మరోసారి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
కోలకత్తా: వివాదాస్పద బీజేపీ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ మరోసారి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. డీమానిటైజేషన్ తర్వాత దేశంలో జనాభా నియంత్రణకు మాస్ స్టెరిలైజేషన్ కార్యక్రమం చేపట్టాలని మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ సహాయమంత్రి గిరిరాజ్ సింగ్ పిలుపు నివ్వడం కలకలం రేపింది.
తన పార్లమెంటరీ నియోజకవర్గం నవాడా జరిగిన ఒక కార్యక్రమంలో సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జనాభా ను నియంత్రించడానికి స్టెరిలైజేషన్ కు పిలుపునిచ్చారు. నోట్ బందీ తర్వాత నస్ బందీ కార్యక్రమం చేపట్టాలన్నారు. దేశంలో స్టెరిలైజేషన్ కోసం చట్టాలను చేయాల్సిన అవసరం ఉందని గిరిరాజ్ వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ,మలేషియా లో ఇలాంటి జనాభా నియంత్రణ చట్టాలు ఉన్నాయన్నారు. కనుక ఇలాంటి చట్టాలు భారతదేశంలో కూడా ఉంటే తప్పేమీ లేదని పేర్కొన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలను బీజీపీ కొట్టివేసింది. ఇది ఆయన వ్యక్తి గత అభిప్రాయమనీ, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఏదీ లేదని రాహుల్ సిన్హా వివరణ ఇచ్చారు. దేశంలో జనాభా పెరుగుతోంది , ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ పార్టీకి గానీ, ప్రభుత్వానికి గానీ అలాంటి ఎజెండా ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే జనాభా నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు, ప్రకటనలు రావాలన్నారు. దీనికి రాజకీయ పార్టీలు సహా ఇతర స్వచ్చంద సంస్థలు అందరూ కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో (1975-1977) ప్రజలు పడ్డ ఇబ్బందును రాహుల్ సింగ్ గుర్తు చేశారు. ఆ సమయంలో నిర్బంధ స్టెరిలైజేషన్ తో ప్రజలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు.
కాగా గిరిరాజ్ సింగ్ పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశం లో జనాభా నియంత్రణ ఒక సామూహిక స్టెరిలైజేషన్ పిలుపునిచ్చారు. ఇంతకుముందు మరో బీజేపీ సంజయ్ పాశ్వాన్ మాస్ స్టెరిలైజేషన్ చేయాలని వ్యాఖ్యానించారు. విమర్శలకు, వివాదాలకు ఎప్పుడూ తెరతీసే గిరిరాజ్ సింగ్ జనాభా విధానంలో మార్పులు చేయాలని, ముస్లిం కుటుంబాలకు ఇద్దరకుమించిన పిల్లలుండకూదని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.