PNB results
-
పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఎన్పీఏల భారం!
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్టాండలోన్ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన 3 నెలల్లో 63% తగ్గిరూ.411 కోట్లకు చేరింది. ఆదాయం రూ.23,001 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.1,105 కోట్లు, ఆదాయం రూ.21,262 కోట్ల చొప్పున ఉన్నాయి. మొండి బకాయిల భారం కొంత తగ్గినప్పటికీ.. వీటి కోసం అధిక కేటాయింపులు చేయాల్సి రావడం లాభాలను ప్రభావితం చేసింది. వడ్డీ ఆదాయం రూ.17,980 కోట్ల నుంచి రూ.20,154 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం 30 శాతం పెరిగి రూ.8,271 కోట్లుగా ఉంది. రుణ ఆస్తుల నాణ్యత మెరుగుపడింది. స్థూల ఎన్పీఏలు 13.36 శాతం నుంచి 10.48 శాతానికి (రూ.87,034 కోట్లు) తగ్గాయి. నికర ఎన్పీఏలు 5.49 శాతం నుంచి 3.80 శాతానికి పరిమితమయ్యాయి. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుత్సాహకర ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అక్టోబర్-డిసెంబర్(క్యూ3) కాలానికి నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 42%పైగా క్షీణించి రూ. 755 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2012-13) క్యూ3లో రూ. 1,306 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మొండి బకాయిలకు కేటాయింపులు, పన్ను చెల్లింపులు వంటివి పెరగడంతో లాభాలపై ప్రతికూల ప్రభావం పడిందని బ్యాంక్ చైర్మన్ కేఆర్ కామత్ చెప్పారు. మొండిబకాయిల కేటాయింపులు రూ. 466 కోట్ల నుంచి రూ. 1,083 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. నికర మొండిబకాయిలు(ఎన్పీఏలు) 2.56% నుంచి 2.8%కు పెరిగినట్లు తెలిపారు. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 13% ఎగసి రూ. 4,221 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.57%గా నమోదైంది. మొత్తం ఆదాయం రూ.11,499 కోట్ల నుంచి రూ.11,922 కోట్లకు స్వల్పంగా పెరిగింది. వాటాదారులకు షేరుకి రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు పెంపుపై స్పందిస్తూ రుణాలకు డిమాండ్ పుంజుకుంటే అటు డిపాజిట్లు, ఇటు రుణాలపై వడ్డీ రేట్లు పెంచే అవకాశముంటుందని చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బ్యాంక్ షేరు బీఎస్ఈలో 6% జంప్‌చేసి రూ. 549 వద్ద ముగిసింది.