paskitan
-
పాక్‌పై బౌల్ అవుట్ విజయానికి 14 ఏళ్లు.. ధోని వ్యూహాలు ఫలించడంతో..
MS Dhoni wins first-ever match as captain: సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే రోజున టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని విజయాల పరంపర మొదలైంది. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఘోర వైఫల్యం తరువాత సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ వంటి సీనియర్ ఆటగాళ్లు మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు ఇష్టపడలేదు. ఈ నేపథ్యంలో 2007 టీ20 ప్రపంచ కప్‌లో యువ భారత జట్టుకు ధోని నాయకత్వం వహించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ స్కాట్లాండ్తో జరగాల్సి ఉండగా.. వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో భారత్ తన తొలి మ్యాచ్ దాయాది దేశం పాకిస్తాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మెదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 141 పరుగులకే పరిమితమైంది. అనంతరం 142 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ జట్టు, భారత బౌలర్ల ధాటికి 87 పరుగులకే కీలకమైన 5 వికెట్లు కోల్పోయింది. ఇక భారత్ విజయం లాంఛనమే అనుకున్న సమయంలో పాక్ బ్యాట్స్‌మెన్ మిస్బా వుల్ హక్ అద్భుతమైన పోరాటంతో టెయిలెండర్లతో కలిసి విజయం అంచుల దాకా తెచ్చాడు. ఆఖరి ఓవర్లో పాక్ విజయానికి 12 పరుగులు కావాలి. శ్రీశాంత్ వేసిన చివరి ఓవర్లో మొదటి నాలుగు బంతుల్లోనే రెండు ఫోర్లు రావడంతో 11 పరుగులు వచ్చేశాయి. రెండు బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే కావాలి. ఐదో బంతికి పరుగులేమీ లేదు. చివరి బంతికి సింగిల్ తీయబోయిన మిస్బా వుల్... రనౌట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చదవండి: బ్లూ కలర్ జెర్సీలో కనిపించనున్న ఆర్సీబీ.. ఎందుకంటే? ఫలితం తేల్చేందుకు అంపైర్లు బౌల్-అవుట్ పద్ధతిని ఎంచుకున్నారు. బౌల్- అవుట్ పద్ధతి అంటే ఇరుజట్లు బౌల్ చేసి 6 బంతుల్లో వికెట్లు పడగొట్టాలి. ఏ జట్టు ఎక్కువ వికెట్లు తీస్తే వారిదే విజయం. ఈ నేపథ్యంలో ధోనీ వ్యూహాలను రచించాడు. కేవలం స్పిన్నర్లతో బౌలింగ్ చేయించేందుకు నిర్ఱయించుకున్నాడు. మొదటి బంతిని అందుకున్న పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ వీరేంద్ర సెహ్వాగ్... క్లీన్ బౌల్డ్ చేశాడు. పాక్ నుంచి మీడియం పేసర్ యాసిర్ అరాఫత్ వేసిన బంతి వికెట్లను తాకలేదు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. తరువాత రెండో బంతి అందుకున్న హర్భజన్ సింగ్ వికెట్లను పడగొట్టాడు. పాక్ తరుపున ఆ జట్టు స్టార్ బౌలర్ ఉమర్ గుల్ వేసిన బంతి వికెట్లకు చాలా దూరంగా వెళ్లింది. దీంతో టీమిండియా 2-0 లీడ్‌లోకి వెళ్లింది. మూడో బంతి వేసిన రాబిన్ ఊతప్ప కూడా వికెట్ తీశాడు. పాక్ మిగత బంతులు విసరాలి అంటే మూడో బంతికి వికెట్ తీయాల్సిందే. ఆ సమయంలో బాల్ అందుకున్న షాహిదీ ఆఫ్రిదీ వికెట్లను కూల్చడంలో గురి తప్పాడు. దీంతో 3-0 తేడాతో టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. ధోని కెప్టెన్‌గా తన కేరిర్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ ‘బాల్ అవుట్’లో తొలి విజయం ఇదే కావడం విశేషం. అటు తర్వాత ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లను ఓడించిన టీమిండియా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో మరోసారి భారత్ దాయాది పాకిస్తాన్‌తో తలపడింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 2007 టీ20 ప్రపంచ కప్‌ను ముద్దాడింది. ధోని కెప్టెన్సీలోనే 2011 వన్డే వరల్డ్ కప్ , 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సైతం టీమిండియా సాధించింది. మూడు ఐసీసీ ట్రోఫీలను అదించిన ఏకైక కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. చదవండి: T20 World Cup 2021: ఇలాగే చేస్తే అతడు రిటైర్మెంట్ ప్రకటించవచ్చు... -
పాక్‌తో చేతులు కలిపిన చైనా?
దుష్ట పన్నాగాల డ్రాగన్ దేశం ఒక వైపు చర్చలంటూనే మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత్‌పై ఒత్తిడి పెంచడానికి పాక్‌తో చేతులు కలిపింది. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖకు తూర్పు దిక్కున చైనా సైనికులు మోహరించి రంకెలు వేస్తూ ఉంటే, ఉత్తరాన నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించి ఉరుముతోంది. ఎటు నుం చైనా ఎలాంటి విషమ పరిస్థితి ఎదురైనా రెండు దేశాలకు గట్టి బుద్ధి చెప్పడానికి భారత్ సన్నద్ధమైంది. సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో సంక్షోభ నివారణకు ఒక వైపు భారత్‌తో చర్చలు సాగిస్తూనే చైనా తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంటోంది. భారత్‌పై ఒత్తిడి పెంచడానికి పాకిస్తాన్‌తో చేతులు కలుపుతున్నట్టుగా తెలుస్తోంది. తూర్పు దిశగా తమ సైన్యం, ఉత్తరాన పాక్ సైన్యాన్ని మోహరించి, జమ్ము కశ్మీర్లో హింస రాజేసే ముక్కోణపు కుట్రకు డ్రాగన్ దేశం తెరతీసింది. ఉగ్రవాద సంస్థ అల్బదర్తో చైనా అధికారులు మంతనాలు సాగిస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయని జాతీయ మీడియా కథనాలు ప్రసారం చేసింది. లద్దాఖ్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉత్తరం దిశగా గిల్గిట్ బాల్టిస్తాన్ సమీపంలో పాకిస్తాన్ 20 వేల మంది సైనికుల్ని మోహరించింది. ఈ ప్రాంతమంతా పాక్ రాడార్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు సమాచారం. జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోకి వచ్చింది. అయితే ఈ ప్రాంతం పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిధిలో ఉంది. లద్దాఖ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పుదిక్కున చైనా 20 వేల మందికి పైగా సైనికుల్ని మోహరిస్తే, వాళ్లతో సరిసమానంగా పాకిస్తాన్ ఉత్తరం దిశగా సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇక చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మరో 10 నుంచి 12 వేల మంది సైనికులు సరిహద్దులకి వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉత్తర జిన్జియాంగ్ ప్రాంతంలో మోహరించారు. వారితో పాటు వాయువేగంతో పరుగులు తీసే వాహనాలు, ఆయుధాలు కూడా ఉన్నాయి. అవసరమైతే ఈ సైనికులు 48 గంటల్లో భారత్ సరిహద్దుకు చేరుకునేలా డ్రాగన్ దేశం సన్నాహాలు చేసిందని ప్రభుత్వంలో ఉన్నత స్థాయి అధికారి తెలిపారు. అయితే భారత ప్రభుత్వం ఈ సైనికుల కదలికలపై పూర్తిగా నిఘా ఉంచిందని చైనా వ్యూహాలను దీటుగా ఎదుర్కొంటామని ఆ అధికారి వెల్లడించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో అల్బదర్తో చైనా అధికారులు చర్చలు జరుపుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. జమ్ము కశ్మీర్లో రక్తపాతం సృష్టించిన చరిత్ర ఈ సంస్థకి ఉంది. అల్బదర్ను మళ్లీ పునరుద్ధరించడానికి చైనా మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. వేడెక్కుతున్న పాంగాంగ్ సరస్సు తీరం పాంగాంగ్ సరస్సుకి ఉత్తరంగా భారత్ భూభాగంలోకి 8 కి.మీ. మేర లోపలికి చొచ్చుకు వచ్చిన చైనా ఆ ప్రాంతం తనదేనని చాటి చెప్పడానికి చిహ్నాలను ఏర్పాటు చేసింది. ఫింగర్ 4–5 మధ్య 80 మీటర్ల పొడవున శాసనాల మాదిరి చిహ్నాలను నిర్మించింది. వీటిపై చైనాకు చెందిన మాండరిన్ గుర్తులను ఉంచి ఆ ప్రాంతమంతా తమదేనని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇక ఫింగర్ 4–8 మధ్య ఎనిమిది కిలో మీటర్ల పొడవునా తాత్కాలిక శిబిరాలు, బంకర్లు ఏర్పాటు చేసి భారీగా సైన్యాన్ని మోహరిస్తోంది. చైనా ఆర్మీకి ఈ ప్రాంతం నుంచి వెనక్కి తగ్గే ఆలోచన లేదని, అందుకే డ్రాగన్ దేశాన్ని ఎదుర్కోవడానికి భారత్ సైన్యాన్ని, యుద్ధ ట్యాంకుల్ని మోహరిస్తూ ప్రణాళికలు రచిస్తోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. పాంగాంగ్‌కు భారత్ ఉక్కు పడవలు పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో నిఘా మరింత పెంచడానికి భారత నావికా దళం సమాయత్తమైంది. డజనుకు పైగా ఉక్కు పడవల్ని లద్దాఖ్ వైపు మళ్తిస్తోంది. ఇప్పటికే పాంగాంగ్లో చైనా ఆర్మీ అత్యంత భారీ నౌకలైన టైప్ 928 బీలను మోహరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా భారీ నౌకలను తరలించే దిశగా ప్రణాళికలు సిద్ధంగా చేస్తోంది. ఈ లోగా పరిస్థితుల్ని పర్యవేక్షించడానికి ఈ ఉక్కు పడవలు పాంగాంగ్ తీర ప్రాంతానికి చేరుకుంటాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపు చర్యలకు దిగుతుండడంతో కేంద్రం సరిహద్దుల్లో ఆర్మీకి సర్వాధికారాలు కట్టబెట్టింది. చైనా ఏదైనా చర్యలకు పాల్పడితే వాటిని తిప్పికొట్టడమే లక్ష్యంగా భారత్ సర్వసన్నద్ధంగా ఉంది. -
అప్పటివరకూ బీసీసీఐతో చర్చల్లేవ్!
కరాచీ: గత డిసెంబర్లో జరగాల్సిన భారత-పాకిస్తాన్ క్రికెట్ జట్ల ద్వైపాక్షిక సిరీస్‌పై ఇరు దేశాల క్రికెట్ పెద్దలు పలు దఫాలుగా చర్చలు జరిగినా అవి సఫలం కాలేదు. ఇక్కడ రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉండటంతో భారత-పాక్ క్రికెట్ సిరీస్‌పై ఎటువంటి ముందడుగు పడలేదు. అయితే ఈ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ తాజాగా స్పందించారు. ఇటీవల కాలంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎటువంటి చర్చలు జరపకపోవడానికి కారణం తమ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడమేనని స్పష్టం చేశారు. ఒకవేళ బీసీసీఐతో ఎటువంటి చర్చలు జరపాలన్నా, ముందుగా తమ ప్రభుత్వ అనుమతి అవసరమన్నారు. అంతవరకూ బీసీసీఐతో ఎటువంటి చర్చలు జరపదలుచుకోలేదని షహర్యార్ అన్నారు. ఈ మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలున్నట్లు పేర్కొన్నారు. ఇదే కారణం చేత అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సమావేశాల్లోనూ బీసీసీఐ పెద్దల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్ ఠాకూర్ అక్కడి ప్రభుత్వ ఎంపీ కూడా కావడంతో ఇరు దేశాల క్రికెట్ సిరీస్‌పై చర్చించడం సులభతరం అవుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. గత జనవరిలో తటస్థ వేదికపై ద్వైపాక్షిక సిరీస్ జరపడానికి కూడా బీసీసీఐ వెనుకడుగు వేయడంతో తాము చాలా ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వచ్చిన తరువాత మరోసారి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుతో చర్చలు జరపుతామన్నారు. ఆ సమయం వచ్చే వరకూ వేచి చూడక తప్పదని షహర్యార్ అన్నారు.