని ఓ పరిశ్రమకు తరలిస్తున్నారు. అక్కడ క్రష్ చేసి బ్రికెట్స్ను తయారు చేస్తున్నారు. దీంతో పత్తి కట్టె అన్నదాతకు అదనపు లాభంగా మారింది.చి‘వరి’కి పశువుల మేతగా..ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రైతుల ఆరుగాలం కష్టం పశువులకు మేతగా మారుతోంది. సాగునీరు అందక ఎండుతున్న పంటలను పశువులకు మేతగా వదిలేస్తున్న రైతులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్టతండాకు చెందిన రైతు గుగులోతు మహేశ్నాయక్.. అప్పులు చేసి ఆరు ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నాలుగు బోర్లు ఎత్తిపోయాయి. మల్కపేట రిజర్వాయర్ నుంచి కాలువల వెంట సాగునీటిని విడుదల చేయకపోవడంతో.. సాగు చేసిన పంట కళ్ల ముందే ఎండిపోతోంది. సాగునీటి కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోవడంతో చి‘వరి’కి రైతు మహేశ్నాయక్ పంట పొలాన్ని పశువులకు వదిలేశాడు. ఇలాంటి పరిస్థితి జిల్లావ్యాప్తంగా ఉంది.చదవండి: అందుకే హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ఉండాలి -
యంత్రాంగం కదిలింది
సాగు నీరందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లాలో వరి సాగు దుస్థితిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ఏరువాక కార్యక్రమం సైతం అభాసు పాలైన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం మండలం చిట్టవరంలో స్వయంగా చంద్రబాబు నాట్లు వేసిన పొలంలోనూ నాట్లు ఎండిపోయి తుంగ గడ్డి మొలి చింది. ఈ దుస్థితిపై ‘నారుపోసి.. నీళ్లు మరిచి’ శీర్షికన 23వ తేదీ సంచిక మెయిన్ 11వ పేజీలో పరిశీలనాత్మక కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఇరిగేషన్ అధికారులు మంగళవారం డెల్టా మండలాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లారు. నీరందకపోవడానికి కారణాలేమిటనే విషయాన్ని పరిశీలించారు. శివారు ప్రాంతాలకు నీరు రాకుండా వేసిన అనధికార తూములను తొలగించాలని నిర్ణయించారు. అవసరమైతే మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కలెక్టర్, నీటి పారుదల శాఖ అధికారులు పర్యటించారు. కాలువలు, ్రyð యిన్లలో ఏర్పాటు చేసిన అనధికారిక తూములను రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల కారణంగా నీరంతా అవిరైపోతోందని, కాలువలో నీరున్నా శివారు ప్రాంతాలకు అందడం లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాకు 6వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా, 7,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా సరిపోవడం లేదన్నారు. జూన్, జూలై నెలల్లో పూర్తి కావాల్సిన నాట్లు ఇప్పటివరకూ కాలేదని, ప్రస్తుతం సుమారు 6 వేల ఎకరాలకు నీరు అందడం లేదని గుర్తించామన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే అడ్డుకట్టలు వేసి సాగునీరు అందిస్తామన్నారు. బ్యాంక్ కెనాల్, రాపాక చానల్, చించినాడ చానెల్ పరిధిలో లో 16, 17 గ్రామాలకు తీవ్ర నీటిఎద్దడి ఉందన్నారు. ప్రధానంగా వర్షాలు కురవకపోవడం వల్ల శివారు భూములకు కాలువల ద్వారా సాగునీరు సక్రమంగా అందక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, నీటిసంఘాల అధ్యక్షులు సమన్వయంతో పనిచేసి అవసరమైన చోట మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని తోడుకోవాలన్నారు. అవసరమైన చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి శివారు భూములు ఎండిపోకుండా సాగునీరు అందిస్తామన్నారు. జిన్నూరు కాలువ పొడవునా అనధికార తూములు ఏర్పాటు చేసుకోవడంతో శివారు ప్రాంతాలకు నీరందడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, వెంటనే తొలగించాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. వడలి సుబ్బారాయుడుపుంత వద్ద రైతులు కలెక్టర్ రాక కోసం ఎదురుచూశారు. ఆయన పెనుగొండ మండలంలో ఎక్కడా ఆగకుండా నేరుగా ఆచంట మండలానికి వెళ్లిపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. -
యంత్రాంగం కదిలింది
సాగు నీరందక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎట్టకేలకు ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చింది. జిల్లాలో వరి సాగు దుస్థితిపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురిస్తున్న విషయం విదితమే. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ఏరువాక కార్యక్రమం సైతం అభాసు పాలైన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : నరసాపురం మండలం చిట్టవరంలో స్వయంగా చంద్రబాబు నాట్లు వేసిన పొలంలోనూ నాట్లు ఎండిపోయి తుంగ గడ్డి మొలి చింది. ఈ దుస్థితిపై ‘నారుపోసి.. నీళ్లు మరిచి’ శీర్షికన 23వ తేదీ సంచిక మెయిన్ 11వ పేజీలో పరిశీలనాత్మక కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఇరిగేషన్ అధికారులు మంగళవారం డెల్టా మండలాల్లోని వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లారు. నీరందకపోవడానికి కారణాలేమిటనే విషయాన్ని పరిశీలించారు. శివారు ప్రాంతాలకు నీరు రాకుండా వేసిన అనధికార తూములను తొలగించాలని నిర్ణయించారు. అవసరమైతే మోటార్లు ఏర్పాటు చేసి నీరు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆచంట, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు నియోజకవర్గాల్లో కలెక్టర్, నీటి పారుదల శాఖ అధికారులు పర్యటించారు. కాలువలు, ్రyð యిన్లలో ఏర్పాటు చేసిన అనధికారిక తూములను రాజకీయ వత్తిళ్లకు తలొగ్గకుండా తక్షణమే తొలగించాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల కారణంగా నీరంతా అవిరైపోతోందని, కాలువలో నీరున్నా శివారు ప్రాంతాలకు అందడం లేదని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లాకు 6వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా, 7,300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నా సరిపోవడం లేదన్నారు. జూన్, జూలై నెలల్లో పూర్తి కావాల్సిన నాట్లు ఇప్పటివరకూ కాలేదని, ప్రస్తుతం సుమారు 6 వేల ఎకరాలకు నీరు అందడం లేదని గుర్తించామన్నారు. రెండు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. అవసరమైతే అడ్డుకట్టలు వేసి సాగునీరు అందిస్తామన్నారు. బ్యాంక్ కెనాల్, రాపాక చానల్, చించినాడ చానెల్ పరిధిలో లో 16, 17 గ్రామాలకు తీవ్ర నీటిఎద్దడి ఉందన్నారు. ప్రధానంగా వర్షాలు కురవకపోవడం వల్ల శివారు భూములకు కాలువల ద్వారా సాగునీరు సక్రమంగా అందక ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు, నీటిసంఘాల అధ్యక్షులు సమన్వయంతో పనిచేసి అవసరమైన చోట మోటార్లు ఏర్పాటు చేసుకుని నీటిని తోడుకోవాలన్నారు. అవసరమైన చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి శివారు భూములు ఎండిపోకుండా సాగునీరు అందిస్తామన్నారు. జిన్నూరు కాలువ పొడవునా అనధికార తూములు ఏర్పాటు చేసుకోవడంతో శివారు ప్రాంతాలకు నీరందడం లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా, వెంటనే తొలగించాలని ఇరిగేషన్ ఈఈని ఆదేశించారు. వడలి సుబ్బారాయుడుపుంత వద్ద రైతులు కలెక్టర్ రాక కోసం ఎదురుచూశారు. ఆయన పెనుగొండ మండలంలో ఎక్కడా ఆగకుండా నేరుగా ఆచంట మండలానికి వెళ్లిపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు.