
యాచారం (ఇబ్రహీంపట్నం): ఫార్మాసిటీ భూ సేకరణలో భాగంగా మంత్రి టి.హరీశ్‌రావు పరిహారం అందుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లిలోని సర్వే నంబరు 196లో 7–24 ఎకరాలు, సర్వే నంబరు 178లో 9–19 ఎకరాల వ్యవసాయ భూమిని 2011లో ఆయన కొనుగోలు చేశారు. మొత్తం 17.03 ఎకరాలను కొనుగోలు చేసిన మంత్రి 2012 ఫిబ్రవరి 18న యాచారం తహసీల్దార్ కార్యాలయంలో పట్టాదారు పాసు పుస్తకాలు పొందారు. నక్కర్తమేడిపల్లిలో ఫార్మాసిటీకి భూ సేకరణ చేస్తున్న నేపథ్యంలో మంత్రి పట్టా భూమి సైతం ఫార్మాలో పోయింది. ఆ భూమిని టీఎస్‌ఐఐసీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన మంత్రి దానికి పరిహారంగా ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున రూ.2.12 కోట్లు తీసుకున్నారు.