Parliamnet
-
‘రాహుల్ గాంధీ పగ! అందుకే ఆప్‌కు కేటాయింపు’
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరోపణలు, విమర్శల దాడి పెరుగుతోంది. కాంగెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులపై ఎంపికపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ.. ఇండియా కూటమిలో భాగంగా పలు రాష్ట్రాల్లో సీట్ల పంపకంపై తీవ్రంగా కసరత్తు చేస్తూ ఓ కొలిక్కి తీసుకువస్తోంది. బీజేపీని ఓడించటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇక.. బీజేపీ సైతం వారం రోజుల్లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యుర్థుల మొదటి జాబితాను విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయ. ఇక.. కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం ఢిల్లీ, యూపీలో కొలిక్కి రాగా గుజరాత్లో కూడా ఆప్‌తో పొత్తుగా భాగంగా రెండు సీట్లను కేటాయించింది. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఆప్‌కు కేటాయించిన రెండు సీట్లలో భారుచా లోక్‌సభ నియోజకవర్గం ఒకటి. ఇది దివంగత కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ కుటుంబానికి బలం ఉన్న నియోజకవర్గం. ఇక.. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కు ఇవ్వటంపై ఇప్పటికే అహ్మద్ పటేల్ కూతురు, కొడుకు నిరాశ వ్యక్తం చేశారు. In the Congress, one dynasty is more equal than the others. Everyone knows of the differences between late Ahmed Patel and Rahul Gandhi. Giving away Bharuch to AAP is Rahul Gandhi’s attempt to erase his legacy and humiliate the family. Gandhis believe in use and throw. https://t.co/nQWDqDneTe — Amit Malviya (@amitmalviya) February 24, 2024 గుజరాత్‌తో కాంగ్రెస్ ఆప్‌కు కేటాయించిన సీట్లపై బీజేపీ తీవ్రంగా విమర్శలు గుప్పింస్తోంది. ‘కాంగ్రెస్ పార్టీలో ఇతర వారసత్వ కుటుంబాల కంటే ఒక్కరికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరిగి తెలుసు దివంగత నేత అహ్మద్ పటేల్, రాహుల్ గాంధీకి మధ్య ఉన్న విభేదాలు. కాంగ్రెస్ భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కు ఇవ్వటం అంటే రాహుల్ గాంధీ.. అహ్మద్ పటేల్ వారసత్వాన్ని అంతం చేయటమే. ఆ కుటుంబాన్ని అవమానపరచటమే. రాహుల్ గాంధీ ఎప్పుడూ ఉపయోగించుకోని.. వదిలేయటాన్ని మాత్రమే నమ్ముతారు’ అని అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ ట్వీట్‌ను బీజేపీ నేత అమిత్ మాల్వియా షేర్ చేశారు. Handing over long standing stronghold of Sh Ahmed Patel, who gave his life to Congress Party, to AAP is the revenge of the “Prince” ! — Jaiveer Shergill (@JaiveerShergill) February 24, 2024 బీజేపీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసిన దివంగత అహ్మద్ పటేల్ కుటుంబానికి బలం ఉన్న భారుచా సెగ్మెంట్‌ను ఆప్‌కి అప్పగించటం..‘యువరాజు’ (రాహుల్) పగలో భాగం’ అని ఎక్స్‘ట్విటర్’లో మండిపడ్డారు. -
ధన్‌ఖడ్‌పై ఖర్గే విమర్శలు.. నేను అలా అనుకోవాలా?
ఢిల్లీ: పార్లమెంట్ భద్రత వైఫల్యానికి సంబంధించి హోంమంత్రి అమిత్ షా స్పందించాలని పట్టుబట్టారు కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఎంపీలు. ఈ క్రమంలో 146 మంది ఉభయ సభల నుంచి సస్పెండ్ చేయబడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్‌పై నిరసనగా శుక్రవారం ఇండియా కూటమి ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ చీఫ్ మళ్లికార్జున ఖర్గే.. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్‌పై విమర్శలు గుప్పించారు. ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మీరు, హుందాగా వ్యవహరిస్తూ ఆ పదవిని నిలబెట్టుకోవాలి. కులం పేరుతో మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని అనడం సరికాదు. ట్రెజరీ బెంచ్‌లు నన్ను చాలాసార్లు మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నాయి. దానికి నా కులం(దళిత సామాజికవర్గం) పేరుతో నన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారని నేను అనుకోవాలా?’ అని ఖర్గే తీవ్రంగా విమర్శించారు. అయితే పార్లమెంట్ భద్రత వైఫల్యంపై నిరసన తెలిపిన ఎంపీలపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ పలువురు ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్‌కు గురైన ఎంపీలు పార్లమెంట్ బయట ‘మాక్ పార్లమెంట్’ నిర్వహించారు. ఇందులో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ.. రాజ్యసభ చైర్మన్ సభలో వ్యవహరించే తీరును అనుకరించి మరీ నిరసన తెలిపాడు. దీంతో.. ‘నన్ను కులం (జాట్) పేరుతో అవమానించారు. నేను ఒక వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినందుకు నన్ను టార్గెట్ చేశారు’ అంటూ రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ సదరు ఎంపీలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చదవండి: ఆరు నెలల పాపకు కరోనా! అప్రమత్తమైన అధికారులు -
రాష్ట్రపతికి మేము వ్యతిరేకం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని బహిష్కరించాం తప్ప రాష్ట్రపతికి తాము వ్యతిరేకం కాదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు స్పష్టం చేశారు. అందుకే పార్లమెంటులో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపామన్నారు. గత ఎనిమిదేళ్లలో కేంద్రం ప్రజలకు ఏమీ చేయలేదని... ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీయకపోతే ఎలా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేలా పాలన సాగుతోందని... అందుకే గౌతమ్ అదానీ పేరుతో కేంద్రం అదానీ చట్టాన్ని తేవాలని కేకే ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పారీ్టతో కలిసి బహిష్కరించిన అనంతరం విజయ్‌చౌక్‌లో బీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్ నేత, సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర, సురేశ్‌రెడ్డి, కవిత, దామోదర్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్, రాములు, పార్థసారథి రెడ్డి, లింగయ్య యాదవ్‌లతో కలిసి కేకే, నామా నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగం ప్రస్తావన ఏదీ?: కేకే రాష్ట్రపతి తన ప్రసంగంలో సామాజిక, గిరిజన, మహిళల అంశాలపై గొప్పగా పేర్కొన్నా అవన్నీ ఎక్కడా అమలులో లేవని కె. కేశవరావు విమర్శించారు. దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉన్నా రాష్ట్రపతి ప్రసంగంలో కనీసం ఆ మాటే లేదని, విద్య, ఆరోగ్యం ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్రం వీటన్నింటిపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణలో గవర్నర్ కారణంగా బడ్జెట్ ఆమోదం కోసం కోర్టుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహారంతో ఆప్ ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను చూస్తున్నామన్నారు. అలాగే కేరళ, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా జరుగుతున్న పరిణామాలు దేశంలో అందరూ గమనిస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై ఇప్పటికైనా కేంద్రం దృష్టి సారించాలనే ఉద్దేశంతోనే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయం తీసుకున్నామని కేకే తెలిపారు. రాష్ట్ర అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తాం: నామా రాష్ట్రపతి ప్రసంగంలో మహిళల గురించి ప్రస్తావించినా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించలేదని ఎంపీ నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. అలాగే పలుమార్లు అంబేడ్కర్ పేరును తలుచుకున్నా కొత్త పార్లమెంటు భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న తమ డిమాండ్‌కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదని విమర్శించారు. వీటితోపాటు రైతు సమస్యలు, దేశవ్యాప్తంగా రైతుబంధు అమలు, పంటలకు కనీస మద్దతు ధర, రైతులపై పెట్టిన కేసుల ఉపసంహరణ వంటి డిమాండ్లను ప్రస్తావించలేదని విమర్శించారు. దేశంలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు ఇచ్చామని కేంద్రం రాష్ట్రపతి ప్రసంగంలో చెప్పుకుందని... అయితే తెలంగాణలో ఇంటింటికీ ఎప్పుడో ప్రక్రియను పూర్తి చేశామన్నారు. తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్న కేంద్ర ప్రభుత్వం... రాష్ట్రాభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటోందని నామా ప్రశ్నించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని నామా స్పష్టం చేశారు. -
నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?
బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో తీసుకొచ్చిన నేరస్థుల గుర్తింపు చట్టం స్థానంలో అంతకంటే మించి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే బిల్లు తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందింది. నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాదముద్రలు వంటివాటిని భద్రపర్చే అధికారాలను ఇది నేరదర్యాప్తు అధికారులకు దఖలు పర్చింది. ఈ బిల్లు శిక్షపడిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను 75 సంవత్సరాల పాటు అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తోంది. వ్యక్తుల డేటాను శాశ్వతంగా సేకరించి ఉంచుకోవడం అనేది నేరాల నిరోధంలో లేదా నేర విచారణలో ఎలా సాయపడుతుందనే విషయంలో ఈ బిల్లు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. పైగా పార్లమెంటులో ఈ బిల్లును త్వరత్వరగా తీసుకొచ్చి ఆమోదం పొందిన పద్ధతి మరింత ఆందోళన కలిగిస్తోంది. బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం 1920లో నేరస్థుల గుర్తింపు చట్టాన్ని ఆమోదించింది. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన నెల రోజుల తర్వాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. జాతీయవాదం పెల్లుబుకుతున్న వేళ, ప్రజలపై నిఘా పరిధిని విస్తరించడం ద్వారా వారిని మరింతగా నియంత్రించడానికిగానూ బ్రిటిష్ పాలకులు చేసిన ప్రయత్నంలో భాగంగా ఆనాడు నేరస్థుల గుర్తింపు చట్టాన్ని తీసు కొచ్చారు. ఈ చట్టం నేరస్థుల ఫొటోగ్రాఫ్‌లు, వేలిముద్రలు, పాద ముద్రలు వంటివాటిని (కొన్ని పరిమిత కేసుల్లో నేరస్థులు కానివారివి కూడా) భద్రపర్చే అధికారాలను చట్టాన్ని అమలు చేసే అధికారులకు దఖలు పర్చింది. ఇలాంటి వివరాలను భద్రపర్చడానికీ, తొలగించ డానికీ మరిన్ని నిబంధనలు తీసుకొచ్చారు. వలస పాలనా బిల్లు కంటే ప్రమాదకరం ఇప్పుడు 102 సంవత్సరాల తర్వాత, స్వతంత్ర భారతదేశంలో నెహ్రూ తర్వాత సుదీర్ఘ కాలం దేశాన్ని పాలిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, వలస పాలనా కాలంనాటి చట్టం చేసిన దానికంటే మరింత అధికంగా వ్యక్తిగత డేటాను (అతితక్కువ భద్రతలతో) సేకరించడానికి ప్రయత్నిస్తూ తాజా ముసాయిదా బిల్లును తీసుకొచ్చి నేరస్థుల గుర్తింపు చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించింది. మార్చి నెల చివరలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్ ప్రొసీజర్ (గుర్తింపు) బిల్లు ప్రకటిత లక్ష్యం ఏమిటంటే, గత శతాబ్ది కాలం పైగా రూపొం దుతూ వచ్చిన నూతన కొలతలు, గుర్తింపు పద్ధతులను లెక్కలోకి తీసుకోవడం ద్వారా చట్టాన్ని మరింతగా మెరుగుపర్చడమే. ఈ క్రమానికి తుదిరూపం ఇవ్వడానికి, ఈ బిల్లులో వేలి ముద్రలు, పాద ముద్రలు, ఫొటోగ్రాఫ్‌లు, ఐరిస్, రెటీనా స్కాన్లు, శారీరక, జీవపరమైన నమూనాలు, వాటి విశ్లేషణలు, ప్రవర్తనాప రమైన లక్షణాలతోపాటు సంతకాలు, చేతి రాత లేదా ఇతర పరీక్షలను కూడా పొందుపరుస్తున్నారు. కొలతల జాబితాలో వీటన్నింటినీ చేరుస్తున్నారు. అయితే ఈ బిల్లు ఇంతటితో ఆగిపోలేదు. శరీరం నుంచి ఏ కొలతలు తీసుకోవచ్చు అనే శాస్త్రీయ పరిణామాన్ని దృష్టిలో ఉంచుకుని చట్టాన్ని మెరుగుపర్చడంతో సంబంధం లేని మరో మూడు లక్షణాలు కూడా ఈ చట్టంలో మనకు కనిపిస్తాయి. వ్యక్తుల గోప్యతను లెక్కచేయని బిల్లు మొదటిది, ముందస్తు నిర్బంధ చట్టాల కింద నిర్బంధంలోకి తీసు కున్న ప్రజలతో సహా ఏ ఇతర నేరాల కింద అరెస్టు చేసిన ప్రజలకైనా సరే... వర్తించే విధంగా ఇది చట్టాల పరిధిని విస్తరిస్తోంది. ఇప్పటికైతే భారతదేశంలో అరెస్టు చేసే తమ అధికారాన్ని పోలీసులు దుర్విని యోగం చేయడం, ముందస్తు నిర్బంధ చట్టాలను మరింతంగా దుర్వి నియోగపర్చడం గురించి మనందరికీ బాగా తెలుసు. దురదృష్ట వశాత్తూ, ఈ బిల్లు ఏ తప్పూ చేయని, దోషులుగా నిర్ధారణ కాని వ్యక్తుల గోప్యతను ప్రభుత్వం చేతుల్లో పెడుతోంది. రెండు, ఈ బిల్లు శిక్షపడిన వ్యక్తుల వ్యక్తిగత డేటాను 75 సంవత్స రాల పాటు అట్టిపెట్టుకునేందుకు అనుమతిస్తోంది. వాస్తవంగా చూస్తే ఆ వ్యక్తి చనిపోయేంతవరకు అతడి వివరాలు పోలీసుల వద్ద ఉంటా యన్నమాట. ఏదేమైనా ఒక నేరచర్యలో శిక్షకు గురైన వ్యక్తులందరి పట్ల వివక్షారహిత అన్వయం విషయంలో ఈ బిల్లు పరిధులు దాటు తోంది. పైగా వ్యక్తుల డేటాను శాశ్వతంగా సేకరించి ఉంచుకోవడం అనేది నేరాల నిరోధంలో లేదా నేర విచారణలో ఎలా సాయపడు తుందనే విషయంలో ఈ బిల్లు ఎలాంటి వివరణా ఇవ్వడం లేదు. మూడు, ఈ బిల్లు వ్యక్తిగత డేటాను ఎలాంటి లా ఎన్ఫోర్స్ మెంట్ ఏజెన్సీతోనైనా పంచుకునేందుకు, అందజేసేందుకు జాతీయ నేర రికార్డుల బ్యూరోకి అనుమతిస్తోంది. ‘ప్రయోజన పరిమితి’కి చెందిన సూత్రంతో సహా డేటా పరిరక్షణకు చెందిన ఉత్తమ విధానా లన్నింటికీ ఈ బిల్లు వ్యతిరేకంగా ఉంటోంది. ఉదాహరణకు, డేటా సేకరణ చట్టబద్ధంగా ఉన్నప్పటికీ, ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించిన డేటాను ఆ పరిమిత ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప మరే ఇతర ప్రయోజనం కోసం దాన్ని ఉపయోగించకూడదు. నేర దర్యాప్తు, నేర విచారణ అనేవి సాధారణంగా అనిశ్చితంగానే ఉంటాయి. అన్ని రకాల నేర విచారణకు వ్యక్తిగత డేటా అవసరం ఉండదు. కొన్ని కేసుల్లో మాత్రమే విభిన్న వ్యక్తిగత డేటాలను కలిపి చూడాల్సిన అవసరం ఉంటుంది. పౌరులపై హద్దులు మీరిన నిఘా కాబట్టి, మరోసారి ఈ బిల్లులోని ప్రధాన సమస్య ఏమిటంటే, ఎలాంటి ఆంతరం చూపని దాని స్వభావమే. ఒక నేరాన్ని దర్యాప్తు చేయడానికి వ్యక్తిగత డేటా సేకరణ అవసరమైన చోట నేర వర్గీకరణ లను జాగ్రత్తగా వేరుచేసి చూడవలసిన అవసరం తప్పనిసరి. అలా వేరుచేసి చూడకపోతే వ్యక్తిగత డేటా గోప్యతను వంచించినట్లే అవు తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నేరçస్థుల రూపాలను కొలిచే టెక్నిక్‌లు గత శతాబ్ద కాలంగా ఏర్పడుతూ వచ్చాయి కాబట్టి నేరస్థులకు సంబంధించిన ప్రకటన, హేతువులను సరిగ్గా నోట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ బిల్లు విస్మరిస్తున్నది ఏమి టంటే, టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రభుత్వం తన పౌరులపై అత్యంత అధికంగా నిఘా పెట్టే అధికారాలను కలిగి ఉంది. కాబట్టే ఈ అధికారాలను చట్టపరంగా విస్తరించేటప్పుడు వాటిని అత్యంత కఠి నంగా క్రమబద్ధీకరించవలసి ఉంటుంది. ఉదాహరణకు, ప్రభుత్వం ఫొటోగ్రాఫులతో, వేలిముద్రలతోనే చక్కగా నిఘా పెట్టగలుగుతున్నప్పుడు, వాటికి ఇప్పుడు రెటీనా స్కాన్లు, బయోలాజికల్ శాంపిల్స్ (డీఎన్ఏ కూడా దీంట్లో భాగమే), చివరకు ప్రవర్తనాపరమైన లక్షణాలను తీసుకోవడం కూడా చేస్తున్న ప్పుడు ప్రభుత్వానికి ఉండే అధికారం ఇంకా విస్తరిస్తుంది. పైగా అలాంటి డేటా పరిరక్షణ చర్యలు కూడా చాలా ఎక్కువగా అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో, మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. అదేమిటంటే, డేటా పరిరక్షణ గురించి భారత్ ప్రకటించి అయిదేళ్లు కావస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ దేశం డేటా పరిరక్షణ చట్టాన్ని కలిగిలేదు. ఇది చట్టరూపం దాల్చి ఉంటే వ్యక్తిగత డేటా ఉపయోగంలోని పరిమితులను స్పష్టంగా నిర్దేశించి ఉండేది. అలాగే వ్యక్తిగత డేటాను దుర్వినియోగపర్చే విధానాలను నిరోధించడానికి తగిన పరిష్కార యంత్రాంగాలను కూడా ఏర్పర్చి ఉండేది. డేటా పరిరక్షణ చట్టం లేక పోవడం అనేది క్రమబద్ధీకరణ లేని న్యాయ పరిధిని మాత్రమే అందు బాటులో ఉంచుతుంది. ఇలాంటి సందర్భంలో మాత్రమే, క్రిమినల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ బిల్ వంటి చట్టాల ద్వారా ప్రభుత్వ నిఘా అధికారం ఎలాంటి తనిఖీలు లేకుండా విస్తరిస్తూనే ఉంటుంది. ఇంత తొందర దేనికి? చివరగా, పార్లమెంటులో బిల్లును త్వరత్వరగా తీసుకొచ్చిన పద్ధతి ఆందోళన కలిగిస్తోంది. ఇది మన ప్రజాస్వామ్యంలో చట్టాల రూప కల్పన విషయంలో పెరుగుతున్న సాధారణ అంశమనే చెప్పాలి. ఈ బిల్లును ముందస్తుగా ప్రజల్లో చర్చకు పెట్టలేదు. ప్రజలు తమ అభి ప్రాయం చెప్పడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అందుకే ‘లక్ష్యాలు, కారణాల ప్రకటన’ విషయంలో బిల్లు సైలెంటుగా ఉండిపోయిందన్న వాస్తవంలోనే ఇది ప్రతిఫలించింది. వాస్తవానికి ప్రభుత్వ నిఘా అధి కార పరిధిని విస్తరించాల్సిన అవసరం గురించి ఇది పేర్కొనాల్సి ఉండింది. ప్రజా చర్చలో భాగంగా ఈ అంశాన్ని లేవనెత్తేవారు. అందుకే ఈ బిల్లును అసలు ప్రజా సంప్రదింపుల్లో భాగం చేశారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ అన్ని కారణాల వల్ల, ఈ కొత్త బిల్లు గురించి తీవ్రమైన ఆందో ళన కలుగుతోంది. మరింత ప్రజాస్వామికమైన, సమ్మిశ్రితమైన ప్రక్రియ ఈ భయాలన్నింటికీ పరిష్కారంగా ఉంటుంది. కానీ ఈ ప్రక్రియకు ఎలాంటి ఆస్కారం లేకుండానే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడమే విచారకరం. -గౌతమ్ భాటియా వ్యాసకర్త ఢిల్లీకి చెందిన న్యాయవాది (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
లాస్ట్ ఓవర్.. ఐదు బంతులు.. 36 పరుగులు.. ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తాడో?
నయా పాకిస్థాన్ నినాదంతో 2018లో అధికార పీఠం ఎక్కిన ఇమ్రాన్ ఖాన్ పీటీఐ సర్కార్.. ఈ నాలుగేళ్లలో సాధించింది ఏం లేదన్నది అక్కడ ప్రజల మెదళ్లలో బలంగా పాతుకుపోయింది. అందుకే రాజకీయ సంక్షోభాన్ని పట్టించుకోకుండా తమ పనుల్లో మునిగిపోతున్నారు. పార్లమెంట్లో ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. మార్చి 31వ తేదీన దీనిపై చర్చ జరగనుంది. బంధు ప్రీతి, దేశ ద్రవ్యోల్బణం.. అధిక ధరలు, కరోనా కట్టడిలో ఘోరంగా విఫలం, అప్పులు, నిరుద్యోగుల నిరసనలతో పీటీఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌లో నిరసనలు పెలుబిక్కాయి. ఈ నిరసనలనే ఆయుధంగా చేసుకుని ఖాన్ సాబ్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్. పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం నుంచి ప్రభుత్వం గట్టెక్కాలంటే.. 172 మంది మద్ధతు అవసరం. అధికార పీటీఐకి 155 మంది సభ్యులుండగా, నాలుగు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 179 మంది సభ్యుల బలముంది. కానీ, ఇమ్రాన్ సొంత పీటీఐ పార్టీకి చెందిన సుమారు 25 మంది, అధికార సంకీర్ణ కూటమిలోని 23 మంది.. ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో చాలావరకు అతనికి అనుకూలంగా లేవు. మొదటి నుంచి పొసగకపోవడం, పైగా తాము చెప్పినట్లు నడవడం లేదన్న కోపంతో పాక్ ఆర్మీ ఉంది. అందుకే ప్రభుత్వం పడిపోయే తరుణంలోనూ సాయం చేయలేమని తెగేసి చెప్పింది. పైగా రాజీనామా చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సూచించింది. ఇంకోవైపు వలసలు సైతం ఇమ్రాన్ ఖాన్‌కు తలనొప్పిగా మారాయి. ఈ తరుణంలో.. కేవలం రాజకీయాల ద్వారానే ఇప్పుడు పరిస్థితిని కొలిక్కి తెచ్చుకోవాలి. అందుకోసం ముందస్తు ఎన్నికలకు వెళ్తాననే హామీ సైతం ఇచ్చారాయన. కానీ, ప్రతిపక్షాలు ఆ హామీకి ఒప్పుకోకపోవచ్చు. అందుకే.. ఇమ్రాన్ ఖాన్ ముందున్న మరొకొన్ని ఆఫ్షన్స్పై మీద పీటీఐలో చర్చ నడుస్తోంది. ఎంక్యూఎం-పీ కోసం మంతత్రిత్వ శాఖ, గవర్నర్ పోస్ట్ ఎర వేస్తోంది. అదే సమయంలో తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఈ క్రమంలో ప్రతిపక్షాలతో పాటు సొంత పక్షం వాళ్లతోనూ ఇమ్రాన్ ఖాన్ మైండ్ గేమ్ ఆడుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఏం చేస్తాడో.. క్రికెట్.. రాజకీయం రెండూ ఇమ్రాన్ ఖాన్‌కు ఒక్కటే. ఈ రెండింటిలోనూ.. తెలివిగా, లోతుగా, అభిమానుల నినాదాలు.. ఆశీర్వాదంతో చెలరేగడానికి ప్రయత్నించాడు. బహుశా ఇప్పుడున్న కష్టకాలంలోనూ.. ఈ పోలిక సరిపోయేదే!. ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టమైన, అసాధ్యమైన పరిస్థితిని వివరించడానికి సరిపోతుంది. చివరి ఓవర్లో ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. 36 పరుగులు అవసరం. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఇమ్రాన్ ఖాన్ పొలిటికల్ మ్యాచ్ నెగ్గలేడు. ప్రత్యర్థి బౌలర్ల(ప్రతిపక్షాల) నుంచి నో బాల్స్(మద్ధతు) ఏదైనా పడాల్సిందే. లేదంటే అంపైర్లు(కోర్టు.. న్యాయమూర్తులు) ఏదైనా వివాదాస్పద నిర్ణయం తీసుకోవాలి. అదీ కాకుంటే మైదానంలో రచ్చ జరిగితే.. ఏకంగా మ్యాచ్ రద్దు అయ్యి పోవాలి(పార్లమెంట్లో గందరగోళం.. అరెస్టుల పర్వం). అప్పుడు కచ్చితంగా థర్డ్ అంపైర్(పాక్ ఆర్మీ) జోక్యం చేసుకుంటుంది. లేకుంటే చిన్నపిల్లలాగా మ్యాచ్ ఓడిపోయే తరుణంలో.. వికెట్లు గుంజుకుని, బాల్-బ్యాట్ ఎత్తుకుని మైదానం నుంచి పారిపోవచ్చు(చర్చకు సిద్ధపడకుండా బయటకు వెళ్లిపోవడం). ఇవేవీ కాకుంటే.. 1992 ప్రపంచకప్ సెమీస్‌లో మాదిరి డక్‌వర్త్ లూయిస్ లాంటి నిబంధన ఏదైనా కలిసొస్తే.. అది ఖాన్ సాబ్ అదృష్టమే! ఏది ఏమైనా.. పాక్ నేషనల్ అసెంబ్లీ అనే గ్రౌండ్లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. -
Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్‌దే..
సాక్షి, న్యూఢిల్లీ: ఏటా కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక మంత్రి ఆ బడ్జెట్లోని అంశాలను క్షుణ్నంగా వివరించడం ఆనవాయితీ. కొందరు ఆర్థిక మంత్రులు ఈ ప్రసంగాన్ని సుదీర్ఘంగా, మరోసారి క్లుప్తంగా చేస్తుంటారు. అయితే అత్యంత ఎక్కువ వివరాలు, పదాలతో కూడిన బడ్జెట్ ప్రవేశ పెట్టినది మన్మోహన్సింగ్. పీవీ నర్సింహారావు ప్రధానిగా, మన్మోహన్ ఆర్థికమంత్రిగా ఉన్న 1991లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏకంగా 18,650 పదాలు ఉన్నాయి. ఈ విషయంలో 2018లో బడ్జెట్ ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీది రెండో స్థానం. ఆ బడ్జెట్లో 18,604 పదాలు ఉన్నాయి. అతి తక్కువ పదాలతో, తక్కువ సమయం ప్రసంగంతో కూడిన బడ్జెట్ రికార్డు హిరుభాయ్ ముల్జీభాయ్ పటేల్‌ది. 1977లో ఆయన 800 పదాలతో, కొద్ది నిమిషాల ప్రసంగంతో బడ్జెట్‌ను ముగించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చూస్తే.. సుదీర్ఘ ప్రసంగం రికార్డు నిర్మలా సీతారామన్‌దే. 2020 ఫిబ్రవరి 1న ఆమె ఏకంగా 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. నిజానికి అప్పటికీ బడ్జెట్ ముగియలేదు. ఇంకో రెండు పేజీలు మిగిలిపోయాయి. ఆమెకు కాస్త అనారోగ్యంగా అనిపించడంతో.. మిగతా వివరాలను క్లుప్తంగా చెప్పి ముగించారు. సుదీర్ఘ ప్రసంగం విషయంలో రెండో స్థానం కూడా నిర్మలా సీతారామన్‌దే. 2019లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు ప్రసంగించారు. ఆమెకాకుండా మరొకరిని చూస్తే.. 2018లో బడ్జెట్ పెట్టిన అరుణ్‌జైట్లీ గంటా 49 నిమిషాల పాటు ప్రసంగించారు. -
నిజమైన నివాళి అదే!
అది 2001, డిసెంబర్ 13. ఢిల్లీకే ప్రత్యేకించిన ఓ చలికాలపు ఉదయాన వైమానిక దళాధికారి సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్నాను. ఎయిర్ చీఫ్ మార్షల్ ఎ.వై టిప్నీస్ ఆరోజు ఆఫీసులో లేరు. మా ఆఫీసు నుంచి చూస్తుంటే నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్ స్పష్టంగా కనిస్తున్నాయి. అది ఉత్తర భారతదేశంలో పెళ్లిల్ల సీజన్ కాబట్టి టపాసుల శబ్దాలు వినిపించినప్పుడు ఆందో ళన చెందేవాళ్లం కాదు. ఆరోజు పార్లమెంట్ వైపు నుంచి వినిపించిన కాల్పుల శబ్దాల వంటివాటిని ముందుగా పట్టించుకోనప్పటికీ, వాటి తీవ్రత పెరిగి అవి తుపాకీ కాల్పులేనని స్పష్టమవ్వడంతో నేను వెంటనే వైస్ చీఫ్, ఎయిర్ మార్షల్ కృష్ణస్వామి ఆఫీస్‌కు వెళ్లాను. పార్లమెంట్ దగ్గర కాల్పులు జరుగుతున్నాయని చెప్పాను. అప్పటికే ఢిల్లీ పోలీస్ జీపులు సైరన్ మోతలతో పార్లమెంట్ వైపు పరుగి డుతున్నాయి. కొద్ది సేపటికే అక్కడ భ్రదతా దళాలు మొహ రించాయి. హఠాత్తుగా జరిగే ఉగ్రదాడులను ఎదుర్కోవ డంలో దేశ భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉండాలో చెప్తూ చర్చను లేవనెత్తిన ఉగ్రదాడి అది. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి 20 ఏళ్లు అయిన సందర్భంగా మరోసారి మన భద్రతా సన్నద్ధతను అవలోకించవలసిన సందర్భం ఇది. అత్యంత అధునాతన ఆయుధాలు ధరించిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడిచేయడానికి ఢిల్లీలో తిరు గాడుతుంటే మన నిఘా వ్యవస్థ గుర్తించలేకపోయింది. 1999లో నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైన నేపథ్యంలో తలెత్తిన కార్గిల్ యుద్ధం జరిగిన రెండేళ్లకే ఈ దాడి జరగ టంతో విమర్శలు వెల్లువెత్తాయి. తర్వాతైనా నిఘా వ్యవస్థ మెరుగుపడిందా? ఏడేళ్ల తర్వాత 26/11 ముంబయి మారణకాండ మన నిఘా వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడ లేదనే విషయాన్ని నిర్థారించింది. ఆ తర్వాత అనేక నిఘా నివేదికలు హెచ్చరిస్తున్నప్పటికీ 40 మంది సిఆర్పిఎఫ్ జవా నుల మరణానికి కారణమైన 2019లో జరిగిన పుల్వామా దాడి, లడఖ్‌లో గత ఏడాది జరిగిన చైనీయుల చొరబాటు, ఈ ఏడాది జూన్‌లో జమ్మూలోని వైమానిక కేంద్రంపై జరి గిన దాడి వంటివాటిని ఎందుకు గుర్తించలేకపోయినట్లు? అలాగే 2016లో యూరీలో చోటుచేసుకున్న మరణాలు, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి జరిగిన చొరబాటును మనం మర్చిపోయామా? ఐబీ, రా, ఎన్టీఆర్ఓ, డీఐఏ,ఎన్ఐఏ వంటి కేంద్ర సంస్థలు, అనేక రాష్ట్ర నిఘా సంస్థలు ఉన్నాయి. వీటికి జవాబుదారీతనం ఉండాలి. అలాగే నిఘా వ్యవస్థల నిర్మాణాలనూ సమీక్షించాల్సిన అవసరమూ ఉంది. నిఘా వందశాతం విజయం సాధించలేకపోవచ్చు. కానీ జరిగిన సంఘటనను ఫాలో అప్ చేయవలసిన అవ సరం అయితే ఉంది కదా. 2008 నవంబర్ 26న ముంబయే కాక మొత్తం దేశం నాలుగు రోజులపాటు స్తంభించి పోయింది. యూరి లేదా పుల్వామా దాడుల వంటివి జరిగిన తర్వాత ప్రతిసారి సరిహద్దులు దాటి మనం దాడిచేయడం సాధ్యం కాదు. అటువంటి దాడుల ప్రభావం కొద్దికాలం మాత్రమే ఉంటుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పెరిగిన అంచనాలను బట్టి ప్రత్యర్థి ప్రతీకారానికి సిద్ధంగా ఉంటాడు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి? ముందు రాజకీయ వ్యాఖ్యల తీవ్రత తగ్గించాలి. నిధులను తగినంతగా కేటాయించాలి. శిక్షణ కార్యక్రమా లను పునరుద్ధరించడం ప్రయోజనకరం. ఈ విషయంలో స్థిరమైన ఉగ్రవాద విధానాన్ని అనుసరిస్తున్న ఇజ్రాయెల్ నుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది. అద్భుతమైన సమాచార సేకరణ యంత్రాంగం, సోషల్ మీడియాపై నిఘా, అవసరమైనప్పుడు మెరుపు బాంబుదాడులకు దిగటం వంటివాటిని మనమూ గమనించాలి. ఆపరేషన్ పరాక్రమ్ వంటి అరకొర సైనిక చర్యలను నివారించాలి. 10 నెలలపాటు పది లక్షల మంది ఆధునిక సైనికులను అప్రమత్తం చేసి యుద్ధ సన్నాహాలు చేయడం వల్ల, ఇండియా యుద్ధం చేయకుండానే 1874 మంది సైనికులను కోల్పోయింది. అలాగే కోట్లాది రూపాయల ధనం వ్యర్థమయింది. ఈ సైనిక చర్యల వల్ల ఏమైనా ఉగ్రవాద చర్యలు తగ్గాయా? స్పష్టమైన రాజకీయ వ్యూహం లేకపోతే ఇవి కొనసాగుతూనే ఉంటాయి. ఇక చివరగా గమనించాల్సిందేమిటంటే.. మన శత్రు వులు మన ప్రతికూలతను అనుకూలంగా మార్చుకుంటున్న సంగతిని గుర్తించడం. మన ప్రభుత్వం అనేక భద్రతా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దానితోపాటు సామాజిక చైతన్యాన్ని కూడా రేకెత్తించవలసి ఉంది. మావో గెరిల్లా యుద్ధ తంత్రాన్ని ‘సముద్రంలో ఈదే చేప’ అని వ్యాఖ్యా నించాడు. ప్రభుత్వం సముద్రంలాంటి ప్రజల్లో ఉగ్ర వాదం అనే చేపకు మద్దతు దొరకకుండా నిరోధించగలగాలి. ఈ చర్యలన్నీ చేపడితే దేశ విభజన కోసం కుయుక్తులు పన్నే శక్తులను అణచివేయడం సాధ్యమవుతుంది. ఇదే పార్ల మెంట్‌పై జరిగిన దాడిలో మరణించిన మన యోధులకు అర్పించే నిజమైన నివాళి అవుతుంది. – వైస్ చీఫ్ మార్షల్ మన్మోహన్ బహదూర్ (రిటైర్డ్) (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో) -
కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి 5 రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం నెలకు 25–27.5 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి చేస్తుండగా, భారత్ బయోటెక్ నెలకు 5నుంచి 6 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 90% మేర సాధించినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి మంగళవారం లోక్‌సభకు వెల్లడించారు. చదవండి: 2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు! -
రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తాం: విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షత వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ భేటీలో త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. భేటీ అనంతరం వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి. విజయసాయిరెడ్డి మీడియాతో మట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామని తెలిపారు. సమావేశాల్లో పలు అంశాలపై ఎలా స్పందించాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. తాము ఏ కూటమిలో లేమని, తమది ప్రజల కూటమి అని సీఎం జగన్ చెప్పారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రతిష్టను నిలబెట్టేలా పార్లమెంటులో వ్యవహరించాలని సీఎం జగన్ సూచించారని తెలిపారు. పోలవరం నిర్మాణ ఖర్చు రూ. 55 వేల కోట్లు ఆమోదం పొందేలా కృషి చేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. జాతీయ ప్రాజెక్టులో సాగునీరు, విద్యుత్ కలిపి చూడాలని కొరతామని, జోనల్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి లేవనెత్తిన 6 అంశాలు పార్లమెంట్లో గళమెత్తుతామని చెప్పారు. ఆహార భద్రత చట్టం ద్వారా ఏపీకి అన్యాయం జరుగుతోందని, దాన్ని ఉభయసభల్లో లేవనెత్తుతామని.. తెలంగాణా నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. వరద బాధితులకు తాత్కాలికంగా రూ.1000 కోట్లు కావాలని సీఎం జగన్ కోరారని పార్లమెంటులో ఈ అంశంపై మాట్లాడతామని తెలిపారు. బీసీ జనగణన అసెంబ్లీలో తీర్మానం చేశామని, దాన్ని కూడా కేంద్రంతో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో తమ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందని, దాన్ని లాభాల్లోకి తెచ్చేందుకు గట్టిగా కృషి చేస్తామని అన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతుల కోసం రూ.30 వేల కోట్ల కోసం పోరాడతామని, ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్నాని చెప్పారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. చదవండి: ‘ఒకటో తరగతితో బీజం వేస్తే.. 20 ఏళ్ల తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధం’ -
నేపాల్ ప్రజాస్వామ్యానికి ఓలి షాక్
నేపాల్ అస్థిర ప్రభుత్వాల చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నియామకం అయిన రెండేళ్లలోపు అవిశ్వాస తీర్మానం తెచ్చే వీల్లేకుండా సంస్కరణ తెచ్చారు. అయితే నిర్ణీత సమయం మీరకముందే ప్రధాని ఓలి పార్లమెంటును రద్దు చేయడానికి పూనుకోవడం అంటేనే సుస్థిరతను కొనసాగించడం అనే రాజ్యాంగ లక్ష్యాన్ని నీరుగార్చినట్లే. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానికి పార్లమెంటును రద్దు చేసే అధికారం లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ ఈ రద్దును సమర్థించుకోవడం అంటే సంస్కరించిన పార్లమెంటరీ వ్యవస్థను తప్పుగా అర్థం చేసుకోవడమే అవుతుంది. ఈ తరుణంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి సుప్రీంకోర్టే తగిన తీర్పు చెప్పాల్సి ఉంది. నేపాల్ రాజ్యాంగం ప్రమాదంలో పడింది. దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి నిరంకుశపాలనకు మొగ్గు చూపుతుండటమే దీనికి కారణం. తన సొంత ప్రయోజనాల కోసం ప్రధాని పార్లమెంటునే రద్దు చేయడంతో నేపాల్ రాజకీయ కల్లోలంలో చిక్కు కుంది. పాలక పార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఓలి, ప్రచండ మధ్య అంతర్గత పోరు పరాకాష్ఠకు చేరిన నేపథ్యంలో ప్రధాని ఓలిపై అవిశ్వాస తీర్మానం గురించి చర్చిస్తున్నారన్న పుకార్ల మధ్య కీలకమైన రాజ్యాంగ పదవుల్లో ఓలి అనుకూలురను చొప్పించ డానికి ఆర్డినెన్స్ తీసుకురావడంతో సంక్షోభం ముది రిపోయింది. ప్రజలు వీధుల్లోకి వచ్చి రాజరికాన్ని మళ్లీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న తరు ణంలో ఈ పరిణామాలు వేగంగా జరిగిపోయాయి. నేపాల్‌లో ప్రప్రథమంగా ఎన్నికైన ప్రభు త్వాన్ని, పార్లమెంటును 1960లో రాజరికపు కుట్ర ద్వారా రద్దు చేసిన ఘటనకు 60 సంవత్సరాలు గడిచిన సందర్భంలోనే ఓలి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాకతాళీయం కావచ్చు కానీ ఇది మరొక చారిత్రక తప్పిదం వైపు దారితీస్తున్నట్లే చెప్పాలి. ఎన్నికలను తాజాగా నిర్వహించడం అప్రజాస్వామికం కాకపోవచ్చు. కానీ ప్రధాని స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతినిధుల సభను రద్దు చేయడం అనేది ఇప్పటికే సంస్కరించి ఉన్న పార్లమెంటరీ వ్యవస్థ స్ఫూర్తికి అనుగుణంగా మాత్రం లేదనే చెప్పాలి. సమస్యకు నాంది 2017 సాధారణ ఎన్నికల్లో నేపాల్ కాంగ్రెస్ నేతృత్వంలోని డెమాక్రటిక్ అలయెన్స్‌కు వ్యతిరే కంగా నేపాల్ ఐక్య మార్క్సిస్ట్ లెనినిస్టు (సీపీఎన్– యుఎమ్ఎల్), సీపీఎన్ (మావోయిస్టు సెంటర్) నేతృత్వంలో వామపక్ష ఎన్నికల కూటమి ఏర్ప డింది. నేపాల్ అభివృద్ధికి అస్థిరత్వమే ప్రధాన ఆటంకమని చెబుతూ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తా మని ఈ కూటమి హామీ ఇచ్చింది. దీంతో ప్రజలు కమ్యూనిస్టు కూటమికి అనుకూలంగా తీర్పిచ్చారు. పార్లమెంటులో ఉన్న 275 స్థానాలకుగానూ 175 ఈ కూటమి గెల్చుకుని ఏడు ప్రావిన్స్‌లలో ఆరింట ప్రభుత్వాలను ఏర్పర్చింది. ఎన్నికల కూటమితో మొదలైన ఈ క్రమం రెండు పార్టీల విలీనానికి దారితీసి కమ్యూనిస్టు పార్టీ అఫ్ నేపాల్ (సీపీఎన్) ఏర్పడింది. కానీ ఈ కొత్త పార్టీ అంతర్గత ఘర్షణల్లో మునిగిపోయింది. పార్టీలోని ఇద్దరు కీలక నేతలు పార్టీలోనూ, ప్రభు త్వంలోనూ అధికారాన్ని ప్రతిష్టించుకోవడం కోసం నిత్య పోరాటాలకు తెరతీశారు. అంతర్గత ఘర్షణ ముదురుతున్న నేపథ్యంలో 2020 ఏప్రిల్‌లో ప్రధాని ఓలి రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చారు. ఒకటి, పొలిటికల్ పార్టీస్ యాక్ట్. దీంతో పార్టీని చీల్చడం సులభం అయింది. రెండు, రాజ్యాంగ మండలి యాక్ట్ సవరణ. దీంతో కీలకమైన రాజ్యాంగ పదవుల్లో తన అనుయాయులను నామి నేట్ చేయడం సులభమైంది. పార్టీలోనూ ప్రజ ల్లోనూ తీవ్ర విమర్శ తర్వాత ఓలి వెనక్కు తగ్గి తాత్కాలిక సంధి కుదుర్చుకున్నారు. అయితే తనపై అవిశ్వాస తీర్మానం తీసుకురానున్నారనే అను మానం తలెత్తడంతో ఏకంగా పార్లమెంటునే రద్దు చేసిపడేశారు. అధ్యక్ష, ప్రధాని దుష్ట కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రధాని వివాదా స్పదమైన ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన ప్రతి సందర్భం లోనూ దానికి ప్రతిపక్షం తీవ్ర వ్యతిరేకత తెలుపు తున్నప్పటికీ అధ్యక్షురాలు బిద్యాదేవి భండారి వెను వెంటనే ఆమోదం తెలుపుతూ వచ్చారు. రాజ్యాంగ మండలి చట్టం అలాంటి ఆర్డినెన్సుల్లో ఒకటి. ప్రధాని నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల మండ లిలో చీఫ్ జస్టిస్, పార్లమెంటు స్పీకర్, జాతీయ అసెంబ్లీ చైర్మన్, ప్రతిపక్ష నేత, డిప్యూటీ స్పీకర్ ఉంటారు. ఓలి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ మండలి సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావలసిన సభ్యుల సంఖ్యను అయిదు నుంచి మూడుకు కుదించింది. అంటే ప్రధాని, ఆయన పార్టీకి చెందిన మరొక సభ్యుడు మాత్రమే నియామకాలపై కీలక నిర్ణయాలు తీసుకోగలరు. రాజ్యాంగం ప్రకారం పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య పరస్పర తనిఖీకి చెందిన ప్రాతిపదికనే ఈ ఆర్డినెన్స్ చెరిపివేసింది. రాజ్యాంగాన్ని నీరుగార్చేశారు రాజ్యాంగ నిబంధనలను ప్రాతిపదికగా చేసు కుని అధ్యక్షురాలు ప్రధాని సిఫార్సులను ఆమో దిస్తూ వచ్చారు. దీంతో పార్లమెంటరీ వ్యవస్థ ప్రాథ మిక స్ఫూర్తిని నేపాల్లోనూ, అంతర్జాతీయంగానూ ఈక్రమంలో తొక్కిపెట్టేశారు. ఆర్టికల్ 76(1), (7), ఆర్టికల్ 85 ఆధారంగా పార్లమెంటును రద్దు చేశారు. పార్లమెంటు పదవీకాలం అయిదేళ్లు కొన సాగాలని ఆర్టికల్ 85 చెబుతోంది. ఆర్టికల్ 76 (7) పార్లమెంటు రద్దుకు రాజ్యాంగం ప్రకారం అనుమ తించే ఏకైక నిబంధనగా ఉంటోంది. ఇక ఆర్టికల్ 76 అయితే మెజారిటీ పార్టీ నేత, సంకీర్ణ పార్టీల నేత, అతిపెద్ద పార్టీ నేత లేదా మెజారిటీని నిరూపించు కునే చేవ కలిగిన ఏ సభ్యుడైనా సరే ప్రభుత్వాన్ని ఏర్పర్చే ప్రయత్నాలన్నింటికీ ప్రెసిడెంట్ తావిచ్చి చూడాలి. ఆ తర్వాత మాత్రమే ఆర్టికల్ 76(7) కింద ప్రధాని సిఫార్సుతో పార్లమెంటును రద్దు చేయవచ్చు. అంటే ఆర్టికల్ 76 అనేది ప్రభుత్వ స్థాపననే ప్రధానంగా ప్రోత్సహిస్తుంది. ప్రభు త్వాన్ని ఏర్పర్చే అవకాశమే లేదని తేలిన తర్వాతే తాజా ఎన్నికల నిర్వహణకు గానూ పార్లమెంటును రద్దు చేయవచ్చు. అంతేకానీ పార్లమెంటును మధ్యలో రద్దు చేయడానికి ఆర్టికల్ 76(7)ని ఉపయోగించలేరు. 1990ల నాటి రాజ్యాంగంలో ఆర్టికల్ 53 కింద ఒక స్పష్టమైన నిబంధన ఉండేది. దానిప్రకారం ప్రధాని సిఫార్సు మేరకే నేపాల్ రాజు పార్లమెం టును రద్దు చేయగలిగేవాడు. ప్రధాని ఇష్టాయిష్టాల మేరకు పార్లమెంటును పదే పదే రద్దు చేస్తూ వచ్చిన గుణపాఠాలతో నూతన రాజ్యాంగం ఆర్టికల్ 76 (7) కింద పరిమిత సందర్భాల్లో మాత్రమే రద్దు చేయడానికి అనుమతించింది. అయితే రెండేళ్లలోపే కొత్త ప్రభుత్వ హయాంలో ప్రధాని సిఫార్సు మేరకు పార్లమెంటును రద్దుచేయడం సరికొత్త పరిణామం గానే చెప్పాలి. 1995లో కూడా రెండు సందర్భాల్లో ప్రధానులు పార్లమెంటు రద్దు కోరుతూ తీర్మానిం చినప్పుడు, రాజు ఆమోదం లభించినా కూడా సుప్రీంకోర్టు విభేదించి ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి అన్ని ప్రయత్నాలూ చేసి విఫలమైన తర్వాతే పార్లమెంటు రద్దుకు అధికారాన్ని ఉపయోగిం చాలని వ్యాఖ్యా నించి రద్దును కొట్టేసింది. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానికి పార్లమెం టును రద్దు చేసే అధికారం లేదని చెప్పడానికి వీల్లేదు. కానీ అంతర్జాతీయ ఆచరణను చూపించి నేపాల్‌లో అలాంటి రద్దుకు పాల్పడవచ్చని సమ ర్థించుకోవడం అంటే సంస్కరించబడిన పార్లమెం టరీ వ్యవస్థను తప్పుగా అర్థం చేసుకోవడమే. నేపాల్ చరిత్రలో అస్థిర ప్రభుత్వాలు, వాటి రాజ కీయీకరణ చరిత్రను దృష్టిలో పెట్టుకుని ప్రధానిని నియమించిన రెండేళ్లలోపు అవిశ్వాస తీర్మానం రాకుండా సంస్కరణ తెచ్చారు. మంత్రిమండలిని తన విధులు నెరవేర్చేలా చూడటం ప్రస్తుత రాజ్యాంగం తీసుకొచ్చిన సంస్క రణ. అయితే నిర్ణీత సమయం మీరకముందే పార్లమెంటును రద్దు చేయడానికి పూనుకోవడం అంటేనే సుస్థిరతను కొనసాగించడమనే రాజ్యాంగ లక్ష్యాన్ని నీరుగార్చినట్లే అవుతుంది. ఈకోణంలో ప్రధాని ఓలి చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి, అప్రజాస్వామికమైనవి, చారిత్రక తప్పిదాలను కొనసాగించేవి. నేపాల్‌కు రాజరికం, నిరంకుశ అధికారం, రాజ్యాంగ ఉల్లంఘనల బాధాకరమైన చరిత్ర ఉంది. ప్రస్తుత నేతలు కూడా దాన్నే పాటిస్తే ప్రజలు భరించలేరు. అంతకు మించి ఒక పార్టీలోని అంతర్గత వివాదం రాజ్యాం గాన్నే బందీ చేయకూడదు. రాజ్యాంగాన్ని పరిరక్షిం చడానికి సుప్రీంకోర్టే తగిన తీర్పు చెప్పాల్సి ఉంది. రాబిన్ శర్మ, హార్దిక్ సుబేది వ్యాసకర్తలిద్దరూ ఖాట్మండు న్యాయవాదులు, నల్సార్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు. -
ఎందుకు రాజకీయం చేస్తున్నారు...
న్యూఢిల్లీ: పార్లమెంటులో ఉగ్రవాదం చర్చ జరగకపోవడంపై కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఒక టెర్రరిస్టు ఉరశిక్షపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహించారు. ఉగ్రవాదంపై ముక్తకంఠంతో పోరాడాల్సి ఉండగా అందుకు భిన్నంగా ప్రతిపక్షాలు వ్రవర్తిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్ గురుదాస్ పూర్ ఉగ్రవాదదాడిని రాజకీయం చేయడానికి చూస్తోందని ఆర్థిక మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఉగ్రవాదంపై చర్చకు ఎందుకు నిరోధిస్తున్నారో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ జాతికి వివరణ ఇవ్వాలని అరుణ్ జైట్లీ డిమాండ్ చేశారు. ఉగ్రవాదంపై చర్చించడానికి ఎందుకు అంగీకరించడం లేదో చెప్పాలన్నారు. మెమన్ ను ఉరితీయడం ద్వారా దేశం రెండుగా చీలిపోయిందనే భావన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం రాజ్యసభలో గురుదాస్ ఘటనపై హోమంత్రి రాజ్‌నాధ్ సింగ్ వివరణ ఇస్తుండగా గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ అందోళనకు దిగాయి. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీలు వెల్ లోకి దూసుకొచ్చారు. దీంతో సభలో మంత్రి వివరణ పూర్తి కాకండానే రేపటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి ఆరోపణలు గుప్పించారు.