Pension policy
-
‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం మోదీ సర్కారు తాజాగా ఏకీకృత పెన్షన్ విధానాన్ని (యూపీఎస్) తీసుకొచ్చింది. ఉద్యోగుల చిరకాల డిమాండ్లను నెరవేరుస్తూ హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కనీసం పాతికేళ్ల సర్వీసు పూర్తి చేసుకునే వారికి వేతనంలో సగం మొత్తాన్ని అష్యూర్డ్ పెన్షన్‌గా అందిస్తారు. దీనికి అదనంగా రిటైర్మెంట్ సమయంలో నిర్దిష్ట మొత్తాన్ని ఏకమొత్త ప్రయోజనంగా కూడా అందజేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో శనివారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం యూపీఎస్‌కు ఆమోదముద్ర వేసింది. దీనితో 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వారికి సామాజిక భద్రత లభిస్తుందన్నారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. నూతన జాతీయ పెన్షన్ విధానం (ఎన్పీఎస్)లో ఉన్న ఉద్యోగులు యూపీఎస్‌కు మారవచ్చని చెప్పారు. 2004 జనవరి 1 తర్వాత సర్వీసుల్లో చేరిన వారికి ఈ పథకం వర్తించనుంది. సైనికోద్యోగులను మినహాయించి 2004 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వోద్యోగాల్లో చేరిన వారందరికీ ఎన్పీఎస్ను అమలు చేయడం తెలిసిందే. సోమనాథన్ కమిటీ సూచనలతో..మోదీ సర్కారు తీసుకొచ్చిన ఎన్పీఎస్పై ప్రభుత్వోద్యోగుల్లో వ్యతిరేకత రావడం తెలిసిందే. డీఏ ఆధారిత పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) కోసం వాళ్లు పట్టుబడుతున్నారు. పలు రాష్ట్రాలు, ముఖ్యంగా బీజేపీయేతర పారీ్టల పాలనలోని రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ వైపు మళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా యూపీఎస్‌ను తెరపైకి తెచ్చింది. ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ సారథ్యంలో గతేడాది ఒక కమిటీ వేసింది. ప్రభుత్వోద్యోగుల పెన్షన్ పథకాన్ని సమీక్షించి, దానికి చేయాల్సిన మార్పుచేర్పులపై సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరింది. కమిటీ 100కు పైగా భేటీలు జరిపిన మీదట యూపీఎస్ విధి విధానాలను రూపొందించినట్టు వైష్ణవ్ వెల్లడించారు. ఈ పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం (2025 ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వస్తుందని సోమనాథన్ తెలిపారు. ఉద్యోగుల గౌరవం, ఆర్థిక భద్రత: మోదీ యూపీఎస్‌తో ప్రభుత్వోద్యోగులకు గౌరవం, ఆర్థిక భద్రత పెరుగుతాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘జాతి ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వోద్యోగులు మనకు గర్వకారణం. వారి సంక్షేమానికి, భావి జీవిత భద్రతకు కేంద్రం కట్టుబడి ఉంది’’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. బాక్సు యూపీఎస్ విశేషాలివీ... 👉 అష్యూర్డ్ పెన్షన్: ఉద్యోగులు రిటైర్మెంట్కు ముందు తమ చివరి 12 నెలల సగటు బేసిక్ వేతనంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా అందుకుంటారు. ఇందుకోసం కనీసం పాతికేళ్ల సరీ్వసు పూర్తి చేసుకుని ఉండాలి. అంతకంటే తక్కువైతే సరీ్వసు కాలాన్ని బట్టి పెన్షన్ మొత్తం నిర్ధారణ అవుతుంది. 👉అష్యూర్డ్ మినిమం పెన్షన్: కనీసం పదేళ్ల సరీ్వసు పూర్తి చేసుకున్న వారికి రిటైర్మెంట్ అనంతరం నెలకు రూ.10 వేల కనీస పెన్షన్ అందుతుంది. తద్వారా అల్ప వేతనాలుండే దిగువ స్థాయి ఉద్యోగులకు ఇది ఆర్థిక భద్రత కలి్పస్తుంది. 👉 అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్: పెన్షనర్ మరణిస్తే కుటుంబానికి అతని పెన్షన్‌లో 60 శాతాన్ని అందజేస్తారు. తద్వారా ఆ కుటుంబానికి కనీస ఆర్థిక భద్రత కలుగుతుంది. కొత్తగా ఏకమొత్త ప్రయోజనం 👉 ప్రతి ఆర్నెల్ల సర్వీసుకూ నెలవారీ వేతనం (జీతం+డీఏ)లో పదోవంతు చొప్పున రిటైర్మెంట్ సమయంలో ఏకమొత్తంగా అందజేస్తారు. గ్రాట్యుటీ తదితర బెనిఫిట్లకు ఇది అదనం. 👉 సర్వీసులో ఉన్న ఉద్యోగుల మాదిరిగా యూపీఎస్ పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణ సూచిక, డీఆర్ ప్రయోజనాలను వర్తింపజేస్తారు. 👉ఇప్పటికే ఎన్పీఎస్ కింద రిటైరైన వారితో పాటు 2025 మార్చి 31 నాటికి రిటైరయ్యే ఉద్యోగులకు కూడా యూపీఎస్ వర్తిస్తుంది. వారికి గత బకాయిలను పీపీఎఫ్ వడ్డీరేటుతో చెల్లిస్తారు. 👉 ఉద్యోగులు ఎన్పీఎస్, యూపీఎస్‌ల్లో దేన్నయినా ఎంచుకోవచ్చు. 👉 యూపీఎస్ బెనిఫిట్ల నిమిత్తం ఉద్యోగులపై అదనపు భారమేమీ పడబోదు. పెన్షన్ ఖాతాకు వారి చెల్లింపుల వాటా 10 శాతంగానే కొనసాగుతుంది. కేంద్రం వాటా ఇప్పుడున్న 14 శాతం నుంచి 18.5 శాతానికి పెరగనుంది. దీనివల్ల కేంద్రంపై రూ.6,250 కోట్ల దాకా భారం పడనుందని సోమనాథన్ వెల్లడించారు. బకాయిల రూపేణా మరో రూ.800 కోట్ల భారం పడుతుందన్నారు. 👉 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యూపీఎస్‌ను అమలు చేయాలని కేంద్రం సూచించింది. తద్వారా 90 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. బాక్సు కేబినెట్ ఇతర నిర్ణయాలు బయో ఈ–3, విజ్ఞాన్ధారతో పాటు 11, 12వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ పథకాలకు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. విజ్ఞాన్ధారలో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, రీసెర్చ్, ఇన్నొవేషన్లకు సంబంధించి మూడు ప్రస్తుత పథకాలను ఒకే గొడుగు కిందకు తెచి్చంది. ఇందులో భాగంగా ప్రభుత్వం, విద్యా, పరిశ్రమల రంగాల మధ్య పరస్పర సహకారాన్ని మరింతగా పెంచేలా ప్రోత్సహిస్తారు. ఈ పథకానికి రూ.10,579 కోట్లు కేటాయించారు. బయో ఈ–3 కింద ఆర్థిక, పర్యావరణ, ఉపాధి రంగాల్లో బయో టెక్నాలజీకి మరింత ప్రోత్సహమందిస్తారు. దీన్ని ఒక చరిత్రాత్మక ముందడుగుగా ప్రధాని మోదీ అభివరి్ణంచారు. విజ్ఞాన్‌ధార పథకం యువతను శాస్త్రీయ పరిశోధనల వైపు మరింతగా మళ్లించి ఆ రంగంలో భారత్‌ను ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలుపుతుందని అభిప్రాయపడ్డారు. -
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌పై ఎలుగెత్తిన ఉద్యోగి
సాక్షి, అమరావతి: పదవీ విరమణ అనంతరం దక్కే పెన్షన్ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉద్యోగులు కొండంత ఆశతో ఎదురు చూస్తుంటారు. ఓ ఇల్లు కొనాలన్నా, పిల్లల చదువులు పూర్తి కావాలన్నా, భవిష్యత్తు సాఫీగా గడిచిపోవాలన్నా ఎంతో మందికి అదే ఆధారం. ఓ ఉద్యోగి జీవితంలో అనుకోని ఉపద్రవాలు సంభవించినా ఆ కుటుంబాన్ని చివరకు ఆదుకునేది కూడా అదే. తమ ఆశలను ఛిద్రం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్)పై రాష్ట్రవ్యాప్తంగా 1.84 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు భగ్గుమంటున్నారు. తమ భవిష్యత్తును అంధకారం చేసే కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్) స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్రంపై నెపం వేసి తప్పించుకునేందుకు దారులు వెతుకున్న రాష్ట్ర ప్రభుత్వంపై ఇక ఉద్యమించాలని నిర్ణయించారు.చాలా రోజులుగా వినతిపత్రాలు, ధర్నాలు, మౌన ప్రదర్శనలు, నిరసనలు, కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడంతో బుధవారం చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. విజయవాడలో వారిని పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. సీపీఎస్ మొగ్గ తొడిగింది బాబు జమానాలోనే లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తును చీకటిమయం చేసే సీపీఎస్ విధానం గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే సిద్ధమైంది. 2003కి ముందు టీడీపీ ప్రధాన భాగస్వామిగా ఉన్న అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రూపొందించింది. అయితే దీన్ని అమలు చేయాలా వద్దా..? అనే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీరని అన్యాయం చేసే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించి తన ఆమోదాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ప్రపంచ బ్యాంకు సూచనల ప్రకారం ఈ నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే ఈ విధానం పలు దేశాల్లో విఫలమైంది. ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన చంద్రబాబు, కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నూతన పెన్షన్ విధానం బిల్లును పార్లమెంటులో ఆమోదించటం ఉద్యోగులకు అశనిపాతంగా పరిణమించింది. బెంగాల్, త్రిపురలో నేటికీ పాత విధానమే... 2004 జనవరి 1వతేదీ నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానాన్ని వర్తింపచేశారు. ‘‘రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేయడం, చేయకపోవడం వాటి ఇష్టం’ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ విధానం చాలా లోపభూయిష్టమైనదని, ఉద్యోగుల చరమాంక జీవితానికి ఏమాత్రం భరోసా ఇవ్వదని పార్లమెంటులో గొంతెత్తిన వామపక్షాలు వాటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేయలేదు. పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో ఇప్పటికి పాతపెన్షన్ విధానమే అమలవుతుండటం గమనార్హం. ఉద్యోగులను అరెస్టు చేసి బలవంతంగా వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు ఉద్యోగుల ప్రయోజనాలకు గండి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబర్ 10 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సీపీఎస్)విధానాన్ని వర్తింపచేశారు. ఉద్యోగులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 1980 నాటి పెన్షన్ నిబంధనలు, వాటిలోని ప్రయోజనాలు సీపీఎస్ విధానంలో వర్తించవు. 1980 పెన్షన్ నిబంధనల ప్రకారం పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ, కమ్యూటేషన్, ఆర్జిత సెలవును నగదుగా మార్చుకొనే సదుపాయం, మరణానంతర ప్రయోజనాలనేకం ఉద్యోగులకు సమకూరాయి. కొత్త పెన్షన్ విధానం వల్ల పదవీ విరమణ అనంతరం ఉద్యోగుల జీవితం గాలిలో దీపంలా మారనుంది. రూ. వందల్లోకి పెన్షన్ కుదింపు.. ఉదాహరణకు పాత పెన్షన్ విధానంలో ఓ ఉద్యోగి బేసిక్ వేతనం రిటైరయ్యే నాటికి రూ. 66,330 ఉంటే పదవీ విరమణ తరువాత అతడికి రూ. 33,165 పెన్షన్‌గా అందుతుంది. 40 శాతం కమ్యూటేషన్ చేసినా మిగిలిన మొత్తం రూ. 19,899తో పాటు డీఏ, మెడికల్ అలవెన్సులు కలిపితే రూ. 27,398 పెన్షన్‌గా అందేది. అదే కొత్త పెన్షన్ విధానంలో ఒక ఉద్యోగి పెన్షన్ ఖాతాలో అక్టోబర్ నెలలో రూ. 4,93,564 ఉన్నాయనుకుంటే ఆ మొత్తం పెట్టుబడిగా పెడితే నెల చివరికి రూ. 4,95,888 అవుతోంది. అంటే పెరిగిన ఆదాయం రూ.2,324 మాత్రమే. ఈ లెక్కన ఉద్యోగికి వచ్చే పెన్షన్ నెలవారీ వందల్లోనే తప్ప అంతకు మించి అందదు. ఇక ఎవరైనా ఉద్యోగి చనిపోతే షేర్ మార్కెట్లో ఉన్న సొమ్ము మొత్తం ఆ కుటుంబానికి చెల్లిస్తారు. తరువాత ఆ ఉద్యోగి కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ రాదు. పాత పద్దతిలో అయితే చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి ఉద్యోగి చివరి బేసిక్‌లో సగం + దానిపై డీఏ వచ్చేది. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్ విధానంతో తమ కుటుంబాలు ఎలా బతకాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కుటుంబ పెన్షన్ లేకపోవడం, కమ్యూటేషన్ తొలగించటం, ఇతర ప్రయోజనాలను కూడా లేకుండా చేయడంతో వృద్ధాప్యంలో తమ పరిస్థితి ఏమిటని ఆక్రోశిస్తున్నారు. మండలిలో నిలదీసిన టీచర్ ఎమ్మెల్సీలు ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరరావు, కత్తినరసింహారెడ్డి, వై.శ్రీనివాసులురెడ్డి, రామసూర్యారావులు బుధవారం శాసనమండలిలో సీపీఎస్ రద్దు కోసం ఏకవాక్య తీర్మానానికి పట్టుబట్టారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో సభను స్తంభింపచేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ పోడియం ముందు బైఠాయించారు. లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్య పై చర్చించకపోవడం అన్యాయమని, తమ గోడును వెళ్లబోసుకొనేందుకు అసెంబ్లీకి వస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను ముందురోజు నుంచే అరెస్టు చేయడం అన్యాయమని ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించినందున ప్రభుత్వం కూడా దీనిపై తన వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని పట్టుబట్టారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో నిరసనగా సభనుంచి వాకౌట్ చేశారు. ఈనెల 20వ తేదీన శాసనమండలి, అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మళ్లీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని ప్రకటించారు. మహిళ ఉద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులకు ప్రయోజనాలు ఇవీ - ప్రతి నెలా జీతం నుంచి సొమ్ము చెల్లించకున్నా రిటైర్ అయిన తర్వాత నిర్ధిష్టమైన పెన్షన్ నెలనెలా అందుతుంది. ఏటా వచ్చే డీఏ, పీఆర్సీ ఇతర సదుపాయాలను అనుసరించి ఇది ప్రతినెలా పెరుగుతుంది. ఉద్యోగి బతికి ఉన్నంతవరకు పెన్షన్ ఇవ్వటంతోపాటు చనిపోయిన తరువాత ఉద్యోగి భార్యకు పెన్షన్ చెల్లిస్తారు. ఆ పెన్షన్ బాధ్యత ప్రభుత్వానిదే. - ప్రభుత్వ ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే అతడి కుటుంబంలో అర్హులైన వారికి దామాషా ప్రకారం జీవితాంతం ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు ఇది కూడా ప్రతినెలా పెరుగుతుంది. - ఉద్యోగి అవసరాలకోసం ప్రతినెలా జీతంలో కొంతభాగం జీపీఎఫ్ ఖాతాలో పొదుపు చేసుకోవచ్చు. ఈ ఖాతాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ఈ సొమ్ముపై ప్రతి నెలా నిర్దిష్ట వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగికి డబ్బు అవసరమైతే వడ్డీలేని రుణంగా పొందవచ్చు. సులభ వాయిదాల్లో చెల్లించవచ్చు. - పదవీ విరమణ అనంతరం ఉద్యోగి ఆరోగ్య అవసరాల కోసం హెల్త్ కార్డుల సదుపాయం ఉంది. - తన శక్తి సామరŠాధ్యలను ప్రభుత్వ సేవకి వినియోగించినందుకు పదవీ విరమణ సమయంలో బహుమానంగా దామాషా ప్రకారం గరిష్టంగా రూ.12 లక్షల వరకు గ్రాట్యుటీ చెల్లిస్తారు. పీఆర్సీ ప్రకారం ఇది పెరుగుతుంది. - పదవీ విరమణ సమయంలో కుటుంబ అవసరాలు తీర్చుకునేందుకు తనకు వచ్చే పెన్షన్‌లో దామాషా ప్రకారం 40 శాతం వరకు ముందుగానే తీసుకోవచ్చు. ఈ సొమ్మును పెన్షన్ నుంచి ప్రతి నెలా మినహాయిస్తారు. దీన్నే కమ్యుటేషన్ అంటారు. - ఉద్యోగికి లభించే ఆర్థిక ప్రయోజనాలపై ఎలాంటి పన్ను విధించరు. కొత్త విధానంలో అన్నిటికీ కోతే - పదవీ విరమణ అనంతరం పెన్షన్ గురించి ఉద్యోగే చూసుకోవాలి. దీనికోసం ఉద్యోగి తన సర్వీసు ప్రారంభం నుంచే జీతంలో ప్రతి నెలా 10 శాతం సొమ్ము పొదుపు చేసుకోవాలి. దీనికి ప్రభుత్వం అంతే మెత్తం జమచేసి ఎన్ఎస్డీఎల్ అనే సంస్థ ద్వారా షేర్ మార్కెట్లలో వివిధ రకాల ఫండ్లలో పెట్టుబడిగా పెడుతుంది. పదవీ విరమణ సమయంలో లాభనష్టాలు పోనూ మిగిలిన సొమ్ములో 60 శాతం ఉద్యోగికి చెల్లిస్తారు. దీనిపై ఉద్యోగి పన్ను చెల్లించాలి. మిగిలిన 40 శాతం సొమ్ము మళ్లీ షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి వచ్చే లాభాలతో పెన్షన్ ఇస్తారు. ఇది ఎంత అనేది నిర్ధిష్టంగా ఉండదు. షేర్ మార్కెట్లలో నష్టాలు వస్తే పెన్షన్ తగిపోతుంది. ఒకవేళ పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి మరణిస్తే కుటుంబానికి ఫ్యామిలి పెన్షన్ అందదు. ఆ కుటుంబం వీధుల పాలు కావాల్సిందే. - ఉద్యోగి తన శక్తి సామర్థ్యాలను ప్రభుత్వ సేవకి అంకితం చేసినందుకు పదవీ విరమణ సమయంలో ఇచ్చే ్రగ్రాట్యుటీ సదుపాయం లేదు. అయితే దీన్ని ఇచ్చేందుకు ఇటీవలే ప్రభుత్వం అంగీకరించి జీవో ఇచ్చింది. - రిటైరయిన తరువాత ఉద్యోగి హెల్త్ కార్డులపై స్పష్టత లేదు. - ఉద్యోగులకు కమ్యుటేషన్ సదుపాయం లేదు. - పాత పెన్షన్ విధానంలో మాదిరిగా ఆపదలో ఆదుకోనే జీపీఎఫ్ లోన్ సదుపాయం ఉద్యోగులకు లేదు. ఉపాధ్యాయుల చలో అసెంబ్లీ భగ్నం భవానీపురం(విజయవాడ): కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బుధవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమంపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచే అన్ని జిల్లాల్లో అరెస్టుల పర్వం కొనసాగింది. బస్సులు, రైళ్లలో బయలుదేరిన వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. విజయవాడ, గుంటూరుల్లో భారీగా పోలీసులను మోహరించటంతోపాటు వెలగపూడిలోని తాత్కాలిక అసెంబ్లీకి వచ్చే అన్ని దారుల్లోనూ నిఘా వేశారు. విజయవాడకు చేరుకున్న వేలాది మందిని అడ్డుకొని సుదూరంలోని పోలీసు స్టేషన్లలో నిర్బంధించారు. ఫ్యాప్టో లోని అన్ని సంఘాల రాష్ట్ర నేతలు, జిల్లాల నేతలను పోలీసులు అరెస్టుచేసి రాత్రి వరకు నిర్బంధించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి అసెంబ్లీ ముట్టడికి బయల్దేరేందుకు 13 జిల్లాల నుంచి ఉద్యోగులు ఉదయమే కళాక్షేత్రం వద్దకు భారీగా చేరుకున్నారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసు బలగాలు వారిని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కిందపడిపోయిన మహిళా మహిళలను నిర్దాక్షిణ్యంగా ఎత్తి వ్యాన్లలో పడేశారు. సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, పాత పెన్షన్ స్కీం విధానాన్నే కొనసాగించాలంటూ ఉద్యోగులు నినదించారు. ప్రభుత్వ దమననీతి నశించాలని, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసుల అత్యుత్సాహంపై ఉద్యోగులు మండిపడ్డారు. సీపీఎస్ విధానం రద్దు కోరేది తమ ఒక్కరి కోసమే కాదని, అది మీకు కూడా వర్తిస్తుందన్న విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. ఆడామగా తేడా లేకుండా విచక్షణా రహితంగా ప్రవర్తించిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తమైంది. ఒక దశలో కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు వదలలేదు. ఒక ఛానల్ రిపోర్టర్ పొట్టలో పిడిగుద్దులు గుద్దారు. మరికొంతమందిపైనా దౌర్జన్యం చేశారు. -
జగన్ ప్రకటనపై హర్షం
తాము అధికారంలోకి వస్తే నూతన పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం చేసిన ప్రకటనను ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తున్నాయి. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళనబాట పట్టాయి. సీపీఎస్ అమలు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే అప్పగించినా పాలకులు మాత్రం సీపీఎస్ రద్దు అంశాన్ని, ఉద్యోగులు ఆందోళనలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ క్రమంలో ప్రతిపక్షనేత హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. –అనంతపురం అర్బన్ సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఇప్పటికే ఆందోళన బాట పట్టారు. అధికారంలోకి వస్తే ఈ విధానం రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయం. మాకు పార్టీలతో సంబంధం లేదు. అధికారంలో ఎవరున్నా ఉద్యోగుల సంక్షేమం చూడాలి. – శీలా జయరామప్ప, జిల్లా చైర్మన్, ఏపీ జేఏసీ అమరావతి జగన్‌ను అభినందిస్తున్నాం కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. ఆయన్ను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ అభినందిస్తున్నాయి. సీపీఎస్ రద్దు చేస్తే రాష్ట్రంలోని 1.84 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుంది. పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు. చంద్రబాబు పెట్టే బిక్ష కాదు. –ఆత్మారెడ్డి, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర నాయకుడు చంద్రబాబుకు చెంపపెట్టు జగన్ ప్రకటన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చంపపెట్టు. సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. కానీ సీఎం తన పరిధిలోని అంశం కాదంటూ తప్పించుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా స్పందించడం ఆనందంగా ఉంది. –జంషీద్, ఉపాధ్యాయుడు, కదిరి మంచి నిర్ణయం సీపీఎస్ రద్దు ప్రకటన మంచి నిర్ణయం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్న తరుణంలో జగన్మోహన్రెడ్డి ప్రకటన కొండంత ఊరటనిచ్చింది. ఆయన చెబితే చేస్తాడన్న నమ్మకం కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఉంది. –గంగాధర్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా నాయకుడు సాహసోపేతమైన నిర్ణయం ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనది. ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి ఇది మద్దతుగా నిలుస్తుంది. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు దీన్ని స్వాగతిస్తున్నాయి. –రామానుజన్, ఉపాధ్యాయుడు, ఆర్ఎంసీహెచ్ పాఠశాల హర్షణీయం అధికారంలోకి వస్తే సీపీఎస్ విధానం రద్దు చేస్తామన్న జగన్మోహన్రెడ్డి ప్రకటన హర్షణీయం. సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు కొద్ది నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విధానం రద్దు చేస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుంది. – ఎం.రాజారమేశ్ నాయక్ సంతోషదాయకం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి ప్రకటన చేయడం సంతోషదాయకం. సీపీఎస్ విధానం వల్ల 2004, సెప్టెంబరు 1 తర్వాత ఉద్యోగంలో చేరిన వారు తీవ్రంగా నష్టపోతారు. అందువల్లే సీపీఎస్ రద్దు చేయాలని అన్ని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. – ఫరూక్, జిల్లా కార్యదర్శి, ట్రెజరీ ఉద్యోగుల సంఘం రద్దు ప్రకటన హర్షణీయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామన్న ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఇది ఒక గొప్ప నిర్ణయం. సీపీఎస్ విధానం ద్వారా ఉపాధ్యాయులు ఆర్థిక భరోసాను కోల్పోతారు. అటువంటిది ఎన్నో కుటుంబాలకు జీవిత భద్రత కల్పించేలా నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. – డి.రవీంద్రనాథ్, ఏపీ టీపీఎస్ఈ సభ్యులు ఉద్యోగుల ఆశలు చిగురించాయి జగన్ మోహన్‌రెడ్డి తన ప్రజా సంకల్ప యాత్రలో సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటన చేయడం ద్వారా ఉద్యోగుల ఆశలు చిగురించాయి. ఉద్యోగులకు ఇదో తీపి కబురు. దీనికి అన్ని సంఘాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాలి. – ప్రభాకర్, టీచర్, ఝాన్సీలక్ష్మీబాయి పాఠశాల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. జగన్‌కు ఉద్యోగ సంఘాల తరుఫున కృతజ్ఞతలు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న ఆయన తీరు అందరిని ఆకర్షిస్తుంది. – ఫణిభూషణ్, ఎస్టీయూ నగర శాఖ నాయకుడు -
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
- ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు - తెలుగు రాష్ట్రాల నుంచి హాజరైన15 వేల మంది ఉపాధ్యాయులు సాక్షి, న్యూఢిల్లీ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారుు. ఈ ధర్నాలో 20 రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్)కు చెందిన సుమారు 15 వేల మంది ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ జనరల్ సెక్రటరీ సీఎన్. భారతి మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పీఎఫ్ఆర్డీఏను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, వై. శ్రీనివాసులు రెడ్డి, డా.ఎం.గేయానంద్, ఎంవీఎస్ శర్మ, బొడ్డు నాగేశ్వరరావు పాల్గొని సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ. వెంకటేశ్వరరావు, పి. బాబురెడ్డి ప్రసంగిస్తూ.. సీపీఎస్ పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ ఉపాధ్యాయుల జీవితాలతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. పాత పెన్షన్ విధానం ప్రకారం ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ చేసే సమయంలో ఎంత జీతం ఉందో.. అందులో సగం ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్‌గా వచ్చేదన్నారు. అరుుతే సీపీఎస్ అమలు వల్ల ఆ పెన్షన్ రాకుండా పోతోందన్నారు. 12 ఏళ్లుగా అమలవుతున్న ఈ విధానం.. దేశంలో 40 లక్షల మంది ఉపాధ్యాయుల ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిందని యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్. రవి పేర్కొన్నారు. ఈ ధర్నాలో ఎస్టీఎఫ్ఐ అధ్యక్షుడు అబిజిత్ ముఖర్జీ, సంఘం నేతలు ఎన్.నారాయణ, కేసీ. హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎస్ విధానం.. అయోమయం!
వజ్రపుకొత్తూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయులను ఆందోళన బాట పట్టేలా చేస్తోంది. ఇటీవల చేపట్టిన లక్ష సంతకాల సేకరణ దశల వారీ ఉద్యమానికి కీలకం కానుంది. మంచి జీతం, పదవీ విరమణ పొందిన తరువాత పింఛన్ పొందే సౌకర్యంతో భద్రత ఉంటుందనే ప్రభుత్వ ఉద్యోగానికి చాలా మంది మొగ్గు చూపుతారు. కానీ ప్రస్తుత ప్రభుత్వాలు ఉద్యోగుల నమ్మకాన్ని ఒమ్ము చేశాయి. భద్రత లేని సీపీఎస్ పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టి మోసానికి పాల్పడుతున్నాయి. అందరికీ సమానమైన పింఛన్ మంజూరు కాక ఉద్యోగుల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. భరోసా లేని పథకం కంట్రిబ్యూటరీ పింఛన్ విధానం వల్ల ఉద్యోగులకు భరోసా కరువైంది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. భవిష్యత్తులో ఈ అంశమే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ప్రధాన ఎజెండా కానుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. 2004 జనవరి ఒకటి నుంచి కేంద్రం, అదే ఏడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని అమలు చేశాయి. పథకాన్ని పీఎఫ్ఆర్డీ(ఫెన్స్‌న్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ), ఎన్ఎస్డీఎల్(నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్)ల సహాయంతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూలవేతనం, కరువు భత్యంలో పింఛన్ కోసం మినహాయించి పది శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తానికి మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో సక్రమంగా చెల్లింపులు జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఫండింగ్ ఏజెన్సీల ద్వారా షేర్ మార్కెట్లో పెట్టి లాభాలు ఆధారంగా పింఛన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధానంలో నష్టాలొస్తే పింఛన్ ఏ విధంగా ఇస్తారన్నది అస్పష్టత నెలకొంది. ఉద్యోగులకు నష్టమిలా.. శ్రీకాకుళం జిల్లాలో 2004 తరువాత సుమారు 12,453 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు విధుల్లో చేరారు. ఇందులో సుమారు 6,200 మంది ఉపాధ్యాయులే. పదవీ విరమణ తరువాత వీరికి సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగుల గ్రాట్యూటీ సౌకర్యాన్ని కోల్పోతారు. పింఛన్లో కొంత భాగాన్ని కముటేషన్ చేసుకునే వీలుండదు. ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే కారుణ్య నియామకంలో పాటు కుటుంబంలో ఒకరికి పింఛన్ అందే విధానం లేదు. దీంతో భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనతో 12 ఏళ్లు తరువాత సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్‌తో ఒక గొడుకు కిందకు వచ్చారు. వీరికి అండగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. పెన్షన్ భిక్ష కాదు పెన్షన్ అంటే యజమాని తన ఇష్ట ప్రకారం ఇచ్చే పారితోషికం కాదు. భిక్ష కాదు. ఎక్స్‌గ్రేషియా పేమెంట్ కాదు. అది ఉద్యోగి చేసిన సర్వీసుకు ఇచ్చే చెల్లింపు మాత్రమే. అది సగటు ఉద్యోగి హక్కు. వారి హక్కును కాలరాయడం అంటే మానవతా విలువలను విస్మరించడం అవుతుంది. - తమ్మినానా రామకృష్ణ, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత, వజ్రపుకొత్తూరు పాత విధానంలో పింఛన్ ఇవ్వాలి పాత పద్ధతిలోనే పింఛన్ ఇవ్వాలి. కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు సీపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టి మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్తున్నాయి. ఇక్కడ ప్రభుత్వం అవిధంగా చేయూలి. ఉద్యోగుల హక్కులను కాలరాస్తే ఉద్యమాలు తప్పవు. - ఎ.జయరామయ్య, ఉపాధ్యాయుడు,యు. కూర్మనాథపురం వజ్రపుకొత్తూరు మండలం -
ఇదెక్కడి పింఛన్ విధానం!
రాయవరం : వేటు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏది కోరుకుంటారని చదువుకున్న వారిని అడిగితే..ప్రభుత్వ ఉద్యోగమే కావాలని ప్రతి ఒక్కరూ ఠక్కున సమాధానమిస్తారు. మంచి జీతం, పదవీ విరమణ తర్వాత పింఛన్ పొందే సౌకర్యంతో భద్రత ఉంటుందనే ప్రభుత్వ ఉద్యోగానికి చాలా మంది మొగ్గు చూపుతారు. ప్రభుత్వ ఉద్యోగులైనా అందరికీ సమానమైన పింఛన్ విధానం అమలు కావడం లేదు. ఇది ఒక రకంగా ఉద్యోగుల మధ్య అంతరానికి దారితీస్తోందని చెప్పవచ్చు. ప్రభుత్వాలపైనా వ్యతిరేకతను పెంచుతుంది. కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానంతో పింఛన్ వస్తుందన్న నమ్మకాన్ని ఉద్యోగులు కోల్పోతున్నారు. దీనిపై సీపీఎస్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళన బాట పడుతున్నారు. వీరికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బాసటగా నిలుస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ అంశమే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రధాన అజెండాగా మారనుంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే .. 2004 జనవరి ఒకటి నుంచి కేంద్రం, అదే ఏడాది సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పింఛన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. పథకాన్ని పీఎఫ్ఆర్డీ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డవలప్మెంట్ అథారిటీ), ఎన్ఎస్డీఎల్(నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్) సమన్వయంతో దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. ఉద్యోగుల మూల వేతనం, కరువుభత్యంలో పింఛన్ కోసం మినహాయించిన పది శాతం మొత్తానికి సమానంగా ప్రభుత్వం అంతే మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంటుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో చెల్లింపులు సక్రమంగా జరగడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు ఫండింగ్ ఏజెన్సీ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టి లాభాల ఆధారంగా పింఛన్ అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నష్టాలొస్తే పింఛన్ ఎలా ఇస్తారన్న దానిపై అస్పష్టత నెలకొంది. జిల్లాలో 2004 తర్వాత సీపీఎస్ విధానంలో 14,457 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. సుమారు ఏడు వేల మంది వరకు ఉపాధ్యాయులు ఉన్నారు. భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనతో 12 ఏళ్ల తర్వాత సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటుతో ఒక గొడుగు కిందకు వచ్చారు. వీరంతా లక్ష సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతున్నారు. వీరికి బాసటగా పలు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాట పడుతున్నాయి. ఉద్యోగులకు నష్టమిలా .. పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత ఉండదు. ఉద్యోగులు గ్రాడ్యుటీ సౌకర్యాన్ని కోల్పోతారు. పింఛన్లో కొంత భాగాన్ని కముటేషన్ చే సుకునే అవకాశం ఉండదు. ఉద్యోగులు సర్వీసులో మరణిస్తే కారుణ్య నియామకంతో పాటు కుటుంబానికి పింఛను వచ్చే సదుపాయం పాత విధానంలో ఉండగా, కొత్తగా లేదు. వృద్ధాప్యంలో అభద్రత పార్లమెంట్లో పీఎఫ్ఆర్డీ బిల్లును ఇటీవలే ఆమోదించారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం ఉండదు. దీని వల్ల సామాజిక భద్రత లేకుండా పోతోంది. 30 ఏళ్లు సర్వీసు ఉన్నా పింఛను లేక పోతే వృద్ధాప్యంలో కష్టాలు తప్పవు. - కె.మునిప్రసాద్, సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా నేత, కరప పాత విధానంలో పింఛన్ ఇవ్వాలి.. పింఛన్ విధానాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. కొత్త పింఛన్ విధానంలోకి వచ్చిన తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కూడా మళ్లీ పాత విధానంలోకి వెళ్లేందుకు యోచిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలి. - దొంతంశెట్టి సతీష్, టీచర్, మాచవరం, రాయవరం మండలం