Parveen Rana
-
'సుశీల్ రెచ్చగొట్టి దాడి చేయించాడు'
న్యూఢిల్లీ:ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ మద్దతుదారులు తనపై చేయిచేసుకోవడంపై సహచర రెజ్లర్ ప్రవీణ్ రాణా స్పందించాడు. సుశీలే స్వయంగా అతని మద్దతుదారులను రెచ్చగొట్టి తనపై దాడి చేయించాడని రాణా ఆరోపించాడు. ఈ క్రమంలోనే సుశీల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ‘సెమీస్ బౌట్ ముగిసిన వెంటనే సుశీల్ .. అతని మద్దతుదారులను నాపైకి ఉసిగొల్పాడు. రాణా ఇక్కడే ఉన్నాడు చూసుకోండి అని చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. దగ్గరుండి మరీ ఇలా చేయించడం దారుణం. ఆ రోజు దాడిలో నా సోదరుని తలపై కుర్చీతో దాడి చేశారు. నా సోదరుడు ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు' అని రాణా పేర్కొన్నాడు. కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్ల ఎంపిక కోసం శుక్రవారం స్థానిక కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా రచ్చ చోటు చేసుకుంది. ఇద్దరు రెజ్లర్లకు చెందిన అనుచరుల మధ్య గొడవ ముదిరి కొట్టుకునే వరకు వచ్చింది. నేరుగా కాకపోయినా దీనికంతటికీ పరోక్ష కారణంగా స్టార్ రెజ్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకం సాధించిన సుశీల్ కుమార్ నిలవడం దురదృష్టకర పరిణామం. వచ్చే ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత రెజ్లర్లకు సంబంధించిన సెలక్షన్ ట్రయల్స్ జరిగాయి. ఇందులో 74 కేజీల విభాగంలో తన ఆటను ప్రదర్శించేందుకు సుశీల్ కుమార్ బరిలోకి దిగాడు. సెమీస్‌లో అతనికి ప్రత్యర్థిగా ప్రవీణ్ రాణా నిలిచాడు. ఈ బౌట్లో సుశీల్ సునాయాసంగానే నెగ్గాడు. ఆ తర్వాత ఫైనల్ కూడా గెలిచి కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించినా వివాదం మాత్రం సుశీల్‌ను వీడటం లేదు. -
ఆ విషయంలో వేరే ఆప్షనే లేదు : కేంద్ర మంత్రి
ఒలింపిక్స్‌లో పాల్గొననున్న ఆటగాళ్ల స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చేది లేదని క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టంచేశారు. యాంటీ డోపింగ్ ప్యానెల్ నిషేధించిన ఆటగాళ్ల స్థానంలో వేరొకరికి చాన్స్ ఇవ్వడం లాంటివి ఉండవని ఆయన అభిప్రాయపడ్డారు. రియోకు అర్హత సాధించిన ఓ ప్లేయర్ ఎవరైనా డోపింగ్ టెస్టులో విఫలమైతే ఈ విషయంలో వేరే ఆప్షన్ ఉండదని మంత్రి గోయల్ పేర్కొన్నారు. ఒకవేళ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్లేయర్ తీవ్ర అస్వస్థతకు లోనైన ప్రత్యేక సందర్భాలలో మాత్రమే రీప్లేస్మెంట్ గురించి ఆలోచిస్తారని చెప్పారు. ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని ఇతర ఆటగాడిని రియోకు పంపిస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలపారు. మరోవైపు నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడని ప్రచారంలో ఉంది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఈ విషయంపై సమాచారం అందించింది. -
నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రాణా
యునెటైడ్ రెజ్లింగ్‌కు ఐఓఏ సమాచారం కొర్సిర్ సర్వే (స్విట్జర్లాండ్): డోపింగ్‌లో పట్టుబడిన భారత స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశాలకు తెరపడింది. నర్సింగ్ యాదవ్ స్థానంలో పురుషుల ఫ్రీస్టయిల్ 74 కేజీల విభాగంలో భారత్ నుంచి ప్రవీణ్ రాణా బరిలోకి దిగనున్నాడు. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు సమాచారం అందించింది. వాస్తవానికి నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికాడని ఆదివారం బయట పడినా... వారం రోజులకంటే ముందుగానే ఈ విషయాన్ని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఐఓఏకు తెలియజేయడం... ఈ సమాచారాన్ని యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఐఓఏ అందజేయడం జరిగింది. క్వాలిఫయింగ్ టోర్నీలో కాకుండా పోటీలు లేని సమయంలో నర్సింగ్ యాదవ్ డోపింగ్‌లో దొరికినందుకు.... అతని స్థానంలో భారత్ నుంచి వేరే రెజ్లర్‌ను పంపించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు గత వారమే ఐఓఏకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాచారం ఇచ్చింది. ఒకవేళ ప్రత్యామ్నాయం లేకపోతే భారత్‌కు దక్కిన బెర్త్ ఖాళీ అవుతుందని ప్రకటించింది. దాంతో నర్సింగ్ యాదవ్ స్థానంలో ప్రవీణ్ రాణా పేరును సూచిస్తూ యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్‌కు ఐఓఏ తెలిపింది. ఈ మేరకు యునెటైడ్ వరల్డ్ రెజ్లింగ్ మంగళవారం తమ అధికారిక వెబ్సైట్లో ఈ వార్తను ప్రచురించింది.