Patidar Anamat Andolan Samiti (PAAS) convener
-
హార్దిక్ పటేల్‌కు హైకోర్టు షాక్
అహ్మదాబాద్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమైన పటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్‌కు గుజరాత్ హైకోర్టు షాక్ ఇచ్చింది. 2015లో ఓ అల్లర్ల కేసులో దిగువ కోర్టు దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని హార్దిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం తిరస్కరించింది. ఈ కేసు విచారణ సందర్భంగా హార్దిక్ పటేల్‌పై 17 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని గుజరాత్ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వీటిలో రెండు దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని వెల్లడించింది. హార్దిక్‌కు నేరచరిత్ర ఉందని పేర్కొంది. దీంతో హార్దిక్ పటేల్‌పై నమోదైన కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. పటీదార్ రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా 2015, జూలైలో ఆందోళనకారులు బీజేపీ ఎమ్మెల్యే హృషీకేశ్ పటేల్ కార్యాలయంపై దాడిచేశారు. ఈ కేసును విచారించిన విస్నగర్ సెషన్స్ కోర్టు హార్దిక్‌ను దోషిగా తేలుస్తూ రెండేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో హార్దిక్ గతేడాది గుజరాత్ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయన శిక్షపై స్టే విధించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్లు అంతకంటే ఎక్కువకాలం జైలుశిక్ష పడ్డవారు ఎన్నికల్లో పోటీకి అనర్హులవుతారు. ఈ నేపథ్యంలోనే హార్దిక్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన హార్దిక్ జామ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తనను దోషిగా తేలుస్తూ విస్నగర్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. గుజరాత్లో నామినేషన్ల దాఖలుకు గడువు ఏప్రిల్ -
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తా : హార్దిక్
సాక్షి,న్యూఢిల్లీ : పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలల్లో పోటీకి సిద్ధమయ్యారు. లక్నోలో నిర్వహించిన ర్యాలీలో హర్దిక్ ఈ విషయాన్ని వెల్లడించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు హార్దిక్ పటేల్ ప్రయత్నించారు, కానీ వయస్సు సరిపోని కారణంగా పోటీకి దూరంగా నిలిచారు. ఇప్పుడు 25ఏళ్ల వయసు దాటడంతో ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హర్దిక్ సిద్ధమయ్యారు. అయితే ఏ స్థానం నుంచి అతను పోటీ చేస్తాడన్న విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. (చిన్ననాటి స్నేహితురాలితో హార్ధిక్ పెళ్లి) గుజరాత్‌లోని అమ్రేలీ లేదా మెహసానా స్థానం నుంచి పోటీ చేస్తాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమ్రేలి నుంచి అభ్యర్థిని నిలబెట్టకుండా హార్దిక్ పటేల్‌కు ఇవ్వనున్నట్లు సమాచారం. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రేలీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న అయిదు స్థానాల్లో పటేదార్లు గెలిచారు. దీంతో హార్థిక్ ఆ స్థానం నుంచే పోటీపడే అవకాశాలు ఉన్నాయి. -
ఇంటివాడైన హార్దిక్ పటేల్..
బాల్య స్నేహితురాలు కింజాల్ పారిఖ్‌ను వివాహమాడిన పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్. అహ్మదాబాద్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని దిగ్సార్ అనే గ్రామంలో ఆదివారం ఈ వేడుక జరిగింది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల అనుమతితో ఒక్కటయ్యారు. -
రిజర్వేషన్ల కోసం హార్దిక్ ఆమరణ దీక్ష
అహ్మదాబాద్: విద్యా, ప్రభుత్వ ఉద్యోగాల్లో పటీదార్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి(పాస్) చీఫ్ హార్దిక్ పటేల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మద్దతుదారుల సమక్షంలో హార్దిక్ తన ఫాంహౌస్‌లో దీక్ష ప్రారంభించారు. దీక్ష ప్రాంగణానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు తరలిరావటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు నానాపాట్లు పడ్డారు. మరోవైపు పలువురు కాంగ్రెస్ నేతలు హార్దిక్‌ను కలసి తమ మద్దతు తెలిపారు. ఈ దీక్ష వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ప్రభుత్వం ఆరోపించింది. రెండు నెలల క్రితం దీక్షకు అనుమతి కోరామని..అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి ఇవ్వలేదని హార్దిక్ ఆరోపించారు. -
హార్ధిక్ పటేల్‌కు ఝలక్.. ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, అహ్మదాబాద్: అసలే తాను మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో నిరాశ చెందుతున్న పటీదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) నేత హార్ధిక్ పటేల్‌కు అహ్మదాబాద్ పోలీసులు ఝలక్ ఇచ్చారు. అహ్మదాబాద్ పోలీసులు హార్ధిక్ పటేల్‌పై బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డిసెంబర్ 11న అహ్మదాబాద్ లోని బోపాల్ మునిసిపాలిటీలో తన మద్ధతుదారులతో కలిసి హార్ధిక్ రోడ్ షో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే జిల్లా అధికారుల అనుమతి లేకున్నా.. బైక్ ర్యాలీ నిర్వహించిన కారణంగా పటేల్ రిజర్వేషన్ల ఉద్యమనేతపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు బోపాల్ ఇన్స్పెక్టర్ ఐహెచ్ గోహిల్ తెలిపారు. రోడ్ షోకు జిల్లా అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండానే హార్థిక్ తన మద్దతుదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా చేశారని పేర్కొన్నారు. హార్ధిక్‌తో పాటుగా మరో 50 మంది అతడి కీలక అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు గోహిల్ వివరించారు. గుజరాత్ రెండో దశ ఎన్నికలకు మూడు రోజుల ముందు బైకులు, కార్లతో బోపాల్ ఏరియా నుంచి నికోల్ ఏరియాల మధ్య 15 కి.మీ మేర రోడ్ షో నిర్వహించిన హార్ధిక్‌పటేల్ సహా మరికొందరిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ ఏకే సింగ్ అన్నారు. కాగా, గుజరాత్ రెండోదశ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిసెంబర్ 12న ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీలు అహ్మదాబాద్‌లో పర్యటించవలసి ఉంది. అయితే శాంతి భద్రతలతో పాటుగా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ర్యాలీలకు తాము అనుమతి ఇవ్వలేదని ఏకే సింగ్ వివరించారు. అయితే మోదీ, రాహుల్‌లు పోలీసుల నిర్ణయానికి కట్టుబడి ఉండగా.. ఉద్యమనేత హార్ధిక్ పటేల్ మాత్రం నిబంధనలు ఉల్లంఘించారని, అందుకే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. -
హర్దిక్ పటేల్‌పై దోపిడి కేసు
సూరత్/ పలన్‌పూర్ : పటేదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హర్దిక్ పటేల్‌పై మరో కొత్త కేసు నమోదు అయింది. ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదైన అతడిపై తాజాగా దోపిడి కేసు నమోదు అయింది. ఈ ఏడాది జూలై 23వ తేదీన విస్నగర్ పట్టణంలో హర్దిక్ సారథ్యంలో ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ర్యాలీలో హింసతోపాటు విధ్వంసం చోటు చేసుకుంది. ఈ ఘటనకు హర్దిక్ కు సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్దిక్‌పై పోలీసులు దోపిడి కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని... అవసరమైతే పోలీసులను చంపండంటూ అక్టోబర్ 3వ తేదీన సూరత్‌లో పటేల్ యువకులకు హర్దిక్ సూచించారు. దీంతో పోలీసులు హర్దిక్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే మెహసానా జిల్లాలో కూడా హర్దిక్ పై పలు కేసులు నమోదయ్యాయి.