విజయం ఏ ఒక్కరికీ వంశపారంపర్యంగానో, ఏవో కొన్ని ప్రత్యేక జన్మతః లక్షణాల వల్లనో లభించదు. ఎవరైనా విజేతగా ఎదగవచ్చు.
‘‘సాఫ్ట్‌స్కిల్స్ అలవరచుకుంటే విజయం లభిస్తుంది..’’ మేనేజ్‌మెంట్ పుస్తకాల్లో కనిపించే ఈ పదం ఇటీవల కాలంలో అందరి నోళ్లలో నానుతోంది. చిత్రమేమిటంటే బాగా ప్రచారంలో ఉన్న ఈ పదం ప్రామాణిక నిఘంటువులలో మాత్రం కనిపించదు. అసలు సాఫ్ట్‌స్కిల్స్ అంటే ఏమిటి? వాటిని ఎందుకు అలవరచుకోవాలి? ఎలా ఒంటబట్టించుకోవాలి? ఇంతా చేస్తే వాటివల్ల ఉపయోగం ఉందా? వీటన్నింటికీ సమాధానం తెలుసుకుందాం... ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ.. ఇలా ఏ ప్రొఫెషనల్ కోర్సు చేసిన వారైనా విజయ శిఖరాన్ని అధిరోహించాలంటే సాఫ్ట్‌స్కిల్స్‌ను సోపానాలుగా చేసుకోవాల్సిందే! బతికేందుకు ఆక్సిజన్ ఎంత అవసరమో.. ఉన్నత కెరీర్‌కు సాఫ్ట్‌స్కిల్స్ కూడా అంతే అవసరం.
‘‘మీ హార్డ్ స్కిల్స్.. మిమ్మల్ని ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్తాయి. మీకు ఉద్యోగం రావాలన్నా.. ఉద్యోగంలో రాణించాలన్నా మీకు సాఫ్ట్‌స్కిల్స్ అవసరం..’’
-ఇది హెచ్‌ఆర్ మేనేజర్ల ప్రసంగాల్లో తరచూ వినిపించే మాట.
మీరు ఇంటర్వ్యూ వరకు ఎప్పుడు వెళ్లగలరు?
తగిన విద్యార్హతలు ఉన్నప్పుడు .....................................................................
అవసరమైన సాంకేతిక నైపుణ్యాలున్నప్పుడు .....................................................................
భాషా పరిజ్ఞానం ఉన్నప్పుడు .....................................................................
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నప్పుడు
.....................................................................
ఓ ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడే పై స్కిల్స్‌నే హార్డ్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. వాడుక భాషలో చెప్పాలంటే.. ఉద్యోగాన్ని చేజిక్కించుకునేందుకు మనకు ఏవైతే నైపుణ్యాలు ఉన్నాయో అవి హార్డ్‌స్కిల్స్. మనకున్న నైపుణ్యాలను సమర్థవంతంగా వ్యక్తీకరించి, ఇతరులను ఒప్పించగలిగే నైపుణ్యాలను సాఫ్ట్‌స్కిల్స్‌గా చెప్పొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్‌ను ఇప్పుడు ఇలా పిలుస్తున్నారా? అని అనుకుంటున్నారా? అయితే మీరు బాగా దగ్గరికి వచ్చినట్లే! మన భావాలను ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం.. కమ్యూనికేషన్. ఇంకొంత మెరుగ్గా అర్థమయ్యేలా చెప్పగలగడం.. కమ్యూనికేషన్ స్కిల్. మనం చెప్పింది విని, గ్రహించి, ఎదుటి వ్యక్తి మనతో ఏకీభవించేలా చేసుకోవాలంటే కేవలం కమ్యూనికేషన్ స్కిల్స్ చాలవు. సాఫ్ట్‌స్కిల్స్ కూడా కావాలి.
ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అతణ్ని లేదా ఆమెను అర్థం చేసుకొని ఉండాలి. దీన్నే "The ability to think in others' shoes" అంటారు. అంటే ఎదుటి వారి కోణంలో మన ఆలోచనా ధోరణిని కాసేపు మార్చుకోవాలి. దీన్నే ఉక్కఖీఏ్గ అంటారు. ఇంకా వివరంగా చెప్పాలంటే..
మీ స్నేహితుడు మీకు ఫోన్ చేసి.. ‘మీ ఇంటికి దారి చెప్పు, నేను బయల్దేరాను..’ అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? టకటకా మన ఇంటి అడ్రస్ చెప్పేసి, వచ్చేయ్! చాలా సులభం అని చేతులు దులుపుకోం కదా..! మొదట ‘నీవు ఎక్కడ ఉన్నావు?’ అని అడుగుతాం. ఆ తర్వాత మనల్ని మనం అతని స్థానంలో ఊహించుకుంటూ, అతను ముందుకొచ్చే కొద్దీ ఎదురయ్యే ల్యాండ్ మార్క్స్ గుర్తులు చెప్పుకుంటూ వస్తాం.. ఫలానా దగ్గర ఎడమ మలుపు, ఫలానా దగ్గర కుడి మలుపు అని చెబుతాం. ఇదంతా అతని కోణంలో నుంచి ఆలోచిస్తూ అతనికి మనం సూచనలు ఇస్తాం. మీరు ఇలా చేస్తే అతను సరిగ్గా గమ్యం చేరగలడు. ఈ ప్రక్రియనే ఎంపథీ (సహానుభూతి- ఎదుటి వారి కోణంలో ఆలోచించడం) అంటాం. సాఫ్ట్‌స్కిల్స్‌లో మనం ఆకళింపు చేసుకోవాల్సిన మొదటి నైపుణ్యం ఇదే.
మీకు మరో ఉదాహరణ చెబుతాను.. మీరూ, నేనూ ఒక పార్టీలో కలిసామనుకుందాం. అది ఒక పెద్ద పెళ్లి రిసెప్షన్ అనుకుందాం. దీనికి మీకున్న వాటిలో బాగా ఇష్టమైన షర్ట్ వేసుకొని వచ్చారు. మీ షర్టు నాకు నచ్చలేదు. నేను ఏమీ ఆలోచించకుండా ‘నీ షర్టు ఏం బాగాలేదు..’ అని అన్నాననుకోండి... మీకు సహజంగానే తీవ్రమైన బాధ కలుగుతుంది. అదే నేను మీ కోణం నుంచి ఆలో చించి మాట్లాడుంటే పరిస్థితి మరోలా ఉండేది!
కామన్‌సెన్స్ ఏం చెబుతుంది ?
ఎవరైనా తమకిష్టమైన దుస్తుల్నే పార్టీకి వేసుకొని వస్తారు. కాబట్టి empathizing skill¯ను ఉపయోగించి, కామన్ సెన్స్ జోడించి ఇలా చెప్పి చూస్తాను..
‘‘నీ షర్ట్ చాలా బాగుంది.. ఎక్కడ కొన్నావు? ఇలాంటిదే కొనాలని నేను చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఇన్‌ఫాక్ట్ ఇది కాస్తా డార్క్ షేడ్ కావడం వల్ల ఆకర్షణీయంగా ఉంది. కాకపోతే నిన్న నీవు తొడుక్కున్న లేత నీలి రంగు షర్ట్ ఇంకా బాగుంది. సో పార్టీకి మన వాళ్లింకా ఎవరు వచ్చారో చూద్దాం పద!
మన మాటలతో ఎదుటి వారిని నొప్పించే అధికారం మనకు లేదు. మనం ్ఛఝఞ్చ్టజిజ్డ్ఛీ చేసుకుంటూ మాట్లాడటం వల్ల మంచి ఫలితాలను రాబట్టవచ్చు.
మీరు ఒక మేనేజర్, టీం లీడర్, సీఈవో, డెరైక్టర్.. ఇలా రకరకాల హోదాల్లో పనిచేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో మీ కింద పనిచేసే ఉద్యోగుల్ని కావొచ్చు, బృంద సభ్యుల్ని కావొచ్చు, టీం మెంబర్స్‌ని కావొచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కావొచ్చు, జీవిత భాగస్వామిని కావొచ్చు, ఎవరినైనా సరే నొప్పించకుండా, ఒప్పించగలగాలి అంటే సహానుభూతి ఎంతైనా అవసరం.
ఇప్పటి వరకూ మనం తెలుసుకున్న దాన్నిబట్టి సాఫ్ట్‌స్కిల్స్‌ను అలవరచుకోవాలంటే ముఖ్యంగా కావాల్సినవి...Communication Skills.Empathizing Skill.Common sense.
వచ్చే వారం సాఫ్ట్‌స్కిల్స్- సాధనపై విశ్లేషణ