pharmaceutical
-
130 బిలియన్ డాలర్లకు దేశీ ఫార్మా
దేశీయ ఫార్మా పరిశ్రమ 2030 నాటికి రెట్టింపు స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (IPA) ప్రెసిడెంట్, టోరెంట్ గ్రూప్ ఛైర్మన్ సమీహ్ మెహతా తెలిపారు. అప్పటికి 120–130 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,79,400 కోట్లు)కు చేరుకోవచ్చని, 2047 నాటికి 400–450 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకోగలదని ఆయన పేర్కొన్నారు. గత 25 ఏళ్లలో భారతీయ ఫార్మా(Pharma) పరిశ్రమ 20 రెట్లు పెరిగిందని వివరించారు.1999–2000లో 3 బిలియన్ డాలర్లుగా ఉన్నది 58 బిలియన్ డాలర్లకు చేరిందని మెహతా చెప్పారు. వాణిజ్య మిగులుకు దోహదపడుతున్న అయిదు రంగాల్లో ఇది కూడా ఒకటని ఐపీఏ ఏర్పాటై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాసిన ఆర్టికల్‌లో ఆయన పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాల సాధనలో భాగంగా ఉద్యోగాల కల్పన నుండి గ్లోబల్ ట్రేడ్(Global Trade) వరకు వివిధ అంశాల్లో ఫార్మా కీలక పాత్ర పోషించగలదని ఆయన వివరించారు. సానుకూల పాలసీలు, పరిశోధనలు.. అభివృద్ధిపై భారీ పెట్టుబడులు, చౌకగా వైద్యసేవలను అందుబాటులోకి తేవడం మొదలైనవన్నీ పరిశ్రమ పూర్తి సామర్థ్యాల మేరకు పని చేసేందుకు దోహదపడతాయని మెహతా తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలకు నెలకొన్న డిమాండ్‌లో భారత్ 20 శాతం ఔషధాలను సరఫరా చేస్తోందని, పరిమాణం.. విలువపరంగా 11వ ర్యాంకులో ఉందని వివరించారు. ఇదీ చదవండి: ఇంటి భోజనం మరింత భారం!నష్టాల్లోకి మొబిక్విక్డిజిటల్ వాలెట్ సేవలందించే మొబిక్విక్(Mobikwik) ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో లాభాలను వీడి నష్టాలు ప్రకటించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ.3.6 కోట్ల నష్టం నమోదైంది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ.6 కోట్ల స్టాండెలోన్ నికర లాభం ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ.207 కోట్ల నుంచి రూ.297 కోట్లకు ఎగసింది. మొత్తం వ్యయాలు రూ.186 కోట్ల నుంచి రూ.287 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ కాలంలో రూ.7 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా.. గత నెల లో లిస్టయిన వన్ మొబిక్విక్ సిస్టమ్స్ తొలిసారి త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. తదుపరి వృద్ధి అవకాశాలకు వీలుగా పెట్టుబడులు వెచ్చిస్తుండటంతో నష్టాలు నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. -
పరిశ్రమలకు ఎలాంటి సమస్యలు రానివ్వం
మాదాపూర్: రాష్ట్రం నుంచి ప్రతి ఏటా రూ.50 వేల కోట్ల విలువైన మందులను ఎగుమతి చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలి పారు. తమది పారి శ్రామిక అనుకూల ప్రభుత్వమని, పారి శ్రామికవేత్తలకు మంత్రివర్గం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్తు, నీటి సమస్య లేదని, ఏ పరిశ్రమకు ఎలాంటి సమస్యా రానివ్వబోమని అన్నా రు. ఓఆర్అర్, ఆర్ఆర్ఆర్ల మధ్యలో ఫార్మా క్లస్టర్లు నిర్మించి పరిశ్ర మను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. మాదా పూర్లోని హైటెక్స్‌లో మూడురోజుల పాటు కొనసాగే 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌ను శుక్రవారం మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలతో కలసి ఆయన ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణకు ఫార్మా పరిశ్రమ వెన్నెముక లాంటిదని భట్టి పేర్కొన్నారు. అత్యధిక నాణ్యతతో జనరిక్ మెడిసిన్ ఉత్పత్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తూ తెలంగాణ గుర్తింపు సాధించిందన్నారు.కరోనా కాలంలో ఫార్మాసిస్టులు అసమానమైన చురుకుదనం ప్రదర్శించి అవిశ్రాంతంగా శ్రమించారని అభినందించారు. రాష్ట్ర్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్టు భట్టి తెలిపారు. మిగులు విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి గ్రామీణ ఆస్పత్రుల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా ఫార్మా దిగ్గజాలకు మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కంపెనీలు తమ సామాజిక బాధ్యత (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు కేటాయించాలని కోరారు. హైదరాబాద్‌లో టిమ్స్, వరంగల్‌లో గవర్నమెంట్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హస్పిటల్ రూ.8 వేల కోట్లతో నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ చైర్మన్ బి.పార్థసారథిరెడ్డి, భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఫార్మా కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ మొంటుకుమార్ పటేల్, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ రఘువంశీ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. మొత్తం 8,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.అమీన్పూర్లో ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్ – పల్సస్ గ్రూప్ ప్రకటనసాక్షి, హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ట్రాన్స్ఫార్మేటివ్ ఏఐ డ్రివెన్ ఫార్మా హెల్త్‌కేర్ ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పల్సన్ గ్రూప్ తెలిపింది. హైదరాబాద్‌లో జరుగుతున్న ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్‌లో ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఏఐ ఫార్మా హబ్ ఏర్పాటుతో దాదాపు 10 వేల ప్రత్యక్ష ఉద్యోగాలను కల్పిస్తామని పేర్కొంది. అమీన్‌పూర్‌లోని ఐటీ/ఐటీఈఎస్ జోన్లో అద్భుతమైన మౌలిక వసతులు, రవాణా సౌకరర్యాలు ఉండడం హబ్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని తెలిపింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సహా 1,400కు పైగా సైన్స్, టెక్నాలజీ, మెడికల్ జర్నల్స్‌ను ప్రచురించే గొప్ప వారసత్వంతో పల్సస్ గ్రూప్ సమాజానికి గణనీయమైన సహకారం అందిస్తోందని పేర్కొంది. హెల్త్‌కేర్ ఐటీ హబ్ ప్రయోజనాలు ఇలా... ⇒ రోగులకు మెరుగైన వైద్య సేవలు⇒ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణల్లో తెలంగాణ అగ్రగామిగా మారుతుంది⇒10 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన⇒అనుబంధ పరిశ్రమలు, సేవల ద్వారా 40 వేల పరోక్ష ఉద్యోగాలు⇒ స్థానికులకు గణనీయమైన ఉపాధి అవకాశాలు. -
మైగ్రేన్ నుంచి ఉపశమనం కలిగించే సరికొత్త డివైజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పార్శ్వపు నొప్పి (మైగ్రేన్) నివారణకు ఔషధ రహిత పరిష్కారాన్ని ఫార్మా రంగ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ తీసుకువచ్చింది. నెరివియో పేరుతో చేతికి ధరించే పరికరాన్ని ప్రవేశపెట్టింది. యూఎస్ఎఫ్డీఏ అనుమతి ఉందని, 12 ఏళ్లు, ఆపై వయసున్న వారు వైద్యుల సిఫార్సు మేరకు దీన్ని వాడొచ్చని కంపెనీ గురువారం ప్రకటించింది. తలనొప్పి ప్రారంభమైన 60 నిమిషాలలోపు వాడాలి. లేదా పార్శ్వపు నొప్పి నివారణకు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉపయోగించాల్సి ఉంటుంది. -
ఫార్మా సంస్థలు నాణ్యతపై దృష్టి పెట్టాలి
ముంబై: అంతర్జాతీయంగా ఫార్మా ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్లే విషయంలో నియంత్రలే పెద్ద అడ్డంకిగా ఉన్నాయని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్ విభాగం కార్యదర్శి ఎస్ అపర్ణ పేర్కొన్నారు. దీంతో దేశీ ఫార్మా సంస్థలు నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఎనిమిదో అంతర్జాతీయ ఫార్మాస్యూటికల్ నాణ్యతా సదస్సును ఉద్దేశించి వీడియో సందేశం ఇచ్చారు. ‘‘అంతర్జాతీయంగా ఫార్మా పరిశ్రమ అధిక నియంత్రణల మధ్య ఉంది. మార్కెట్ ప్రవేశానికి నియంత్రణలే పెద్ద అడ్డంకి. భారత తయారీ రంగంలో ఎన్నో సంస్థలు ఉన్నాయి. అవన్నీ కూడా అన్ని రకాల శ్రేణుల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఈ రంగంలో భారత్‌లో ఎన్నో చిన్న, మధ్యస్థాయి సంస్థలు ఉన్నాయి. ప్రధానంగా జనరిక్ మార్కెట్ మనది. మారుతున్న వ్యాధులకు అనుగుణంగా ఆవిష్కరణలపైనా దృష్టిపెట్టాలి’’అని అపర్ణ సూచించారు. భారత ఫార్మా సంస్థలకు గణనీయమైన సామర్థ్యం, నాణ్యత, వ్యయపరమైన అనుకూలతలు ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటున్నాయన్నారు. -
ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త సురేశ్ బండారి మృతి
హన్మకొండ: హనుమకొండకు చెందిన యువ ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్త డాక్టర్ సురేష్ బండారి కోవిడ్ అనంతర సమస్యలతో అమెరికాలోని మిసిసిపి రాష్ట్రంలో మృతి చెందారు. 2017 మే నెలలో అమెరికాలోని మిసిసిపి యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌ను విజయవంతంగా పూర్తి చేసి అదే యూనివర్సిటీలో సీనియర్ సైంటిస్ట్ హోదా పొందారు. యూనివర్సిటీ యాజమాన్యం అయన ప్రతిభను గుర్తించి ఒక విభాగానికి అధిపతిగా నియమించింది. అతి తక్కువ సమయంలో అధిపతిగా నియమితులైన పిన్నవయస్కుడిగా డాక్టర్ సురేష్ బండారి పేరుగాంచారు. మొత్తం 110 పబ్లికేషన్స్, 2865 సైటేషన్స్ (అనులేఖనాలు) రూపొందించడంతో పలు పేటెంట్ హక్కులు పొందారు. అంతకుముందు హనుమకొండ విద్యా నగర్‌లోని సెయింట్ పీటర్స్ ఫార్మసీ కాలేజీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో మొదటిసారి కోవిడ్‌కు గురై త్వరగానే కోలుకున్నారు. కోవిడ్ అనంతరం మళ్లీ అస్వస్థతకు గురై అస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10.30 గంటలకు మిసిసిపిలో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమా రులు ఉన్నారు. సురేష్ బండారి తండ్రి మొగిలయ్య యోగా గురువుగా హనుమకొండ నగర ప్రజలకు సుపరిచితుడు. (చదవండి: ప్రాణం తీసిన ‘ప్రేమ’ పంచాయితీ) -
సీఎం జగన్‌తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి భేటీ
సాక్షి, అమరావతి: ఫార్మాస్యూటికల్స్ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉంది. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాయంలో కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ కలిశారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పారిశ్రామిక ప్రగతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి వివరించారు. దీనిపై దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ప్రకటన రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై సీఎం ఆలోచనలు తనను ముగ్దుడ్ని చేశాయని సన్‌ఫార్మా అధినేత సంఘ్వీ పేర్కొన్నారు. -
Leena Gandhi Tewari: మర్యాద ఇచ్చిపుచ్చుకుంటాం.. 3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో
Leena Gandhi Tewari Inspirational Story: ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి కంపెని యుఎస్వీ ప్రధాన కార్యాలయం దగ్గర ఒక తోట ఉంటుంది. ఆ తోటలోనే కాదు కార్యాలయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడా అరుపులు, కేకలు వినబడవు. ప్రశాంతమైన వాతావరణంలో పని జరుగుతుంటుంది. ‘నేను నీ కంటే ఎక్కువ. నువ్వు నా కంటే తక్కువ... అనే వాతావరణం మా సంస్థలో కనిపించదు. మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటుంది లీనా గాంధీ తివారి. యుఎస్వీ చైర్పర్సన్ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్ ‘100 రిచెస్ట్ ఇండియన్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళలలో రూ.3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో నిలిచింది. చదవండి : Divya Gokulnath: ఫోర్బ్స్ లిస్ట్‌లో.. సంపద ఎంతో తెలుసా? ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, సోషల్ రెస్పాన్స్‌బిలిటీ భిన్న ధృవాలుగా కనిపిస్తాయి. కానీ మనసు ఉన్న వాళ్లకు రెండు వేరు వేరు కావు. లీనా తివారి ఇలాంటి వ్యక్తే. వ్యాపార నైపుణ్యం, సామాజిక బాధ్యతను మిళితం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది లీనా. ‘డా. సుశీలగాంధీ– సెంటర్ ఫర్ అండర్ ప్రివెలేజ్డ్ ఉమెన్’ తరఫున అట్టడుగు వర్గాల మహిళలకు అనేక రకాలుగా సహాయంగా నిలుస్తుంది. పేద గ్రామీణ విద్యార్థులకు విద్య చెప్పించడం నుంచి కంప్యూటర్లో శిక్షణ ఇప్పించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ‘మహిళలు తమ సొంతకాళ్ల మీద నిలబడేలా చేయడానికి సహకరించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆడవాళ్లు ఎంత చదువుకున్నా పురుషులతో సమానం కాదు అనే ఆధిపత్య భావజాలాన్ని తొలగించడం మరో ఎత్తు. మొదటి లక్ష్యం సులభమేకాని రెండోది మాత్రం క్లిష్టమైనది. దానికి నిరంతర కృషి కావాలి. క్లిష్టమైన వాటిని దారికి తేవడం ఎంటర్ప్రెన్యూర్ చేసే పనుల్లో ఒకటి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను అదే చేయాలనుకుంటున్నాను’ అంటున్న లీనా మాటల్లోనే కాదు చేతల్లోనూ తన మాట నిలబెట్టుకుంటుంది. యుఎస్వీలో ఉన్నతస్థానాల్లో మహిళలు ఉన్నారు. వారి ప్రతిభ, కృషి సంస్థ విజయానికి ఇంధనంగా పనిచేస్తుంది. ‘మొదట్లో ఏ మహిళలకైనా ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తే...నేను చేయలేనేమో అన్నట్లుగా మాట్లాడేవారు. నువ్వు తప్పకుండా చేయగలవు. నీలో ఆ ప్రతిభ ఉంది...అని ప్రోత్సహిస్తే కీలక బాధ్యతలను భుజాన వేసుకోవడం మాత్రమే కాదు తమను తాము నిరూపించుకున్న మహిళలు మా సంస్థలో ఎంతోమంది ఉన్నారు’ అంటుంది లీనా. 1961లో యుఎస్వీ ఏర్పాటయింది. అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు స్త్రీలను గౌరవించే సంస్కృతికి కూడా సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది. పెద్దలు పాదుకొల్పిన ఈ విలువలను మరింత ముందుకు తీసుకువెళుతుంది లీనా. ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్’లో పట్టా పుచ్చుకుంది. వ్యాపార పాఠాలు మాత్రమే కాదు జీవితపాఠాలను కూడా చదువుకుంది లీనా. అందుకే ‘ఫోర్బ్స్’ మాత్రమే కాదు ఫిలాంత్రోపి జాబితాలోనూ ఆమె అగ్రస్థానంలో ఉంటుంది. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం. దీనిలో ఒక వాక్యం... ‘నువ్వు గెలవడమే కాదు ఇతరుల గెలుపు గురించి కూడా ఆలోచించు' లినా తివారీ గాంధీ వ్యక్తిత్వానికి అద్దం పట్టే వాక్యం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: World Post Day: జ్ఞాపకాల మూట -
పిరమల్ పునర్వ్యవస్థీకరణకు సై
న్యూఢిల్లీ: వ్యాపార పునర్వ్యవస్థీకరణకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చనట్లు డైవర్సిఫైడ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ తాజాగా వెల్లడించింది. దీనిలో భాగంగా ఫార్మాస్యూటికల్, ఫైనాన్షియల్ సరీ్వసుల బిజినెస్‌లను రెండు ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు తెలియజేసింది. కంపెనీ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ వీటిని రెండు లిస్టెడ్ కంపెనీలుగా విభజించనున్నట్లు వివరించింది. ఫార్మాస్యూటికల్ బిజినెస్‌ను పూర్తిగా విడదీయడం ద్వారా కన్సాలిడేట్ చేయనున్నట్లు తెలియజేసింది. పిరమల్ ఫార్మా పేరుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. దీంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో లిస్టయిన అతిపెద్ద ఫార్మా కంపెనీలలో ఒకటిగా పిరమల్ ఫార్మా నిలవనున్నట్లు తెలియజేసింది. ఏర్పాటు ఇలా..: బిజినెస్ విడతీతలో భాగంగా వాటాదారులకు ప్రతి 1 పిరమల్ ఎంటర్ప్రైజెస్(పీఈఎల్) షేరుకిగాను 4 పిరమల్ ఫార్మా లిమిటెడ్(పీపీఎల్) షేర్లను కేటాయించనుంది. పీఈఎల్ షేరు ముఖవిలువ రూ. 2 కాగా.. పీపీఎల్ షేరు రూ. 10 ముఖ విలువతో జారీ కానుంది. మరోవైపు పిరమల్ ఫార్మా నిర్వహణలోగల రెండు పూర్తి అనుబంధ సంస్థలను పీపీఎల్లో విలీనం చేయనుంది. తద్వారా ఫార్మా బిజినెస్ నిర్మాణాన్ని సులభతరం చేయనుంది. గత కొన్నేళ్లుగా ఒకే లిస్టెడ్ హోల్డింగ్ కంపెనీ పిరమల్ ఎంటర్ప్రైజెస్ ద్వారా డైవర్సిఫైడ్ బిజినెస్‌లను గ్రూప్ నిర్వహిస్తున్నట్లు చైర్మన్ అజయ్ పిరమల్ పేర్కొన్నారు. తాజాగా కార్పొరేట్ నిర్మాణాన్ని సరళతరం చేస్తూ బిజినెస్‌లను రెండుగా విడదీసేందుకు బోర్డు నిర్ణయించినట్లు తెలియజేశారు. వెరసి ఫైనాన్షియల్ సరీ్వసులు, ఫార్మా విభాగాల్లో నాయకత్వ స్థాయిలో ఉన్న స్వతంత్ర కంపెనీలుగా ఆవిర్భవించనున్నట్లు వివరించారు. కంపెనీల తీరిలా..: కాంట్రాక్ట్ తయారీ, అభివృద్ధి(సీడీఎంవో), కాంప్లెక్స్ జనరిక్స్‌లో గ్లోబల్ పంపిణీ, కన్జూమర్ ప్రొడక్టులు తదితరాలతో పిరమల్ ఫార్మా అతిపెద్ద లిస్టెడ్ కంపెనీలలో ఒకటిగా ఆవిర్భవించనున్నట్లు అజయ్ పేర్కొన్నారు. సీడీఎంవో బిజినెస్‌లో మూడు అతి పెద్ద కంపెనీలలో ఒకటిగా నిలవనున్నట్లు తెలియజేశారు. ఇక ఫైనాన్షియల్ సర్వీసుల విభాగంలో పిరమల్ ఎంటర్ప్రైజెస్ అతిపెద్ద లిస్టెడ్ డైవర్సిఫైడ్ ఎన్బీఎఫ్సీలలో ఒకటిగా ఏర్పాటు కానున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా పీహెచ్ఎల్ ఫిన్వెస్ట్ ప్రయివేట్ లిమిటెడ్‌ను పీఈఎల్లో విలీనం చేయనున్నారు. మరోపక్క డీహెచ్ఎఫ్ఎల్లో 100 శాతం వాటాను సొంతం చేసుకోవడంతో పీఈఎల్కు పూర్తి అనుబంధ కంపెనీగా ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ కొనసాగనున్నట్లు అజయ్ వెల్లడించారు. పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 2,899 వద్ద ముగిసింది. -
రతన్ టాటా పక్కన ఈ వ్యాపారవేత్త ఎవరంటే..
సాక్షి, ముంబై: టాటా గ్రూప్ ఫౌండర్, పారిశ్రామికవేత్త రతన్ టాటా తాజా పెట్టుబడులు ఆసక్తికరంగా నిలిచాయి. ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడుల వివరాలను ఆయన వెల్లడించలేదు. ముంబైలోని యువ వ్యవస్థాపకుడు, సీఈవో అర్జున్ దేశ్‌పాండే (18)కు చెందిన ‘జనరిక్ ఆధార్'లో 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు. సరసమైన ధరలకే ఔషధాలను అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ముంబైకు చెందిన అర్జున్ దేశ్‌పాండే 2018లో రూ. 15 లక్షల ప్రారంభ నిధులతో ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. జెనెరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనెరిక్ ఔషధాలను తయారీదారు నుండి నేరుగా చిల్లర వ్యాపారులకు అందిస్తుంది. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. ఫలితంగా మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులను విక్రయిస్తుంది. ఫార్మసిస్ట్‌లు, ఐటీ ఇంజనీర్లు, మార్కెటింగ్ నిపుణులు సహా ఈ సంస్థలో సుమారు 55 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం, ముంబైలో 35 ఫ్రాంచైజీలున్నాయి. ఇతర మెట్రోలలోకి విస్తరించలనే ప్రణాళికలో వుంది. అలాగే రాబోయే నెలల్లో 1,000 ఫ్రాంఛైజీలను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, గోవా, రాజస్థాన్, గుజరాత్ వంటి మార్కెట్లకు తమ పరిధిని విస్తరించాలని జెనెరిక్ ఆధార్ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్, జెనెరిక్, హోమియోపతి, ఆయుర్వేద ఔషధాలను అందిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ మందులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు త్వరలోనే ప్రజలకు అందించాలని ప్లాన్ చేస్తోంది. (రిలయన్స్ దన్ను, భారీ లాభాలు) కంపెనీ ప్రతిభను గుర్తించి రతన్ టాటా పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా వుందని దేశ్‌పాండే తెలిపారు. ఫార్మా వ్యాపారంలో ఉన్న తన తల్లితో కలిసి విదేశాలకు వెళ్ళిన తరువాత జెనెరిక్ ఆధార్ ఆలోచన తనకు వచ్చిందని దేశ్‌పాండే చెప్పారు. దేశవ్యాప్తంగా సాధారణ ప్రజలకు సరసమైన ధరలకు మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించుకున్నానన్నారు. కాగా అర్జున్ దేశ్‌పాండే తల్లి ఔషధ మార్కెటింగ్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు మందులను విక్రయిస్తుంటారు. తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు. మరో వైపు కొత్త వ్యాపారాలను నిర్మించాలనుకునే యువకులకు ఉద్దేశించిన సిలికాన్ వ్యాలీలోని థీల్ ఫెలోషిప్ (రెండేళ్లు) కోసం దేశ్‌పాండే షార్ట్ లిస్ట్ కావడం విశేషం. చదవండి : మరో ఫేక్ న్యూస్ : రతన్ టాటా ఆందోళన -
ఔషధ మొక్కల రైతు, వైద్యుడు!
మారుమూల గిరిజన ప్రాంతాల్లో వనమూలికలతో సంప్రదాయ వైద్యం కొత్తేమీ కాదు. అయితే, అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్న తరుణంలో వనమూలికల కోసం పూర్తిగా అడవులపై ఆధారపడలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తనకున్న అరెకరం భూమిలో వందలాది రకాల ఔషధ మొక్కలను సాగు చేస్తూ రోగులకు మూలికా వైద్యం అందిస్తూ ప్రశంసలందుకుంటున్నారు మండంగి చలపతిరావు. విజయనగరం జిల్లా కురుపాం మండలం వెంపటాపురం (పెదగొత్తిలి పంచాయతీ) మండంగి చలపతిరావు స్వగ్రామం. తాత నుంచి నేర్చుకున్న మూలికా వైద్యాన్ని కొనసాగిస్తున్న ఆయన తన అరెకరం పొలంలో 363 ఔషధ మొక్కలను సాగు చేయటంతోపాటు.. ఆ మూలికలతోనే గిరిజనులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి మూలికా వైద్యం కోసం రోగులు ఆయన వద్దకు తరలివస్తున్నారు. అల్సర్, టీబి, షుగర్, రక్తహీనత, పచ్చకామెర్లు, పక్షవాతం, కాలేయ సమస్యలు, విరిగిన ఎముకలకు, చివరకు కేన్సర్‌కు కూడా మూలికా వైద్యం అందిస్తున్నారు. చలపతిరావు 1995లో జరడ గ్రామంలో తన తాత వద్ద వనమూలికా వైద్య సేవలు నేర్చుకున్నారు. దానిని అందరికి అందించాలన్న లక్ష్యంతో 1999లో వెంపటాపురం గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. అప్పటి నుండి వనమూలికా వైద్యాన్ని గిరిజనులకు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారికి అందిస్తున్నారు. తక్కువ ఖర్చుతోనే మొండి వ్యాధులను సైతం నయంచేసి ఔరా అనిపిస్తున్నారు. మూలికలను సేకరించడానికి అడవిలో అన్ని రకాల ఔషధ మొక్కలు లభించకపోవటంతో కొన్ని మొక్కలు, విత్తనాలను సేకరించి నాలుగేళ్లుగా సాగు చేయటం ప్రారంభించారు. తనకున్న కొద్దిపాటి అరెకరం పొలంలోనే కొన్ని ఔషధ మొక్కలను సాగు చేస్తున్నారు. తెల్లపసుపు, నల్లపసుపు, నాగసారం, జిల్లేడు, అడవిధాన్యం చెట్టు, ఉత్రవెల్లి, లక్ష్మీ తులసి, తెల్లచిత్రమూల, బుర్జ చెట్టు, నాగర్జన్ ఉల్లి, కొమ్మెత్తుకొమ్ము, మురదండ, పాలతీగ, నేలవేము, తిప్పతీగ, అడవి గుమ్మడి, నేరేడు వంటి 363 వనమూలిక మొక్కలను సాగు చేసి వాటి వేర్లు, ఆకు చిగుర్లతో పొడులు, పసర్లు తయారు చేసి రోగులకు చికిత్స చేస్తున్నారు. వనమూలికల సాగు కోసం అవసరమైన మొక్కలు, విత్తనాలను అడవి నుంచే సేకరిస్తున్నారు. ఔషధ మొక్కల సాగుకు వర్షపు నీరే ఆధారం కావడంతో నవంబర్ నెల దాటే సరికి అవసరమైన మేర సేకరించి, శుద్ధి చేసి భద్రపరుచుకుంటారు. కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగిస్తారు. చీడపీడలు రాకుండా ఆవు మూత్రం అప్పుడప్పుడూ పిచికారీ చేస్తారు. మొక్కలు డిసెంబర్ నుంచి మే నెలాఖరు వరకూ ఎండిపోయిన స్థితిలోనే ఉంటాయి. వర్షాలు పడిన తర్వాత మొక్కలు మళ్లీ చిగురిస్తాయి. గెడ్డబోడ మొక్కను కేన్సర్ చికిత్సలో ఆయన ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు సహాయం అందిస్తే మరింత మందికి వైద్యం అందిస్తానన్నారు. మూలికల సాగుకు తోడ్పడాలి! నేను చదివింది 7వ తరగతి. మాత తాత దగ్గర నుంచి మూలికల సాగుతోపాటు వైద్యం కూడా నేర్చుకున్నాను. అడవి నుంచి తెచ్చిన మూలికలకు తోడు నేను అరెకరంలో పండించిన మూలికలను కలిపినా రోగులకు సరిపోవడం లేదు. ఐటీడీఏ అధికారులు ప్రోత్సాహం అందిస్తే మరింత విస్తీర్ణంలో ఏడాది పొడవునా ఔషధ మొక్కలను సాగు చేపట్టి.. వైద్యసేవలను మరింత విస్తృత పరచవచ్చు. వన మూలికల సాగుకు బోరు నీటి సదుపాయం కల్పించాలి. మందుల తయారీకి యంత్ర పరికరాల అవసరం ఉంది. ఐటీడీఏ ప్రోత్సహిస్తే ఏడాది పొడవునా మూలికలను సాగు చేస్తూ, మరింత మంది రోగులకు వైద్యం అందించవచ్చు. వైజాగ్‌లో నయం కాని కేసులు కూడా నా దగ్గరకు వస్తున్నాయి. రోగి వయసును, వ్యాధి తీవ్రతను బట్టి ఔషధాల మోతాదు, వాడే కాలం ఆధారపడి ఉంటుంది. నా వద్ద మందులు వాడిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోతాదు ఎక్కువైనా ప్రమాదం ఉండదు. – మండంగి చలపతిరావు (94941 32910), ఔషధ మొక్కల రైతు, వెద్యుడు, వెంపటాపురం, విజయనగరం జిల్లా – బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం. ఫొటోలు: కె.చంద్రమౌళి, కురుపాం. ఔషధాలను తయారుచేస్తున్న మండంగి చలపతిరావు -
ఫార్మాలో హరీశ్‌కు పరిహారం
-
ఫార్మాలో హరీశ్‌కు పరిహారం
యాచారం (ఇబ్రహీంపట్నం): ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా మంత్రి టి.హరీశ్‌రావు పరిహారం అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలోని సర్వే నంబరు 196లో 7–24 ఎకరాలు, సర్వే నంబరు 178లో 9–19 ఎకరాల వ్యవసాయ భూమిని 2011లో ఆయన కొనుగోలు చేశారు. మొత్తం 17.03 ఎకరాలను కొనుగోలు చేసిన మంత్రి 2012 ఫిబ్రవరి 18న యాచారం తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. నక్కర్తమేడిపల్లిలో ఫార్మాసిటీకి భూ సేకరణ చేస్తున్న నేపథ్యంలో మంత్రి పట్టా భూమి సైతం ఫార్మాలో పోయింది. ఆ భూమిని టీఎస్ఐఐసీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన మంత్రి దానికి పరిహారంగా ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున రూ.2.12 కోట్లు తీసుకున్నారు. -
కారుచీకట్లో.. కమ్మేస్తున్న పొగలు
♦ విషం చిమ్ముతున్న పరిశ్రమలు ♦ ఘాటైన విష వాయువులతో ఉక్కిరిబిక్కిరి ♦ రాత్రి అయ్యిందంటే నరకమే.. రాత్రి అయ్యిందంటే చాలు ఊపిరి ఆగిపోయినంత పనవుతోంది. ఘాటైన విష వాయువులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫార్మా, రసాయన పరిశ్రమలు విషం చిమ్ముతుండటంతో జనం తల్లడిల్లిపోతున్నారు. రాత్రి పది దాటితే చాలు.. సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, లెడ్ వంటి విష వాయువులను అడ్డగోలుగా వదలుతున్నారు. ఆరుబయట నిద్రించాలంటేనే జంకుతున్నారు. అసలే ‘మండు’ తున్న వేసవికాలం.. ఇంట్లో ఉక్కపోత.. బయట పొగల వాతతో నరకయాతన పడుతున్నారు. పారిశ్రామిక వాడలేకాక, జిల్లా అంతటా ఇదే దుస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఇక్కడకు వచ్చి ఒక్క క్షణం ఉంటే తాము పడుతున్న బాధ తెలుస్తుందని స్థానికులు అంటున్నారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: పటాన్చెరు, పాశమైలారం పారిశ్రామిక వాడల్లో కంపెనీల యాజమాన్యం రెచ్చి పోతున్నాయి. రాత్రి అయితే చాలు.. ఫార్మా, స్పాంజ్, రసాయన పరిశ్రమల వాయు వ్యర్థాలను నేరుగా గాలిలోకి వదిలేస్తున్నారు. ప్రజా జీవనంపై అత్యంత ప్రభావం చూపే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, కార్బన్‌మోనాక్సైడ్, లెడ్ లాంటి విష వాయువులు ఇబ్బడిముబ్బడిగా విడుదలవుతున్నాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పొగ గొట్టాల ద్వారా వాయువులను వదిలేస్తున్నారు. ఈ దొంగ తంతును నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు చోద్యం చూస్తున్నారు. రాత్రి వేళలో వందలాది పరిశ్రమలు ఒకేసారి వాయువులను విడుదల చేయడంతో ఆ గాలులు పారిశ్రామిక వాడల పరిసరాలను దాటి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని తాకుతున్నాయి. ఆరుబయట పడుకుంటే.. రామచంద్రాపురం,పటాన్చెరు, జిన్నారం, సంగారెడ్డి, హత్నూరా, శివ్వంపేట, నర్సాపూర్ మండలాల పరిధిలోని గ్రామాల జనం విష వాయువులతో తల్లడిల్లిపోతున్నారు. వేసవి కాలం కావటంతో ఇంట్లో ఉక్కపోతకు, ఆరుబయట పరిశ్రమల విష గాలులకు తట్టుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలం ఉక్కపోత నుంచి ఉపశమనం పొందటానికి పల్లె ప్రజలు ఆరుబయట పడుకుంటారు. కానీ పరిశ్రమల నుంచి వస్తున్న విషపు గాలులతో ఆరుబయట పడుకునే పరిస్థితి లేదు. సరిగ్గా ఐదు నిమిషాలు నిలబడి గాలి పీల్చే పరిస్థితి లేదు. ఫార్మా, రసాయన కంపెనీల నుంచి వస్తున్న నైట్రోజన్ డై ఆక్సైడ్తో కళ్లు, ముక్కులు మండిపోతున్నాయి. ఆరుబయట పడుకుంటే తెల్లారే సరికి వాంతులు, విరోచనాలు , తీవ్రమైన చిరాకుకు లోనవుతున్నారు. ఇక్కడి గాలి అంతా విషమే... నిబంధనల ప్రకారం సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్ 80 మైక్రో గ్రాముల వరకు మాత్రమే ఉండాలి, వాస్తవానికి అదికూడా ఎక్కువే. సీసం 1.5, కార్భన్ మోనాక్సైడ్ 5 మైక్రో గ్రామల వరకు ఉండొచ్చు. కానీ పాశం మైలారం, పటాన్చెరు, సంగారెడ్డి పారిశ్రామిక వాడలపరిసర ప్రాంతాల్లోని నివాస పల్లెల్లో సల్ఫర్ డయాక్సైజ్, నైట్రోజన్ ఆక్సైడ్ పరిమాణం 101 నుంచి 140 మైక్రో గ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లు పీసీబీ నివేదికలు చెబుతున్నాయి. సీసం, కార్భన్ మోనాక్సైడ్ పరిమాణం కూడా 5 మైక్రో గ్రామల కంటే ఎక్కువగానే ఉన్నట్లు రికార్డు అయింది. వాస్తవానికి ఈ నివేదికల్లో కూడా లోపాలు ఉన్నాయి. వాస్తవంగా పరిశ్రమల నుంచి వస్తున్న వాయు కాలుష్యాన్ని అధికారులు సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. యాజమాన్యాల ఇష్టారాజ్యం వాస్తవానికి వాయువుల విష గాఢతను అంచనా వేయడానికి కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు ప్రతి ఫార్మా, రసాయన పరిశ్రమ పొగ గొట్టం చివరన కాలుష్య నిర్ధారణ పరికరాలను ఏర్పాటు చేశారు. ఈ శాస్త్రీయ పరికరాన్ని తాకుతూ పొగ వెళ్తే... ఆ పొగలో ఉన్న విష వాయువులు, వాటి పరిమాణంను గుర్తించి రికార్డు చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వాయు వ్యర్థాలను విడుదల చేసిన పరిశ్రమలపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కంపెనీల యాజమాన్యం పొగగొట్టం మధ్యలోనే ఒక భారీ రంధ్రాన్ని ఏర్పాటు చేసి వాయువులను దారి మళ్లిస్తున్నారు. దీంతో విష వాయువుల గాఢత రికార్డు కాకుండా పోతోంది. -
నరకయాతన..!
పిడుగురాళ్ల : ఔషధ బాధితులు నిత్యం నరకయాతనతో కొట్టుమిట్టాడుతున్నారు. వారిని పట్టించుకునే నాథుడు లేక, సాయం అందక విలవిలలాడుతున్నారు. పిడుగురాళ్ల పట్టణం ఆదర్శనగర్, లెనిన్‌నగర్‌లలో సుమారు 24 మంది ఔషధ బాధితులు ఉన్నారు. 2011లో హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన యాక్సిస్ క్లినిక్స్ లిమిటెడ్ ల్యాబ్‌లో ఔషధ తయారీ కోసం మనుషులపై ప్రయోగాలు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఔషధ ప్రయోగ బాధితుల్లో ఐలా నరసింహారావు(43) అనారోగ్యానికి గురై మృతి చెందాడు. మరికొందరు అనారోగ్యంతో మంచంపట్టారు. బతక లేక దీనావస్థలో ఉన్నారు. ఈ ల్యాబ్‌లో మూడు నెలలకు నిర్వహించాల్సిన రక్త పరీక్షలు ఒక్క నెలలోనే మూడు సార్లు నిర్వహించడం వల్ల రక్తహీనత ఏర్పడి అనారోగ్యం బారినపడ్డారు. ఇక్కడి నుంచి తీసుకెళ్లిన 24 మందికి రోజు వ్యవధిలోనే 18 సార్లు 15 ఎంఎల్ చొప్పున రక్తాన్ని శ్యాంపిల్‌గా తీసి ప్రయోగాలు నిర్వహించారు. కొన్ని ట్యాబ్లెట్లు మింగించి ప్రయోగాలు నిర్వహించారు. ఫలితంగా వీరంతా అనారోగ్యం బారిన పడ్డారు. పట్టించుకోని అధికారులు.... అప్పట్లో ఔషధ ప్రయోగాలపై స్పందించి ప్రభుత్వం హుటాహుటిన బాధితులను హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రికి పంపి వైద్య సేవలు అందించింది. అంతేకాక, అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారులంతా బాధితులు కోలుకునేంతవరకు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో ఇప్పటికీ వారంతా అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు. అందని సహాయం.. ఔషధ ప్రయోగాలకు గురైన 24 మందికి ఆరోగ్య సేవలతో పాటు ఒక్కొక్కరికి రెండు సెంట్ల స్థలం, ఆ స్థలంలో గృహాన్ని నిర్మించి ఇవ్వడంతో పాటు రూ.2 లక్షల నష్టపరిహారం అందిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. వీటిల్లో ఒక్కటి కూడా వారి దరిచేరలేదు. ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది పడుతున్నా ... నన్ను ముందుగా ల్యాబ్‌లో పరీక్షించి నాకు 43546 అనే నంబర్ ఇచ్చారు. ఈ నంబర్ యాక్సిస్ క్లినికల్ ల్యాబ్‌లో ఎంటర్ చేస్తే నాకు ఏ పరీక్షలు నిర్వహించారో, ఏ మందులు వాడారో అన్న పూర్తి వివరాలు వస్తాయి. వీళ్ల ప్రయోగాల వల్ల ఆరోగ్యం దెబ్బతిని ఇబ్బంది పడుతున్నాను. - కొమ్ము కరుణమ్మ,బాధితురాలు ఎడమ వైపు భాగాలన్నీ పనిచేయడం లేదు ఏవో పరీక్షలు చేసి మందులు ఇచ్చి రూ.10 వేలు ఇస్తామని చెబితే ఇల్లు గడవని పరిస్థితిలో పరీక్షలకు ఒప్పుకున్నా. కొన్ని రోజులకు ఎడమ వైపు శరీర భాగాలన్నీ పనిచేయడం లేదు. పది వేల కోసం ఆశపెడితే ఇప్పుడు ఏ పని చేసుకోలేకపోతున్నా. - అడిగొప్పల మల్లీశ్వరి, బాధితురాలు కుడి కంటి చూపు పోయింది ... ల్యాబ్‌లో పరీక్షలు చేసి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత కళ్లల్లో నుంచి విపరీతమైన ఆవిరితో పాటు నీరు కూడా కారింది. కొన్ని రోజులకు కుడి కంటిచూపు పూర్తిగా పోయింది. ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఏమైనా పనులు చేసుకోవాలన్నా సహకరించడంలేదు. ఎక్కువ శాతం మంచం మీదే గడపాల్సి వచ్చింది. పేదరికంతో డబ్బు కోసం ఆశపడి పరీక్షలు చేయించుకుంటే ఇప్పుడు మంచాన పడాల్సి వచ్చింది. - షేక్ బీబీ, బాధితురాలు -
కంపల్సరీ లెసైన్సుకు దరఖాస్తు చేసిన లీ ఫార్మా
- మధుమేహ ఔషధం తయారీకి రెడీ - అతి తక్కువ ధరకే అందించేందుకు సిద్ధం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ లీ ఫార్మా మధుమేహ చికిత్సలో వాడే సాక్సాగ్లిప్టిన్ ఔషధం తయారీకై కంపల్సరీ లైసెన్సు కోసం దరఖాస్తు చేసింది. పేటెంటెడ్ డ్రగ్ అయిన సాక్సాగ్లిప్టిన్ను ఆన్గ్లైజా బ్రాండ్ పేరుతో, అలాగే మెట్ఫార్మిన్ కాంబినేషన్‌తో కాంబిగ్లైజ్ బ్రాండ్‌తో ఆస్ట్రాజెనికా భారత్‌లో మార్కెట్ చేస్తోంది. వాలంటరీ లెసైన్సు కోసం ఆస్ట్రాజెనికాతో గత ఎనిమిది నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నట్టు లీ ఫార్మా ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. పేటెంటు యాక్టు సెక్షన్ 84 ప్రకారం కంపల్సరీ లెసైన్సు కావాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి. ఇక సాక్సాగ్లిప్టిన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని, ఇన్సులిన్ వాడే అవసరం లేదని కంపెనీ వర్గాలు అంటున్నాయి. లీ ఫార్మాతో కలిపి ఇప్పటి వరకు భారత్‌లో కంపల్సరీ లెసైన్సుకు చేసుకున్న దరఖాస్తుల సంఖ్య మూడుకు చేరుకుంది. బేయర్ తయారీ క్యాన్సర్ ఔషధమైన నెక్సావర్ జనరిక్ వర్షన్ కోసం నాట్కో చేసుకున్న దరఖాస్తు మొదటిది కాగా, బ్రిస్టల్ మేయర్ స్క్విబ్ తయారీ క్యాన్సర్ మందు డసాటినిబ్ జనరిక్కై బీడీఆర్ కంపెనీ దరఖాస్తు రెండోది. నాట్కోకు మాత్రమే కంపల్సరీ లెసైన్సు దక్కింది. అతి తక్కువ ధరలో..ఇక ఆన్గ్లైజాకు జనరిక్ వర్షన్ ఔషధాన్ని తయారు చేసేందుకు అనుమతి కోరుతూ జూన్ చివరి వారంలో లీ ఫార్మా దరఖాస్తు చేసింది. సరిపడ లభ్యత లేకపోయినా, అందుబాటు ధరలో లభించని పరిస్థితుల్లో ఔషధానికి పేటెంటు వచ్చిన మూడేళ్ల తర్వాత కంపల్సరీ లెసైన్సుకు దరఖాస్తు చేయవచ్చు. ఆస్ట్రాజెనికా భారత్‌లో ఆన్గ్లైజా ట్యాబ్లెట్‌ను రూ.41-45 మధ్య, కాంబిగ్లైజ్ను రూ.49కి విక్రయిస్తోంది. వాస్తవానికి దిగుమతి అయిన ఒక్కో ట్యాబ్లెట్‌కు కంపెనీకి అయిన వ్యయం 80-92 పైసలు మాత్రమే. పేషెంటుకు నెలకు అయ్యే ఖర్చు సుమారు రూ.1,300. ఇది రోగులకు భారమేనని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సాక్సాగ్లిప్టిన్ 2.5 ఎంజీ ట్యాబ్లెట్‌కు రూ.27, 5 ఎంజీ ట్యాబ్లెట్‌ను రూ.29లకే అందించాలని లీ ఫార్మా నిర్ణయించింది. అలాగే సాక్సాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ కాంబినేషన్ డ్రగ్‌ను దాని సామర్థ్యాన్నిబట్టి రూ.30-31.50లకే ఆఫర్ చేస్తోంది. ఆస్ట్రాజెనికాకు చెల్లించాల్సిన రాయల్టీతో కలుపుకుని ఈ ధరలను నిర్ణయించింది. -
వేప నూనెతో ఎన్నో ప్రయోజనాలు
వేపనూనె... వేప పిండి... ఇవి రెండూ రైతులకు సుపరిచితమే. వీటి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపైనా అవగాహన ఉంది. అయితే వినియోగంలో మాత్రం అంతగా చొరవ చూపడంలేదు. వేపనూనె వినియోగిస్తే పైరును చీడపీడలు ఆశించవు. రసాయన మందుల వాడకం తగ్గుతుంది. సాగు ఖర్చులు కలిసొస్తాయి. వేపనూనె వినియోగం, దాని వల్ల కలిగే ప్రయోజనాలు కంకిపాడు ఏవో లంక శ్రీనివాస్ మాటల్లో.. వేపనూనెలో అజాడిరిక్టన్ అనే పదార్థం ఉంటుంది. ఇది చేదుగా ఉంటుంది. దీనిని వాడితే మొక్కలు కూడా చేదెక్కుతాయి. దీని వల్ల మొక్కలను తినేందుకు పురుగులు ఆశించవు. వేప నూనె, వేపపిండి వినియోగిస్తే పైరులను ఆశించే చీడపీడలను నివారించొచ్చు. దీంతో పురుగు మందుల వినియోగం ఖర్చు తగ్గుతుంది. వేపనూనె ద్వారా పంటకు అవసరమైన చేవ సమృద్ధిగా అందుతుంది. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గడంతో రైతుకు పెట్టుబడులపై వ్యయం ఆదా అవుతుంది. గతంలో వేపనూనె వినియోగం తక్కువగా ఉండేది. ప్రస్తుతం రైతుల్లో అవగాహన పెరగటంతో వినియోగం కొద్దిగా పెరిగింది. వేపనూనె వినియోగం, దాని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. - కంకిపాడు ఇలా వాడుకోవాలి.. వేప నూనెను పంట పొలంలో నేరుగా కానీ, యూరియా, పురుగు మందుల్లో కానీ కలిపి వినియోగించాలి. పంట ఏదైనా సరే, ఏ సమయంలో నైనా వేప నూనె వాడితే పంటకు మేలు చేకూరుతుంది. యూరియా, పురుగు మందు, సూక్ష్మధాతు మిశ్రమాల్లో వేపనూనె కలిపి వాడుకోవచ్చు. యూరియా 50 కిలోల బస్తాకు అర లీటరు నుంచి లీటరు వరకూ వేప నూనె, వేప పిండి అయితే 50 కిలోల బస్తాకు 10 కిలోల వరకూ కలిపి వాడుకోవాలి. యూరియా భూమిలో త్వరగా కరిగిపోకుండా చూస్తుంది. నత్రజని మొక్కకు ఎక్కువ సమయం అందే విధంగా చూడటం వేప నూనె ద్వారానే సాధ్యం. నత్రజని వృథా కాకుండా నిరోధిస్తుంది. పంటలకు కీడుచేసే పురుగు సంతతిని నివారిస్తుంది. పురుగుకు చెందిన గుడ్లు పొదగకుండా వాటిని నిర్వీర్యం చేయటంలో దోహదపడుతుంది. దీని వల్ల అధికంగా పురుగు మందులు వినియోగించాల్సిన అవసరం ఉండదు. వేప నూనె వాడకంతో నత్రజని ఎరువులు వినియోగం తగ్గుతుంది. వ్యవసాయ పెట్టుబడుల్లో ఖర్చులో 20 శాతం, పురుగు మందుల వినియోగం ఖర్చులో 40 శాతం తగ్గుతుంది. నత్రజని వృథా కాకుండా ఉండటమే కాకుండా, మొక్క చేదు ఎక్కటం వల్ల పురుగు వ్యాప్తి నిరోధించటానికి దోహదపడుతుంది. పండ్ల తోటల్లో వినియోగం ఇలా.. పండ్ల తోటల్లో అయితే వేప నూనెను చిన్న ప్లాస్టిక్ సంచుల్లో నింపి మొక్క వేరుకు తగిలించాలి. వేరు ద్వారా నూనె మొక్కకు నేరుగా చేరుతుంది. దీని వల్ల పురుగును నివారించుకోవచ్చు. గానుగ నుంచి తెచ్చిన వేప పిండి పండ్ల తోటలకు పనికిరాదు. వేపనూనెనే వినియోగించాలి. అరటి, పసుపు, కంద, మిర్చి తోటల్లో ఆముదపు పిండి, గానుగ పిండి, పొగాకు పిండితో పాటుగా వేప పిండి కలిపి చల్లుకుంటే పంటకు ఉపయుక్తంగా ఉంటుంది. మొక్క ఎదుగుదలకు, పురుగు నియంత్రణకు పిండి దోహదపడుతుంది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై వేపనూనె అందిస్తుంది. లీటరు రూ.100 చొప్పున విక్రయిస్తోంది. వేప పిండి మాత్రం వ్యవసాయ శాఖ ద్వారా సరఫరా లేదు. బయటి మార్కెట్లో 40 కిలోల వేప పిండి బస్తా రూ.600 నుంచి రూ.800 వరకూ ధర పలుకుతోంది. లంక శ్రీనివాస్ 88866 13370