Pension applicants
-
రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్.. ఎలాగంటే?
ఉద్యోగం లేనివారికి, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, కూలీలకు పెన్షన్ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రోజూ టీ తాగే ఖర్చుతో నెలకు రూ.5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. అదే మీరు కొంత ఆలస్యంగా అంటే మీ ఇరవైఐదో ఏట ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాలి. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40వ ఏట దీన్ని ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్ పొందే వీలుంది. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా చిన్న వయసులోనే నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతోనే రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. -
సెల్ఫీతో లైఫ్ సర్టిఫికెట్
సాక్షి, కాజీపేట అర్బన్: ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ఉద్యోగులు పెన్షన్దారులుగా వృద్ధాప్యంలో తమ శేష జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. కాగా ప్రతి ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు పెన్షన్‌దారుడు లైఫ్ సర్టిఫికెట్‌ను సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో లేదా బ్యాంకులో అందజేస్తే సంబంధిత అధికారులు పెన్షన్‌దారుడు జీవించి ఉన్నట్లుగా ధృవీకరించి పెన్షన్ అందజేస్తారు. ఒకవేళా పెన్షన్‌దారుడు ట్రెజరీ కార్యాలయం, బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నప్పుడు జీవన్ ప్రమాణ్ వెబ్సైట్లో లేదా మీ–సేవా కేంద్రానికి వెళ్లి ఆధార్ ఆధారిత లైఫ్ సర్టిఫికేట్‌ను అందజేయాలి. ఇందుకు రూ.30 చెల్లించాలి. సకాలంలో లైఫ్ సర్టిఫికెట్ అందజేయకపోతే పెన్షన్ నిలపి వేయబడుతుంది. దీంతో పెన్షన్‌దారుడికి టెన్షన్ మొదలవుతుంది. పెన్షన్‌దారులకు వరంలా.. నేటి ఆధునిక యుగంలో మారుతున్న టెక్నాలజీ వృద్ధాప్యానికి చేరుకున్న పెన్షన్‌దారులకు తెలంగాణ ప్రభుత్వం టీయాప్–ఫోలియో వరంగా మారనుంది. ఇంట్లో ఉంటునే కేవలం ఒక సెల్ఫీ ద్వారా లైఫ్ సర్టిఫికెట్‌ను అందజేసే విధంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం టీ యాప్ ఫోలియోకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల యాబై వేల మంది, ఉమ్మడి వరంగల్‌లో సుమారు ఇరవై వేల మంది పెన్షన్‌దారులకు లైఫ్ సర్టిఫికెట్ అందజేయడంలో చాలా ఈజీగా మారనుంది. యాప్ డౌన్లోడ్ ఇలా.. పెన్షన్‌దారులు తొలుత తమ ఆండ్రాయిడ్ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి టీ యాప్–ఫోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ఈ–మెయిల్ ఐడీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. యూజర్ ఐడీగా మొబైల్ నెంబర్ స్వీకరిస్తుంది. ఎంపీన్ను పాస్‌వర్డ్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌లను ఎంటర్ చేయడం ద్వారా టీ–యాప్ ఫోలియోలోకి లాగిన్ అవుతారు. యాప్‌లోకి ప్రవేశించిన అనంతరం పెన్షనర్ అన్యూవల్ వెరిఫికేషన్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ అనే అప్షన్‌ను క్లిక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ లేదా పెన్షనర్ ఐడీ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఎలక్షన్ ఓటర్ ఈపీక్ నెంబర్ , అసెంబ్లీ నియోజకవర్గం పేరును ఎంటర్ చేయాలి. అనంతరం పెన్షన్‌దారుడు ఒక సెల్ఫీ దిగి పంపించాలి. సెల్ఫీ ఫోటో జనాభా లెక్కల (ఓటర్ ఐడీ)తో సరిపోలితే ఆమోదం పొందినట్లుగా ధృవీకరిస్తూ ఒక మెసేజ్, రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. పెన్షన్‌దారుడికి అందిన మెసేజ్ సంబంధిత ట్రెజరరీ, బ్యాంకు అధికారికి చేరడంతో లైఫ్ సర్టిఫికెట్ అందించినట్లుగా భావిస్తారు. దీంతో పెన్షన్‌దారులకు లైఫ్ సర్టిఫికేట్ అందించడంలో ఏర్పడే కష్టాల నుంచి ఒక సెల్ఫీతో ఊరట లభించనుంది. సద్వినియోగం చేసుకోవాలి... పెన్షన్‌దారులు ప్రభుత్వం, ట్రెజరరీ శాఖ ప్రవేశపెట్టిన ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫేస్ రికాగనైజేషన్ టెక్నాలజీ ద్వారా మొట్టమొదటి సారిగా పెన్షన్‌దారుడు టీయాప్–ఫోలియో సౌజన్యంతో సెల్ఫీ అందిస్తే కార్యాలయంలోని రికార్డుల ఆధారంగా ఆమోదం అందిస్తాం. ఒక్క సారి ఆమోదం పొందిన పెన్షన్‌దారుడు తర్వాత ఏడాది నుంచి లైఫ్ సర్టిఫికెట్ అందజేయకపోయినా ఆటోమెటిక్‌గానే ఆమోదం పొందుతారు. - గుజ్జురాజు, ఉప సంచాలకులు, జిల్లా ఖజానా కార్యాలయం -
పింఛన్ దరఖాస్తుల్లో భారీగా కోత!
విజయనగరం అర్బన్ :అర్హులందరికీ సామాజిక భద్రత పింఛన్ వర్తింపచేసి ‘ఆసరా’గా నిలుస్తామని చెబుతున్న రాష్ట్ర పాలకులు... చేతల్లో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే పింఛన్‌దారుల సంఖ్యను భారీగా కుదించిన సంగతి తెలిసిందే. అయితే నూతనంగా మంజూరు చేయబోతున్న పింఛన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించే పనిలో పడింది. పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న 36 వేల మందిలో కేవలం 11,710 మందిని మాత్రమే ప్రాథమికంగా ఎంపిక చేశారు. మిగిలిన వారిని ఎందుకు ఎంపిక చేయలేదో స్పష్టమైన కారణాలను వివరించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్హులందరికీ పింఛన్ ఇస్తామని చెప్పి ఇలా కొందరినే ఎంపిక చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 11,710 మంది పేర్లతో ప్రాథమిక అర్హత జాబితాను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు పంపింది. ఈ జాబితాలోని అర్హతలను మరోసారి పరిశీలించే బాధ్యతను గ్రామ స్థాయి జన్మభూమి కమిటీలు అప్పగించారు. ఈ మేరకు కమిటీలు నిర్థారించి ప్రకటించిన తుదిజాబితాను ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకొని తుదిజాబితాలను జిల్లా కేంద్రాలకు పంపాలి. ఆ జాబితాకు జిల్లా కమిటీ అనుమతి ఇస్తుంది. ఈ లెక్కన రానున్న ఏప్రిల్ నెలకు కూడా నూతన పింఛన్లు వచ్చే పరిస్థితి కనబడలేదు. మరోవైపు తుదిజాబితా ఎంపిక బాధ్యత జన్మభూమి కమిటీలకు అప్పగించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గ్రామల్లో రాజకీయ జోక్యం తారస్థాయిలో చేరుతుంది. 36వేల మందిలో 11,710 మందిని ఎంపిక జిల్లాలో జరిగిన జన్మభూమి, మాఊరి పిలుస్తోంది వంటి కార్యక్రమాల్లో 45 వేల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత ధ్రువీకరణ పత్రాలను అనుసంధానం చేసిన తరువాత 36 వేల దరఖాస్తులు మిగి లాయి. రాష్ట్రప్రభుత్వ అనుమతి కోసం పంపిన ఆ జాబితాలో కేవలం 11,710 మంది మాత్రమే ప్రాథమికంగా అర్హులని తాజాగా అదేశాలొచ్చాయి. వీరిలో వికలాంగులు-4,168, వితంతువులు-4,107, ఓఏపీ-3,137, వీవర్స్-121, టోడీ టాపర్స్-177 మంది ఉన్నారు. ప్రాథమి క జాబితాలోలేనివారి అనర్హతకు కారణాలు చెప్పకపోవడంపై పలు అ నుమానాలు వస్తున్నాయి. కొత్త పింఛన్ల సంఖ్యను పరిమితం చేయడానికే అంటూ విమర్శలు వస్తున్నాయి.