విజయనగరం అర్బన్ :అర్హులందరికీ సామాజిక భద్రత పింఛన్ వర్తింపచేసి ‘ఆసరా’గా నిలుస్తామని చెబుతున్న రాష్ట్ర పాలకులు... చేతల్లో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే పింఛన్‌దారుల సంఖ్యను భారీగా కుదించిన సంగతి తెలిసిందే. అయితే నూతనంగా మంజూరు చేయబోతున్న పింఛన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించే పనిలో పడింది. పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న 36 వేల మందిలో కేవలం 11,710 మందిని మాత్రమే ప్రాథమికంగా ఎంపిక చేశారు. మిగిలిన వారిని ఎందుకు ఎంపిక చేయలేదో స్పష్టమైన కారణాలను వివరించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అర్హులందరికీ పింఛన్ ఇస్తామని చెప్పి ఇలా కొందరినే ఎంపిక చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. 11,710 మంది పేర్లతో ప్రాథమిక అర్హత జాబితాను రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు పంపింది. ఈ జాబితాలోని అర్హతలను మరోసారి పరిశీలించే బాధ్యతను గ్రామ స్థాయి జన్మభూమి కమిటీలు అప్పగించారు. ఈ మేరకు కమిటీలు నిర్థారించి ప్రకటించిన తుదిజాబితాను ఈ నెలాఖరులోగా పూర్తి చేసుకొని తుదిజాబితాలను జిల్లా కేంద్రాలకు పంపాలి. ఆ జాబితాకు జిల్లా కమిటీ అనుమతి ఇస్తుంది. ఈ లెక్కన రానున్న ఏప్రిల్ నెలకు కూడా నూతన పింఛన్‌లు వచ్చే పరిస్థితి కనబడలేదు. మరోవైపు తుదిజాబితా ఎంపిక బాధ్యత జన్మభూమి కమిటీలకు అప్పగించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. గ్రామల్లో రాజకీయ జోక్యం తారస్థాయిలో చేరుతుంది.
36వేల మందిలో 11,710 మందిని ఎంపిక
జిల్లాలో జరిగిన జన్మభూమి, మాఊరి పిలుస్తోంది వంటి కార్యక్రమాల్లో 45 వేల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్హత ధ్రువీకరణ పత్రాలను అనుసంధానం చేసిన తరువాత 36 వేల దరఖాస్తులు మిగి లాయి. రాష్ట్రప్రభుత్వ అనుమతి కోసం పంపిన ఆ జాబితాలో కేవలం 11,710 మంది మాత్రమే ప్రాథమికంగా అర్హులని తాజాగా అదేశాలొచ్చాయి. వీరిలో వికలాంగులు-4,168, వితంతువులు-4,107, ఓఏపీ-3,137, వీవర్స్-121, టోడీ టాపర్స్-177 మంది ఉన్నారు. ప్రాథమి క జాబితాలోలేనివారి అనర్హతకు కారణాలు చెప్పకపోవడంపై పలు అ నుమానాలు వస్తున్నాయి. కొత్త పింఛన్‌ల సంఖ్యను పరిమితం చేయడానికే అంటూ విమర్శలు వస్తున్నాయి.
పింఛన్ దరఖాస్తుల్లో భారీగా కోత!
Published Wed, Mar 25 2015 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 PM
Advertisement
Advertisement