pinnelli ramakrishnareddy
-
పిన్నెల్లికి ముందస్తు బెయిల్ 20 వరకు పొడిగింపు..
సాక్షి, అమరావతి: పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఆ మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 20 తేదీ వరకు పొడిగిస్తూ.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులు సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు పోలీసులు నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.తరువాత ఈ వ్యాజ్యాలు గత వారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాల్లో వాదనలు రాత్రి 10.30 గంటల వరకు సాగడంతో అదే రోజు ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానానికి సమయం దొరకలేదు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పిన్నెల్లి వ్యాజ్యాలు విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్ విజయ్ స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో వాదనలు విన్నప్పటికీ, నిర్ణయం వెలువరించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.ఈలోగా కోర్టుకు వేసవి సెలవులు ముగుస్తాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలను రెగ్యులర్ బెంచ్ ముందు వచ్చేలా విచారణను వాయిదా వేస్తానని ప్రతిపాదించారు. ఈ విషయంపై ఇరుపక్షాల తరఫు న్యాయవాదుల అభిప్రాయాన్ని కోరారు. ఇందుకు ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. -
ఆ భయంతోనే బాబు దాడులు చేయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉద్యమం ముసుగులో టీడీపీ కార్యకర్తలు పిన్నెల్లి కాన్వాయ్‌పై రాళ్లదాడి చేయడాన్ని సర్వత్రా నాయకులు, ప్రజలు ఖండిస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను తీవ్రంగా ఖండించారు. రైతుల ముసుగులో తెలుగుదేశం గూండాలే ఈ దాడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. అమరావతి ప్రాంతంలో భూ కుంభకోణాలు ఎక్కడ బయటపడతాయన్న భయంతోనే చంద్రబాబు తన అనుచరులతో దాడులకు పాల్పడుతున్నారని, అమరావతిలో భయానిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 13 జిల్లాల్లో సమగ్ర అభివృద్ధి జరగాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ముందుకువెళ్తుంటే.. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై దాడులకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడి హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఈ దాడి కచ్చితంగా టీడీపీ గూండాల పనేనని పేర్కొన్నారు. చంద్రబాబునాయుడు నీచరాజకీయాలు చేస్తున్నారని, రైతులను రెచ్చగొట్టేవిధంగా ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలతో చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. రైతులను తమ ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకొంటుందన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడిని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ తీవ్రంగా ఖండించారు. ఇది పిరికి పందల చర్య అని, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ఆయన పేర్కొన్నారు. -
జగన్ రాకతో పులకించిన పల్లెలు
వైఎస్ జగన్‌ను చూసేందుకు పోటీ పడ్డ అభిమానుల దారి పొడవునా సందడి చేసినకార్యకర్తలు నూతన వధూవరులను ఆశీర్వదించిన జగన్ తుళ్ళూరు : రాజధాని అమరావతి ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం రాకతో పల్లెలు పులకించాయి. ఉద్దండ్రాయునిపాలెం దళితవాడలో కాబోయే నూతన వధూవరులు నాగేంద్రబాబు, ఝాన్సీలకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత వైఎస్సార్ యూత్ అధ్యక్షుడు నందిగం సురేష్ ఆధ్వర్యంలో వెంకటపాలెం నుంచి పూలతో దారిపొడవునా స్వాగతం పలికారు. జగన్ రాయపూడి దళితవాడ వద్ద ఆగి మహిళలు, యువకులతో కరచాలనం చేశారు. అనంతరం తుళ్ళూరు అంబేడ్కర్ బొమ్మ వద్ద మహిళలను పలకరించి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. వడ్డమానులో జగన్‌కు ఘనస్వాగతం లభించింది. ఊరంతా పార్టీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. గ్రామంలో కాబోయే వధూవరులు చంద్రశేఖర్ రెడ్డి, అనూరాధలను జగన్ దీవించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి అయోధ్య రామిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి హెనీ క్రిస్టీనా, నాయకుడు కత్తెర సురేష్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల కిషోర్ పాల్గొన్నారు. -
'పోలీసులతో నిర్బంధ అరెస్టులు చేయిస్తున్నారు'
గుంటూరు(మాచర్ల): టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ కేసులు నమోదు చేసి వైఎస్సార్ సీపీ నాయకులు, ఎమ్మెల్యేలను వేధింపులకు గురిచేస్తూ రాష్ట్రంలో రాక్షస పాలనసాగిస్తోందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీఎం చంద్రబాబు అన్ని వర్గాలపై పోలీసులను ప్రయోగిస్తూ నిర్బంధ అరెస్ట్‌లు చేయిస్తూ ప్రజల సమస్యలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. శనివారం గుంటూరు జిల్లా మాచర్లలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించు కునేందుకు పోలింగ్‌బూత్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే అఖిలప్రియపై పోలీసులు అనుచితంగా వ్యవహరించారన్నారు. దీనిపై ప్రశ్నించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై పోలీసులే అక్రమంగా ఫిర్యాదు చేసి ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయించడం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే జరిగిందని ఆరోపించారు. గతంలో కూడా కర్నూలు కార్పొరేషన్ సమావేశంలో భూమా నాగిరెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేసినట్టు గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ బలంగా ఉన్న ప్రాంతాలలో పార్టీని నిర్వీర్యం చేసేందుకు అధికార పార్టీ పలు కుట్రలకు పాల్పడుతోందని, అందులో భాగంగానే ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పేర్కొన్నారు. తనపై కూడా గతంలో చెన్నాయపాలెం భూముల విషయంలో అధికార పార్టీ వారు అక్రమ కేసులు బనాయించారని చెప్పారు.