Peddavagu project
-
పెద్దవాగును పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు
-
పెద్దవాగు ప్రాజెక్టుకు భారీ గండి
-
పెద్దవాగుతో మొదలు!
సాక్షి, హైదరాబాద్: గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లే ప్రాజెక్టులపై కొంత స్పష్టత వచ్చింది. ఇరు రాష్ట్రాల సమ్మతి మేరకు అక్టోబర్ 14 నుంచి గోదావరి బేసిన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న పెద్దవాగు ప్రాజెక్టును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకునేందుకు మార్గం సుగమమైంది. శ్రీరాంసాగర్ మొదలు సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నిం టినీ బోర్డు పరిధిలో ఉంచాలన్న ఏపీ డిమాండ్‌పై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవడంతో పెద్దవాగు నిర్వహణ బాధ్యతల ను ప్రయోగాత్మకంగా చేట్టాలని సోమవారం జరిగిన బోర్డు భేటీలో నిర్ణయమైంది. పెద్దవాగును అప్పగిస్తూ ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాక, వీటి నిర్వహణను బోర్డు చేపట్టనుంది. అయితే, దశలవారీగా ప్రాజెక్టులను అధ్యయనం చేసి వాటిని బోర్డు పరిధిలోకి తీసుకురానున్నట్లు గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. పెద్దవాగు.. సీలేరులపైనే కీలక చర్చ ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు పూర్తిస్థాయి భేటీ జరిగింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన భేటీకి తెలంగాణ, ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శులు రజత్‌కుమార్, శ్యామలరావుతోపాటు ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. గోదావరిపై తెలంగాణ ఎస్సారెస్పీ నుంచి సీతమ్మసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవా లని ఏపీ పట్టుబట్టింది. దీనికి తెలంగాణ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఉమ్మడిగా ఉన్న పెద్దవాగును మాత్రమే బోర్డుపరిధిలో ఉంచాలని కోరింది. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులోనూ 13 వేల ఎకరాల మేర ఆయకట్టు ఏపీలో ఉన్నందున నిర్వహణకు వ్యయంలో ఏపీనే 85% చెల్లించాలని కోరింది. అయితే తొలిదశలో ట్రయల్ మాదిరి పెద్దవాగును పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు స్పష్టం చేసింది. దశలవారీగా మిగతా ప్రాజెక్టులను అధ్యయనం చేసి బోర్డు పరిధిలోకి తెస్తామంది. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపింది. పెద్దవాగుకు అవసరమైన ఉత్తర్వులు వెం టనే విడుదల చేసేందుకు ఏపీ సమ్మతి తెలిపింది. సీలేరు విద్యుదుత్పత్తి ప్రాజెక్టును సైతం బోర్డు పరి ధిలోకి తేవాలని తెలంగాణ కోరింది. సీలేరు విద్యుత్‌లో సగం తెలంగాణకు రావాల్సి ఉన్నా ఏపీ ఇవ్వ డంలేదంది. దీనిపై ఏపీ అభ్యంతరం చెప్పగా, బోర్డు సైతం విద్యుదుత్పత్తి కేంద్రాల అంశం కేంద్రం పరిధిలో ఉన్నందున.. తోసిపుచ్చింది. బడ్జెట్ ఉద్దేశం చెబితే సీడ్‌మనీ విడుదల బోర్డులుకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌మనీ అంశంపైనా బోర్డు భేటీలో చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాలు ప్రశ్నించాయి. నిధుల విడుదల ఆర్థికశాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే వాటినే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని ఇరు రాష్ట్రాలు వివరించాయి. నేడు కృష్ణా బోర్డు భేటీ కృష్ణా బోర్డు మంగళవారం భేటీ జరుగనుంది. ప్రాజెక్టుల అధీనంతోపాటు నిధులు, సిబ్బంది పై బోర్డులో చర్చించనున్నారు. విద్యుదుత్పత్తి కేంద్రాల చుట్టూనే ప్రధానచర్చ జరిగే అవకాశాలున్నాయి. వీటితోపాటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల పరిధిలోని ఔట్లెట్లపై నిర్ణయాలు వచ్చే అవకాశాలున్నాయి. -
ఎకరా తడవట్లే..
ఐదు దశాబ్దాలు గడిచినా పెద్దవాగు ప్రాజెక్టు నుంచి సాగు నీరందడం లేదు. 16 వందల ఎకరాలకు నీరందించాల్సిన పెద్దవాగు ప్రాజెక్ట్ ఐదు దశాబ్దాల కాలంలో ఇప్పటి వరకు గరిష్టంగా 6 వందల ఎకరాలకు మాత్రమే నీరందించగలిగింది. ప్రస్తుతం మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎకరా పొలానికి సైతం నీరందించలేని దుస్థితి నెలకొంది. మండలంలోని పొలాలను సస్యశ్యామలం చేయాల్సిన నీరు కర్ణాటక రాష్ట్రంలోకి వృథాగా తరలిపోతోంది. విధిలేని పరిస్థితుల్లో రైతులు ఆయకట్టు భూముల్లో వర్షాధార పంటలు సాగుచేస్తున్నారు.– కోహీర్(జహీరాబాద్) గొడిగార్‌పల్లి పెద్దవాగు ప్రాజెక్ట్ నిర్మాణానికి 1968లో శ్రీకారం చుట్టారు. ఎడమ కాల్వ నిర్మించి గొడిగార్‌పల్లి, శేడెగుట్ట తండా, జహీరాబాద్ మండలంలోని మల్చల్మ, జాడిమల్కాపూర్ గ్రామాల పరిధిలోని 675 ఎకరాలకు, కుడికాల్వ నుంచి గొడిగార్‌పల్లి,పర్సపల్లి గ్రామాల పరిధిలోని 425 ఎకరాల భూమి సాగు లక్ష్యంగా కాల్వల నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్ట్ నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకు పర్సపల్లి, మల్చల్మ, జాడిమల్కాపూర్ గ్రామాల శివారులోని పంట పొలాలకు చుక్క నీరందలేదు. గొడిగార్‌పల్లి, శేడెగుట్ట తండాల పరిధిలో 5 వందల ఎకరాల సాగు లక్ష్యంగా చేపట్టిన ఎత్తిపోతల పథకం సైతం రైతులకు నీరందించకుండానే నిరుపయోగమైంది. లోపభూయిష్టంగా కాల్వల నిర్మాణం పెద్దవాగు ప్రాజెక్ట్ పనులు లోపభూయిష్టంగా ఉన్నాయి. రూ. లక్షలు వెచ్చించి నిర్మించిన కుడి కాల్వ, పైపులైన్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. పర్సపల్లి గ్రామ రైతులకు నీరందించడానికి నిర్మించిన అక్వడక్టు మొదట్లోనే కూలిపోయింది. పంట కాల్వలు పటిష్టంగా నిర్మించకపోవడంతో నీరు వృథాగా పోతోంది. కాల్వలు నల్లరేగడి భూముల నుంచి తవ్వించారు. కాల్వలకు బుంగలుపడి నీరు వృథాగా పోతోంది. కాల్వలను సీసీబెడ్‌తో నిర్మించాలని రైతులు చేస్తున్న విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు నిర్వహణ కోసం రూ. కోట్లు వెచ్చించినా ప్రయోజనం లేకుండా పోతోంది. పొలాలకు నీరందకుండా పోతోంది. పెద్దవాగు ప్రాజెక్ట్‌ను ఉపయోగంలోకి తేవడానికి తాజాగా రెండేళ్ల క్రితం నీటి పారుదల అధికారులు మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా 4.85 కోట్ల వ్యయంతో అంచనాలు రూపొందించగా కేవలం రూ. 2.08 కోట్లకే మంజూరు లభించింది. టెండరు ప్రక్రియ పూర్తయి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. ఎత్తిపోతలు వృథా పెద్దవాగు ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియా అధికంగా ఉండడంతో వరద నీరు ఎక్కువగా వచ్చి చేరుతుంటుంది. తొలకరిలో కురిసిన వర్షాలకే ప్రాజెక్ట్ నిండి అదనంగా వస్తున్న నీరు కర్ణాటకకు తరలి వెళ్తోంది. అదనపు నీటిని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో 1980లో మరో 5 వందల ఎకరాల భూమికి సాగు నీరందించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటిని నిల్వ చేయడానికి ప్రాజెక్ట్ అలుగుపై రెండున్నర ఫీట్ల ఎత్తుతో ఫాలింగ్ షెట్టర్లను నిర్మించారు. లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ ఫాలింగ్ షెట్టర్ల లక్ష్యం నెరవేరక నిరుపయోగమయ్యాయి. పథకంలో భాగంగా ఒక పంప్‌హౌస్ నిర్మించారు. మూడు విద్యుత్ మోటార్లను అమర్చ ఒక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. వాచ్మెన్, వస్తు సామగ్రి కోసం రెండు గదులను నిర్మించారు. పొలాలకు సాగు నీరందించడానికి అటవీ ప్రాంతంలో సుమారు కిలోమీటర్ మేర కాల్వల తవ్వకం చేపట్టారు. గట్టి రాతి నేలలు అడ్డుపడడంతో సదరు పనులు చేపట్టిన కాంట్రాక్టర్ రేటు గిట్టుబాటు కావడం లేదని పనులు పూర్తి చేయలేదు. అనంతరం పలుమార్లు కాల్వల తవ్వకం కోసం టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు పనులు తీసుకోవడానికి ముందుకురాలేదు. తవ్విన కిలోమీటర్ కాల్వ రైతులకు ఏమాత్రం ఉపయోగపడ లేదు. సరైన కాపలా లేక ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ పరికరాలు, విద్యుత్ మోటార్లు, కాల్వల్లో ఏర్పాటు చేసిన షాబాద్ రాళ్లను దొంగలు ఎత్తుకుపోయారు. దీంతో ఎత్తిపోతల పథకం పూర్తిగా నీరుగారిపోయింది. పెద్దవాగు ప్రాజెక్టును పూర్తి వినియోగంలోకి తేవడానికి సరిపడా నిధులు మంజూరు చేయాలని రైతులు అధికారులను కోరుతున్నారు. వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా.. నాకు శేడెగుట్ట తండా శివారులో రెండున్నర ఎకరాల పొలం ఉంది. గొడిగార్‌పల్లి ఎత్తిపోతల పథకం నుంచి సాగు కోసం నీరు వస్తుందని వేయికళ్లతో ఎదురు చూస్తున్నా. పథకం నిర్మించి 40 ఏండ్లు కావస్తున్నా ఇంతవరకు నీరు రాలేదు. రెండేళ్ల క్రితం బోరు వేశాను. ఏడాది పాటు పంటకు నీరందించింది. వర్షాలు లేక బోరు ఎండిపోయి నిరుపయోగమైంది. ఖరీఫ్‌లో వర్షాధార పంటలు మాత్రమే సాగు చేస్తున్నా. ఎత్తిపోతల పథకాన్ని వినియోగంలోకి తేవడానికి చర్యలు తీసుకోవాలి. –సోమ్లా నాయక్, రైతు òశెడెగుట్టతండా నిధుల మంజూరయ్యాయి పెద్దవాగు ప్రాజెక్ట్‌కు మరమ్మతులు చేయడానికి నిధుల మంజూరు కోసం రూ. 4.85 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. అయితే రూ. 2.08 కోట్లకు మంజూరు లభించింది. టెండరు ద్వారా కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాం. పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తుండడంతో సదరు కాంట్రాక్టర్‌కు మూడు నోటీసులు ఇచ్చాం. ఫాలింగ్ షెట్టర్ల మరమ్మతుల కోసం రూ. 30 లక్షలతో ప్రతిపాదనలు పంపించాం. – ఉదయ్ భాస్కర్, డీఈ ఇరిగేషన్ -
పెదవాగు.. పెద్దకష్టం
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి గ్రామంలోని పెదవాగు ప్రాజెక్టు పెద్ద కష్టం ఎదుర్కొంటోంది. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోవడంతో ఈ ప్రాజెక్టు ఆయకట్టు కూడా రెండు భాగాలైంది. పోలవరం ముంపు పేరుతో ఈ ప్రాజెక్టు పరిధిలోని కొన్ని ప్రాంతాలు సీమాంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లాలో కలిపారు. జిల్లాలో మొత్తం ఏడు మండలాలు సీమాంధ్రలో కలవగా ఈ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాలు ఆ రాష్ట్రంలో కలిశాయి. మొత్తం 16వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న ఈ ప్రాజెక్టు ఆయకట్టును ఎలా వర్గీకరించాలి, నీటి పంపిణీ ఎలా చేయాలో అర్థంకాక నీటిపారుదల శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నప్పటికీ ఆయకట్టు ఆంధ్రాలోకి పోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నారు. 1981 సంవత్సరంలో ఖమ్మం ఇరిగేషన్ డివిజన్ పరిధిలో నిర్మించిన ఈ పెదవాగు ప్రాజెక్టు ద్వారా మొన్నటి వరకు జిల్లాలో అంతర్భాగంగా ఉన్న అశ్వారావుపేట, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 16వేల ఎకరాలకు సాగునీరందించేవారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అశ్వారావుపేట మినహా మిగిలిన రెండు మండలాలు సీమాంధ్ర పరిధిలోకి వెళ్లడంతో అధికారులు నీటి పంపకాలు ఎలా చేయాలో అర్థంకాక తలలుపట్టుకుంటున్నారు. మొత్తం మూడు మండలాల్లో ఉన్న ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో తెలంగాణకు చెందిన అశ్వారావుపేటలో 810 ఎకరాలు, సీమాంధ్రలోకి వెళ్లిన కుక్కునూరులో 5,030 ఎకరాలు, వేలేరుపాడులో 10,160 ఎకరాల భూమి సాగవుతోంది. ప్రాజెక్టు ఆయకట్టు మొత్తంగా చూస్తే తెలంగాణలో పరిధిలో 10,822 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 5,175 ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని ఏ రాష్ట్ర ఇంజినీర్లు పర్యవేక్షణ చేయాలి?, ఎవరు అభివృద్ధి చేయాలి?, నీటి పంపకాలు ఎలా చేయాలో అర్థంకాక అధికారులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాజెక్టుకు కుడి, ఎడమ కాల్వలున్నాయి. 19 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ రెండు కాల్వల ద్వారా సాగునీరందుతోంది. కుడి కాల్వ సున్నా నుంచి 14వ కిలోమీటర్ వరకు, ఎడమకాల్వ 15వ కిలోమీటర్ వరకు తెలంగాణ పరిధిలోకి వస్తుంది. మిగిలిన కిలోమీటర్ల కాల్వలు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వెళ్తాయి. రెండుకాల్వల చివరి ఆయకట్టు సీమాంధ్రలో ఉండటంతో రైతుల మధ్య నీటియుద్ధాలు తలెత్తే ప్రమాదముందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులను జపాన్ దేశ ఆర్థిక సహాయంతో చేపట్టేందుకు నీటిపారుదలశాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. సుమారు రూ.57.40 కోట్ల అంచనాలతో ఈ ప్రతిపాదనలు పంపారు. ఒకవేళ ఈ నిధులు మంజూరైతే ఆ పనులు ఏ రాష్ట్ర అధికారులు చేపట్టాలి? విభజన నేపథ్యంలో ఆధునికీకరణకు నిధులు మంజూరువుతాయా? లేదా? అనే సం దిగ్ధత నెలకొంది. పోలవరం ముంపులో ఎంతమేరకు ప్రాజెక్టు పరిధిలోని భూములు పోనున్నాయో కూడా ఇప్పటి వరకు స్పష్టత లేదు. దీనిపై ఇరిగేషన్ ఈఈ అంకవీడు ప్రసాద్‌ను ‘న్యూస్‌లైన్’ వివరణ కోరింది. ‘ఈ సమస్య మా పరిధిలో లేదు. రాష్ట్రాలు విడిపోయాయి కాబట్టి ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? అనే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయి.’