Panjab university
-
ఓవరాల్ చాంప్ పంజాబ్ యూనివర్సిటీ
భువనేశ్వర్: తొలిసారి నిర్వహించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పంజాబ్ యూనివర్సిటీ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ముగిసిన ఈ క్రీడల్లో పంజాబ్ వర్సిటీ మొత్తం 46 పతకాలు సాధించింది. ఇందులో 17 స్వర్ణాలు, 19 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ముగింపు ఉత్సవానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. మొత్తం పది రోజులపాటు జరిగిన ఈ క్రీడల్లో 64 యూనివర్సిటీలు కనీసం ఒక స్వర్ణమైనా సాధించాయి. 113 యూనివర్సిటీలు కనీసం ఒక కాంస్యమైనా గెలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నాలుగు పతకాలతో (స్వర్ణం, రజతం, రెండు కాంస్యాలు) 38వ ర్యాంక్‌లో... ఆంధ్ర యూనివర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, కాంస్యం) 50వ ర్యాంక్‌లో... కృష్ణా యూనివర్సిటీ రెండు రజతాలతో 72వ ర్యాంక్‌లో... డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ ఒక కాంస్యంతో 97వ ర్యాంక్‌లో.... తెలంగాణకు చెందిన ఉస్మానియా యూనివర్సిటీ రెండు పతకాలతో (స్వర్ణం, రజతం) 45వ ర్యాంక్‌లో... పాలమూరు యూనివర్సిటీ ఒక రజతంతో 81వ ర్యాంక్‌లో నిలిచాయి. -
‘మన్మోహన్ సింగ్ కొలువులో చేరొచ్చు’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గౌరవ అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టవచ్చని మంగళవారం పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. ఆయన రాజ్యసభ సభ్యత్వంపై ఈ కొత్త బాధ్యతల ప్రభావం ఉండబోదని తెలిపింది. జవహార్ లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్షిప్ బాధ్యతలు చేపట్టేందుకు రావాలని, తీరిక ఉన్న సమయాల్లోనే తమ విద్యార్థులకు, అధ్యాపకులకు బోధించాలని కోరుతూ పంజాబ్ యూనిర్సిటీ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ ను కోరింది. దీంతో ఆయన ఈ ఏడాది జూలై నెలలోనే అలా చేయవచ్చా లేదా అనేది తెలుసుకునేందుకు రాజ్యసభ చైర్మన్‌ను సంప్రదించారు. భారత రాజ్యంగంలోని 102(1)(ఏ) నిబంధన తాను ఆ బాధ్యతలు చేపట్టేందుకు అనుమతి ఇస్తుందా లేదా సలహా ఇవ్వాలని కోరారు. ఈ నిబంధన ప్రకారం పార్లమెంటు ఉభయ సభల్లోని ఏ సభలో సభ్యుడు అయినా.. ఆ వ్యక్తి ఆదాయం వచ్చే ఇతర ఏ ప్రభుత్వ సంస్థలో విధులు నిర్వర్తించరాదు. దీనిపైనే వివరణ కోసమే చైర్మన్ ను సంప్రదించారు. అయితే, గౌరవ అధ్యాపక బాధ్యతలు మాత్రమే చేపడుతున్నందన మాజీ ప్రధాని వాటిని నిరభ్యంతరంగా స్వీకరించవచ్చని, ఆయన రాజసభ సభ్యత్వానికి ఎలాంటి ఢోకా లేదని పార్లమెంటు కమిటీ స్పష్టం చేసింది. మన్మోహన్సింగ్ పంజాబ్ యూనివర్సిటీలోనే ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశారు. అనంతరం 1963 నుంచి 65 మధ్యలో ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా మరోసారి ఆయన అదే యూనివర్సిటీలో తన విజ్ఞానాన్ని పంచేందుకు అవకాశం దక్కనుంది. ఈ బాధ్యతలు చేపట్టే వ్యక్తికి వర్సిటీ తరుపున విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్, ఓ కారు, డ్రైవర్, వసతి, రోజుకు రూ.5,000లు గౌరవంగా అందిస్తారు. చర్చల ద్వారా ఆయన విద్యార్థులతో, అధ్యాపకులతో బోధన చేస్తారు. -
ఆసియా టాప్ 100 వర్సిటీల్లో భారత్‌కు చోటు
లండన్: ఆసియాలోని యూనివర్సిటీల ర్యాంకింగ్‌లలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించింది. 2014 సంవత్సరానికి సంబంధించి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మేగజైన్ గురువారం విడుదల చేసిన టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో భారత్‌లోని పది విద్యాసంస్థలకు చోటు లభించింది. 2013లో ఈ జాబితాలో కేవలం మూడింటికి మాత్రమే చోటు లభించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 10కి పెరిగింది. ఈ జాబితాలో చండీగఢ్‌లోని పంజాబ్ యూనివర్సిటీకి 32వ స్థానం లభించింది. అలాగే ఖరగ్‌పూర్‌లోని ఐఐటీకి 45, కాన్పూర్ ఐఐటీకి 55వ ర్యాంకులు వచ్చాయి. ఢిల్లీ, రూర్కీ ఐఐటీలకు సంయుక్తంగా 59వ ర్యాంకు లభించింది. గువాహటి, మద్రాస్ ఐఐటీలు 74, 76 స్థానాల్లో నిలిచాయి. కోల్‌కతాలోని జాదవ్‌పూర్ వర్సిటీకూడా 76వ ర్యాంకు వచ్చింది. అలీగఢ్ ముస్లిం వర్సిటీకి 80, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి 90వ స్థానం దక్కింది. ఇదిలా ఉండగా 20 విద్యాసంస్థలతో జపాన్ ఈ జాబితాలో అగ్రభాగంలో ఉంది. -
భారత్‌లో 10 ప్రపంచస్థాయి యూనివర్సిటీలు
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ టాప్ 100 ర్యాంకుల ప్రకటన లండన్: అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో భారత్‌లోని పది యూనివర్సిటీలకు చోటు లభించింది. జాబితాలో పంజాబ్ యూనివర్సిటీ 13వ స్థానంలో, ఐఐటీ ఖరగ్‌పూర్ (30), ఐఐటీ కాన్పూర్(34)వ స్థానాల్లో నిలవగా ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కీలు సంయుక్తంగా 37వ స్థానంలో నిలిచాయి. ఐఐటీ గువాహటి 46, ఐఐటీ మద్రాస్, జాదవ్‌పూర్ యూనివర్సిటీలు 47, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 50, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ 57 స్థానాలను దక్కించుకున్నాయి. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్), మరో 17 అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రపంచస్థాయి యూనివర్సిటీలపై తొలిసారి సర్వే చేసిన టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ఈ మేరకు ర్యాంకులను ప్రకటించింది. ఈ టాప్ 100 వర్సిటీల జాబితాలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనాలోని పెకింగ్, త్సింగ్వా యూనివర్సిటీలు మొదటి, రెండో స్థానంలో నిలవగా.. ఆ దేశంలోని 44 యూనివర్సిటీలు టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. బోధన, పరిశోధన, నాలెడ్జి ట్రాన్స్ఫర్, అంతర్జాతీయ దృక్పథం వంటి 13 అంశాల ఆధారంగా ర్యాంకులు కేటాయించారు. భారత్‌లో 20 యూనివర్సిటీలు మాత్రమే తమ సమాచారాన్ని అందజేయడంతో ఐఐఎంల వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను పరిశీలించలేదు. పాకిస్థాన్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోని ఒక్క యూనివర్సిటీకి కూడా ఈ జాబితాలో చోటు దక్కలేదు.