Personality Development
-
ఏమిటి ఈ పరీక్ష? ఎందుకు?
పరీక్ష... లేదా పరీక్షలు అనే మాట విద్యారంగంలో తరచూ వినిపిస్తూ ఉంటుంది. చెప్పిన పాఠాలు విద్యార్థి ఎంత శ్రద్ధగా విన్నాడు, ఎంత జ్ఞానాన్ని పొందాడు, దాని సారమెంత అన్నది ఉపాధ్యాయులు అంచనా వేయాలి. అలా వేసే అంచనానే పరీక్షంటే. పరీక్ష అతణ్ణి పైతరగతులకు పంపే ఒక పక్రియ లేదా సాధనం. అయితే పరీక్ష అనేది విద్యార్థులకు మాత్రమే పరిమితం కాదు. చదువున్నా లేకపోయినా, జీవితంలో ప్రతి ఒక్కరూ పరీక్షకు గురి అయిన వారే. తమను తాము పరీక్ష చేసుకునేవారే. ఇంతకీ పరీక్ష అంటే ఏమిటి, ఎందుకో తెలుసుకుందాం. మన మాట తీరు, ఇతరులతో మన సంబంధాలు, వారితో మన వర్తన, విలువలు, నీతి, నిజాయితీ, తోటి మానవుల పట్ల మన భావన, ప్రేమ ఇటువంటి అనేకమైన వాటిని అంచనా వేసుకునేందుకు కూడా పరీక్ష అవసరం. మన జీవిత ప్రవాహ సారాన్ని అర్ధం చేసుకుని దాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాలి. అంటే మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. దాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలంటే ఈ పరీక్ష అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ఇతర జీవులకు, మనకు ఉండే జనన మరణాల సారూప్యతకు భిన్నంగా, గొప్పగా మన జీవనవిధానాన్ని గమనిస్తూ జీవితాన్ని మార్పు చేసుకోగలమా? అలా మన తెలివితేటలకు, ఆధిక్యతకు ఒక విశిష్టత, అర్థం చూపగలమా? ఆ ఆలోచన వచ్చిన వారెవరైనా తమ శల్య పరీక్షకు సంసిద్ధులైతే జీవితాన్ని చక్కగా మలచు కోవటం కష్టం కానే కాదు. అది మనోవికాసానికి, గొప్ప ఆలోచనలకు దారి తీసి మానవాళికి ఉపయుక్తం అయ్యే అనేక ఆవిష్కరణలకు దారితీస్తుంది.‘శోధించని జీవిత జీవనయోగ్యం కాదు’ అన్నాడు సోక్రటీస్. ఈ పరీక్షకు విద్యార్థి, పరీక్షాధికారి ఎవరికి వారే. విద్యార్థి సంవత్సరకాలంలో పుస్తకాలలోని తను పొందిన జ్ఞానాన్ని ఎలా జ్ఞప్తికి తెచ్చుకుంటాడో అలా ప్రతి వ్యక్తి తను గడిపిన, గడుపుతున్న జీవితాన్ని నెమరు వేసుకోవాలి. వివిధ సందర్భాలలో తన మాటలు, ప్రవర్తన అనుబంధాలకు, ఆప్యాయతలకు ఎంత విలువనిచ్చాయి, వాటిని తను ఎంత నిలబెట్టుకున్నాడో స్ఫురణకు తెచ్చుకోవాలి. తన వర్తన ఇతరుల మనస్సులనేమైనా అకారణంగా గాయపరిచిందేమో తరచి చూసుకోవాలి. వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థక మవుతుంది. ఇక్కడ పరీక్ష పత్రం తయారు చేసేది, సమాధానాలు రాసేది మనమే. దీనితో విద్యార్థి పాత్ర ఉపాధ్యాయుని పాత్రగా మారుతుంది. ఇప్పుడు పరీక్షాధికారిగా వీటి మంచి చెడులను విశ్లేషించాలి. మంచికి మురిసిపోతూ మనల్ని మనమే ప్రశంసించుకో కూడదు. మంచిని చూసినంత బాగా, నిశితంగా లోపాలను చూడాలి. నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించగలగాలి. ఆ ఫలితాలను లోతుగా చూసి, ఒక నిజమైన, ఖచ్చితమైన మదింపు వేసుకోవాలి. అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకునే వివేచన కావాలి. ఇక్కడ బేషజాన్ని, ఆహాన్ని విడిచి తప్పులను దిద్దుకునే సంస్కారం అలవరుచుకోవాలి. పెద్దలు, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి. విద్యార్థి తన విద్యాభ్యాసకాలంలో రాసే పరీక్షలు కొన్నే ఉంటాయి. కాని మనం జీవితాంతం మన జీవితాన్ని పరీక్షకు గురి చేయాల్సిందే. సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిందే. సోక్రటీస్ చెప్పిన మాటల సారమిదే. తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతయ్యలు ఉపాధ్యాయులు ఈ శోధన తత్వాన్ని పిల్లలు అలవాటు చేసుకునేలా చెయ్యాలి.ఈ శోధన మనిషి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదం చేస్తుంది. కొందరు వ్యక్తులకు ఈ శోధన చిన్నతనం నుండే సహజంగా ఉంటుంది. ఆ శోధనా దృష్టి కొందరిలో అతి చిన్న వయస్సులోనే ఏర్పడి చక్కని రూపు దాల్చి ఉన్నత పథంలో పయనం చేసి మొత్తం మనవాళికి దాని ఫలితాలను అందిస్తుంది. వారు చిర స్మరణీయులవుతారు. ఈ శోధనాతత్వం ప్రతి ఒక్కరికీ అవసరం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, శాస్రవేత్తలకు, నాయకులకు చాలా అవసరం. ఎప్పటికప్పుడు తాము చేసిన పనిని, దానిలోని తప్పుల్ని తెలుసుకుని తమను తాము నూతనంగా ఆవిష్కరించుకుంటారు. సోక్రటీస్ అన్న మాటలలో పరిశీలన, తార్కికత, ఉత్సహం, ఆధ్యాత్మికత పెనవేసుకున్నాయి. ప్రశ్నించే, శోధించే గుణాలు ఉన్నాయి. వృత్తి జీవితంలోనూ ఒక ఉద్యోగి, రచయిత, కళాకారుడు తమ కృషి లేదా పని తీరును సమీక్షించు కోవడమూ పరీక్షే. జీవితాన్ని ఎంత నిశితంగా పరీక్షలకు గురి చేస్తే అంతగా మన వ్యక్తిత్వం సార్థకమవుతుంది. – లలితా వాసంతి -
లోపలి శత్రువు
ప్రతి మనిషికీ అంతరంగంలో ఆరుగురు శత్రువులు ఉంటారని చెబుతారు. ఆ శత్రువును ఓడించి అదుపులో పెట్టగలిగినప్పుడు ఆ మనిషికి పురోగతి సాధ్యమవుతుంది. అదుపులో పెట్టలేకపోతే పతనం తప్పదు. ఇది మనకు చిరకాలంగా వినిపిస్తున్న పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేవి విడివిడిగా వ్యక్తులకు ఉండే ఆరుగురు అంతః శత్రువులు. వీటినే అరిషడ్వర్గాలు అంటున్నాము. వ్యక్తులపై కాకుండా సమూహాలపై దాడి చేసే అంతః శత్రువులు కూడా ఉంటారు. ఈ శత్రువులు సామాజిక విలువల రూపంలో కూడా ఉండవచ్చు. కట్టుబాట్ల రూపంలో ఉండవచ్చు. ఆచార సంప్రదాయాల రూపంలో కూడా ఉండవచ్చు. ఈ సంప్రదాయాలు మన మెదళ్లలో తిష్ఠ వేసుకొని ఆలోచనలను తమ గుప్పెట్లోకి తీసుకుంటూ ఉండవచ్చు. సమాజం గతిశీలమైనది. నిరంతర చలనం దాని స్వభావం. వస్తుగత మార్పులను ఎప్పటికప్పుడు అది ఆహ్వానిస్తూనే ఉంటుంది. సామాజిక చైతన్యాన్ని శాశ్వత విలువలతో, కట్లుబాట్లతో నియంత్రించడం సాధ్యం కాదు. ఒకప్పుడు సదాచారాలు అనుకున్నవి కాలక్రమంలో దురాచారాలుగా పరిగణించవచ్చు. అటువంటి దురాచారాలను క్రమానుగతంగా మన సమాజం తొలగించుకుంటూ పురోగమిస్తున్నది. అట్లా తొలగించుకోలేక మిగిలిపోయిన దురాచారాలే సమాజ వికాసానికి ప్రతిబంధకాలవుతున్నాయి. కాలానుగుణమైన మార్పుల్ని ఆహ్వానించడం ఒక పురోగామి సూత్రం. అటువంటి మార్పులు మన ఆలోచనల్లో రావాలి. మనం ఏర్పరచుకున్న చట్టాల్లో కూడా రావాలి. మొన్న ఒక అబార్షన్ సంబంధిత కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం చెప్పింది ఇదే. అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడం మహిళలకు ఉండే తిరుగులేని హక్కుగా సమున్నత న్యాయస్థానం గుర్తించింది. ఇది వైవాహిక స్థితిగతులతో సంబంధం లేకుండా మహిళలందరికీ వర్తిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మనదేశంలో పెళ్లి కాకుండానే గర్భం దాలుస్తున్న బాలికలు, యువతుల సంఖ్యకు లెక్కలేదు. ఇటువంటి అవాంఛిత గర్భాలకు వారినే బాధ్యులుగా చేయటం దుర్మార్గం. తాము ఎదిరించలేని వారు, తమ వారు అనుకున్న వారి అఘాయిత్యాల బారిన పడుతున్న యువతులు ఎంతో మంది ఉంటున్నారు. కామాంధుల అత్యాచారాలకు గురవు తున్న వారు కూడా ఎంతోమంది ఉంటున్నారు. వీరే కాదు, వ్యక్తిగత కారణాల రీత్యా వివాహానికి దూరంగా ఉండదలచిన వారు, విడాకులు తీసుకున్న వారు కూడా చాలామంది ఉంటారు. ఇష్టపూర్వకమైన కలయికలు చట్టవిరుద్ధం కాదని గతంలోనే న్యాయస్థానం తీర్పు చెప్పింది. కలయిక చట్టవిరుద్ధం కానప్పుడు గర్భస్రావం మాత్రం ఎట్లా చట్టవిరుద్ధమవుతుంది? ఈ వైరుద్ధ్యాన్ని సుప్రీంకోర్టు తొలగించింది. పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన స్త్రీలకు పునరుత్పాదక హక్కులనేవి సహజ హక్కులు. ఈ సత్యాన్ని న్యాయస్థానం గుర్తించినట్లయింది. మన న్యాయస్థానాలు అప్పుడప్పుడు ఇటువంటి ప్రగతి శీలమైన తీర్పులనివ్వడం ద్వారా సామాజిక వికాసానికి దోహదం చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలోనే అమెరికా సుప్రీంకోర్టు ఇదే విషయంలో భిన్నమైన తీర్పు చెప్పిన నేపథ్యంలో మన సుప్రీం తీర్పు గర్వకారణం. అయితే మన న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో సామాజికాంశాలకు సంబంధించి ప్రగతి నిరోధకమైన తీర్పుల్ని ఇవ్వకపోలేదు. న్యాయమూర్తులు కూడా సమాజంలో భాగమే కనుక సామాజిక విలువలుగా చలామణిలో ఉన్న భావజాల ప్రభావం వారిపై కూడా ఉండవచ్చు. పితృస్వామిక వ్యవస్థ భావజాల ప్రభావం నుంచి చాలా సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా తప్పించు కోలేకపోతున్నారు. పదేళ్ల కిందట సుప్రీంకోర్టులోనే ఒక విడాకుల పిటిషన్ మీద ఇచ్చిన తీర్పు సంచలనం కలిగించింది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా సరే భర్త బదిలీపై వెళ్ళినప్పుడు భార్య తన ఉద్యోగాన్ని వదిలేసైనా సరే వెళ్లాలని కోర్టు చెప్పింది. సీతాదేవి శ్రీరాముడిని అనుసరించి వెళ్లినట్లు భార్య కూడా భర్తను అనుసరించి వెళ్లాలని కోర్టు అభిప్రాయ పడింది. అంతేకాదు, భార్యల సంపాదనను ‘లిప్‌స్టిక్ మనీ’గా కూడా పోల్చింది. 2018లో కేరళ హైకోర్టులో మరో న్యాయమూర్తి ఒక తీర్పును ఇస్తూ చేసిన వ్యాఖ్యానం మరింత దిగ్భ్రాంతికరంగా ఉన్నది. భార్యకు ఉండవలసిన లక్షణాలను చెప్పడానికి ఆయన ఒక సంస్కృత∙శ్లోకాన్ని ఉదహరించారు. పితృస్వామిక భావజాలానికి పరాకాష్ఠ ఈ శ్లోకం. బాగా పాపులర్. పురుషుల్లో చాలామందికి నచ్చుతుంది కూడా! ‘కార్యేషు దాసీ, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రి...’! భార్య చూడటానికి లక్ష్మీదేవిలా ఉండా లట! భర్తకు దాసి లాగా సేవ చేయాలి. మంత్రిలా సలహా లివ్వాలి. అమ్మలా తినిపించాలి. రంభలా శయనించాలి. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉండాలి. పురుషాధిక్య సమాజం కనుక పురుషుని కోణం నుంచి, కోర్కెల నుంచి అల్లిన శ్లోకం బాగానే ఉన్నది. కానీ దీన్నే తిరగేసి స్త్రీల కోణం నుంచి కొత్త శ్లోకం అల్లితే? తమ పురుషునిలో స్త్రీ కోరుకునే లక్షణాలపై పరీక్ష పెడితే ఎంతమంది పురుష పుంగవులు పాస్ మార్కులు తెచ్చు కోగలరు? చెప్పడం కష్టం. ఇటువంటి కాలం చెల్లిన మౌఢ్యాన్ని సమాజం వదిలించుకోలేకపోతే ఇప్పుడు మనకు అవసరమైన పురోగతిని సాధించటం సాధ్యం కాదు. అండపిండ బ్రహ్మాండమైన విశ్వంలో భూగోళమే ఒక పిపీలికం. మన పిపీలికం ఉన్న పాలపుంత ఈ చివరి నుంచి ఆ చివరవరకు కాంతి వేగంతో ప్రయాణం చేస్తే లక్ష సంవత్సరాలు పడుతుందట! ఈ పాలపుంతను పోలిన గెలాక్సీలు విశ్వంలో వందల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నరజాతి సాధించిన శాస్త్ర సాంకేతిక ప్రతిభ ఎక్కడున్నట్టు? విశ్వ రహః పేటికా విపాటన లక్ష్యం సాధించేది ఎప్పుడు? భూగోళంలో తన చరిత్రను తాను ఇప్పటికీ మానవుడు పూర్తిగా ఆవిష్కరించలేదు. క్రీస్తు పుట్టిన తర్వాత రెండు వేల యేళ్లు, అంతకుముందో వెయ్యేళ్లు తప్ప అంతకుమించి మనకున్నది అరకొర జ్ఞానమే. ఎన్నో మహో న్నతమైన నాగరికతలు ఎందుకు అంతరించాయో తెలియదు. ఆ నాగరికతల పూర్తి వివరాలూ తెలియవు. మూడున్నర వేల ఏళ్లకు పూర్వమే మహిళలకు సురక్షితమైన గర్భస్రావ విధానాలు ఎటువంటి వివక్ష లేకుండా అందుబాటులో ఉన్నాయని ఆధారాలు కూడా ఈజిప్టులో దొరికాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు మనం సుప్రీంకోర్టు తీర్పును గొప్ప ముందడుగుగా వర్ణించుకునే దుఃస్థితిలో ఉన్నాము. ఎటువంటి అరమరికలు, విభేదాలు లేనప్పుడే, ప్రజలం దరూ ఐక్యమైనప్పుడే, విజ్ఞానవంతులైనప్పుడే మానవజాతి శాస్త్ర సాంకేతిక పురోగతి సాధించగలుగుతుంది. కానీ మతాన్ని సంకుచితంగా అన్వయించి, మౌఢ్యంగా అనువదించి విసురు తున్న కత్తులతో, పారిస్తున్న నెత్తురుతో నరజాతి శత్రు శిబిరాలుగా విడిపోతున్నది. మనదేశంలో కులోన్మాదం కలిగిస్తున్న నష్టం ఇంతా అంతా కాదు. వీటితో పాటు ఇంకా మన మెదళ్లలో తిష్ఠవేసిన పితృస్వామిక భావజాలం సగం జనాభాలోని ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చంపేస్తున్నది. ఈ పితృస్వామిక భావజాలం ఓ సైలెంట్ కిల్లర్. మతాలు, కులాలు, దురాచారాలు చేసిన నష్టం కంటే ఎక్కువ నష్టాన్ని నిశ్శబ్దంగా చేసుకుపోతున్నది. అభ్యుదయవాదులు, విప్లవకారు లుగా చెప్పుకునే వాళ్లు కూడా దీని కనికట్టు పట్టులో చిక్కుకుంటు న్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఇవ్వవచ్చు. మన టెలివిజన్లలో వచ్చే కార్యక్రమాల్లో చెత్త కార్యక్రమాలు కోకొల్లలు. సకుటుంబ సపరివార సీరియళ్ల పేరుతో కొన్ని సీరియళ్లు బోలెడంత సామాజిక కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఇన్ని చెత్తల్లో ఒక చెత్త ‘బిగ్ బాస్’. కానీ మన అభ్యుదయవాదుల టార్గెట్ మాత్రం ‘బిగ్ బాస్’ ఒక్కటే. ఎందుకంటే అందులో ఓ పదిమంది అమ్మాయిలు, ఓ పదిమంది అబ్బాయిలు కొంత కాలం పాటు కలిసి ఉంటారట! ఎంతో పరిణతి పొందిన యువతీ యువకులు వీరు. చదువుకున్న వాళ్ళు, స్వతంత్రంగా జీవన గమనాన్ని సాగిస్తున్న వారు. వాళ్ళంతా కలిసి కొన్ని రోజులపాటు ఒకే ఇంట్లో ఉండి ఆటలాడినంత మాత్రాన ఏదో ప్రళయం ముంచుకొస్తుందట! ఆకాశం కుంగిపోతుందట! అగ్ని పర్వతాలు బద్దలవుతాయట! మన సంస్కృతీ సంప్రదాయా లను ఈ కార్యక్రమం మంటగలుపుతున్నదని విమర్శించేవాళ్లు ఉన్నారు. ఏ సంస్కృతిని? కార్యేషు దాసి సంస్కృతినేనా? అది మంటగలిస్తేనే మానవజాతి విముక్తి సాధించగలుగుతుంది. ‘బిగ్‌బాస్’ అనేది సమాజానికి పనికి వచ్చే గొప్ప కార్యక్రమం కాకపోవచ్చు. అంతమాత్రాన అందులో పాల్గొం టున్న యువతీ యువకుల క్యారెక్టర్‌ను దెబ్బతీసే కామెంట్లు చేయడం న్యాయం కాదు. వాళ్ల మీద వేస్తున్న నిందలు అమానుషం. ముఖ్యంగా చాలామంది యువతులు ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని, ఎన్నో మూతివిరుపుల్ని అధిగమించి స్పాట్లైట్లోకి దూసుకొస్తున్నారు. సమాన స్థాయి కోసం ప్రపంచం మీదకు దండెత్తి వస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో, నవ చైతన్యంతో కదం తొక్కుతూ వస్తున్నారు. వీళ్ళూ అందులో భాగమే! వీలైతే స్వాగతిద్దాం. కాకపోతే చచ్చుబడిన మోకాళ్ళను అడ్డం పెట్టకుండా పక్కకు తప్పుకుందాం. మహిళా సాధికారత సాధ్యం కాకుండా ముందు ముందు మరే గొప్ప నాగరికత నిర్మాణం కాబోదు. ఆ సాధికారత సాధ్యం కావాలంటే పితృస్వామిక భావజాలాన్ని ఓడించక తప్పదు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
6 లక్షల జీతం.. ప్రేమించి పెళ్లాడి.. ఆఖరికి విడాకులు? అసలు తెలివి అంటే?
ఆమె ఐఐఎంలో ఎంబీఏ చేసి క్యాంపస్ ఇంటర్వ్యూలో నెలకు ఆరు లక్షల జీతం పొందే ఉన్నతోద్యాగాన్ని సాధించింది. ఉద్యోగం వచ్చాక ఒక అబ్బాయిని రెండేళ్లపాటు ప్రేమించింది. తల్లితండ్రులను ఒప్పించి పెళ్లిచేసుకుంది. పెళ్ళయాక ఆరునెలల్లో విడాకులు తీసుకొంది. అప్పటికి తాను నాలుగు నెలల గర్భవతి. అబార్షన్ చేయించుకొని విడాకులు తీసుకొన్న ఆమె ఇప్పుడు డిప్రెషన్లో ఉంది. ఇక జీవితంలో పెళ్లిచేసుకోను అంటోంది . మరో చోట మరో అమ్మాయి. అమెరికాలో అత్యున్నత సంస్థలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అటుపై పెద్ద ఉద్యోగం సాధించింది. ఈమె సంపాదనపై కన్నేసిన ఒక యువకుడి ప్రేమ వలలో చిక్కి నరకయాతన అనుభవించి ఎలాగో ఒకలా బయటపడింది . మరో చోట ఐఐటీ చదివే విద్యార్ధి యూట్యూబ్ వీడియోలు చేస్తూ దానికి ఆదరణ లేదని (మరి కొన్ని కారణాలు) ఆత్మహత్య చేసుకొన్నాడు. పెద్దగా చదువుకోని వారు కూడా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సక్సెస్ అవుతున్నారు. మరి.. నువ్వు చదివే చదివేంటి ? చేస్తున్న వీడియోలు ఏంటి ? అంతకు మించి వీడియోలకు జనాదరణ ఎలా పెంచుకోవాలో తెలియకపోవడం.. పోనీ రాలేదు. అదే జీవితం అనుకొని తనువు చలించడం. ఏంటిది ? లక్షమంది పోటీ పడితే వందమందికి కూడా సీట్ దక్కని ఐఐటీ, ఐఐఎం లాంటి సంస్థల్లో సీట్ సాధించిన వారు నిస్సందేహంగా తెలివైన వారే ! కానీ రెండేళ్లు ప్రేమించినా అబ్బాయి తత్త్వం అర్థం చేసుకోలేని బేలతనం.. ఒకసారి అబార్షన్ అయితే అటుపై పుట్టే పిలల్లకు మానసిక వైకల్యం వచ్చే ప్రమాదం పెరిగిపోతుంది అని తెలుకోలేని అజ్ఞానం. అవతలి వాడు ప్రేమిస్తున్నది తన జీతాన్ని.. తనకు కంపెనీ ఇచ్చిన షేర్లను అని తెలుసుకోలేని అమాయకత్వం.. ఏంటివన్నీ? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్, మాథ్స్ లాంటి సబ్జెక్టులలో నైపుణ్యం సాధిస్తే అకాడమిక్ లేదా డొమైన్ ఇంటలిజెన్స్ అంటారు. సంగీతం లో పట్టుంటే మ్యూజిక్ ఇంటలిజెన్స్.. భాషపై పట్టుంటే లింగ్విస్టిక్ ఇంటలిజెన్స్. శ్రీదేవి. ఒకనాటి యువకుల కలల రాణి. అద్భుత నటి. కానీ అదివరకే పెళ్ళైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొంది. అనూహ్య పరిస్థితుల్లో లోకాన్ని వీడి వెళ్లిపోయింది. ఇక మరో ప్రముఖ నటి సావిత్రి ఎలా మోసపోయిందో మహానటి సినిమా పుణ్యమా అని చాలామందికి తెలిసింది. తెలివైన వారు ప్రతిభావంతులు ఇలా మోసపోతారెందుకు? చాలా మందికి అర్థం కాని విషయం ఒకటుంది. తెలివంటే కేవలం పాఠ్యఅంశాలపై పట్టుసాధించి మార్కులు, ర్యాంకులు కొట్టడం కాదు . మీకందరకు ఒక కాలేజీ మిత్రుడుంటాడు. కాలేజి ఎగ్గొట్టి జులాయిలా బలాదూర్ తిరిగేవాడు. కాలేజీలో పుస్తకాలతో కుస్తీ పట్టే వారెందరో ఇప్పుడు సర్కారీ క్లర్కులుగా ఉంటే.. మీరనుకున్న ఆ జులాయి కాంట్రాక్టర్‌గానో, బిజినెస్మేన్గానో అవతరమెత్తి కోట్లు కూడబెట్టివుంటాడు. కేవలం లక్ లేదా పలుకుబడి అనుకొంటే అది మీ అమాయకత్వం అవుతుంది. ఆలోచించండి. ఇదెలా సాధ్యం ? సోషల్ ఇంటలిజెన్స్.. సామాజిక తేలితేటలు.. ఎమోషనల్ ఇంటలిజెన్స్.. భావోద్వేగ తెలివితేటలు. ఈ రెండూ లేకపోతే ఎన్ని మార్కులు వచ్చినా, ఎంత సంపద ఉన్నాఅన్ని బండి సున్నాయే. ఎలాగంటారా ? మార్కులు, జీతం, సంపద ఇవన్నీ లక్షల్లో. సామజిక తేలితేటలు జీరో. ఇప్పుడు ఈ జీరోతో ఆస్తిని సంపాదనను గుణించండి. ఏమొచ్చింది? బండి సున్నా. అవునా కదా ? సామాజిక తెలివితేటలు ఉంటే ఆ సంఖ్యను ఆస్తి / జీతంతో గుణించండి. అనేక రెట్లు పెరుగుతుంది. సామాజిక తేలితేటలు లేక మలిమొఘల్ చక్రవర్తులైన ఫారూఖ్ షియార్, రఫీ ఉద్ డారాజ్, రఫీ ఉద్దీన్ లాంటి వారు సయ్యిద్ సోదరుల చేతిలో చిక్కి విలవిలలాడి, చరిత్ర మరుగయ్యారు. ఎమోషనల్ ఇంటలిజెన్స్ లేక పెద్ద సినిమాల్లో హీరోగా నటించినా అటుపై అవకాశాలు రావడం లేదని ఆత్మహత్య చేసుకొన్న వారొకరు. డిప్రెషన్ లో మరొకరు. దీర్ఘకాలం కోమా.. ఉరి.. ఇలా మరణాన్ని పొందినవారు ఇంకొందరు. తాత సంపాదించిన ఆస్తిని తగలెట్టేసి వ్యాపారాన్ని దివాళా తీయించిన వారు ఎందరో ! ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది ఈ వ్యక్తులు ఎవరు అని కాదు. ఎమోషనల్ సోషల్ ఇంటలిజెన్స్‌ను పిలల్లకు ఎలా నేర్పాలి? ఇందులో స్కూల్ , కాలేజీ పాత్ర ఏంటి ? తల్లితండ్రులుగా మన పాత్ర ఏంటి అని? ఆయన నాలుగో పెళ్ళానికి మూడో భర్త ఎవరు? ఆ వీడియోలో ఆమె ఒయ్యారాన్ని ఒలక పోసిందా? ఇలాంటి మనకు అవసరం లేని విషయాలపై మీరు ఆసక్తి ప్రదర్శిస్తూ సమయాన్ని వినియోగిస్తుంటే.. మీ పిలల్లు ఇంటర్నెట్ చీకటి ప్రపంచంలో దొరికే వీడియోలకు బానిసలై మీ చేయి దాటి పోతారు. ఆవు/ఎద్దు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పిల్లలకు సోషల్ ఇంటలిజెన్స్ ఎమోషనల్ ఇంటలిజెన్స్ ఎలా నేర్పాలో ఆలోచిస్తూ ఉండండి. - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
వ్యక్తిత్వ వికాసం పై నాట్స్ అవగాహన సదస్సు
ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా వ్యక్తిత్వ వికాసంపై 2022 మే 26న వెబినార్ నిర్వహించింది. నాట్స్ టెంపాబే విభాగం చేపట్టిన ఈ వెబినార్‌లో ఛేంజ్ సంస్థ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ స్వామి మాట్లాడుతూ... వ్యక్తిగత జీవితాల్లో చిన్న చిన్న మార్పులు ఎలాంటి పెద్ద ఫలితాలు ఇస్తాయనేది చక్కగా వివరించారు. తాను రూపొందించిన క్లామ్ ప్రోగ్రామ్ ద్వారా జీవితాన్ని ఎలా ఆనందమయంగా మార్చుకోవచ్చనేది అంశాల వారీగా ఆయన తెలిపారు. వాస్తవాలను గ్రహించినప్పుడే అజ్ఞాన అంధకారం తొలిగిపోయి జీవితంలో కొత్త కాంతులు వస్తాయన్నారు. మనిషికి ఆధ్యాత్మికత ప్రశాంతతను అందిస్తుందని తెలిపారు. మన శక్తికి మనమే పరిమితులను సృష్టించుకోవడం.. ఓటమి వస్తే కుంగిపోవడం.. లాంటి వ్యతిరేక భావనల నుంచి బయటపడేలా గోపాలకృష్ణ స్వామి దిశా నిర్దేశం చేశారు. ఈ వెబినార్‌లో పాల్గొన్న సభ్యుల సందేహాలను గోపాలకృష్ణ నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో కీలకపాత్ర పోషించిన డాక్టర్ నంద్యాల మల్లికార్జున, రమేష్ కొల్లికి నాట్స్ నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది. ఈ వెబినార్‌కు మద్దతు ఇచ్చిన నాట్స్ బోర్డ్ ఛైర్ విమెన్ అరుణగంటి, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్లు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ నెట్టెం, నాట్స్ (పైనాన్స్ అండ్ మార్కెటింగ్ ) వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు, వెబ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ సుదీర్ మిక్కిలినేని, టెంపాబే చాప్టర్ కోఆర్డినేటర్, ప్రసాద్ అరికట్ల, చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేష్ బొజ్జా తో పాటు కోర్ టీమ్ కమిటీ సభ్యులు ప్రభాకర్ శాకమూరి, సుధాకర్ మున్నంగి, అనిల్ ఆరెమండ, నవీన్ మేడికొండ, శ్రీనివాస్ బైరెడ్డి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, రమేష్ కొల్లి, రవి తదితరులు ఈ వెబినార్ విజయవంత కావడంలో తమ వంతు సహకారం అందించారు. -
Shanta Balu: పూనా పవార్.. వయసు 86.. అయినా తగ్గేదేలే.. ధైర్యంగా..
అమ్మాయిలు ధైర్యంగా ముందడుగు వేయాలని, స్వీయరక్షణలో శిక్షణ పొందినప్పుడు ఆత్మస్థయిర్యం దానంతట అదే పెంపొందుతుందని పర్సనాలటీ డెవలప్మెంట్లో భాగంగా నిపుణులు చెప్తున్నారు. మహిళల రక్షణ కోసం పని చేసే విభాగాల ప్రముఖులందరూ ఈ విషయంలో అమ్మాయిల తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తూనే ఉన్నారు. సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులను పాఠశాల స్థాయిలోనే ప్రవేశ పెట్టాలనే సూచనలు కూడా చేస్తున్నారు. అయితే వీటన్నింటి గురించి ఏ మాత్రం తెలియని ఓ మామ్మ శాంతాబాలు పవార్ తాను నివసించే పూనా నగరంలో అమ్మాయిలకు కర్రసాములో శిక్షణనిస్తోంది. శాంతాబాలు పవార్ వయసు 86. మహారాష్ట్రలో శరద్ పవార్ ఎంత ఫేమసో పూనాలో శాంతాబాలు పవార్ అంత పాపులర్. దాదాపు ఎనభై ఏళ్లుగా ఆమె పూనా వీధుల్లో విన్యాసాలు చేస్తోంది. ఎనిమిదేళ్ల వయసు నుంచి కర్రసాము, తాడు మీద నడవడం వంటి విన్యాసాలు చేస్తూ పెరిగింది. ఇప్పటికీ ముఖం మీద నుంచి మాస్కు తీసి చీరకట్టుకు దూర్చి, ఆమె రెండు చేతుల్తో కర్రలు పట్టుకుంటే గాలి పక్కకు తప్పుకుంటుంది. ఆమె చేతి ఒడుపు తగ్గలేదు, వేగమూ తగ్గలేదు. ఒకప్పుడు వీధి ప్రదర్శనకు మాత్రమే పరిమితం అయిన కళ... ఇప్పుడు పూనాలోని ఆడపిల్లలకు స్వీయరక్షణ విద్యగా మారింది. వారియర్ ఆజి దగ్గర శిక్షణ తీసుకుంటే తమ ఆడపిల్లల రక్షణ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, భరోసా ఉంటుందని భావిస్తున్నారు తల్లిదండ్రులు. శాంతాబాలు అజి రెండేళ్ల కిందట కరోనా సమయంలో ప్రారంభించిన శిక్షణకేంద్రం ఇప్పుడు ఆడపిల్లల కర్రసాముతో ధైర్యవికాసం పొందుతోంది. అప్పట్లో సోనూసూద్, రితేశ్ దేశ్‌ముఖ్ వంటి సెలబ్రిటీలు శాంతా బాలూ పవార్‌ను అభినందనలతో ముంచెత్తారు. ఆమె చేతిలోని కర్రసాము యుద్ధవిద్య పూనా అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు ఇరవై మంది సభ్యులున్న ఆజి కుటుంబాన్ని పోషించడానికి ఆధారం అయింది. కరోనా కారణంగా ఆమె కొడుకులకు పని లేకపోవడంతో ఆమె కర్రసాముతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. ‘ఇంట్లో ఊరికే కూర్చోవడం నాకు నచ్చదు’’ అంటోంది శాంతాబాలు పవార్. అన్నట్లు ఈ వారియర్ ఆజీలో నటనాకౌశలం కూడా దాగి ఉంది. 1972లో హేమమాలిని, ధర్మేంద్ర నటించిన హిట్ మూవీ ‘సీత ఔర్ గీత’లో నటించింది. -
మీ అమ్మాయికి మంచిమార్కులు వస్తాయి!
కొండ ఎక్కాలంటే ఏం చెయ్యాలి?దేవుణ్ని మనసులో పెట్టుకోవాలి.అప్పుడు మెట్లు కనిపించవు. దీవెనలే కనిపిస్తాయి. జీవితంలో పిల్లలకు కష్టాలు.. కష్టమైన మెట్లు.ప్రతిసారీ తోడుగా మనం ఉండలేం. కానీ.. లక్ష్యసాధనలో ఆనందాన్ని వాళ్లకు చూపగలిగితే పరీక్షలు కనబడవు. మంచి మార్కులే కనిపిస్తాయి. సైకియాట్రిస్ట్ దగ్గర ఆ అమ్మాయి కూచుని ఉంది.పదహారేళ్లు ఉంటాయి. తోడుగా అమ్మా నాన్నా ఉన్నారు.‘ఏంటి ప్రాబ్లమ్?’ అడిగాడు సైకియాట్రిస్ట్.‘బాగా చదువుతుంది డాక్టర్. ఎమ్సెట్లో మెడిసిన్ ర్యాంక్ కొట్టాలని లక్ష్యం. కాలేజీలో స్లిప్ టెస్ట్‌లు, వీక్లీ టెస్టుల్లో తనే ఫస్ట్ ఉంటుంది. తనకో మంచి ఫ్రెండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి కూడా బ్రైట్ స్టూడెంటే. కాని ఈ మధ్య ఒకటి రెండు టెస్టుల్లో ర్యాంకులు రాలేదు. దాంతో విపరీతంగా ఏడ్వడం మొదలెట్టింది. కాన్ఫిడెన్స్ పోయింది. అది పక్కన పెట్టండి. ర్యాంకులు తనఫ్రెండ్కు వచ్చాయట. పాపం ఆ అమ్మాయిని శతృవుగా చూస్తోంది. దూరం పెడుతోంది. అంతా గందరగోళంగా తయారైంది బిహేవియర్. మీరే హెల్ప్ చేయాలి’సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయివైపు చూశాడు. ‘ఏమ్మా... ఏంటి నీ సమస్య’ఆ అమ్మాయి వెక్కివెక్కి ఏడ్వడం మొదలెట్టింది.‘నా పని అయిపోయింది డాక్టర్. ఇక నాకు ర్యాంకులు రావు. నేను మెడిసిన్ చేయనట్టే. రెండు మూడు టెస్టుల్లో నాకు మంచి మార్కులు రాలేదంటే ఇక ఎప్పటికీ రావనేగా అర్థం’...సైకియాట్రిస్ట్ ‘ఏం పిల్లలో’ అన్నట్టుగా నిశ్వాస విడిచాడు.‘సరే అయితే నీకు ఇంకో అమ్మాయి కథ చెబుతా. నా పేషెంటే. అది విని నీకేం అనిపించిందో చెప్పు’ అన్నాడు. సైకియాట్రిస్ట్ చెప్పడం మొదలుపెట్టాడు. ∙∙ ఇది నీలవేణి కథ.నీలవేణిది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. చిన్నప్పుడు అందరిలాగే ఆడుతూ పాడుతూ ఉండేది. అమ్మా నాన్నలతో హాయిగా ఉండేది. కాని ఆ అమ్మాయికి ఎనిమిదేళ్ల వయసు వచ్చినప్పుడు సడన్‌గా ఒక ప్రమాదంలో అమ్మా నాన్నా చనిపోయారు. చిన్న పిల్ల. ఏమీ తెలియని వయసు. లాలించే అమ్మ ఆడించే నాన్న ఇక కనపడరు అనంటే ఆ వయసులో ఎంత భయంగా ఉంటుంది. ఎంత భీతిల్లేలా ఉంటుంది. కాని నీలవేణి అంత దుఃఖాన్ని తట్టుకొని నిలబడింది. అమ్మా నాన్నలు లేకపోయినా అమ్మమ్మ, తాతయ్య ఉన్నారనుకుంది. అమ్మమ్మ, తాతయ్యలు కూడా ఆ పాపను అంతే ప్రేమగా చూసుకున్నారు. నీలవేణికి చదువు పెద్దగా రాలేదు. కాని నీలవేణికి జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదల. చదువు రాలేదని ఆ అమ్మాయి కుంగిపోలేదు. నిరాశ పడలేదు. ఆ అమ్మాయిది గట్టి వొళ్లు. చరుగ్గా ఉంటుంది. అందుకని ఆటల్లోకి వెళ్లింది. లాంగ్‌జంప్ తన ఫేవరెట్ గేమ్. పల్లెటూరి స్కూల్లో లాంగ్‌జంప్‌లో రాణిస్తున్న నీలవేణిని హైస్కూల్లో ఒకరిద్దరు టీచర్లు ఎంకరేజ్ చేశారు. జిల్లాస్థాయి ప్లేయర్ అయ్యింది. ఊళ్లో గుర్తింపు పొందింది. అందరూ మెచ్చుకునేవారు.∙∙ ‘చూశావా? నీలవేణి ఎక్కడా కుంగిపోకుండా ఎలా సెకండ్ చాన్స్ తీసుకొని పైకి వచ్చిందో’ అన్నాడు సైకియాట్రిస్ట్.ర్యాంకు రాని అమ్మాయి తల ఊపింది.‘కథ ఇంకా అయిపోలేదు’ అన్నాడు సైకియాట్రిస్ట్.∙∙ నీలవేణి కథ కొనసాగింపు.నీలవేణి ఆ ఊళ్లోనే ఉన్న జూనియర్‌కాలేజీలో చేరింది. అలాంటి కాలేజీల్లో చదువు సరిగ్గా రాకపోయినా ఆటల్లో రాణించే మగపిల్లలు ఉంటారు. అలాంటి అబ్బాయే రాజు. అతడు లాంగ్‌జంప్ కోసం వచ్చే నీలవేణిలోని టాలెంట్‌ను గమనించాడు. అదే కాలేజ్‌లో ఉన్న ఫిజికల్ డైరెక్టర్‌తో కలిసి నీలవేణిని ఎంకరేజ్ చేయడం మొదలెట్టాడు. లాంగ్‌జంప్‌తో పాటు హైజంప్, పోల్జంప్, రన్నింగ్... అన్నింటిలోనూ నీలవేణి పార్టిసిపేట్ చేసేలా చేశాడు. నీలవేణి ఇప్పుడు స్టేట్‌లెవల్ అడపాదడపా నేషనల్ లెవల్ మెడల్స్ సాధించడం మొదలెట్టింది. ఇక భవిష్యత్తంతా నీలవేణిదే అనిపించే సమయం. సరిగ్గా ఆ సమయంలో ఊహించని సంఘటన. విజయవాడలో ఒక స్పోర్ట్స్ మీట్‌కు హాజరయ్యి తిరిగి ఊరికి వస్తుండగా రాజు, నీలవేణి ప్రయాణిస్తున్న షేర్ ఆటోను వెనుక నుంచి లారీ గుద్దింది. రాజు ఎడమ వైపున పొదల్లో పడగా నీలవేణి కుడివైపు రోడ్డు మధ్యలో పడింది. అప్పుడే వేగంగా వస్తున్న కారు ఆ అమ్మాయి కాళ్లను తొక్కేసింది.∙∙ వింటున్న అమ్మాయి ఉలిక్కి పడి చూసింది.సైకియాట్రిస్ట్ ఆ అమ్మాయి వైపు చూస్తూ నీలవేణి కథ కొనసాగించాడు. ∙∙ ఏ కాళ్లతోనైతే నీలవేణి ఇంత గుర్తింపు తెచ్చుకుందో ఏ కాళ్లతోనైతే తన భవిష్యత్తును నిర్మించుకుందో ఆ కాళ్లు తీసేయక తప్పదు అని డాక్టర్లు నిర్ణయించి నీలవేణి స్పృహలో లేని సమయంలో కాళ్లు తీసేశారు. స్పృహలోకి వచ్చాక పేషెంట్ షాక్‌లోకి వెళ్లకుండా బ్యాండేజీలతోనే కృత్రిమ రూపాన్ని చుట్టి కాళ్లు ఉన్నాయన్న భ్రాంతి సృష్టించారు. ఆరువారాల వరకు నీలవేణికి తనకు కాళ్లు లేవన్న సంగతే తెలియదు. ఒకరోజు తెలిసింది. భూమి ఆకాశాలు చీకటితో నిండిపోయాయన్న భావన వచ్చింది. అలాంటి స్థితి వస్తే ఎవరైనా కుంగిపోతారు. నీలవేణి కూడా కుంగిపోయింది. కాని ఆ ప్రమాదం కంటే పెద్ద దెబ్బ రాజు తీశాడు. అంతవరకూ పలకరించే కుర్రాడు, అంతవరకూ తోడు నిలుస్తాడనుకున్న స్నేహితుడు తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. ఇటు ఆ దెబ్బ అటు ఈ దెబ్బ... నీలవేణి తట్టుకొని నిలబడగలదా?కాని నిలబడింది. జీవితం అంటే అనూహ్యంగా ఉంటుందని, కాని మనం జీవితానికి లొంగ కుండా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉండాలని నమ్మింది. అందుకోసం ఆత్మస్థయిర్యం కోసం సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకుంది.నూరేళ్ల జీవితంలో ఇవాళ్టి ఘటనలు, రేపటి ఘటనలే మొత్తం జీవితం కాబోవని ఎన్నో అవకాశాలు ఊహించని మలుపులు మున్ముందు ప్రతి ఒక్కరికీ ఎప్పుడూ ఉంటాయని సైకియాట్రిస్ట్ చెప్పిన మాటలను మనసులోకి తీసుకుంది.ఆమె గురించి తెలిసిన వాళ్లందరూ ఆమెకు సాయం చేశారు. విదేశాల నుంచి కృత్రిమ కాళ్లు తెప్పించారు. ఆటల్లో పాల్గొనే వీలున్న ఆ కృత్రిమకాళ్లతో నీలవేణి మళ్లీ ప్రాక్టీసు మొదలెట్టింది. మొదట్లో కొంచెం కష్టమైంది. ఆ తర్వాత వీలైంది. నీలవేణి క్షణం కూడా ఆలస్యం చేయకుండా నిపుణుల పర్యవేక్షణలో తిరిగి ప్రాక్టీసు మొదలెట్టింది.కాళ్లు బాగుంటే ఆమెకు ఒలింపిక్స్‌లో పాల్గొనాలనే కోరిక ఉండేది.కాళ్లు పోయాక కూడా ఒలింపిక్స్‌లో పాల్గొనగలిగింది. కాకపోతే పారా ఒలింపిక్స్‌లో. ఆరు మెడల్స్ వచ్చాయి కూడా. ∙∙ సైకియాట్రిస్ట్ చెప్పడం ఆపి తన సెల్ఫోన్లో నుంచి నీలవేణి ఫొటో చూపించాడు. మెడలో మెడల్స్‌తో నవ్వుతూ ఉన్న నీలవేణి.‘కథ ఇంకా అయిపోలేదు. నీలవేణిని విడిచిపెట్టి వెళ్లిన రాజు తిరిగి వచ్చాడు. క్షమించమని కోరుకున్నాడు. ఇక ఎప్పటికీ నీలవేణి తోడు విడువనని చెప్పాడు. సాధారణంగా ఇంకో అమ్మాయి అయితే అతణ్ణి అసహ్యించుకునేది. కాని నీలవేణి మాత్రం– దివ్యాంగులను ఎలాగైతే ఎక్కువ ప్రేమతో చూడాలో తప్పు చేసినవారిని కూడా ఎక్కువ ప్రేమతో చూసి వారిని మంచి మార్గంలో పెట్టాలి అని అతణ్ణి యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు చెప్పు. నీ సమస్య ఒక సమస్యా. నీ పని అయిపోయినట్టేనా? నీలవేణిలాంటి వాళ్లను చూసి మనం ఎప్పుడూ పోరాడుతూ ఉండాలని సాటి స్నేహితులను వదిలిపెట్టకుండా ముందుకు వెళ్లాలని అనిపించడం లేదా’ అన్నాడు సైకియాట్రిస్ట్.మార్కులు రాని అమ్మాయి సిగ్గుపడుతూ తల ఆడించింది.నిటారుగా కూర్చుంది. ‘ఇంకో సిట్టింగ్’... అని తల్లి అంటూ ఉంటే ‘అక్కర్లేదు’ అని ఆ అమ్మాయే చెప్పింది.లేచి నిలబడుతూ ‘థ్యాంక్స్ అంకుల్. నీలవేణికి కూడా నా థ్యాంక్స్ చెప్పండి’ అంది కొంచెం నవ్వుతూ.సైకియాట్రిస్ట్ కూడా నవ్వుతూ తర్వాతి పేషెంట్ కోసం బెల్ నొక్కాడు. కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డాక్టర్ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్ -
మూర్తీభవించిన వ్యక్తిత్వవికాసం
ఆత్మీయం శ్రీకృష్ణుని రూపం నల్లటిది. కాని మనసు మాత్రం తెల్లనిది, స్వచ్ఛమైనది. బాల్యం నుంచి – ఆ మాటకొస్తే పుట్టకముందు నుంచే ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు? ఎన్ని సవాళ్లను అధిగమించాడు? కన్నతల్లిదండ్రులకు దూరమయ్యాడు. కడుపులో పెట్టుకుని కాపాడవలసిన మేనమామే శత్రువై సంహరింప చూసినా చలించక తామరాకు మీది నీటిబొట్టులా ఉన్నాడు. దేనికీ భయపడలేదు, ఎవరికీ లొంగలేదు. వెన్నుచూపలేదు. కార్యసాధన అంటే ఏమిటో చాటి చెప్పాడు. శరణన్న వారికి సదా రక్షణ వహించాడు. సహాయం కోరిన వారికి ఒట్టి చెయ్యి ఎప్పుడూ చూపించలేదు. మోసాన్ని మోసంతోనే జయించాలని, ముల్లును ముల్లుతోనే తీసివేయాలని, తగిన ఉపాయముంటే ఎంతటి అపాయం నుంచయినా బయట పడవచ్చునని రుజువు చేసి చూపాడు. అవసరమయిన చోట మహిమలు చూపాడు. యుద్ధంలో విజయం సాధించడానికి భుజబలమే కాదు, బుద్ధిబలం ఉంటే చాలునని కొన్ని అక్షౌహిణుల సేనను, రథ, గజ, తురగ పదాతి దళాలను కౌరవుల పరం చేసి, తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించి, వారిని విజయం వైపు నడిపించి నిరూపించాడు. అసలైన వ్యక్తిత్వ వికాసమంటే ఏమిటో గీత ద్వారా బోధించి చూపాడు. శ్రీకృష్ణుని లీలలు తెలుసుకోవడమే కాదు, ఆయన మంచితనాన్ని, ఉన్నత వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన చేసిన గీతాబోధను ఆకళింపు చేసుకోవాలి. అర్థం అయిన వాటిని వ్యర్థం చేయకూడదు. ఆచరణలో పెట్టగలగాలి. అప్పుడే మనం కృష్ణునికి ప్రియభక్తులమవుతాం. -
అలోచనల మీద అదుపు...
రమజాన్ కాంతులు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అన్నపానీయాలకు దూరంగా ఉంటూ ఉపవాస దీక్ష పాటిస్తారు. ఆకలిదప్పులతో ఉండటమే కాక అన్ని రకాల కోరికలను, వాంఛలను త్యజిస్తారు. చిత్తశుద్ధి్దతో, నిష్కల్మషంగా రోజా పాటించే వారికి దైవభీతి, జవాబుదారీతనం, సహనం, సద్గుణాలు అలవడతాయి, ఈ శిక్షణ రంజాన్‌కే పరిమితం కాదు. ఏడాది పాటు ఈ సద్గుణాలు సొంతం అవుతాయి. వ్యక్తిత్వ వికాసం వెల్లివిరుస్తుంది. ఉత్తమ వ్యక్తిత్వ వికాస పాఠాలు బోధించే ఉత్తమ గురువు లాంటిది రోజా. రంజాన్ నెలలో పాటించే రోజాలు సమాజంలోని బీదసాదల ఆకలి దప్పులను తెలుపుతుంది. తోటి వారి వ్యధాభరిత జీవితాన్ని కళ్లకు కడుతుంది. తోటి వారు, ఆనాథలు, అణగారిన వారి పట్ల మృదుత్వం అలవడుతుంది. తోటివారి శ్రేయాన్ని కాంక్షిస్తారు. వారి బాధల్ని, కష్టాల్ని తీర్చేందుకు పాటుపడతారు. – షేఖ్ అబ్దుల్ హఖ్ -
24న వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సు
వికారాబాద్ రూరల్: శ్రీ సత్యసాయి సేవాసమితి వికారాబాద్ శాఖ ఆధ్వర్యలో ఈనెల 24న స్థానిక జ్ఞానకేంద్రంలో సేవాసంస్థలోని సేవాదళ్ సభ్యులకు, ఇతర పౌరులకు వ్యక్తిత్వ వికాస అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు సేవాసమితి కన్వీనర్ డా.కె సత్యనారాయణగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న ఈ సదస్సులో చర్చనీయ అంశాల్లో భాగంగా శ్రీ సత్యసాయి అవతార తత్వం ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో సేవాసంస్థల పాత్ర, పట్టిష్టవంతమైన బాలవికాస్ నిర్మాణంలో భావినాయకుల పాత్ర, భక్తులు, కార్యకర్తలు, సత్యసాయి సంస్థలో కన్వీనర్ పాత్ర, సత్యసాయి అవతారంలో స్త్రీల పాత అనే అంశాలపై పున్నయ్య, ఫణీంద్రకుమార్, ప్రకాశ్‌రావు, వీఎస్ఆర్కే ప్రసాద్, సక్కుబాయి చంద్రకళ మాటాట్లాడుతారని ఆయన తెలిపారు. ఆధ్యాత్మిక విభాగంలో భాగంగా జిల్లాలో వ్యక్తిత్వ వికాస సదస్సుకు ప్రముఖ విద్యావేత్త హారతీద్వారకనాథ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారన్నారు. విద్యావేత్తలు, యువకులు, ఉపాధ్యాయులు, మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
పతంగులు... పర్సనాలిటీ డెవలప్మెంట్!
హ్యూమర్ ప్లస్ పతంగులను ఎగరేయడానికి మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు లేవు. ‘గాలిపటాలు - వ్యక్తిత్వ వికాసం’ అనే అంశమ్మీద గాలీపులాక న్యాయంగా ఒక పరిశీలన చేద్దాం. దాన్ని ఎగరేసేవాడు ఎంతో ఓపికనూ, ఒడుపునూ అభ్యసించాలి. చెట్టుకు గాలిపటం చిక్కుకుంటే... దాన్ని మళ్లీ జేజిక్కించుకోడానికి మనం దారంతో చేసే విన్యాసాలన్నీ... భవిష్యత్తులో ఏదైనా అంశం మీద చేయాల్సిన చర్చల గురించి చెబుతాయి. బేరసారాలు నెరపడానికి కావాల్సిన కౌశలాన్ని నేర్పుతాయి. ఇక చేతికి రాదని తెలిశాక... వీలైనంత తక్కువ దారాన్ని నష్టపోతూ విషయాన్ని ‘తెగగొట్టడం’ ఎలాగో తెల్పుతాయి గాలిపటాలు. గాలిపటాలతో లడాయి పెట్టడాన్ని ‘పేచీ’ అంటారన్నది చాలామందికి తెలిసిందే. దాంట్లో ఎన్నో వ్యూహాలుంటాయి. ఉదాహరణకు లడాయి తప్పనప్పుడు పటాన్ని పైనుంచి వచ్చేలా చేసి... దారాన్ని ధారాళంగా వదలడాన్ని ఢీల్ వదలడం అంటారు. కింది వైపు నుంచి దారాన్ని తీసుకొని దారాన్ని వేగంగా లాగడాన్ని ఖీంచ్కాట్ అంటారు. మనం ఏదైనా విషయాన్ని తేలిగ్గా వదిలేయాలా అన్నది ‘ఢీల్’ వ్యూహం. పట్టు పట్టి కట్ చేయాలా అన్నది ఖీంచ్కాట్ ఎత్తుగడ. ఈ ప్రణాళికా రచనా పద్ధతులను చిన్నప్పుడే నేర్పేది పతంగుల యుద్ధం. అంటే వ్యూహాలూ, ఎత్తుగడలూ లాంటివన్నీ మనకు గాలితో పెట్టిన విద్య అవుతాయి. గాలిపడగతో లడాయి చేసే ఈ యుద్ధంలో మన ప్రత్యర్థితో తలపడే సమయంలోనే మన చెరఖ్ పట్టుకుని ఉండే తోడు కూడా ఉండాలని పటం పాఠాలు పేర్కొంటాయి. గెలుపు లక్ష్యాన్ని మనమే ఛేదించాల్సి ఉన్నా... మన పక్షం వహించేందుకు ఆ తోడు తోడ్పడుతుందన్నది మనం నేర్చుకునే పాఠం. ఈ తోడు జీవిత భాగస్వామి కూడా కావచ్చు. చెరఖా పట్టినంత మాత్రాన పక్కవారిని మనకు గొడుగు పట్టే వారిగా చూడకూడదు. మన అడుగులకు మడుగులొత్తేవారుగా పరిగణించకూడదు. హీరో పక్కన ఉండే హీరోయిన్లాగానో లేదా హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌లో హీరోలాగానో లేదా కమెడియన్లాగానో తేలికగా చూడకూడదు. జీవితాంతపు తోడు అయితే నరకాసుర యుద్ధంలో సత్యభామ అనుకోవచ్చు. అదే జీవనకురుక్షేత్రంలోనైతే అర్జునుడి పాలిటి నారాయణుడని అనుకోవచ్చు. వాడు ఫ్లూటుకు బదులు చెరఖాను ధరించి ఉంటాడు. పింఛం లేని పామర పార్థసారథిలా అనునిత్యం తోడుంటాడు. పేచీలో ప్రత్యక్షంగా పాలుపంచుకోకుండా సలహాలిస్తుంటాడు. యుద్ధం గెలవడంలో తోడ్పడుతుంటాడు. జీవన భాగస్వామిని లేదా మిత్రులనూ మన సాన్నిహిత సహచరులనుకుంటే... వాళ్లు మన గెలుపు వాళ్ల గెలుపులా ఫీలవుతుంటారు. మన విజయాన్నీ వాళ్లూ ఓన్ చేసుకుంటారు. అదే గనక జరగకపోతే పతంగులు ఎరగేసేవాడే ‘కటీ పతంగ్’ అవుతాడు. అనగా తెగిన గాలిపటమై, తూలుతూ కిందికి పడిపోతాడు. ఇక కోటికి పడగెత్తడం అనే మాట ఎలాగూ ఉంది. కోటి సంపాదించలేకపోతే గాలిపడగ ఎగరేస్తే గాలికి పడగెత్తినట్లే కదా. ఇలా ఆలోచిస్తూ సంపదలు సమకూర్చుకోకపోయినా పర్లేదు. కేవలం గాలిపటాలు ఎగరేస్తే చాలు. ఈ జీవనసారం అంతా నింగియే హద్దుగా ఎగిరే గాలిపటం చేస్తున్న హితబోధ! ఆకాశంలోంచి చెరఖా వరకు కనిపించే దారపు ‘గీత’ బోధ!! - యాసీన్ -
లేడీసే లీడర్స్
యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్.. యువ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, వారి సాధికారతకు కృషి చేస్తున్న సంస్థ. దశాబ్దానికి పైగా నగరంలో సేవలందిస్తున్న ఎఫ్ఎల్ఓ (ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్)కు అనుబంధంగా నడుస్తోందీ వైఎఫ్‌ఎల్‌ఓ. పర్సనాలిటీ డెవలప్మెంట్, అవేర్నెస్, ట్రైనింగ్, బిజినెస్ కన్సల్టెన్సీ, నెట్వర్కింగ్ తదితర అంశాల్లో ఎప్పటికప్పుడు యంగ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ను అప్డేట్ చేస్తూ... వారి అభివృద్ధికి చేయూతనందిస్తోంది. దీనికి నూతన చైర్‌పర్సన్‌గా సామియా అలమ్‌ఖాన్ నియమితులయ్యారు. సిటీకి చెందిన ఈ యువ పారిశ్రామికవేత్త మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్. బ్యాంకింగ్ ప్రొఫెషనల్‌గా కెరీర్ ప్రారంభించి, ఐటీఈఎస్, కేపీఓ సెక్టార్స్‌లో ప్రభావవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం లీడింగ్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ ‘ఆరాయిష్’ పార్ట్నర్గా, ‘ది హైదరాబాద్ దక్కన్ సిగరెట్ ఫాక్యక్టరీ’ డెరైక్టర్‌గా సమర్థవంతమైన పాత్రలు పోషిస్తున్న సామియా... శకుంతల దివి నుంచి ‘వైఎఫ్‌ఎల్‌ఓ’ పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా... జీవితంలోని ప్రతి అంకంలో మహిళ నాయకురాలే అంటారామె. ‘మహిళ సాధికారత సాధించాలంటే విద్యాభివృద్ధి, ఆర్థిక కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించడం కీలకం. అన్ని స్థాయిల్లో విద్య, నైపుణ్యాల అభివృద్ధి ద్వారా దీన్ని సాకారం చేసుకోగలం. కాన్ఫిడెన్స్, ఎంపవర్మెంట్... కజిన్స్. దానికి మూలం, ప్రోత్సాహం ఆత్మవిశ్వా సమే. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే ఓ శక్తిగా ఎదుగుతోంది. మహిళలు నిర్ణయాత్మకంగా వ్యవహరించి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఆలోచనలు విస్తృతం చేసి, ప్రతి రంగంలోనూ ముందుకు దూసుకు పోయేలా ఎదగాలి. అది విద్య, మౌళిక వసతులు, పరిశ్రమలు, ఆర్థిక సేవలు, వ్యాపారాలు.. ఏవైనా కావచ్చు’ అంటూ ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు సామియా. వయసులో చిన్నే అయినా ఆమె ఆలోచనలు ఆకాశమంత. సీఈఓ నుంచి హౌస్‌వైఫ్ వరకు.. మహిళలు వంటింట్లో ఉన్నా.. వ్యాపార రంగంలో ఎదుగుతున్నా.. ఎక్కడున్నా నాయకురాళ్లే అనేది సామియా అలమ్‌ఖాన్ చెప్పే భాష్యం. అంతే కాదు... ‘ఏ గొప్ప కార్యం జరిగినా దానికి ఆరంభం మహిళలతోనే. విశ్వాసం, నాయకత్వ లక్షణాలున్న ఎంతో మంది స్త్రీల సామర్థ్యంతో ఈ భారతావని నిర్మితమైంది’ అంటూ స్ఫూర్తిదాయకంగా చెప్పుకొచ్చారు ఈ యువ పారిశ్రామికవేత్త. మహిళలు స్వతంత్రంగా ఎదిగి తోటి మహిళలకూ చేయూతనందించడం తప్పనిసరంటున్న సామియా ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారు. ‘లెర్న్, ఇంప్లిమెంట్ అండ్ ఇన్స్పైర్’ అనే థీమ్‌తో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తానంటున్నారామె. సో... బెస్ట్ ఆఫ్ లక్ టు సామియా! -
కొత్త పుస్తకాలు
గుణ (భగవద్గీత ఆధారంగా వ్యక్తిత్వ వికాసం) రచన: శ్రీనివాస్ మిర్తిపాటి పేజీలు: 292; వెల: 135 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతోపాటు, 3-19/11, మధురానగర్, గోకులం రోడ్, స్టార్ హోమ్స్, కాకినాడ. ఫోన్: 8686559557 దర్పణం (కవిత్వం) రచన: డా.ఎ.వి.వీరభద్రాచారి పేజీలు: 146; వెల: 100 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలు; కవి ఫోన్: 9391310886 1.మరణ తరంగం (కథానికలు) సంకలనం: డా.కె.బి.గోపాలమ్ పేజీలు: 102; వెల: 100 2.కథాకేళి (బహుమతి పొందిన కథానికలు) సంకలనం: ఎం.నాగకుమారి, ఎం.రామారావు పేజీలు: 96; వెల: 60 3.గిడుగు-పిడుగు రచన: డా.వేదగిరి రాంబాబు పేజీలు: 100; వెల: 50 4.డాక్టర్ వాసా ప్రభావతి కథానికలు పేజీలు: 140; వెల: 100 5.కథాకృతి-3 (పరిచయాలు-పరామర్శలు) రచన: విహారి పేజీలు: 182; వెల: 100 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటు, శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్, హెచ్ఐజి-1, బ్లాక్-6, ఫ్లాట్ 10, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్-44. ఫోన్: 9391343916 కాలక్షేపం కథలు రచన: మేడా మస్తాన్ రెడ్డి పేజీలు: 164; వెల: 100 ప్రతులకు: రచయిత, 201, సత్యం ఎన్క్లేవ్, లక్ష్మీ నగర్, శివాజీ పార్క్ రోడ్, విశాఖపట్నం-17. ఫోన్: 9441344365 -
‘సాఫ్ట్’గా విజయం సాధించాలి!
విజయం ఏ ఒక్కరికీ వంశపారంపర్యంగానో, ఏవో కొన్ని ప్రత్యేక జన్మతః లక్షణాల వల్లనో లభించదు. ఎవరైనా విజేతగా ఎదగవచ్చు. ‘‘సాఫ్ట్‌స్కిల్స్ అలవరచుకుంటే విజయం లభిస్తుంది..’’ మేనేజ్మెంట్ పుస్తకాల్లో కనిపించే ఈ పదం ఇటీవల కాలంలో అందరి నోళ్లలో నానుతోంది. చిత్రమేమిటంటే బాగా ప్రచారంలో ఉన్న ఈ పదం ప్రామాణిక నిఘంటువులలో మాత్రం కనిపించదు. అసలు సాఫ్ట్‌స్కిల్స్ అంటే ఏమిటి? వాటిని ఎందుకు అలవరచుకోవాలి? ఎలా ఒంటబట్టించుకోవాలి? ఇంతా చేస్తే వాటివల్ల ఉపయోగం ఉందా? వీటన్నింటికీ సమాధానం తెలుసుకుందాం... ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా ఏ ప్రొఫెషనల్ కోర్సు చేసిన వారైనా విజయ శిఖరాన్ని అధిరోహించాలంటే సాఫ్ట్‌స్కిల్స్‌ను సోపానాలుగా చేసుకోవాల్సిందే! బతికేందుకు ఆక్సిజన్ ఎంత అవసరమో.. ఉన్నత కెరీర్‌కు సాఫ్ట్‌స్కిల్స్ కూడా అంతే అవసరం. ‘‘మీ హార్డ్ స్కిల్స్.. మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్తాయి. మీకు ఉద్యోగం రావాలన్నా.. ఉద్యోగంలో రాణించాలన్నా మీకు సాఫ్ట్‌స్కిల్స్ అవసరం..’’ -ఇది హెచ్ఆర్ మేనేజర్ల ప్రసంగాల్లో తరచూ వినిపించే మాట. మీరు ఇంటర్వ్యూ వరకు ఎప్పుడు వెళ్లగలరు? తగిన విద్యార్హతలు ఉన్నప్పుడు ..................................................................... అవసరమైన సాంకేతిక నైపుణ్యాలున్నప్పుడు ..................................................................... భాషా పరిజ్ఞానం ఉన్నప్పుడు ..................................................................... కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడు ..................................................................... ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే పై స్కిల్స్‌నే హార్డ్స్కిల్స్గా చెప్పొచ్చు. వాడుక భాషలో చెప్పాలంటే.. ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు మనకు ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో అవి హార్డ్‌స్కిల్స్. మనకున్న నైపుణ్యాలను సమర్థవంతంగా వ్యక్తీకరించి, ఇతరులను ఒప్పించగలిగే నైపుణ్యాలను సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ఇప్పుడు ఇలా పిలుస్తున్నారా? అని అనుకుంటున్నారా? అయితే మీరు బాగా దగ్గరికి వచ్చినట్లే! మన భావాలను ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం.. కమ్యూనికేషన్. ఇంకొంత మెరుగ్గా అర్థమయ్యేలా చెప్పగలగడం.. కమ్యూనికేషన్ స్కిల్. మనం చెప్పింది విని, గ్రహించి, ఎదుటి వ్యక్తి మనతో ఏకీభవించేలా చేసుకోవాలంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ చాలవు. సాఫ్ట్‌స్కిల్స్ కూడా కావాలి. ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అతణ్ని లేదా ఆమెను అర్థం చేసుకొని ఉండాలి. దీన్నే "The ability to think in others' shoes" అంటారు. అంటే ఎదుటి వారి కోణంలో మన ఆలోచనా ధోరణిని కాసేపు మార్చుకోవాలి. దీన్నే ఉక్కఖీఏ్గ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే.. మీ స్నేహితుడు మీకు ఫోన్ చేసి.. ‘మీ ఇంటికి దారి చెప్పు, నేను బయల్దేరాను..’ అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? టకటకా మన ఇంటి అడ్రస్ చెప్పేసి, వచ్చేయ్! చాలా సులభం అని చేతులు దులుపుకోం కదా..! మొదట ‘నీవు ఎక్కడ ఉన్నావు?’ అని అడుగుతాం. ఆ తర్వాత మనల్ని మనం అతని స్థానంలో ఊహించుకుంటూ, అతను ముందుకొచ్చే కొద్దీ ఎదురయ్యే ల్యాండ్ మార్క్స్ గుర్తులు చెప్పుకుంటూ వస్తాం.. ఫలానా దగ్గర ఎడమ మలుపు, ఫలానా దగ్గర కుడి మలుపు అని చెబుతాం. ఇదంతా అతని కోణంలో నుంచి ఆలోచిస్తూ అతనికి మనం సూచనలు ఇస్తాం. మీరు ఇలా చేస్తే అతను సరిగ్గా గమ్యం చేరగలడు. ఈ ప్రక్రియనే ఎంపథీ (సహానుభూతి- ఎదుటి వారి కోణంలో ఆలోచించడం) అంటాం. సాఫ్ట్‌స్కిల్స్‌లో మనం ఆకళింపు చేసుకోవాల్సిన మొదటి నైపుణ్యం ఇదే. మీకు మరో ఉదాహరణ చెబుతాను.. మీరూ, నేనూ ఒక పార్టీలో కలిసామనుకుందాం. అది ఒక పెద్ద పెళ్లి రిసెప్షన్ అనుకుందాం. దీనికి మీకున్న వాటిలో బాగా ఇష్టమైన షర్ట్ వేసుకొని వచ్చారు. మీ షర్టు నాకు నచ్చలేదు. నేను ఏమీ ఆలోచించకుండా ‘నీ షర్టు ఏం బాగాలేదు..’ అని అన్నాననుకోండి... మీకు సహజంగానే తీవ్రమైన బాధ కలుగుతుంది. అదే నేను మీ కోణం నుంచి ఆలో చించి మాట్లాడుంటే పరిస్థితి మరోలా ఉండేది! కామన్సెన్స్ ఏం చెబుతుంది ? ఎవరైనా తమకిష్టమైన దుస్తుల్నే పార్టీకి వేసుకొని వస్తారు. కాబట్టి empathizing skill¯ను ఉపయోగించి, కామన్ సెన్స్ జోడించి ఇలా చెప్పి చూస్తాను.. ‘‘నీ షర్ట్ చాలా బాగుంది.. ఎక్కడ కొన్నావు? ఇలాంటిదే కొనాలని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇన్ఫాక్ట్ ఇది కాస్తా డార్క్ షేడ్ కావడం వల్ల ఆకర్షణీయంగా ఉంది. కాకపోతే నిన్న నీవు తొడుక్కున్న లేత నీలి రంగు షర్ట్ ఇంకా బాగుంది. సో పార్టీకి మన వాళ్లింకా ఎవరు వచ్చారో చూద్దాం పద! మన మాటలతో ఎదుటి వారిని నొప్పించే అధికారం మనకు లేదు. మనం ్ఛఝఞ్చ్టజిజ్డ్ఛీ చేసుకుంటూ మాట్లాడటం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు. మీరు ఒక మేనేజర్, టీం లీడర్, సీఈవో, డెరైక్టర్.. ఇలా రకరకాల హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీ కింద పనిచేసే ఉద్యోగుల్ని కావొచ్చు, బృంద సభ్యుల్ని కావొచ్చు, టీం మెంబర్స్‌ని కావొచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కావొచ్చు, జీవిత భాగస్వామిని కావొచ్చు, ఎవరినైనా సరే నొప్పించకుండా, ఒప్పించగలగాలి అంటే సహానుభూతి ఎంతైనా అవసరం. ఇప్పటి వరకూ మనం తెలుసుకున్న దాన్నిబట్టి సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవరచుకోవాలంటే ముఖ్యంగా కావాల్సినవి...Communication Skills.Empathizing Skill.Common sense. వచ్చే వారం సాఫ్ట్‌స్కిల్స్- సాధనపై విశ్లేషణ