peoples welfare
-
Congress Prty: 7 కీలక హామీలు
సాక్షి, న్యూఢిల్లీ: హరియాణా శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ బుధవారం తమ హామీల చిట్టీని బహిర్గతం చేసింది. తాము అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తామనే విషయాన్ని మేనిఫెస్టోలో వివరించింది. పేద, మధ్య తరగతి ప్రజలు, మహిళలు, రైతులకు వరాలు కురిపించింది. మహిళలకు ప్రతి నెల రూ.2,000 ఆర్థికసాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్ సహా పలు వర్గాలపై వరాల జల్లు కురిపించింది. ఏడు కీలకమైన హామీలు ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ల సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 53 పేజీల మేనిఫెస్టోను విడుదల చేశారు.ఏడు గ్యారంటీలు ఇవే → మహిళా సాధికారత: 18 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.2,00 చొప్పున ఆర్థికసాయం. రూ.500కే గ్యాస్ సిలిండర్ → సామాజిక భద్రత: వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు రూ.6,000 పెన్షన్ → యువతకు: రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ → ఉచితాలు: రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్→ పేదలకు: ప్రతి పేద కుటుంబానికి 100 గజాల స్థలంలో ఇల్లు. ఇందులో రూ.3.5 లక్షల ఖర్చుతో రెండు గదుల ఇళ్లు → రైతులకు: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత → వెనుకబడిన వర్గాలకు: కులగణన చేసి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవడం. క్రిమిలేయర్ పరిమితిని రూ.10లక్షలకు పెంపు గెలిచాకే సీఎం అభ్యర్థి ఖరారు: ఖర్గే హరియాణలో ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇచి్చన ఏడు హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు ‘‘దాదాపు 35 లక్షల ఉద్యోగాలను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా నిలిపివేసింది. బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఒక ఇంజన్ ముందుకు తీసుకెళ్తుంటే మరో ఇంజన్ వెనక్కి లాగుతోంది. మేం మేనిఫెస్టోలో చెప్పిన ఏడు ప్రధాన వాగ్దానాలను అధికారంలోకి రాగానే నెరవేరుస్తాం. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిన నష్టాన్ని సరిదిద్దటంతోపాటు రాష్ట్రంలో వృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ‘అభివృద్ధి ఎక్స్‌ప్రెస్ ఇంజన్’జత చేస్తాం’’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాకే ముఖ్యమంత్రి అభ్యరి్థని ప్రకటిస్తామని ఖర్గే స్పష్టంచేశారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా సైతం మాట్లాడారు. ‘‘నాటి ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ హయాంలో 1966లో మా రాష్ట్రం ఏర్పాటైంది. నాటి నుంచి 2014 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందింది. అయితే తొమ్మిదిన్నరేళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రం వెనుకబడిపోయింది. మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ హరియాణాను నంబర్ వన్ చేస్తాం’అని హూడా అన్నారు. -
మోదీ పీఎంవో కాదది... ప్రజా పీఎంవో!
న్యూఢిల్లీ: ‘‘ప్రధాని కార్యాలయమంటే అధికార కేంద్రమని మన దేశంలో పదేళ్ల కింది దాకా అభిప్రాయముండేది. కానీ నేను పుట్టింది అధికారం కోసం కాదు. నాకు అధికారం కావాలని ఎప్పుడూ ఆలోచించను. ప్రధాని కార్యాలయం కూడా అధికార కేంద్రం కాకూడదు. అది ప్రజల పీఎంవోగా ఉండాలి తప్ప మోద పీఎంవోగా కాదు’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘నేను అధికారం కోసం జని్మంచలేదు. 140 కోట్ల మంది భారతీయులే నాకు దేవుళ్లు. వారి సంక్షేమమే నా పరమావధి. దానికోసమే వారు నాకు మరోసారి అవకాశమిచ్చారు. పీఎంవోను అధికార కేంద్రంగా మార్చే ఉద్దేశం నాకెన్నడూ లేదు. అది ప్రజల సంక్షేమం కోసం పని చేసే సంస్థగా ఉండాలి’’ అని స్పష్టం చేశారు. 2014 నుంచీ అదే దిశగా కృషి చేస్తూ వచ్చామన్నారు. ఆయన వరుసగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయడం తెలిసిందే. సోమవారం ఉదయం ప్రధాని కార్యాలయంలో ఆయన లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 17వ విడత నిధుల విడుదల ఫైలుపై తొలి సంతకం చేశారు. పీఎంఓలో అధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు. వారినుద్దేశించి మోదీ మాట్లాడారు. పీఎంవో ఒక ప్రేరక శక్తిగా నిలవాలన్నదే తన తపన అని చెప్పారు. ‘‘దేశమే ముందు. నాకైనా, మీకైనా ఇదే ఏకైక లక్ష్యం కావాలి’’ అని వారికి ఉద్బోధించారు. ‘‘2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుదాం. మీనుంచి నేను కోరేది అదే’’ అని స్పష్టం చేశారు. ‘‘మనం నిరీ్ణత పని గంటలు పెట్టుకుని, వాటికి పరిమితమై పని చేసేవాళ్లం కాదు. పని వేళలతో పాటు ఆలోచనలకు కూడా ఎలాంటి హద్దులూ లేనివాళ్లే నా పీఎంవో బృందం. వారిపై దేశమూ ఎంతో నమ్మకం పెట్టుకుంది’’ అన్నారు. ‘‘గత పదేళ్లో ఆలోచించిన, అమలు చేసిన దానికంటే ఎంతో ఎక్కువగా చేసి చూపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇదే నా భవిష్యత్తు విజన్’’ అని పేర్కొన్నారు.‘‘అంతర్జాతీయ ప్రమాణాలన్నింటినీ అధిగమిద్దాం. నిన్న ఎలా ఉన్నాం, ఈ రోజు ఎంత బాగా చేశామన్నది కాదు. ఇక ముందు ప్రతి రంగంలోనూ మనమే ప్రపంచంలో అగ్రగాములుగా ఎదగాలి. ఇప్పటిదాకా ఎవరూ చేరలేని శిఖరాలకు దేశాన్ని తీసుకెళ్దాం’’ అని అధికారులకు పిలుపునిచ్చారు. అది జరగాలంటే ఆలోచనల్లో స్పష్టత, చిత్తశుద్ధిపై నమ్మకం, ఆ దిశగా కష్టించే స్వభావం అత్యంత అవసరమని మోదీ చెప్పారు. పీఎంవో బృంద సభ్యులు అందిస్తూ వస్తున్న సహకారానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.అదే నా శక్తి రహస్యం... తనకు ఇంతటి శక్తి ఎక్కడి నుంచి వస్తోందని ఈ ఎన్నికల సందర్భంగా చాలామంది అడిగారని మోదీ అన్నారు. ‘‘30 ఏళ్లుగా నాకీ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. నాలోని విద్యార్థి నిత్యం సజీవంగానే ఉంచుకుంటాను. బలహీనతకు, బద్ధకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ చోటివ్వను. చైతన్యంతో, శక్తిమంతంగా ఉండటమే నా రహస్యం. అలా ఉన్నప్పుడే విజయవంతమైన వ్యక్తులుగా ఎదుగుతాం. నూతనోత్తేజం, రెట్టించిన ఉత్సాహం, శక్తియుక్తులతో ముందుకు సాగుతా’’ అని చెప్పారు. ‘పీఎం కిసాన్ నిధి’పై మోదీ తొలి సంతకం సాక్షి, న్యూఢిల్లీ: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం 17 వ విడత నిధుల విడుదల ఫైలుపై మోదీ తొలి సంతకం చేశారు. దాంతో దేశవ్యాప్తంగా 9.3 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున మొత్తంగా రూ.20 వేల కోట్ల నిధులు అందనున్నాయి. అనంతరం మోదీ మాట్లాడుతూ, తమది రైతు సంక్షేమానికి పూర్తిగా కట్టుబడ్డ ప్రభుత్వమన్నారు. అందుకే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక తొలి సంతకం రైతు సంక్షేమ ఫైలుపై పెట్టడం సముచితమన్నారు. రైతులు, వ్యవసాయ రంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. -
ప్రజా సంక్షేమమే ప్రధాని మోడీ లక్ష్యం
హైదరాబాద్ సిటీ: రాజకీయాలకు అతీతంగా టీమ్ ఇండియాగా పనిచేసి దేశాభివృద్ధికి కృషి చేయడమే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి అన్నారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన భీమా పథకంలో బ్యాంకు ఖాతాదారుంలదరూ విధిగా చేరి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. బీజేపీ మాజీ కార్పొరేటర్ కన్నె ఉమా రమేష్‌యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడ నింబోలిఅడ్డలో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాంకు ఖాతాలున్న వారు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన దరఖాస్తు పూర్తి చేసి ఇవ్వాలని, ఆ బీమాకు అవసరమయ్యే డబ్బులు తానే చెల్లిస్తానని, ప్రజలు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా ఇవ్వవద్దని సూచించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రతి ఒక్కరికీ బీమా పథకం వర్తించేలా ఈ పథకాన్ని ప్రవేవపెట్టారని చెప్పారు. సురక్ష బీమా యోజన పథకం ద్వారా ఏడాదికి రూ.12 అతి స్వల్ప ప్రీమియం చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా పొందవచ్చన్నారు. ప్రమాదం అనేది ఏరకంగా వస్తుందో తెలియదని, ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ కుటుంబం మొత్తం రోడ్డునపడుతుందన్నారు. ప్రజలు దీన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకు ఖాతాలున్న వారందరూ ఈ పథకంలో చేరాల్సిన అవసరం ఉందని, బ్యాంకు ఖాతాలు లేనివారు వెంటనే జీరో బ్యాలెన్స్ ద్వారా ఖాతాలో ప్రారంభించుకోవాలని సూచించారు. బీమా పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి లబ్ధి చూకూర్చేందుకై బీమా పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. -
బాబుకు ప్రజాశ్రేయస్సు పట్టదా?
సాక్షి, హైదరాబాద్: బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు ప్రజా శ్రేయస్సు పట్టదా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తన పార్టీ రెండు ప్రాంతాల్లో బతకాలంటారే తప్ప, ప్రజల శ్రేయస్సు కోసం రెండు ప్రాంతాలు కలిసుండాలని ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, గొల్ల బాబూరావు, టి.బాలరాజు, శ్రీకాంత్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, కాటసాని రామిరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. విభజన వల్ల రెండు ప్రాంతాలకు తీరని నష్టం వాటిల్లుతుందని తెలిసినప్పటికీ తన రాజకీయ భవిష్యత్తు కోసం తెలుగు ప్రజలకు ద్రోహం చేస్తున్నారని చంద్రబాబుపై భూమన మండిపడ్డారు.ఓట్లు, సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీ మాదిరిగా చంద్రబాబు కూడా ఇంత ఘోరంగా దిగజారడం చూసి ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని చెప్పారు. తాము మాత్రం ప్రజల తరఫునే నిలబడ్డామని, రాజకీయంగా నష్టపోయినా ఫర్వాలేదని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని బీరాలు పలికి, చివరకు విభజనకు తలుపులు బార్లా తెరిచిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారని హెచ్చరించారు. బీఏసీకి హాజరు కాలేదేమి?: h ప్రధాన ప్రతిపక్షస్థానంలో ఉన్న చంద్రబాబు బీఏసీ సమావేశానికి హాజరుకాకపోవడాన్ని ఏ సిద్ధాంతమంటారో ఆయనే చెప్పాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. బీఏసీకి కూడా బాబు ఇరుప్రాంత నేతలను పంపించి ద్వంద్వ వైఖరిని అవలంబించారని దుయ్యబట్టారు.