Palestiniana
-
అమేయ సైనిక శక్తి.. అతి శక్తిమంతమైన సైన్యం ఇజ్రాయెల్ సొంతం
అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. హమాస్ పని పట్టేందుకు గాజా స్ట్రిప్ వద్దే ప్రస్తుతం ఏకంగా 3 లక్షల మంది సైనికులను మోహరించింది! గాజాపై భూతల దాడికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోందనేందుకు ఇది కచి్చతమైన సంకేతమేనని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా అమెరికా నుంచి అన్నివిధాలా అందుతున్న సాయంతో ఇజ్రాయెల్ సైనికంగా తేరిపార చూడలేనంతగా బలోపేతమైంది. మధ్యప్రాచ్యంలో తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఆ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా భావించడమే ఇందుకు కారణం... సైనిక శక్తియుక్తులను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు, నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు ఇజ్రాయెల్ అత్యంత ప్రాధాన్యమిస్తుంది. ఆ దేశంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా సైన్యంలో చేరాల్సిందే. పురుషులు కనీసం 32 నెలల పాటు, మహిళలు రెండేళ్ల పాటు సైన్యంలో పని చేయాలి. ఇవిగాక అణు సామర్థ్యం కూడా ఇజ్రాయెల్ సొంతమని చెబుతారు. అణు వార్ హెడ్లను మోసుకెళ్లగల జెరిషో మిసైళ్లు, విమానాలు ఆ దేశం వద్ద ఉన్నాయి. అతి పెద్ద ఆయుధ ఎగుమతిదారు తొలినాళ్లలో సైనిక అవసరాలకు ప్రధానంగా దిగుమతుల మీదే ఆధారపడ్డ ఇజ్రాయెల్, చూస్తుండగానే సంపన్న దేశాలకు కూడా అత్యాధునిక ఆయుధాలు, ఆయుధ, నిఘా వ్యవస్థలు తదితరాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది! ► 2018–22 మధ్య కనీసం 35 దేశాలు ఇజ్రాయెల్ నుంచి 320 కోట్ల డాలర్ల పై చిలుకు విలువైన ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి. ► వీటిలో ఏకంగా మూడో వంతు, అంటే 120 కోట్ల డాలర్ల మేరకు ఆయుధాలను భారతే దిగుమతి చేసుకుంది. ► ఆ ఐదేళ్ల కాలంలో ఇజ్రాయెల్ ఆయుధ దిగుమతులు 270 కోట్ల డాలర్లకు చేరాయి. ఇవన్నీ కేవలం అమెరికా, జర్మనీ నుంచే కావడం విశేషం! అందులోనూ 210 కోట్ల డాలర్ల దిగుమతులు ఒక్క అమెరికా నుంచే జరిగాయి! ఇంజనీరింగ్ అద్భుతం.. ఐరన్‌డోమ్ ఐరన్ డోమ్. ఇజ్రాయెల్ ఏళ్ల తరబడి శ్రమించి రూపొందించిన మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. స్వల్పశ్రేణి రాకెట్లను రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేయగల సామర్థ్యం దీని సొంతం... ► హెజ్బొల్లా తొలిసారి ఇజ్రాయెల్‌పై ఏకకాలంలో వేలకొద్దీ రాకెట్లతో దాడి చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని 2006లో ఐరన్ డోమ్ నిర్మాణానికి ఆ దేశం తెర తీసింది. ► ఇది 2011లో వాడకంలోకి వచి్చంది. ► 2021 మొత్తంలో హమాస్, ఇతర పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు ప్రయోగించిన రాకెట్లలో 90 శాతానికి పైగా ఐరన్‌డోమ్ నిర్వీర్యం చేసి సత్తా చాటింది. ► డోమ్ నిర్మాణానికి అమెరికా ఎంతగానో సాయం చేసింది. ► 1946–2023 మధ్య ఏకంగా 12,400 కోట్ల డాలర్ల విలువైన సైనిక, రక్షణపరమైన సాయాన్ని అమెరికా నుంచి ఇజ్రాయెల్ అందుకుంది!! ► అమెరికా తన 2022 బడ్జెట్లో కేవలం ఇజ్రాయెల్‌కు మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ నిమిత్తమే ఏకంగా 150 కోట్ల డాలర్లు కేటాయించింది! – పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! ► పదేళ్లలో ఇజ్రాయెల్‌కు ఏకంగా 3,800 కోట్ల డాలర్ల మేరకు సైనికపరంగా నిధులు అందించేందుకు 2016లో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది! రక్షణపై భారీ వ్యయం చుట్టూ శత్రు సమూహమే ఉన్న నేపథ్యంలో రక్షణపై ఇజ్రాయెల్ భారీగా ఖర్చు చేస్తుంది. 2022లో సైనిక అవసరాలకు ఏకంగా 2,340 కోట్ల డాలర్లు వెచ్చించింది. ► దేశ జనాభాపరంగా చూసుకుంటే ఇజ్రాయెల్ తలసరి సైనిక వ్యయం ఏకంగా 2,535 డాలర్లు. ఖతర్ తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్–పాలస్తీనా శాంతికి కృషి
బెత్లెహం: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో శుక్రవారం పర్యటించారు. పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాలస్తీనాతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని, తగిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్–పాలస్తీనా మధ్య శాంతి యత్నాలకు ఇంకా కార్యక్షేత్రం సిద్ధం కాలేదని వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య దశాబ్దం క్రితమే సంబంధాలు తెగిపోయాయి. ఇజ్రాయెల్‌లో రాజకీయ అస్థిరత, పాలస్తీనాలో బలహీన నాయకత్వం వల్ల శాంతి చర్చల ప్రక్రియ సాగడం లేదు. లక్షలాది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ పాలన కింద మగ్గిపోతున్నారు. సొంత సార్వభౌమత్వ, స్వతంత్ర దేశాన్ని పొందే అర్హత రెండు దేశాల ప్రజలకు ఉందని బైడెన్ ఉద్ఘాటించారు. రెండు వర్గాల ప్రజలకు రెండు దేశాలని వ్యాఖ్యానించారు. ఇరు వర్గాల మూలాలు ఇక్కడి ప్రాంతంలో ప్రాచీన కాలం నుంచే ఉన్నాయని, పక్కపక్కనే శాంతియుతంగా, భద్రతతో కలిసిమెలిసి జీవించారని గుర్తుచేశారు. అలాంటి పరిస్థితి మళ్లీ రావాలని ఆకాంక్షించారు. ఇజ్రాయెల్–పాలస్తీనా నడుమ శాంతి ప్రక్రియ ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు బైడెన్ చెప్పారు. శాంతి ప్రయత్నాలకు కార్యక్షేత్రం ఇంకా సిద్ధం కానప్పటికీ రెండు దేశాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. పాలస్తీనాకు 300 మిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక సాయాన్ని బైడెన్ ప్రకటించారు. వెస్ట్‌బ్యాంక్, గాజాలో ఇజ్రాయెల్ కాలనీల విస్తరణపై స్పందించలేదు. -
గాజాలో బాంబుల మోత
గాజా సిటీ/వాషింగ్టన్: పాలస్తీనా హమాస్ మిలటరీ విభాగం లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు యథాతథంగా కొనసాగిస్తోంది. బుధవారం ఉదయం గాజా స్ట్రిప్‌పై బాంబు వర్షం కురిపించింది. ఈ ఘటనలో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులను విరమించాలంటూ అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతున్నప్పటికీ ఇజ్రాయెల్ సైన్యం లెక్కచేయడం లేదు. హమాస్ రాకెట్ దాడుల నుంచి తమ ప్రజలను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెబుతోంది. శత్రువులను బలహీనపర్చడానికి వైమానిక దాడులను ఉధృతం చేస్తామని పేర్కొంటోంది. తాజాగా ఇజ్రాయెల్ దాడుల్లో దక్షిణ గాజా టౌన్లో ఒకే కుటుంబానికి చెందిన 40 మంది నివసించే భవనం నేలమట్టమయ్యింది. ఖాన్ యూనిస్, రఫా పట్టణాల్లో 40 సొరంగాలను ధ్వంసం చేయడానికి 52 ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇజ్రాయెల్ ప్రయోగించింది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 219 మంది పాలస్తీనియన్లు మరణించారు. 58 వేల మంది పాలస్తీనియన్లు తమ నివాసాలను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇక హమాస్ రాకెట్ దాడుల్లో 12 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. హింసను ఇకనైనా ఆపండి: జో బైడెన్ గత పది రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య సాగుతున్న హింసాకాండకు ఇకనైనా స్వస్తి పలకాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు సూచించారు. ఇరువురు నేతలు బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఉద్రిక్తతలకు చరమగీతం పాడాలని బైడెన్ నొక్కిచెప్పారు. ఆ తర్వాత నెతన్యాహు కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదలచేసింది. తన లక్ష్యం నెరవేరేదాకా దాడులు కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపింది. ఇజ్రాయెల్ చర్యలపై పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. -
Gaza: ఇజ్రాయెల్ నిప్పుల వాన, మరో 42 మంది మృతి
దుబాయ్: ఇజ్రాయెల్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. గాజా సిటీపై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఆదివారం నిప్పుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో మూడు భవనాలు నేలమట్టమయ్యాయి. కనీసం 42 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు తెలిసింది. వారం రోజుల క్రితం ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ మిలటరీ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ఆదివారం అతిపెద్ద దాడి చేసింది. ఏకంగా 42 ప్రాణాలను బలిగొంది. వీరిలో 16 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు గాజా ఆరోగ్యశాఖ ప్రకటించింది. మరో 50 మంది గాయపడినట్లు వెల్లడించింది. గాజాలోని హమాస్ అగ్రనేత యాహియే సన్వార్ నివాసాన్ని తాము ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. కాల్పుల విరమణ దిశగా ఇరు వర్గాలను ఒప్పించేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుండగా, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య నాలుగో యుద్ధం తప్పదన్న సంకేతాలను ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇచ్చారు. హమాస్‌పై పూర్తిస్థాయిలో దాడులు కొనసాగుతాయన్నారు. హమాస్ భారీ మూల్యం చెల్లించాలని ఇజ్రాయెల్ కోరుకుంటోందన్నారు. ఇస్లామిక్ దేశాల అత్యవసర సమావేశం తాజా ఘర్షణలపై చర్చించేందుకు 57 ఇస్లామిక్ దేశాల కూటమి ఆదివారం అత్యవసరంగా సమావేశమయ్యింది. స్వతంత్ర దేశాన్ని కలిగి ఉండే అర్హత పాలస్తీనియన్లకు ఉందని ఇస్లామిక్ దేశాల కూటమి అభిప్రాయపడింది. జెరూసలేం, గాజాలో తాజా పరిస్థితికి ఇజ్రాయెల్ బాధ్యత వహించాలని కొన్ని ఇస్లామిక్ దేశాలు తేల్చిచెబుతున్నాయి. హింసను ఖండించిన పోప్ ఫ్రాన్సిస్ ఇజ్రాయెల్, పాలస్తీనా హమాస్ నడుమ రగులుతున్న హింసాకాండను పోప్ ఫ్రాన్సిస్ తీవ్రంగా ఖండించారు. చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు భవిష్యత్తును నిర్మించాలని కోరుకోవడం లేదని, కేవలం నాశనం చేయాలని భావిస్తున్నారని ఆక్షేపించారు. ఇరు వర్గాల మధ్య శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని సూచించారు. యుద్ధ నేరమే: పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, గాజాలో మానవత్వంపై దాడి చేస్తోందని పాలస్తీనా విదేశాంగ మంత్రి రియాద్ అల్–మాలికీ ఆరోపించారు. ‘పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న దారుణాలను వర్ణించడానికి పదాలు లేవు. కుటుంబాలను తుడిచిపెడుతున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారులను బలి తీసుకుంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. జెరూసలేం నుంచి పాలస్తీనియన్లను పూర్తిగా వెళ్లగొట్టాలని ఇజ్రాయెల్ చూస్తోందన్నారు. ఇంకెంత మంది చనిపోతే మీరు ఈ దాడులను ఖండిస్తారని ఐరాస భద్రతా మండలిని నిలదీశారు. సంయమనం పాటించాలి: భారత్ మరోవైపు ఇరుపక్షాలు సంయమనం పాటించాలని, దాడులకు పాల్పడవద్దని భారత్ విజ్ఞప్తి చేసింది. ఉద్రిక్తతలు తగ్గడమే తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.త్రిమూర్తి అన్నారు. పాలస్తీనాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. గాజాలో పరిస్థితులు అత్యంత భయానకంగా ఉన్నాయని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. వెంటనే దాడులు ఆగాలన్నారు. This was nothing but an assault on freedom of speech and freedom of press. #Gaza pic.twitter.com/eqA6YKi5SH — Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) May 16, 2021 #Gaza Street. How it was a few days ago and how it is today.#GazaUnderAttak pic.twitter.com/x07DqglXAB — Yara murtaja🇵🇸🇹🇷 (@murtajayara) May 17, 2021 -
‘డాలర్లతో జెరూసలేంను కొనలేరు’
రమల్లా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్‌పై పాలస్తీనా నేతలు ఘాటుగా స్పందించారు. ‘మీరు డాలర్లతో కొనడానికి.. జెరూసలేంను మేము అమ్మకానికి పెట్టలేద’ని పాలస్తీనా అధ్యక్షుడు హుమ్మద్ అబ్బాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బ్లాక్ మెయిలింగ్ చర్యలకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. పాలస్తీనా అథారిటికి ప్రతి ఏడాది ఇచ్చే 300 మిలియన్ డాలర్ల నిధుల్లో కోత పెడతానంటూ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిదే. ట్రంప్ హెచ్చరికలపై స్పందించిన ఆ దేశం.. ఎట్టి పరిస్థితుల్లోనూ జెరూసలేంను వదులుకోమని తెగేసి చెప్పింది. జెరూసలేంపై అమెరికా నిర్ణయంతోనే ఇరు దేశాల మధ్యనున్న సంబంధాలు దెబ్బతిన్నాయని.. ఇప్పుడు కొత్తగా జరిగే నష్టమేమీ లేదని చెప్పడం గమనార్హం. జెరూసలేం అనేది.. పాలస్తీనా శాశ్వత రాజధాని. మా రాజధాని ప్రాంతాన్ని డాలర్లు లేదా బంగారంతో ఎవరూ కొనలేరని మహుమ్మద్ అబ్బాస్ అధికార ప్రతినిధి నబిల్ అబు రెహమాన్ ఘాటుగా సమాధానం చెప్పారు. బ్లాక్ మెయిలింగ్‌కు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగమని పాలస్తీనా ఉన్నతాధికారణి హనమ్ ఆశ్రవి స్పష్టం చేశారు. వివాదాస్పద ప్రాంతంలో అశాంతి, అల్లర్లు జరగడానికి ట్రంప్ చర్యలే కారణమని ఆమె ఆరోపించారు. ఇదిలావుండగా.. పాలస్తీనా అథారిటీకి నిధులు నిలిపేస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇజ్రాయిల్ ప్రభుత్వం స్వాగతించింది. అమెరికా చర్యలను నిరసించేవారు.. ఆ దేశ నిధులను కూడా వద్దనుకోవాలని ఇజ్రాయిల్ మంత్రి మిరి రెగేవ్ అన్నారు. -
సయీద్ ర్యాలీలో పాలస్తీనా దూత
న్యూఢిల్లీ: ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో కలిసి పాకిస్తాన్‌లోని పాలస్తీనా రాయబారి అబు అలీ వేదిక పంచుకోవడాన్ని భారత్ తప్పుపట్టింది. పాలస్తీనా రాయబారి అద్నన్ హైజాను విదేశాంగ కార్యాలయానికి పిలిపించి భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాలస్తీనా.. పాక్‌లోని తమ రాయబారికి ఉద్వాసన పలికింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ‘పాలస్తీనా రాయబారితో పాటు రమల్లాలోని ఆ దేశ విదేశాంగ శాఖకు మా ఆందోళనల్ని స్పష్టం చేశాం. ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొన్న సయీద్‌తో కలిసి శుక్రవారం రావల్పిండిలో నిర్వహించిన కార్యక్రమంలో పాలస్తీనా రాయబారి పాల్గొనడం ఎంత మాత్రం అంగీకారం కాదని ఆ దేశానికి గట్టిగా చెప్పాం’ అని పేర్కొంది. ఈ సంఘటనపై తీవ్ర పశ్చాత్తాపం వెలిబుచ్చడంతో పాటు సయీద్ కార్యక్రమంలో తమ రాయబారి పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని పాలస్తీనా స్పష్టం చేసినట్లు భారత్ తెలిపింది. ‘ఈ అంశాన్ని తగిన విధంగా పరిష్కరిస్తాం. భారత్‌లో సంబంధాలకు పాలస్తీనా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఉగ్రపోరులో ఆ దేశానికి అండగా ఉంటాం. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడిన వారితో సంబంధాలు పెట్టుకోం’ అని పాలస్తీనా పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. -
12 గంటల పాటు శాంతి
గాజా/జెరూసలేం: నిత్యం క్షిపణులు, బాంబుల మోతతో దద్దరిల్లుతున్న పాలస్తీనాలోని గాజా, ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలలో శనివారం తాత్కాలికంగా శాంతి నెలకొంది. శిథిలాల కింద ఉన్న మృతదేహాల గుర్తింపునకు వీలుగా పోరుకు తాత్కాలిక ంగా విరామం పలకాలని ఐక్యరాజ్య సమితి చేసిన అభ్యర్థనకు హమాస్ (ఉగ్రవాద సంస్థ), ఇజ్రాయెల్ అంగీకరించాయి. దీంతో 12 గంటల పాటు మానవతావాద సంధి స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8గంటలకు ప్రారంభమైంది. అయితే, ఏడు రోజుల పాటు కాల్పుల విరమణ కోసం అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, టర్కీ, ఖతార్ విదేశాంగ మంత్రులు తమ ప్రయత్నాలు శనివారం కూడా కొనసాగించారు. వీరు పారిస్‌లో సమావేశమై చర్చలు జరిపారు. మానవతావాద సంధిని 24 గంటల పాటు కొనసాగించాలని తాము ఇరువైపుల పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నామని సమావేశం అనంతరం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి లారెంట్ ఫాబియెస్ మీడియాకు చెప్పారు. దాన్ని తర్వాత కూడా కొనసాగించవచ్చన్నారు. అయితే, దీర్ఘకాలిక కాల్పుల విరమణకు తాము అంగీకరించబోమని హమాస్ స్పష్టం చేసింది. మరోవైపు, శనివారం గాజాలోని వివిధ ప్రాంతాలలో శిధిల భవనాల నుంచి మరో 100 మృతదేహాలను వెలికి తీసి వాటిని ఆస్పత్రులకు తరలించినట్లు పాలస్తీనా అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. దీంతో గత 19 రోజుల్లో పాలస్తీనాలో మృతుల సంఖ్య 1000 దాటింది.