షీనా బోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీపై సీబీఐ హత్యానేరం మోపింది. ఇంద్రాణితో కలిసి షీనా బోరాను హత్యచేయటంలో కీలకంగా
షీనా హత్యలో కీలకంగా వ్యవహరించాడన్న సీబీఐ
ముంబై: షీనా బోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీపై సీబీఐ హత్యానేరం మోపింది. ఇంద్రాణితో కలిసి షీనా బోరాను హత్యచేయటంలో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. పీటర్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టిన సీబీఐ హత్యకు ముందు, హత్య జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా ఇంద్రాణితో పీటర్ మాట్లాడుతూ ఉన్నట్లు తెలిపింది. షీనా, ఇంద్రాణీ మధ్య గొడవలకు పీటర్ మధ్యవర్తిత్వం వహించాడని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ ికోర్టుకు తెలిపారు. షీనా విషయంలో కొడుకు రాహుల్‌కు వాస్తవాలు చెప్పకుండా తప్పుదోవ పట్టించాడన్నారు.