జగన్‌తోనే పీలేరు అభివృద్ధి సాధ్యం
పీలేరు, న్యూస్‌లైన్ : పీలేరు నియోజకవర్గ అభివృద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని పార్టీ రాజంపేట పార్లమెం ట్ నియోజకవర్గ ఇన్చార్జి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అ న్నారు. మంగళవారం పీలేరు నియోజకవర్గంలో జ రిగిన జగన్మోహన్రెడ్డి సమైక్య శంఖారావం యా త్రలో మిథున్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్లుగా పీలేరు ప్రాంత ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారని తెలిపారు. నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కిరణ్ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో కూడా ఎ లాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మరో నాలుగు నెలల్లో జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నా రు. వెంటనే పీలేరు పట్టణంతోపాటు నియో జ కవర్గంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
జగన్మోహన్రెడ్డి అండతో న్యాయం కోసం ఎవరినైనా ఎదిరిస్తామని తెలిపారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం జగన్మోహన్రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. జాతీయపార్టీల మద్దతు కూడగట్టారని చెప్పారు. ముఖ్యమం త్రి కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు రాష్ట్రాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మ హానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అ మలుకావాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి చోద్యం చూస్తోందని విమర్శించారు. త్వరలోనే రాజన్న సువర్ణయుగం వ స్తుందన్నారు. ఈ నెల 9వ తేదీ మధ్నాహ్నం పీలేరు నాలుగు రోడ్ల కూడలిలో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. పీలేరులో జరిగే భారీ బహిరంగ సభ చరిత్ర పుటల్లో నిలచిపోయేలా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మల్లికార్జునరెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి, షామియానా షఫీ, హబీబ్‌బాషా, మోహన్‌రెడ్డి, చిన్నబాబు, విక్టరీ వెంకట్రమణారెడ్డి, మహబూబ్‌బాషా తదితరులు పాల్గొన్నారు.