parliamentary constituency
-
నేడు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ సమావేశం
-
లోక్‌సభ సభ్యత్వానికి అఖిలేశ్ రాజీనామా
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్ లోక్‌సభ ఎంపీగా ఉన్న ఆయన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కర్హాల్ నుంచి గెలవడం తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలనే ఉద్దేశంతోనే ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు అఖిలేశ్ చెప్పారు. ఎస్పీకి అఖిలేశ్ తండ్రి ములాయం సహా లోక్‌సభలో నలుగురు సభ్యులున్నారు. చదవండి: (చిన్నమ్మకు ‘పన్నీరు’ క్లీన్ చిట్) -
భాగ్యనగరం మనదే: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/సైదాబాద్: ‘వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంసహా దాని పరిధిలోని శాసనసభా నియోజకవర్గాలన్నింటినీ బీజేపీ కైవసం చేసుకుంటుంది’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటోందని, అది బీజేపీ వల్లే సాధ్యమని నమ్ముతోందని అన్నారు. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకర్గస్థాయి సమీక్షాసమావేశం ఆదివారం ఇక్కడ చంపాపేటలోని మినర్వా గార్డెన్లో నిర్వహించారు. దొంగ ఓట్లతో ఎంఐఎం గెలుస్తోందని, ఒకవర్గం ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు యత్నిస్తోందని, ఈ విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సంజయ్ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య రామమందిరం తరహా లో భాగ్యనగరంలో భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తెలంగాణను నయా రజాకార్ల రాజ్యంగా మార్చాయని, ఇక్కడ రజాకార్ల పాలన కావాలో... సుభిక్షంగా ఉండే రామరాజ్యం కావాలో.. ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దారుస్సలాంను ఆక్రమిస్తాం.. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు 1969లో అప్పటి ఆంధ్రాపాలకులతో నాటి ఎంఐఎం అధినేత రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే దారుస్సలాంను రాయించుకున్నారని సంజయ్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే దానిని ఆక్రమించుకుని తీరుతామని స్పష్టం చేశారు. పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలకు తట్టుకోలేక ఒకవర్గం ప్రజలెందరో తమ ఆస్తులను వదిలేసి మూసీ అవతలకు వెళ్లిపోయారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాతబస్తీ నుంచే ఘర్‌వాపసీ మొదలుపెడతామని పేర్కొన్నారు. ‘బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరు. అవసరమైతే, అసెంబ్లీలో పెట్టబోయే బడ్జెట్లో లాఠీలు కొనేందుకు, అరెస్ట్ చేసి లోపల పెట్టేందుకు జైళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపులు చేసుకోవచ్చు’అని అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని తెలంగాణ ఐకాన్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయం : కిషన్‌రెడ్డి ‘సీఎం కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు తిరిగినా, చివరికి పాకిస్తాన్ ప్రధానిని, అక్కడి ఉగ్రవాదులను కలిసినా తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయం’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేదలకు అందకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. -
రూ.10 లక్షల చొప్పున ఇస్తే పదవికి రాజీనామా: కోమటిరెడ్డి
చౌటుప్పల్: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్న 7లక్షల మంది దళిత, గిరి జనులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున ఇస్తే తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చే స్తానని పేర్కొన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను ఓడించేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రకటించారన్నారు. దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన రోజునే కేసీఆర్ ఓడిపోయినట్టని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నానని, ఇప్పటికే రెండుసార్లు ప్రధాని మోదీని కలిశానని, రూ.3 వేల కోట్లకు పైగా నిధులు రాబట్టానని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపురం వరకు రూ.600 కోట్లతో నిర్మించనున్న ఆరు వరుసల రహదారి పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. -
పార్లమెంటు లక్ష్యం.. గెలుపు వ్యూహం
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తులో తొలి అంకం ముగిసింది. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న పార్లమెంటరీ నియోజకవర్గాల స్థాయి సమీక్షలు ఆదివారంతో ముగిసాయి. చివరిరోజు ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలపై టీపీసీసీ నేతలు సమీక్ష జరిపారు. దీంతో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల సమీక్షలు పూర్తయ్యాయి.ఈ సమీక్షల్లో తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శులు శ్రీనివాస కృష్ణన్, సలీం అహ్మద్, బోసురాజులతో పాటు సీఎల్పీనేత భట్టి విక్రమార్క, రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, కొత్త జిల్లాల అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాలకు చెందిన మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, పీసీసీ ఆఫీస్‌బేరర్లు పాల్గొని పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అలాగే పార్టీ సమన్వయ కమిటీ, ప్రదేశ్ ఎన్నికల కమిటీల సమావేశాలు కూడా జరిగాయి. పార్టీ ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపికపై వీటిలో చర్చించారు. ఏం చేద్దాం..? అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి పార్టీ కోలుకోవాలంటే లోక్‌సభ ఎన్నికల్లో గౌరవ ప్రదమయిన స్థాయిలో సీట్లు గెలుపొందాలనే ఎజెండాతో ఈ సమీక్షలు జరిగాయని టీపీసీసీ నేతలు చెపుతున్నారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన వ్యూహం, దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఓటర్లను కాంగ్రెస్ వైపు ఆకర్షించడం, ప్రచార వ్యూహం తదితరాలపై చర్చించారు. ఏ లోక్‌సభ స్థానానికి ఎవరు అభ్యర్థి అయితే బాగుంటుందనే దానిపై క్షేత్రస్థాయి నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. నేతల అభిప్రాయాలు తీసుకునే విషయంలో మరికొంత ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టం జరపడంతో పాటు గత ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలను రానున్న ఎన్నికల్లో ఎలా పునరావృతం కాకుండా చూడాలనే దానిపై దిశానిర్దేశం చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కొందరి నేతల్లో వ్యక్తమయింది. చివరి రోజు... ఆ ఐదు నియోజకవర్గాలు ఆదివారం హైదరాబాద్, రంగారెడ్డితో పాటు మెదక్ జిల్లా పరిధిలోని ఐదు లోక్‌సభ స్థానాలపై సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షలో కుంతియా, ఉత్తమ్, భట్టి, బోసురాజు, వంశీచందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పైలట్‌రోహిత్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు కుసుమకుమార్, పొన్నం ప్రభాకర్, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా ఉత్తమ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అనేక కారణాలతో ఓటమి పాలయ్యామని, అధికార పార్టీ విచ్చలవిడిగా వ్యవహరించి ఎన్నికల్లో గెలుపొందిం దని ఆరోపించారు. కానీ, లోక్‌సభ ఎన్నికలు మాత్రం రాహుల్, మోదీ మధ్య జరుగుతాయని, జాతీయ అంశాలతో ముడిపడిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణలో బీజేపీ బలంగా లేనందున కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా అభివృద్ధి జరగలేదని, సీఎం కేసీఆర్ బీజేపీతో లాలూచీ పడి రాష్ట్ర అభివృద్ధి సాధించలేకపోయారని విమర్శించారు. బీజేపీ ముసుగులో ఉన్న టీఆర్ఎస్కు కాకుండా కాంగ్రెస్‌కు ఓట్లేయాలని ఆయన ప్రజలను కోరారు. ఎంఆర్జీ వాకౌట్ సమీక్ష సమావేశాలు జరుగుతున్న తీరుకు నిరసనగా సికింద్రాబాద్ సమీక్ష నుంచి తాను వాకౌట్ చేసినట్టు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఆర్జీ. వినోద్‌రెడ్డి చెప్పారు. సమావేశంతో సంబంధం లేని వారంతా హాజరయ్యారని, ఓ పద్ధతి ప్రకా రం నిర్వహించలేదని, తమ నాయకుడే పార్లమెంటు అభ్యర్థి కావాలనే ప్రసంగాలు పార్టీకి మంచి చేయవనే కారణంతోనే తాను బయటకు వచ్చినట్టు ఆయన వెల్లడించారు. -
అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూయార్క్: దేశంలోని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో ఆయన ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించాక మాట్లాడారు. పౌరులకు పాస్‌పోర్టు సేవలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చే మార్చి కల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీని వల్ల ప్రతి ఒక్కరికీ 50–60 కిలోమీటర్ల దూరంలోనే పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 365 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తమ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లో ఉన్న భారత పౌరుల కోసం అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ పాస్‌పోర్ట్ సేవా పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. విదేశాల్లో భారతీయులు పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. -
అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు
న్యూయార్క్: దేశంలోని మొత్తం 543 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో ఆయన ‘పాస్‌పోర్ట్ సేవా’ కార్యక్రమాన్ని ప్రారంభించాక మాట్లాడారు. పౌరులకు పాస్‌పోర్టు సేవలను సులభతరం చేసే లక్ష్యంతో వచ్చే మార్చి కల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. దీని వల్ల ప్రతి ఒక్కరికీ 50–60 కిలోమీటర్ల దూరంలోనే పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 365 పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు ఉన్నాయన్నారు. వచ్చే నాలుగు నెలల్లో తమ మంత్రిత్వ శాఖ వివిధ దేశాల్లో ఉన్న భారత పౌరుల కోసం అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ పాస్‌పోర్ట్ సేవా పథకాన్ని ప్రారంభించనుందని తెలిపారు. విదేశాల్లో భారతీయులు పాస్‌పోర్టు రెన్యువల్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. -
వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ నియామకం
శ్రీకాకుళం సిటీ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ నూతన కమిటీ నియామకమైంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షునితో పాటు మరో 169 మందితో నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. నూతన కమిటీ ఇదే.. శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షునిగా తమ్మినేని సీతారాం, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా మోతీలాల్ తిలక్, మద్దు రాజారావు(ఇచ్ఛాపురం), పాలిన శ్రీనివాసరావు, బత్తిన హేమేశ్వరరావు(పలాస), తిర్లంగి జానకిరామయ్య, సత్తారు సత్యం( టెక్కలి), శింతు రామారావు, బంకి రమణమూర్తి(నరసన్నపేట), ఎం.వి.పద్మావతి, కె.ఎల్.ప్రసాద్, చల్లా రవికుమార్ (శ్రీకాకుళం), గంట్యాడ రమేష్, శిల్లా ప్రశాంతలక్ష్మి(ఆమదాలవలస), రేజేటి కన్నయ్యస్వామి, బమ్మిడి ఖగేశ్వరరావు(పాతపట్నం)లు నియమితులయ్యారు. జిల్లా కార్యదర్శులు.. కారంగా మోహనరావు, ప్రకాశ్ పట్నాయక్, ఆసి ధర్మరాజురెడ్డి, దేవరాజుసాహు(ఇచ్ఛాపురం), మెట్టకుమార స్వామి, డోకారి దానయ్య, ఉంగశ్రీకృష్ణయాదవ్, దువ్వాడ హేమబాబుచౌదరి, బాళ్ల గిరిబాబు(పలాస), పోలాకి సోమేశ్వరరావు, నడుమూరి శ్రీరామమూర్తి, మోడి భాస్కరరెడ్డి, ముద్దారపు రమణ(టెక్కలి), లుకలాపు రవికుమార్, బచ్చు ఆదినారాయణరెడ్డి, వాన గోపి, కనుసు సీతారాం(నరసన్నపేట), గుమ్మా నగేష్, పీస గోపి, సుంకరికృష్ణ, బోర చిన్నంనాయుడు(శ్రీకాకుళం), కిల్లి లక్ష్మణరావు, కొరికాల వెంకట్రావు, మెట్ట శ్యామలరావు, బోరల సీతారాం(ఆమదాలవలస), అలికాన మాధవరావు, గొర్ల మోహనరావు, కొల్ల కృష్ణారావు, సవర సుభాష్(పాతపట్నం) సంయుక్త కార్యదర్శులు.. దుర్గాసి ధర్మారావు, మద్దిలి ఈశ్వరరావు, ఎర్ర త్రినాథ్, పొడుగు కామేశ్వరరావు, గుమ్మాడి రామదాసు(ఇచ్ఛాపురం), దువ్వాడ శ్రీకాంత్, దున్న వీరస్వామి, గున్న శ్రీనివాసులు, తెలగాన శ్రీరాములు, మల్ల సురేష్(పలాస), దుంగ శిమ్మన్న, బెండి కర్మవీరుడు, బొడ్డు వెంకటరమణ, మదపాల సంజీవరావు, కరాడ చిన్నయ్య, బూరి మోహనరావునాయుడు, నేతింటి నాగేశ్వరరావు(టెక్కలి), గుంటు లక్ష్మయ్య, గొండు బరికివాడు, అంధవరపు రమా, ఆరవెల్లి చిన్నబాబు(శ్రీకాకుళం), సురవరపు నాగేశ్వరరావు, బొడ్డేపల్లి నారాయణరావు, ఇసాయ్ అప్పారావు, బెండి గోవిందరావు, బి.రఘురామ్‌రెడ్డి, గార వెంకటరమణ,(ఆమదాలవలస), కోరాడ అర్జునరావు, వమరవల్లి శ్రీనివాసరావు, లోచర్ల మల్లేశ్వరరావు, బొడ్డేపల్లి బాస్కరరావు(పాతపట్నం), యుంగటి రాజు, బెవర నూకరాజు, నక్క తులసీదాస్, కెల్ల సింహాచలం(నరసన్నపేట). అధికార ప్రతినిధులు.. శిమ్మ రాజశేఖర్(శ్రీకాకుళం పట్టణం), రొక్కం సూర్యప్రకాశ్(టెక్కలి), జేజే మోహనరావు(ఆమదాలవలస). కార్యవర్గ సభ్యులు.. రౌతు విశ్వనాథం, దక్కత లోకనాథ రెడ్డి, బతకల మోహనదాసు, దుబ్బ రాఘవులు (ఇచ్ఛాపురం), మరడ భాస్కరరెడ్డి, మీసాల సురేష్‌బాబు, లండ రామలింగం, పైల చిట్టిబాబు, గుజ్జు మోహనరెడ్డి, కర్రి తిరుపతిరావు, గుంట జగన్నాథం, బైనపల్లి ఎర్రయ్య, కొండ జోగారావు, కరడ గిరి, మద్దిల బాలకృష్ణ, ఎం.రామకృష్ణ, ఎ.దేవేంద్ర, ఎం.జనార్దన, దాసరి వెంకట్రావు, డి.ఈశ్వరరావు, గర్తం తులసీరావు, గనియా తేజేశ్వరరావు, నవీన్మిశ్రా, సంకరి విశ్వనాథం, బడకల తుంబేష్, దిక్కల లక్ష్మణమూర్తి, రోణంకి శ్రీను, కొర్ల ఢిల్లీరావు, హేమసుందర్ పట్నాయక్(పలాస), కెల్లి గోవిందరావు, శ్రీరంగం వీరస్వామి, పరపతి మీనకేతనరెడ్డి, పిలకా రవికుమార్, తర్రా భాస్కరరావు(టెక్కలి), శివాల చిన్నయ్య, అన్నెపు అప్పలనాయుడు, పెనుమజ్జి విష్ణుమూర్తి, లండ ఆనందరావు, లుకలాపు సుధీర్(పాతపట్నం) నీలవేణి దేబరికి, గొర్ల దుర్గారాణి, సైలాడ అనసూయమ్మ, రైతు శ్రీనివాసరావు, గురుగుబెల్లి ప్రభాకరరావు, సనపల పద్మావతి, చిగురుపల్లి నారాయణరావు, బెండి వెంకటరమణమూర్తి, మీసాల రామినాయుడు, గున్నా లక్ష్మి, వెంకట సాయికుమార్, అనకాపల్లి జ్యోతి, గంగిరెడ్ల ఉమాదేవి, బలగ నారాయణమ్మ, వండాన వెంకట్రావు, పోతురాజు సూర్యారావు, వెంకటలక్ష్మి తమ్మినేని, రాకోటి కన్నయ్య, లోలుగు ధనలక్ష్మి, గంట్యాడ లక్ష్మి, కిల్లారి సువర్ణ, పప్పల అప్పలనాయుడు, బొమ్మాలి విశ్వనాథం, పిన్నింటి మంగమ్మ, బొడ్డేపల్లి లక్ష్మీనారాయణ, వీరగట్టాపు జయలక్ష్మి, రావడ రవి, లింగంనాయుడు సీపాన, పీవీ రమణమ్మ, కరణం మాణిక్యమ్మ, లావేటి భవానీ, చల్లా పద్మావతి, వియ్యపు కృష్ణవేణి, జడ్డు దివ్య, ఖండాపు నవీన, తొత్తడి సురేష్, గుమ్మడి రాంబాబు, సూరా భాగ్యలక్ష్మి, బూరి శ్రీరామూర్తి, మామిడి రమణమ్మ, సీపాన వేదవతి, జరజాపు వెంకట్రావు, దాసిరెడ్డి వెంకునాయుడు, మానుకొండ వెంకటరమణ, బోర చిన్నంనాయుడు, ఎస్కే పీర్సాహేబ్, వ్యాపార లక్ష్మీనారాయణ(ఆమదాలవలస). శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా యువజన విభాగం.. శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా యవజన విభాగం ప్రధాన కార్యదర్శిగా మహ్మద్ అబ్దుల్ సిరాజుద్దీన్(శ్రీకాకుళం)లు నియమితులయ్యారు. -
టీడీపీ అరాచకాలను ఐక్యంగా ఎదుర్కొందాం
- వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల సమావేశంలో నేతల పిలుపు నరసరావుపేట రూరల్ : టీడీపీ అరాచకాలను ఐక్యంగా ఎదుర్కొందామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ పిలుపునిచ్చారు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలోని పార్టీ కౌన్సిలర్ల ఆత్మీయ సమావేశాన్ని పట్టణంలోని విజయ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజశేఖర్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు అధికారులతో కలసిచేస్తున్న తప్పుడు పనులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇలాంటి పనులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే అధికారుల మెడకు చుట్టుకునే రోజులు వస్తాయన్నారు. గుంటూరు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశాన్ని ఈ నెల 8న తెనాలిలో నిర్వహిస్తామన్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు వంటి సమస్యలను కౌన్సిల్ సమావేశాల్లో లేవనెత్తడం ద్వారా ప్రజలకు చేరువ కావచ్చన్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాకుండానే టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. ఆ పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. పట్టణాల్లో పార్టీని పటిష్టపరిచేలా కౌన్సిలర్లు, కన్వీనర్లు పనిచేయాలన్నారు. సమస్యలను తెలుసుకునేందుకు ప్రతి రోజు వార్డుల్లో పర్యటించాలన్నారు. దీంతోపాటు సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ జిల్లాలోని పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు సంఘటితం కావాల్సిన పరిస్థితులను టీడీపీ కల్పిస్తోందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని విమర్శించారు. డివిజన్లో నెలకొన్న దారుణ పరిస్థితికి సభాపతి కోడెల శివప్రసాదరావే కారణమని విమర్శించారు. రాజకీయాన్ని రౌడీయిజంవైపు నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్టీ నేత ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ మున్సిపాల్టీల్లో ఏకపక్ష పాలన సాగుతోందన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు నేతలందరితో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కౌన్సిల్ సమావేశాల్లో అధికార పార్టీకి దీటుగా బదులివ్వాలన్నారు. సమస్యలు వచ్చినప్పడు అవసరమైతే ఉద్యమం చే పడతామని చెప్పారు. సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్‌లీడర్లు మాగులూరి రమణా రెడ్డి, ఎన్.వెంకటరామిరెడ్డి, సీహెచ్.సాంబశివరావు, ఆర్.రమాదేవి, రేపాల శ్రీనివాస్, పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి రమేష్‌బాబు, పట్టణ కన్వీనర్ షేక్హనీఫ్, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పాలపర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అభ్యర్థులు రె‘ఢీ’
ఏలూరు, న్యూస్‌లైన్: లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో నామినేషన్ల పర్వానికి బుధవారం తెరపడింది. మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ ఘట్టం పూర్తయింది. ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలు, 15 అసెంబ్లీ సెగ్మెం ట్లలో మొత్తం 192 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. రెండు లోక్‌సభ స్థానాల్లో 29 మంది అభ్యర్థులు రేసులో నిలిచారు. 15 అసెంబ్లీ స్థానాల్లో 163 మంది బరిలో మిగిలారు. నరసాపురం పార్లమెంటరీ స్థానంలో వంక రవీంద్రనాథ్‌కు డమ్మీ అభ్యర్థి వంక రాజకుమారి, స్వతంత్ర అభ్యర్థి సత్తి సూర్యనారాయణరెడ్డి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ స్థానం నుంచి 14 మంది బరిలో నిలిచారు. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 15 మంది బరిలో ఉన్నారు. రెండు ఏంపీ స్థానాలకు 37మంది, అసెంబ్లీ స్థానాలకు 247 మంది నామినేషన్లు దాఖలు చేసిన విషయం విది తమే. ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన అనంతరం రిట ర్నింగ్ అధికారులు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. -
అమ్ముడుపోయానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం
జి. దొంతమూరు (రంగంపేట), న్యూస్‌లైన్ :తన జీవితంలో ఎక్కడైనా అమ్ముడు పోయానని రుజువుచేస్తే దేనికైనా సిద్ధమేనని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేత, సినీ నటుడు మాగంటి మురళీమోహన్ అన్నారు. కేపీఆర్ రసాయన మూలకాల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జి.దొంతమూరు, బాలవరం గ్రామాల్లో జరుగుతున్న నిరశన దీక్షా శిబిరాలను బుధవారం సాయంత్రం ఆయన సందర్శించారు. కేపీఆర్ గుప్పిట్లో మురళీమోహన్ అనే అపరిచిత కరపత్రాలపై స్పందించిన ఆయన వివరణ ఇచ్చారు. రెండు గ్రామాల వారిని ఉద్దేశించి మాట్లాడారు. తనకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని, తనకే అలాంటి ఫ్యాక్టరీలు 10 కట్టగల ఆర్థిక స్థోమత ఉందన్నారు. తాను కేపీఆర్ సంస్థకు తొత్తును కాదని, 30 ఏళ్లుగా దీక్ష చేపడుతున్న అయ్యప్ప మాలపై ఒట్టు వేసి చెబుతున్నానన్నారు. కరపత్రాలు ముద్రించి పంపిణీ చేసిన నాయకుల చరిత్ర నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. తాను దానపరుణ్ణే కాని దాసోహపరుణ్ణి కాదన్నారు. కరపత్రాల వ్యవహారం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దృష్టికి వెళ్లిందని, సరైన సమయంలో సరైన రీతిలో ఆయన స్పందిస్తారని మురళీమోహన్ అన్నారు. తాను కేపీఆర్ సంస్థకు తొత్తును కాదని డబ్బు కోసం ఆశించిన తొత్తులే వారికి దాసోహం అంటున్నారని మండిపడ్డారు. పేదలకు సహాయం చేయాలనే సంకల్పంతో ఉచితంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రోత్సాహానిస్తున్నానన్నారు. ఆరోగ్యశిబిరాలు సమాజ సేవా దృక్పథంతో నిర్వహిస్తున్నానే తప్ప ప్రచారం కోసం కాదన్నారు. ఇలాంటి కరపత్రాలు వేసినవారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కేపీఆర్ వ్యతిరేక ఉద్యమాలకు అండగా నిలుస్తానని ఆయన హామీ ఇచ్చారు. 322 రోజులుగా కేపీఆర్ సంస్థ పనులకు వ్యతిరేకంగా నిరశన ఉద్యమాలు చేయడం అభినందనీయమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని మురళీమోహన్ జోస్యం చెప్పారు. ‘మీసమస్యను తప్పనిసరిగా పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.’ ఆ కరపత్రాలతో తమకు సంబంధం లేదని కేపీఆర్ సంస్థ పనుల వ్యతిరేక పోరాట సమితి అధ్యక్ష, కార్యదర్శులు గిరిజాల సత్తిబాబు, కాకరపల్లి సూరిబాబు తెలిపారు. మండల టీడీపీ అధ్యక్షుడు పెండ్యాల నళినీకాంత్, జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ఆళ్ల గోవింద్, పార్టీనాయకులు గారపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అమేథీలో పర్యటించనున్న ఆప్ నేత కుమార్ విశ్వాస్
లక్నో/ఢిల్లీ: ఆమ్ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ నియోజక వర్గ పర్యటనకు వెళ్లనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి విశ్వాస్ రాహుల్ మీద పోటీకి దిగనున్నట్లు భావిస్తున్నారు. ‘జాదు సందేశ్ యాత్రలో’ పాల్గొనడం ద్వారా నియోజక వర్గపు రాజకీయ పరిస్థితిని పరిశీలించనున్నట్లు ఆయన ప్రకటించారు. డిసెంబర్ 27వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభమౌతుందని వివరించారు. ఉత్తరప్రదేశ్‌లో పాదుకొనడానికి ఈ యాత్ర ఉపకరించే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీ సంచలన విజయం తర్వాత దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర నిర్వహించాలని భావిస్తున్న ఆప్ పార్టీ కళ్లు పలు ప్రముఖులు ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానాల మీద గురి నిలిపింది. అరవింద్ కేజ్రీవాల్‌కు సన్నిహితుడుగా భావించే మనీష్ సిసోడియా విశ్వాస్ రాహుల్‌పై బరిలోకి దిగనున్నట్లు కొద్ది రోజుల కిందట ప్రకటించారు. మరో ఆప్ పార్టీ సీనియర్ నేత మాట్లాడుతూ ‘‘ జాదు సందేశ్ యాత్ర’ ప్రజలను సమీకరించే లక్ష్యంతో నిర్వహిస్తున్నాం. ఈ యాత్ర సందర్భంగా విశ్వాస్ పలు బహిరంగ సభలను ఏర్పాటు చేస్తారు’’ సాయినాథ రోడ్డులోని ఆప్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల మీద దండెత్తడంలో విశ్వాస్ అతి చురుకుగా వ్యవహరించేవాడు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటులో వెలుపలి నుంచి మద్దతు అందుకొంటున్న ఆప్ పార్టీ ఏవిధంగా వ్యవహరించాల్సి వస్తుందో వేచిచూడాల్సిందే అని పలువురు రాజకీయ విశ్లేషకులు వాక్యానిస్తున్నారు. కాగా ఉత్తరప్రదేశ్ ప్రజాపనుల శాఖ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ రాష్ట్రంలో ఆప్ పోటీకి దిగుతుందనే వార్తలను కొట్టిపారేశారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆప్ పార్టీ ప్రభావం ఉత్తరప్రదేశ్‌లో పెద్దగా ఉండదని వ్యాఖ్యానించారు.