Pidamarathi Ravi
-
వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాల్లోనే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రాన్ని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు. వర్గీకరణ చేపట్టాలంటూ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం ఎదుట తెలంగాణ మాదిగ జేఏసీ నేతలతో కలసి ఆయన మౌన దీక్ష చేపట్టారు. వర్గీకరణ చేస్తామని చెప్పి కాంగ్రెస్, బీజేపీలు మోసం చేస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, మంద కృష్ణల వల్ల మాదిగలు బలయ్యారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకపోతే బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. -
వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీల వర్గీకరణ దేశవ్యాప్త సమస్య కాదని, అది కేవలం రాష్ట్రాల సమస్య మాత్రమేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఎస్సీల వర్గీకరణకు బీజేపీ, మంద కృష్ణమాదిగలే ప్రధాన అడ్డంకి అని విమ ర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎస్సీల వర్గీకరణ జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని, వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న హామీలు ఏమయ్యాయన్నా రు. ఎంఆర్పీ ఎస్, ఆర్ఎస్ఎస్ రెండూ ఒక్క టేనని, వర్గీకరణకు సంబంధించి ఉషా మెహ్రా కమిషన్ సిఫారసులు అమలు చేయాలన్నారు.