pancharama
-
పంచారామాలలో ప్రసిద్ధం : క్షీరారామం
పూర్వం ‘‘ఉపమన్యుడనే బాల భక్తుడు పాలకై పరమేశ్వరుని ప్రార్థించగా, శివుడు కరుణించి తన త్రిశూలాన్ని అక్కడి నేలపై గుచ్చాడట. అప్పుడు ఆ ప్రదేశం నుంచిపాలు ఉద్భవించాయని, అందుకే దీనికి ‘క్షీరపురం’,పాలకొలను’’ అన్న పేర్లు కలిగాయని, అలాగే ఆ బాలభక్తుడి పేరు మీదుగా ‘ఉపమన్యుపురం’ అనే పేరు వచ్చిందని పండితుల వాక్కు. అదే నేటి పాలకొల్లు.ఆలయ విశేషాలు...క్షీరారామంలో వెలసిన స్వామి శ్రీ క్షీరా రామలింగేశ్వరుడు. తెల్లగా పాల వలె మెరిసే ఈ శివలింగం రెండున్నర అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగంపై ఉన్న నొక్కులు కుమారస్వామి అమృత లింగాన్ని భేదించినపుడు తగిలిన బాణపు దెబ్బలని భక్తుల విశ్వాసం. ఈ శివలింగం పై భాగం మొనతేలి ఉండటంతో ఇది శివుడి కొప్పు భాగాన్ని సూచిస్తోందని పెద్దల వాక్కు. కాగాశాసనాల్లో ఈ స్వామిని ‘కొప్పు లింగేశ్వరుడు’గా పేర్కొనటం విశేషం. ప్రతి ఏడాదీ ఉత్తరాయణ, దక్షిణాయన కాలాల్లో సూర్యోదయ సమయాల్లో, భానుడి కిరణాలు పెద్దగోపురం రెండో అంతస్థు నుంచి ప్రాకారాల మధ్యగా క్షీరా రామలింగేశ్వర లింగంపై ప్రసరించటం విశేషం.చదవండి: సుదీక్ష అదృశ్యం : తల్లిదండ్రుల షాకింగ్ రిక్వెస్ట్! పెద్దగోపురం...దేవాలయానికి శిఖరం–శిరస్సు, గర్భాలయం–కంఠం, ధ్వజస్తంభం–జీవం కాగా గోపురం పాదం లాంటిదని ఆగమశాస్త్రం చెబుతోంది. ఎంతో పురాణ, చారిత్రక ప్రాశస్త్యం, అద్భుత శిల్పకళ కలిగిన శ్రీ క్షీరారామలింగేశ్వరాలయ గోపురం పాలకొల్లు పెద్దగోపురంగా ప్రసిద్ధి పొందింది. ఇది సుమారు 120 అడుగుల ఎత్తు కలిగి 9 అంతస్థులతో గోపురం చివరిదాకా వెళ్లేందుకు అనువుగా లోపలి వైపు మెట్లు కలిగి ఉంది. ఈ గోపురం మీది ఎన్నో అద్భుత శిల్పాలు చూపరులను కట్టి పడేస్తాయి.ఉత్సవాలు...ఈ క్షేత్రంలో ఉగాది, చైత్రశుద్ధ దశమినాడు స్వామి వార్ల కళ్యాణాలు, చైత్రశుద్ధ ఏకాదశినాడు రథోత్సవం, వినాయక చవితి, శరన్నవరాత్రి ఉత్సవాలు, మహాశివరాత్రి, కార్తీకమాస అభిషేకాలు, జ్వాలా తోరణం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, ముక్కోటి, లక్ష కుంకుమ, బిల్వార్చనలు, కోటి బిల్వార్చనలు, సహస్ర ఘటాభిషేకాలు వైభవోపేతంగా జరుగుతాయి. ఇవి కాక ఆయా సందర్భాలలో మరెన్నో విశేషపూజలు, ఉత్సవాలు జరుగుతాయి. మహా శివరాత్రి నాడు శ్రీ పార్వతీ సమేత క్షీరారామలింగేశ్వర, లక్ష్మీ జనార్ధనుల ఊరేగింపు రంగురంగుల విద్యుద్దీప కాంతుల నడుమ సాంçస్కృతిక వేడుకలతో కన్నుల పండుగగా జరుగుతుంది. పర్వదినాల్లో భక్తి, భజన కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, పురాణ ప్రవచనాలు జరుగుతాయి.– డి.వి.ఆర్. -
రారండోయ్ పంచారామాలు చూద్దాం..
తుని: పవిత్ర కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలను దర్శించుకుంటే పుణ్యమని భక్తుల నమ్మకం. అందుకే ఈ మాసంలో ఎక్కువ మంది శైవ క్షేత్రాలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఒక కుటుంబం పంచారామాలను దర్శించుకోవడానికి వెళ్లాలంటే ఆర్థికంగా భారం పడుతుంది. ఇది గమనించిన ఆర్టీసీ కార్తికమాసంలో పంచారామాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. చదవండి: నాడు ఫిరంగులకు..నేడు పకోడీలకు ప్రసిద్ధి తుని డిపో నుంచి సర్వీసులు తుని ఆర్టీసీ డిపో నుంచి పంచారామాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. తుని నుంచి ఈ నెల 7, 14, 21, 28 తేదీల్లో ఆదివారం సాయంత్రం బయలుదేరి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామ, సామర్లకోట తదితర శైవ క్షేత్రాలకు తీసుకువెళతారు. దర్శనం అనంతరం భక్తులను తుని డిపోకు తీసుకువస్తారు. రిజర్వేషన్ సౌకర్యం తుని ఆర్టీసీ డిపోతో పాటు పాయకరావుపేట, గొల్ల అప్పారావు సెంటర్, అన్నవరం, కత్తిపూడి తదితర ప్రాంతాల్లో రిజర్వేషన్ టికెట్లు పొందవచ్చు. దీంతో పాటు ఆన్లైన్లో టికెట్లను రిజర్వేషన్ చేయించుకునే అవకాశం కల్పించారు. బృందాలకు ప్రత్యేకం పంచారామ క్షేత్రాలను దర్శించుకోవడానికి బృందాలుగా వెళ్లే వారికి ఆర్టీసీ వారి స్వగ్రామం నుంచే బస్సు సౌకర్యం కల్పిస్తోంది. బస్సు సీటింగ్ కెఫాసిటీ మేరకు టికెట్లు ఉంటే వారి నివాస గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తారు. నాలుగైదు సీట్లు మిగిలిపోయినా బస్సును అందిస్తామని అధికారులు చెబుతున్నారు. చార్జీలు ఇలా.. పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు బస్సు కేటగిరి ఆధారంగా పెద్దలకు, పిల్లలకు వేర్వేరు టికెట్ ధరలు ఉంటాయి. తుని డిపో నుంచి పల్లెవెలుగు పెద్దలకు రూ.720, పిల్లలకు రూ.570, అల్ట్రా డీలక్స్ పెద్దలకు రూ.1040, పిల్లలకు రూ.810, సూపర్ లగ్జరీ పెద్దలకు రూ.1080, పిల్లలకు రూ.840గా టికెట్ ధర నిర్ణయించారు. ఉద్యోగులు, వ్యాపారులకు.. ఉద్యోగులు, వ్యాపారుల సౌకర్యం కోసం శనివారం బస్సులు బయలు దేరి ఆదివారం సాయంత్రానికి తిరిగి చేరుకునే ఏర్పాట్లు చేశారు. ఈ నెల13, 20, 27 తేదీల్లో వీరికి ప్రత్యేక బస్సులు నడుపుతారు. భక్తులకు మంచి అవకాశం పవిత్ర కార్తిక మాసంలో పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తులకు కండీషన్లో ఉన్న బస్సులను తుని డిపో నుంచి నడుపుతున్నాం. రెగ్యులర్ భక్తులతో పాటు ఉద్యోగులు, వ్యాపారులకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు బృందంగా వెళ్లే భక్తులను వారి స్వగ్రామం నుంచే పికప్ చేసుకుని తిరిగి ఇంటికి చేర్చుతాం. భక్తులు ఆర్టీసీ సేవలను సద్విని యోగం చేసుకోవాలి. –ఎన్.కిరణ్‌కుమార్, తుని డిపో మేనేజర్ టికెట్ల రిజర్వేషన్, అదనపు వివరాలకు... తుని డిపో మేనేజర్: 99592 25539 అసిస్టెంట్ మేనేజరు: 94928 33885 ఎంక్వయిరీ : 08854–253666 రిజర్వేషన్: 73829 13216, 73829 13218 -
పోస్టల్ ద్వారా ఆలయాల నుంచి ప్రసాదాలు
సాక్షి,అమరావతి/వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో పెద్ద, ప్రముఖ ఆలయాల నుంచి ప్రసాదాలు వంటివి భక్తులకు చేరవేసేందుకు తగిన ఏర్పాట్లు చేయనున్నట్టు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికోసం పోస్టల్ శాఖ సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రసిద్ధ పంచారామాలైన అమరారామం (అమరావతి), సోమారామం (భీమవరం), క్షీరారామం (పాలకొల్లు), భీమారామం (ద్రాక్షారామం), కుమారారామం (సామర్లకోట) చిత్రాలు ముద్రించిన ఐదు రకాల పోస్టు కార్డులను పోస్టల్ శాఖ ప్రత్యేకంగా రూపొందించింది. ఈ పోస్టుకార్డులను మంత్రి వెలంపల్లి బుధవారం విజయవాడలోని మంత్రి కార్యాలయంలో ఆవిష్కరించారు. అదే సమయంలో ఆయా ఆలయాల్లోనూ పోస్టల్ శాఖ, దేవదాయ శాఖ అధికారులు పోస్టుకార్డుల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆన్లైన్లో ఏకకాలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ.. హిందూ సంప్రదాయాలు, దేవాలయాలపై పోస్టు కార్డులు ప్రింట్ చేయడం సంతోషకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు, విజయవాడ సర్కిల్ పోస్ట్ మాస్టర్ జనరల్ టి.యం. శ్రీలత, రీజియన్ పోస్టల్ డైరెక్టర్ ఎస్.రంగనాథన్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ కేవీఎల్ఎన్ మూర్తి, విజయవాడ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ కందుల సుదీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
భీమవరం పంచారామక్షేత్రంలో కార్తీకమాసం సందడి
-
శివ...శివా... చూడవయ్యా ఈ సిత్రాలు
మూడునాళ్ల ముచ్చటగా అభివృద్ధి పనులు పది రోజులు గడవక ముందే గోతులు పడ్డ ఫ్లోరింగ్ పంచారామ క్షేత్రంలో నాసిరకంగా అభివృద్ధి పనులు నేడు ఉప ముఖ్యమంత్రి రాజప్ప సమీక్ష సమావేశం సామర్లకోట : పంచారామ క్షేత్రంలో అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. పనులు పూర్తి చేసి పది రోజులు గడవక ముందే పెచ్చులూడిపోతుండడం పట్ల అటు భక్తులు, ఇటు ఆలయ పాలకవర్గం, అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన రాజప్ప ఆలయ అధికారులు, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో బుధవారం నిర్వహించే సమీక్ష సమావేశంలో ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రూ.కోటితో అభివృద్ధి పనులు పురాతన క్షేత్రం కావడంతో పురావస్తు శాఖ ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఆలయం అభివృద్ధికి రూ.కోటి నిధులు విడుదల కావడంతో ఆ శాఖ ఆధ్వర్యంలోనే పనులు చేస్తున్నారు. ఆలయ ఆవరణలో గార్డెన్ పెంపకం పనులు పూర్తి చేశారు. కోనేరు వరకూ సీసీ రోడ్డు, కోనేరు చుట్టూ మెట్లు ఏర్పాటు చేశారు. కోనేరు దిగువ భాగంలో జిగురు మట్టి ఉండటం వల్ల లోనికి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోనేరులో ఉన్న మట్టిని పూర్తిగా తొలగించి ఇసుక వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కోనేరు అభివృద్ధికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చేందుకు ఓ దాత కూడా ముందుకు వచ్చారు. కోనేరు మధ్యలో ఉన్న మండపం పైనుంచి ఆకతాయిలు కోనేరులోనికి దూకుతున్నారు. ఇప్పటి వరకు జిగురు మట్టిలో కూరుకుపొయి ఇద్దరు యువకులు మృతి చెÆందారు. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు కోనేట్లో పుణ్య స్నానాలు చేస్తారు. మహాశివరాత్రి నాటికి ఇసుకు వేసి భక్తులకు రక్షణ కల్పించాలని స్థానికులు కొరుతున్నారు. నాసిరకంగా ప్లోరింగ్ పనులు ఆలయ ఆవరణలో ప్లోరింగ్ పనులు నాసిరకంగా జరిగాయి. ఆలయ దిగువ భాగంలోని ఉప ఆలయాల చుట్టూ ఫ్లోరింగ్ పనులను గానుగు సున్నంతో చేశారు. పనులు పూర్తి చేసిన 10 రోజులు గడవక ముందే ఫ్లోరింగ్ పెచ్చులూడిపోయి గోతులు ఏర్పడటంతో ట్రస్టు బోర్డు సభ్యులు, భక్తులు ముక్కున వేలు వేసుకున్నారు. గోతులు పడ్డ ప్రదేశంలో తిరిగి మరమ్మతులు చేయడం వల్ల అందంపోయి అతుకులు వేసిన్నట్టు ఉంటుందని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఆలయ ప్రవేశంలో మెట్లు, గణపతి ఆలయం, శ్రీకుమారస్వామి ఆలయం వద్ద ఫ్లోరింగ్‌పై గోతులు పడ్డాయి. మొదటి అంతస్తులో ప్రాకారం చుట్టూ చేసిన ఫ్లోరింగ్ కూడా పాడై పోయింది. పురావస్తుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పనులు నాసిరకంగా జరిగాయని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆలయ ధ్వజ స్తంభం వద్ద కూడా పనులు కూడా నాసిరకంగానే ఉన్నాయనని చెబుతున్నారు. ఫ్లోరింగ్ పనులకు సంబంధించి ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి పురావస్తు శాఖ సీఐ దృష్టికి తీసుకు వెళ్లారు. కోనేరులో ఇసుక వేయాలి పంచారామ క్షేత్రం కోనేరులో భక్తులు స్నానాలు చేస్తుంటారు. మహాశివరాత్రి రోజున వేలాది మంది స్నానాలు చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోనేరులో జిగురు మట్టిని తొలగించి ఇసుక వేయాలి. కొత్త నీటితో కోనేరును నింపాలి. - నూతలపాటి అప్పలకొండ, జిల్లా మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు, సామర్లకోట అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పురావస్తు శాఖ అధికారుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఫ్లోరింగ్ పనులు నాసిరకంగా జరిగిన మాట వాస్తవమే. దీనిపై ట్రస్టు బోర్డుతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి పురావస్తుశాఖ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లి సమస్యను పరిష్కారిస్తాం. - కంటే జగదీష్‌మోహనరావు, ట్రస్టు బోర్డు చైర్మన్, సామర్లకోట -
పంచారామ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు