PG medical courses
-
జీవో 42 రద్దు
సాక్షి, అమరావతి: పీజీ మెడికల్, డెంటల్ వైద్య విద్య కోర్సులకు 2017–18 నుంచి 2019–20 బ్లాక్ పీరియడ్ కాలానికి ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 15న జారీ చేసిన జీవో 42ను హైకోర్టు రద్దు చేసింది. ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ (ఏపీహెచ్ఈఆర్ఎంసీ) నిర్ణ యించిన ఫీజులను, ప్రభుత్వానికి పంపుతూ ఇచ్చిన కమ్యూనికేషన్‌ను రద్దు చేసింది. హైకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగు ణంగా ఏపీహెచ్ఈఆర్ఎంసీ ఫీజులను నిర్ణయించ లేదని ఆక్షేపించింది. ఫీజుల నిర్ణయం విషయంలో ఆయా కాలేజీలు లేవనెత్తే అభ్యంతరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని తామిచ్చిన ఆదేశా లను పట్టించుకోలేదంది. అలాగే ఒక్కో కాలేజీకి సంబంధించి లిఖితపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేయాలన్న ఆదేశాలను కూడా ఏపీహెచ్‌ఈఆర్ ఎంసీ బేఖాతరు చేసిందని హైకోర్టు ఆక్షేపించింది. జీవో 42 ఆధారంగా ఫీజు ఖరారు చేసిన విద్యా సంస్థల్లో తిరిగి ఫీజులను నిర్ణయించి నాలుగు వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫీజుల విషయంలో ఏవైనా ఆధారా లను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటే, ఆ ఆధారాలను సంబంధిత కాలేజీ ముందు ఉంచి వారి వాదనలు వినాలంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి ప్రతి కాలేజీ విషయంలో వేర్వేరుగా తగిన కారణాలతో లిఖితపూర్వకంగా ఉత్తర్వులివ్వా లంది. కమిషన్ తన ఫీజుల ఖరారు ఉత్తర్వులను ప్రభుత్వానికి పంపాలంది. ఆ ఉత్తర్వులు అందు కున్న వారంలోపు ఆ ఫీజును ప్రభుత్వం నోటిఫై చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ఇటీవల తీర్పు వెలువరించారు. -
పెంచిన ఫీజులో 50% మాత్రమే చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పీజీ మెడికల్ కోర్సులకు సంబంధించి 2016లో పెంచిన ఫీజులకు అదనంగా ప్రస్తుతం పెంచిన ఫీజులో 50% మాత్రమే చెల్లించాలని కన్వీనర్ కోటా ఏ కేటగిరీ విద్యార్థులకు హైకోర్టు స్పష్టం చేసింది. మిగిలిన 50 శాతానికి కాలేజీ పేరుమీద బాండ్ సమర్పించాలని ఆదేశించింది. రాష్ట్రంలో పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 20పై హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే యాజమాన్యపు కోటా ‘బీ’కేటగిరీ విద్యార్థులు 2016లో పెంచిన ఫీజుకు అదనంగా ప్రస్తుతం పెంచిన ఫీజులో 60% చెల్లించాలని, మిగిలిన 40 శాతానికి బాండ్ సమర్పించాలని స్పష్టం చేసింది. విద్యార్థులు చెల్లించిన ఫీజులు, బాండ్లు ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు తేల్చి చెప్పింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితిని, ఇబ్బందిని దష్టిలో పెట్టుకుని మధ్యే మార్గంగా ఈ ఉత్తర్వులిచ్చినట్లు పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని 2017లో దాఖలైన వ్యాజ్యాలతో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సవాల్ చేసిన వైద్య విద్యార్థులు పీజీ మెడికల్ కోర్సుల ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం 20ని సవాలు చేస్తూ 121 మంది వైద్య విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పీజీ మెడికల్ కోర్సుల్లో కన్వీనర్, యాజమాన్యపు కోటాల కింద ఫీజులను భారీగా పెంచారని తెలిపారు. ఇంత భారీగా ఫీజులు పెంచేందుకు కారణాలేమిటో తెలియడం లేదన్నారు. మెడికల్ కాలేజీల తరఫున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, బోధనా, బోధనేతర సిబ్బందికి పెద్ద మొత్తంలో జీతాలు, విద్యార్థులకు స్టైఫండ్ చెల్లింపులు చేయాల్సి వస్తోందని, దీంతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయని తెలిపారు. ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఫీజు ఖరారుకు నిర్దిష్ట విధానాన్ని అనుసరించామని, ఆ వివరాలను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం, ఏఎఫ్ఆర్సీ దేని ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించిందో ఆ వివరాలను తమ ముందు లేవని, ఫీజులను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో కూడా ఫీజుల పెంపునకు కారణాలు చెప్పలేదని పేర్కొంది. అటు విద్యార్థులు, ఇటు కాలేజీల ప్రయోజనాలను సమతుల్యం చేసుకుంటూ ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూ ధర్మాసనం పైవిధంగా ఆదేశించింది. ఎన్ఆర్ఐ కోటా ఫీజు విషయంలో మాత్రం ధర్మాసనం జోక్యం చేసుకోలేదు. -
సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బుధవారం ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటకలో మెడికల్, డెంటల్ కోర్సుల్లో పీజీ చేయాలనుకునేవారు రాష్ట్రంలో స్థిరనివాసం కలిగిఉండాలంటూ ప్రభుత్వం జారీచేసిన సమాచార బులెటిన్లోని నిబంధన చెల్లదని జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ యుయు లలిత్‌ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నిబంధనను సవరించి బులెటిన్‌ను మళ్లీ విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీలను ఆదేశించింది. అలాగే పరీక్షల క్యాలెండర్‌ను పునఃప్రచురించాలని సూచించింది. -
పీజీ మెడికల్ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు
విజయవాడ: పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తు గడవును పొడిగించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబరు 7వ తేదీ వరకూ నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామ్స్ గవర్నింగ్ బాడీ కౌన్సిల్ సభ్యులు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. అదే విధంగా 2010 ఎంబీబీఎస్ బ్యాచ్‌కు ఇంటర్నెషిప్ పూర్తి చేసే గడువును ఏప్రిల్ 15 వరకూ పొడిగించినట్లు వీసీ తెలిపారు. ఇప్పటికే 2010 ఎంబీబీఎస్ బ్యాచ్ అభ్యర్ధులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు త్వరలో వెబ్సైట్ ను ప్రారంభించనున్నట్లు వీసీ పేర్కొన్నారు.