Pete Sampras
-
సంప్రాస్ సరసన జొకోవిచ్
పారిస్: ఈ ఏడాది అద్భుతంగా రాణించిన సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ తన చిన్ననాటి ఆరాధ్య క్రీడాకారుడు పీట్ సంప్రాస్ సరసన నిలిచాడు. అత్యధికసార్లు పురుషుల టెన్నిస్ సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన ప్లేయర్‌గా ఇన్నాళ్లూ సంప్రాస్ పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. గతంలో సంప్రాస్ 1993 నుంచి 1998 వరకు వరుసగా ఆరేళ్లపాటు సీజన్‌ను ప్రపంచ నంబర్‌వన్‌గా ముగించాడు. 33 ఏళ్ల జొకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్లను టాప్ ర్యాంక్‌తో ముగించి సంప్రాస్ సరసన చేరాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (20 చొప్పున) సాధించిన మేటి క్రీడాకారులు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) గతంలో ఐదుసార్లు చొప్పున సీజన్‌ను నంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించారు. గతేడాది వరకు ఫెడరర్, నాదల్ సరసన నిలిచిన జొకోవిచ్ ఈ ఏడాది వారిద్దరిని వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిపోయాడు. కరోనా వైరస్ కారణంగా కుదించిన ఈ టెన్నిస్ సీజన్లో జొకోవిచ్ మొత్తం 39 మ్యాచ్‌ల్లో గెలిచి, మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. అంతేకాకుండా నాలుగు టైటిల్స్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ‘టెన్నిస్ రాకెట్ పట్టినప్పటి నుంచి సంప్రాస్‌ను ఆరాధించేవాణ్ని. ఇప్పుడు అతని రికార్డును సమం చేసినందుకు నా కల నిజమైంది’ అని జొకోవిచ్ అన్నాడు. కెరీర్లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్ గత సెప్టెంబర్‌లో అత్యధిక వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్న ఆటగాళ్ల జాబితాలో సంప్రాస్ (286 వారాలు)ను మూడో స్థానానికి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటికే 294 వారాలు టాప్ ర్యాంక్‌లో ఉన్న జొకోవిచ్ వచ్చే సీజన్లోనూ నిలకడగా ఆడితే మార్చి తొలి వారంలో... అత్యధిక వారాలు నంబర్‌వన్ స్థానంలో ఉన్న ప్లేయర్ ఫెడరర్ (310 వారాలు) రికార్డును కూడా బద్దలు కొడతాడు. నవంబర్ 15న లండన్‌లో మొదలయ్యే సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో జొకోవిచ్ బరిలోకి దిగనున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా సీజన్‌ను టాప్ ర్యాంక్‌తో ముగించినందుకు అతనికి అధికారిక ట్రోఫీని ప్రదానం చేస్తారు. -
జొకోవిచ్ ముచ్చటగా మూడోసారి
న్యూయార్క్: ఈ సీజన్ అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న నొవాక్ జొకోవిచ్(సెర్బియా) మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ విజేత(2009) డెల్‌పొట్రోపై ఘన విజయం సాధించాడు. దీంతో సెర్బియా స్టార్ మూడో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం అర్థరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో ఆరో సీడ్ జొకోవిచ్ 6-3, 7-6,(7/4), 6-3తో అర్జెంటీనా ఆజానుబావుడు డెల్‌పొట్రోపై విజయం సాధించాడు. మ్యాచ్ ఆద్యంతం సెర్బియా వీరుడు తన ఫామ్‌ను కొనసాగించాడు. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్‌ను కోల్పోయిన తర్వాత డెల్‌పొట్రో అనూహ్యంగా కోపుంజుకున్నాడు. రెండో సెట్ నువ్వానేనా అన్నట్టు సాగినా.. జొకోవిచ్ దూకుడు ముందు అర్జెంటీనా స్టార్ నిలువలేకపోయాడు. ఇక మూడో సెట్లోనూ జొకోవిచ్ ఏ చిన్న అవకాశం ప్రత్యర్థికి ఇవ్వలేదు. దీంతో చివరి సెట్ కూడా గెలిచి.. 14వ గ్రాండ్‌స్లామ్ తన ఖాతాలో వేసుకొని పీట్ సంప్రాస్ సరసన చేరాడు. ఇక ఈ జాబితాలో రోజర్ ఫెడరర్(20 టైటిల్స్), రఫెల్ నాదల్(17 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. సీన్ రివర్స్.. ఏడాది క్రితం రఫెల్ నాదల్ యూఎస్ ఓపెన్ ట్రోఫీ సొంతం చేసుకున్న వేళ గాయం కారణంగా సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఇంట్లో ఉన్నాడు. సంవత్సరం తిరిగేలోపు పరిస్థితి మారిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ నాదల్ మాజీ విజేత డెల్‌పొట్రోతో జరిగిన సెమీఫైనల్లో మోకాలి గాయంతో మధ్యలోనే వైదొలగగా... పూర్తి ఫిట్నెస్ సంతరించుకున్న జొకోవిచ్ యూఎస్ ఓపెన్ ట్రోఫిని ముద్దాడాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆగస్టు 12న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: పీట్ సాంప్రాస్ (టెన్నిస్ క్రీడాకారుడు) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించినదైనందువల్ల అధికారుల సహకారంతో, పట్టుదలతో అనుకున్న పనులన్నింటినీ అవలీలగా సాధిస్తారు. వయసు పై బడుతున్నా, హుషారుగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. ఇల్లు, ఆస్తులు కొనుక్కోవాలనే కోరిక తీరుతుంది. ఇంటిలో పాతవస్తువుల స్థానంలో ఖరీదైన ఫర్నీచర్‌ను అమర్చుకుంటారు. పుట్టిన తేదీ 12 అంటే 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు మంచి మేధోవికాసం, తెలివి తేటలు, ధారణ శక్తి కలుగుతాయి. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. న్యాయకోవిదులకు, వైద్యులకు, యూనిఫారం ధరించే ఉద్యోగులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,69; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: బుధ, గురు, శుక్ర, ఆదివారాలు. సూచనలు: దక్షిణామూర్తిని ఆరాధించడం,అనాథలను ఆదుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు. - డాక్టర్ మహమ్మద్ దావూద్