Peter Mukherjee
-
పీటర్ ముఖర్జీపై హత్యానేరం
షీనా హత్యలో కీలకంగా వ్యవహరించాడన్న సీబీఐ ముంబై: షీనా బోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీపై సీబీఐ హత్యానేరం మోపింది. ఇంద్రాణితో కలిసి షీనా బోరాను హత్యచేయటంలో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. పీటర్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టిన సీబీఐ హత్యకు ముందు, హత్య జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా ఇంద్రాణితో పీటర్ మాట్లాడుతూ ఉన్నట్లు తెలిపింది. షీనా, ఇంద్రాణీ మధ్య గొడవలకు పీటర్ మధ్యవర్తిత్వం వహించాడని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ ికోర్టుకు తెలిపారు. షీనా విషయంలో కొడుకు రాహుల్‌కు వాస్తవాలు చెప్పకుండా తప్పుదోవ పట్టించాడన్నారు. -
సీబీఐ కస్టడీలో పీటర్ ముఖర్జీయా
ముంబై: క్రైమ్ థ్రిల్లర్ మూవీలా మలుపులు తిరుగుతున్న షీరాబోరా హత్య కేసులో అరెస్ట్ అయిన ఇంద్రాణి భర్త పీటర్ ముఖర్జియాను సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు పీటర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఇంద్రాణి ముఖర్జియా సహా ముగ్గురిపై కేసులు నమోదు చేసిన సీబీఐ, తాజాగా ఆమె ప్రస్తుత భర్త, స్టార్ గ్రూప్ అధినేత పీటర్ ముఖర్జియాను ఏ-4 గా చేర్చింది. నిన్న పీటర్ ముఖర్జియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ అతడిని కోర్టులో హాజరు పరిచారు. కాగా షీనాబోరా హత్య విషయం తెలిసినా నిజం బయటపడకుండా పీటర్ ముఖర్జియా దాచి పెట్టారని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. అలాగే నిందితులకు ఆశ్రయం ఇవ్వటం, కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయటం వల్ల పీటర్‌ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న షీరా బోరా తల్లి ఇంద్రాణీ ముఖర్జీ, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లకు సీబీఐ కోర్టు... డిసెంబర్ 3వ తేదీ వరకు కస్టడీని పొడిగించింది. గత ఆగస్టులో సీబీఐ వీరిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
ఇంద్రాణిని తీవ్రంగా కొడుతున్నారు !
ముంబయి: విచారణ సమయంలో పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని తీవ్రంగా కొడుతున్నారని ఆమె తరుపు న్యాయవాదులు సోమవారం ముంబయి కోర్టుకు ప్రధానంగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆమె హత్య కేసుకు సంబంధించి పలు వివరణలు ఇచ్చినా సంతృప్తి చెందని పోలీసులు విచారణ పేరిట ఆమెను భౌతికంగా మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారని ఆరోపించనున్నట్లు సమాచారం. తాము ఆమెను కలిసేందుకు వెళ్లిన సమయంలో ఆమె ముఖంపై చెంపదెబ్బల గాయాలు వారికి కనిపించినట్లు తెలుస్తోంది. సొంత కూతురు షీనా బోరాను హత్య చేసిన కేసులో మీడియా టైకూన్ ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఆమె కుమారుడిని కూడా హత్య చేసేందుకు ఆమె అదే రోజు పలురకాల కుట్రలకు పాల్పడిందని కూడా తెలిసింది. గతంలో పోలీసులు కోరిన కస్టడీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆ గడువు మరింత కోరేందుకు మరోసారి ఆమెను సోమవారం కోర్టుకు పోలీసులు హాజరుపరచనున్నారు.