picnic spot
-
సెల్ఫీ మోజులో మహిళ మృతి
ఇండోర్ : ఎక్కడ చూసినా, ఎవర్ని చూసిన సెల్ఫీ సెల్ఫీ సెల్ఫీ. యువత సమయంతో సంబంధ లేకుండా ఫోన్లోనే కాలక్షేపం చేస్తూ సెల్ఫీలకు బానిసవుతున్నారు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు తిన్నా, పడుకున్నా, దగ్గినా, తుమ్మినా, నవ్వినా, ఏడ్చినా సందర్భం ఉన్నా లేకున్నా సరే సెల్ఫీలకు ఫోజులిస్తున్నారు నేటి జనం. ఎక్కడ ఉండి సెల్ఫీ దిగుతున్నామన్న ఆలోచన లేకుండా ఎక్కడ బడితే అక్కడ దిగేస్తున్నారు. లైకులు, కామెంట్ల కోసం ఆరాట పడుతూ ప్రమాదకరమైన చోట్ల సెల్ఫీలు దిగేందుకు సాహసం చేస్తున్నారు. ఇలా ప్రమాదకరంగా సెల్ఫీలు దిగుతూ ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా ప్రాణాలు వదులుకున్న సందర్భాలు గతంలో చాలా ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. ఆలోచించకుండా దిగరాని చోట్ల సాహసాలు చేసి ప్రాణాలు పోగుట్టుకుంటున్నారు. తాజాగా సెల్ఫీ దిగుతూ మరో మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్ నగరానికి చెందిన 30 ఏళ్ల మహిళ పిక్నిక్ స్పాట్ లో సెల్ఫీ దిగుతూ లోయలో జారి పడి గురువారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నీతూ మహేశ్వరి సరదగా గడపడానికి కుటుంబంతో కలిసి పిక్నిక్ కోసం ఇండోర్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్ గేట్ ప్రాంతానికి వెళ్లినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు. కొండ మీద సెల్ఫీ దిగుతూ జారిపడి లోయలో పడిందన్నారు. నాలుగు గంటల గాలింపు తరువాత లోయ నుంచి మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. -
పర్యాటకంలో విషాదం...
తూర్పుగోదావరి ,పి.గన్నవరం: సరదాగా ప్రకృతి ఒడిలో సేద తీరదామని వచ్చిన ఓ యువకుడు అదే ప్రకృతిలో ప్రాణాలను కోల్పోయాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వచ్చిన అతడిని మృత్యువు కాటేసింది. మారేడుమిల్లి నుంచి 14 కిలోమీటర్ల దూరంలోని పర్యాటక ప్రాంతం అమృతధార జలపాతం వద్దకు ఆదివారం సాయంత్రం పి.గన్నవరం మండలం ముంగండ గ్రామానికి చెందిన పాలూరి మణికంఠ (23) స్నేహితులతో వాహనంలో వచ్చాడు. స్నానం చేసేందుకు అమృతధార జలపాతం పైకి ఎక్కగా ప్రమాదవశాత్తూ పైనుంచి జారి పడ్డాడు. అతని శరీరానికి బలంగా బండరాళ్లు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతనిని స్నేహితులు వారు వచ్చిన వాహనంలో రంపచోడవరం ఆస్పత్రికి తీసుకు వెళ్లేసరికే అతడు మృతి చెందాడు. ముంగండలో విషాద ఛాయలు ముంగండ ముత్యాలమ్మ గుడి ప్రాంతానికి చెందిన మణికంఠ మరణించినట్టు సమాచారం రావడంతో అతడి తల్లిదండ్రులు, బంధువుల కన్నీరుమున్నీరుగా విలపించారు. అతడి తండ్రి ఆదినారాయణ కొబ్బరి కాయలు గ్రేడింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. తల్లి వెంకటలక్ష్మి గృహిణి. వీరికి అతడు ఏకైక సంతానం. అతడు కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. చేతికి అందివచ్చిన ఏకైక కుమారుడు తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో తల్లి,దండ్రులు, బంధువులు బోరున విలపిస్తున్నారు. -
పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: ఓ కేసు విషయంలో అలసత్వం వహించిన ఆదాయపు పన్ను(ఐటీ) శాఖపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇష్టానుసారం రావడానికి కోర్టు పిక్నిక్ స్థలం కాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. న్యాయస్థానానికి తప్పుడు సమాచారం సమర్పించడంపై తీవ్రంగా స్పందించిన జస్టిస్ మదన్.బి.లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం ఐటీ శాఖకు రూ.10 లక్షల జరిమానా విధించింది. సరైన కారణం చెప్పకుండా 596 రోజుల తర్వాత తీరిగ్గా స్పందించడంపై మండిపడింది. ఉత్తరప్రదేశ్‌లోని హపుల్–పిల్ఖువా అభివృద్ధి మండలి(హెచ్పీడీఏ) యూపీ పట్టణ ప్రణాళికాభివృద్ధి చట్టం–1973 కింద ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో ఐటీ చట్టం–1961 కింద రిజిస్ట్రేషన్ కోసం ఘజియాబాద్ ఐటీ కమిషనర్‌కు హెచ్పీడీఏ దరఖాస్తు చేసుకుంది. అయితే హెచ్పీడీఏ సేవా కార్యక్రమాల కోసం పనిచేయడం లేదన్న కమిషనర్ 2006, జూన్‌లో ఈ దరఖాస్తును తిరస్కరించారు. దీంతో హెచ్పీడీఏ ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్(ఐటీటీఏ)ను ఆశ్రయించడంతో.. కమిషనర్ ఆదేశాలను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఐటీటీఏ ఉత్తర్వులను సవాలుచేస్తూ ఆదాయపు పన్ను శాఖ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా చుక్కెదురైంది. దీంతో 2016, ఆగస్ట్ 29న ఐటీ శాఖ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. తాజాగా ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఇదే తరహా పిటిషన్ ఒకటి సుప్రీంకోర్టులో 2012 నుంచి పెండింగ్‌లో ఉందని ఘజియాబాద్ ఐటీ శాఖ కమిషనర్ కోర్టుకు తెలిపారు. అయితే 2012లో కేసుపై అప్పుడే తీర్పు ఇచ్చామన్న అత్యున్నత న్యాయస్థానం, కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మయం వ్యక్తంచేసింది. పిటిషన్ దాఖలు చేసిన 596 రోజుల తర్వాత కోర్టుకు హాజరుకావడం, ఈ ఆలస్యానికి సరైన కారణం చెప్పకపోవడంపై ఆగ్రహించిన ధర్మాసనం.. ఐటీశాఖకు రూ.10 లక్షల జరి మానా విధించింది. ఈ మొత్తాన్ని సుప్రీంకోర్టు న్యాయసేవల కమిటీ వద్ద 4 వారాల్లోగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని బాల నేరస్తులకు సంబంధించి అంశాల్లో వినియోగించాలని ధర్మాసనం తెలిపింది. -
సెల్ఫీ చంపేసింది
సుల్తాన్‌బజార్: సెల్ఫీ సరదా ఓ ఐఐటీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన ఎంజే మార్కెట్‌కు చెందిన నరేన్(20) ఉత్తరాఖండ్‌లోని చల్లా వాటర్‌డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులోపడి మృతి చెందాడు. ఈ నెల 18న డ్యామ్‌లోపడి గల్లంతు కాగా సోమవారం మృతదేహం దొరికింది. వివరాలు.. మాధవి, రాజేంద్రమోహన్ దంపతులు మోజంజాహి మార్కెట్లో నివాసముంటున్నారు. రాజేంద్రమోహన్ జూబ్లీహిల్స్‌లోని శౌర్యభవన్‌లో స్పెషల్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నరేన్ ఒక్కగానొక్క సంతానం. ఢిల్లీలో ఐఐటీ ప్రథమ సంవత్సరం చదువుతున్న నరేన్ తన 8 మంది స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం బయలు దేరారు. ఈ నెల 18న ఉత్తరాఖండ్‌లోని చెల్లా డ్యామ్ వద్ద సరదాగా సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు డ్యామ్‌లో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలను విస్తృతం చేశారు. మూడు రోజుల తరువాత పోలీసులు నరేన్ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నరేన్ మృతితో ఎంజేమార్కెట్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. -
బీచ్‌కు వెళ్లొద్దామా..!
మొగల్తూరు:ఉత్సాహపడుతున్న పర్యాటకులను చూసి ఉవ్వెత్తున ఎగిసిపడే సముద్రపు అలలు.. లయబద్ధంగా రివ్వున సవ్వడి చేసే సరుగుడు తోటలు.. కనువిందు చేసే సూర్యోదయం, సూర్యాస్తమయాలు.. సేదతీర్చే కొబ్బరి తోటలు.. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించే ఆలయాలు.. ఇలా పేరుపాలెం బీచ్ సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఈ నెల 20వ తేదీ నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండటంతో బీచ్‌లో విశేషాలు ఇలా..ఏటా కార్తీకమాసం, ప్రతి బుధ, ఆదివారాల్లో పేరుపాలెం బీచ్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. మన జిల్లా నుంచే కాక తూర్పు, కృష్టా జిల్లాల నుంచి వచ్చే పర్యాటకులతో బీచ్ కిక్కిరిసిపోతుంది. కేపీ పాలెం బీచ్ ప్రాంతంలో సుమారు 20 ఏళ్ల క్రితం ఆర్సీఎం మిషనరీ సంస్థ వేళాంకణి మాత ఆలయాన్ని సుందరంగా నిర్మించింది. ఏటా ఏప్రిల్‌లో వేళాంకణి మాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. సముద్రం నుంచి కొట్టుకు వచ్చిన వేంకటేశ్వరస్వామి విగ్రహానికి స్థానికులు ఆలయం నిర్మించారు. ఏటా కార్తీక మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పేరుపాలెం సౌత్ శివారున సముద్రం–ఉప్పుటేరు కలిసే ప్రాంతాన్ని సీ మౌత్ అంటారు. దీనిని మోళ్లపర్రు బీచ్‌గా, కనకదుర్గ బీచ్‌గా పిలుస్తారు. ఈ బీచ్‌లో మరో విశేషమేమిటంటే రాష్ట్రంలోనే రెండో అతి పెద్దదిగా 54 అడుగుల అభయాంజనేయ విగ్రహం చూపురులను కట్టిపడేస్తుంది. దీంతో పాటు సత్యనారాయణ స్వామి, షిర్డీ సాయిబాబా, పాండురంగస్వామి ఆలయాలున్నాయి. మోళ్లపర్రు బీచ్‌లో రూ.150 కోట్లతో చిల్డ్రన్స్ పార్క్ పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తయితే బీచ్ మరింత అహ్లాదకరంగా మారుతుంది. తస్మాత్ జాగ్రత్త పేరుపాలెం సముద్రంలో స్నానానికి దిగి గల్లంతైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఏటా కార్తీక మాసంలో నలుగురు, ఐదుగురు యువకులు గల్లంతువుతుండటం పరిపాటిగా మారింది. దీంతో పోలీసులు ఈ ఏడాది ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అతిగా మద్యం సేవించి సముద్ర స్నానానిక దిగేవారిని అడ్డుకుంటామని, బీచ్ ప్రాంతంలో మద్యం అమ్మకాలను నిషేధిస్తామని ఇటీవలే డీఎస్పీగా బాద్యతలు చేపట్టిన టీటీ ప్రభాకరరావు తెలిపారు. అంతే కాదు పర్యాటకులను సముద్రంలోపలికి వెళ్ల నీయకుండా ప్రత్యేక పోలీసులను ఏర్పాటు చేస్తామన్నారు. ఎటువంటి అకతాయి పనులకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సౌకర్యాలు నిల్ మరో నాలుగు రోజుల్లో కార్తీక మాసం ప్రారంభం కాబోతున్నా ఇప్పటివరుకు ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ఏటా లక్షలాది మంది పర్యాటకులు బీచ్‌లకు వస్తున్నా ప్రభుత్వ పరంగా సౌకర్యాలు మాత్రం నిల్. సముద్రస్నానానికి వచ్చే మహిళలు స్నానం అనంతరం బట్టలు మార్చుకోవాలంటే ఇబ్బందులు పడాల్సిందే. ఏటా తాత్కాలికంగా పాకలు వేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ప్రయివేటు వ్యక్తులు స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు , సముద్రస్నానం చేసిన అనంతరం స్నానం చేసేందుకు షవర్ బాత్‌లు ఏర్పాటు చేశారు. మంచినీళ్లు వెంట తెచ్చుకోండి బీచ్‌లకు వచ్చే పర్యాటకులు తమ వెంట మంచినీళ్లు తెచ్చుకోవాలి. లేదంటే బీచ్‌లో అమ్మే వాటర్ ప్యాకెట్లు, మంచినీళ్ల సీసాలకు జేబుకు చిల్లు పడాల్సిందే! చేరుకునేది ఇలా.. భీమవరం నుంచి వచ్చే పర్యాటకులు వెంప, వారతిప్ప, ముత్యాలపల్లి పేరుపాలెం మీదుగా బీచ్‌కు చేరుకోవచ్చు. నరసాపురం నుంచి వచ్చే పర్యాటకులు సీతారాంపురం, రామన్నపాలెం, పసలదీవి, తూర్పుతాళ్లు మీదుగా రావచ్చు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆటోలు, బస్సులు, లారీలు, కార్లలో సందర్శకులు బీచ్ ప్రాంతానికి వస్తుండటంతో టోల్గేట్ వసూలు చేసి పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ప్రతి బుధ, ఆదివారాలు నరసాపురం నుంచి బీచ్‌కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. -
అందాల తాండవం
పిక్నిక్ స్పాట్‌గా అలరిస్తున్న రిజర్వాయర్ కార్తీక మాసంలో రెండు జిల్లాల నుంచి సందర్శకుల తాకిడి నాతవరం: రెండు కొండల మధ్య చూడ చక్కని విధంగా సర్వాంగసుందరంగా నిర్మించిన తాండవ రిజర్వాయర్ పిక్నిక్ స్పాట్‌గా ఆకర్షిస్తోంది. పచ్చని రెండు కొండల నడుమ గట్టు లోపల భాగాన నిండుకుండలా దర్శనమిచ్చే రిజర్వాయర్‌లో గాలులకు కెరటాలతో ఎగిసిపడే నీరు.. రిజర్వాయర్ దిగువన రెండు కాలువల ద్వారా గలగలలాడుతూ పంట పొలాలకు ప్రవహించే నీరు.. చుట్టూ కిలకిలమంటూ పక్షులు కోలాహలం.. మనసును ఉత్తేజపరిచే తాండవ డ్యామ్‌పై వీచే చక్కటి గాలి పర్యాటకులను ఎంతగానో అకట్టుకుంటాయి. రిజర్వాయర్ గట్టుపై నుంచి చూస్తే ఓపక్క కునుచూపు మేర తాండవ రిజర్వాయర్‌లో నీటిమట్టం, మరో పక్క ఆహ్లాదాన్ని నింపే పచ్చటి పంట పొలాలు, రిజర్వాయర్‌లో బోటు షికారు మరిచిపోలేని అనుభూతిని పర్యాటకులకు కలిగిస్తుంది. ఏటా కార్తీక మాసం ప్రారంభం నుంచి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల నలు మూలలు నుంచి పర్యాటకులు తాండవ రిజర్వాయర్‌ను సందర్శిస్తుంటారు. తాండవ డ్యామ్ దిగువన పురాతన శ్రీనల్లకొండమ్మ తల్లి ఆమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత తాండవ అందాలను తిలకించి డ్యామ్ నుంచి సూమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పిల్‌వే గేట్లను సందర్శిస్తారు. రిజర్వాయర్ నిర్మాణ సమయంలో తాండవనీరు ప్రమాదస్థాయికి వచ్చిన పుడు దాని నివారణకు రెండు కొండలను చీల్చి నీరు నదిలోకి పోయేందుకు పొర్లుకట్ట నిర్మించారు. అప్పట్లో రిజర్వాయర్ నిర్మాణం కంటే స్పిల్‌వే గేట్ల నిర్మాణానికి అధికంగా ఖర్చయినట్లు అధికారులు చెబుతున్నారు. అది చూడటానికి పర్యాటకులు ఉత్సాహం కనబరుస్తారు. పర్యాటకులు తాండవలో తిరి గేందుకు 1989లో ఇంజిన్ బోట్లు కూడా మం జూరు చేశారు. క్రమేపీ పర్యవేక్షణ లోపం కారణంగా అవి ప్రసుత్తం అందుబాటులో లేవు. పర్యాటకుల కోరిక మేరకు స్థానికంగా ఉన్న మత్స్యకారులు కిరాయికి తాండవలో బోటు పై తిప్పతుంటారు. కార్తీక మాసంలో రెండు జిల్లాల నుంచి విద్యార్థులు పిక్నిక్ పేరుతో బస్సుపై వస్తుంటారు. అమ్మవారి గుడి ప్రాంగణంలో ఉసిరి చెట్టుతో పాటు చల్లని నీడ నిచ్చే చెట్లు ఉండటంతో కార్తీక సమారాధన పేరుతో వన భోజనాలు చేస్తారు. కార్తీక మాసం నెలలో ప్రతి ఆదివారం ఈ ప్రాంతమంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు సందర్శకులతో కిక్కిరిసి పోయి ఉంటుంది. తాండవ వెళ్లటానికి బస్సు సౌకార్యం ప్రతి రోజు న ర్సీపట్నం నుంచి ఉదయం 6, 7, 9,12 గంటలకు, మధ్యాహ్నం 3, 6, 9.30 గంటలకు డిపో నుంచి ఆర్టీసీ బస్సులు ఉన్నా యి. తాండవ జంక్షన్ నుంచి నిత్యం ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. నర్సీపట్నం నుంచి తాండవకు 27 కిలో మీటర్ల దూరం ఉంది. -
‘అనంత' నేషనల్ పార్క్ పిక్నిక్ స్పాట్ కావాలి
అనంతపురం సిటీ: ‘అనంత'లో సువిశాల విస్తీర్ణంలో ఉన్న నేషనల్ పార్కు పిక్నిక్ స్పాట్‌గా మారాలని పలువురు ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు. నేషనల్ పార్కులో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి నేతృత్వంలో కొనసాగుతున్న శ్రమదానంలో భాగంగా ఆదివారం 8వ రోజు ఎమ్మెల్యేలు పార్థసార థి, ఉన్నం హనుమంతరాయచౌదరి, వరదాపురం సూరి, విప్ యామినీబాల శ్రమదానం చేశారు. పారలు చేతబట్టి పలు మొక్కల చుట్టూ పాదులు చేశారు. పలు రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1996లో ప్రభాకర్‌చౌదరి మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు నేషనల్ పార్కు ఏర్పాటు శ్రమదానంలో భాగమేనని గుర్తు చేశారు. ప్రస్తుతం ‘జన్మభూమి-మా ఊరు’లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే శ్రమదానానికి పిలుపునివ్వడం హర్షణీయమన్నారు. గతంలో నిర్లక్ష్యానికి గురైన నేషనల్ పార్కుకు పూర్వ వైభవం రానుందని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో దశల వారీగా అభివృద్ధి పర్చి శిల్పారామాన్ని నిర్మించి ‘అనంత’ పర్యాటక కేంద్రం’గా దీన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. డిప్యూటీ మేయర్ గంపన్న, టీడీపీ నాయకులు ఆదినారాయణ, లింగంనాయుడు, రవి, సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు. -
దట్టమైన అడవులు...ఎతైన కొండలు....