ponnala lakshmaish
-
బీజేపీ నేతలు జాతర్లకు వచ్చినట్లు వస్తున్నారు..
సాక్షి, హైదరాబాద్: మ్యానిఫెస్టోలు, ప్రొగ్రెస్ రిపోర్టులు వెబ్సైట్లో పెట్టి తీసేయడం టిఆర్ఎస్కు మాత్రమే సాధ్యమని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మేడిపండు కంటే దారుణంగా టీఆర్ఎస్ ప్రొగ్రెస్ రిపోర్టు ఉందని ఎద్దేవా చేశారు. ఎవరి సొమ్మని 17,500 కోట్లు మెట్రోరైలుకు ఖర్చు చేశారని ప్రశ్నించారు. నిజానికి మెట్రో ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ప్రారంభించగా, కేసీఆర్ దాన్ని ఆపేశారన్నారు. 'నీవల్ల ప్రజలకు అసౌకర్యం కలిగింది. ముక్కు నేలకు రాస్తావా? తప్పు ఒప్పుకుంటావా?' అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ విడుదల చేసింది అభివృద్ధి ప్రణాళిక కానే కాదని, అదొక అవినీతి నివేదిక అని, దీనిపై విచారణ జరిపించి నిజనిజాలు బయటకు తేల్చాలని తెలిపారు. 'రాష్ట్రంలో ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. యాదాద్రి, భద్రాద్రి ఎక్కడ ఉంది?అన్నీ గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన విద్యుత్ ప్రాజెక్టులే. విద్యుత్ కొనుగోలు చేయడం కూడా ప్రగతేనా? ఐటికి 2100 కోట్లు ఖర్చు చేశామంటున్న టీఆర్ఎస్.. యానిమేషన్ గేమింగ్ 400 కోట్లతో కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఏడు సంవత్సరాల నుంచి దాన్ని ఎందుకు పూర్తి చేయలేదు. చర్చకు రమ్మంటే ముఖం చాటేసిన టీఆర్ఎస్ నాయకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు. (సీఎం దొరగారు మాస్టర్ ప్లాన్: విజయశాంతి) గ్రేటర్ ఎన్నికల కోసం బీజేపీ నాయకులు జాతరలు, సంతలకు వచ్చినట్లు వస్తున్నారని, ఒక్క నవోదయ స్కూల్ తెలంగాణకు కేటాయించని స్మృతి ఇరానీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ విమర్శించారు. తెలంగాణకు ఏం చేశారో చెప్పుకుని కేంద్ర మంత్రులు ఓట్లు అడిగితే బాగుండేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అశాంతి పాలన చేసిన యోగిఆదిత్య తెలంగాణలో కూడా అలానే ఉండాలని ఇక్కడకు వస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలు చేయదు, వాటిని సమర్దించదని పేర్కొన్నారు. విద్యుత్ చార్జీలు చెల్లించడంలో రైతులు ఆలస్యం చేశారని ట్రాన్స్ ఫార్మర్కు తాళం వేసిన పరిస్థితులు తెలంగాణలో నెలకొనడం దౌర్భాగ్యమని అన్నారు. ('అలా మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారు') -
ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తావా?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు విచారకరమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తావా? పాతబస్తీ హైదరాబాద్‌లో లేదా భారత దేశంలో లేదా అంటూ ప్రశ్నించారు. ఇటు సర్జికల్ స్ట్రైక్ అంటూ, అటు వెళ్లి బాగ్యలక్ష్మి అమ్మవారి అలయంలో పూజలు చేస్తాడంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదన్నారు. వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు చేస్తున్నా ఎంఐఎం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికలు గుర్తుకు రాగానే ఆక్రమణలు గుర్తొస్తున్నాయా? పీవీ ఘాట్,ఎన్టీఆర్ ఘాట్ తొలగించాలని ఇప్పుడు చెప్తున్నారు..ఏనాడైనా పార్లమెంట్లో పాతబస్తీ గురించి మాట్లాడారా? అంటూ పొన్నాల ఫైర్ అయ్యారు. (సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్) -
కోదండరాంకు లైన్‌క్లియర్!
సాక్షి, జనగామ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న జనగామ స్థానం నుంచి పోటీ చేయడానికి తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత ప్రొఫెసర్ కోదండరాంకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా జనగామ టీజేఎస్‌కు కేటాయించే అవకాశాలు ఖాయమైనట్లుగా తెలుస్తున్నాయి. సిద్ధమైన ప్రచార రథాలు కాంగ్రెస్ ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసినా జనగామ నుంచి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కలేదు. ఈ క్రమంలోనే జనగామతోపాటు 11 స్థానాల్లో పోటీ చేస్తా మని టీజేఎస్ ప్రకటించింది. టీజేఎస్ వ్యవహార తీరుపై పొన్నాలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రెండు పార్టీల్లోనూ జనగామ సీటు పీటముడి వీడటం లేదు. దాదాపుగా జనగామ టీజేఎస్‌కే కేటాయించే అవకాశం ఉండటంతో ప్రచారానికి ఆ పార్టీ సిద్ధం అవుతోంది. ఎనిమిది ప్రచార రథాలను సిద్ధం చేశారు. శుక్రవారం నియోజకవర్గంలో తిప్పడానికి పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఈ ప్రచార రథాలపై జనగామ అభ్యర్థి కోదండరాం అని రాయడం గమనార్హం. జనగామ జిల్లా కేంద్రంలో టీజేఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఆ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. ఎన్నికలు అయిపోయే వరకు కోదండరాం ఇక్కడే నివా సం ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కోదండరాం సమీప బంధువులు జనగామలోనే మకాం వేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లతోపాటు గుర్తింపు పొందిన ప్రముఖులను కలసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన ఇద్దరు బలమైన నేతలు కోదండరాం కోసం పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19న కోదండరాం నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. ముం దుగా 17న కోదండరాం తరుపున పార్టీ నేతలు మొదటి నామినేషన్ వేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. కార్యకర్తల మూకుమ్మడి రాజీనామా పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ టికెట్ కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న తీరుతో ఆ పార్టీ కార్యకర్తలు, పొన్నాల అనుచరులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 13 మంది కౌన్సిలర్లతోపాటు 28, 500 మంది క్రియాశీలక కార్యకర్తలు మూకు మ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు లేఖ రాశారు. కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. -
పొత్తుల్లో సందిగ్ధతే కారణం: పొన్నాల
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా కూటమిలోని మిత్రప క్షాల మధ్య పొత్తుల విష యంలో ఏర్పడిన సంది గ్ధత వల్లే జనగాం సీటు ప్రకటన విషయంలో ఆలస్యమవుతోంది తప్ప.. తనకు సీటు ఇవ్వాలా వద్దా అన్న విషయంలో కాదని మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఢిల్లీలో బుధ వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనగాం నుంచి పోటీ చేసేది తానేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. పొత్తుల విషయంలో ఏర్పడిన సందిగ్ధతను పరిష్కరించడంలో ఆలస్యమవు తోందన్నారు. ఇక కొత్తగా వచ్చిన ఓ రాజకీయ పార్టీ కూడా జనగాం నుంచే పోటీ చేస్తామన డంపై ముందుగా తేల్చాలన్నారు. -
కేసీఆర్ యాదృచ్ఛికంగా సీఎం అయ్యారు..
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అయితే అనుకోకుండా అదృష్టం కొద్ది కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని, ఈ విషయాన్ని కేసీఆర్ మర్చిపోవద్దని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. అనుకోని పరిస్థితుల్లో కేసీఆర్ యాక్సిడెంటల్ సీఎం అయ్యారని, ఆయన అబద్దాలను నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లు వేశారన్నారు. మాయమాటలు చెప్పి అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేసీర్ మరోసారి తన అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పొన్నాల సోమవారమిక్కడ విమర్శించారు. అయితే ఈసారి కేసీఆర్ మాటలను వినడానికి ప్రజలు సిద్ధంగా లేరనే విషయం తేలుసుకుంటే మంచిదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని కేసీఆర్ అంటున్నారని, ఈ రోజు ఆయన తెలంగాణ సీఎం అయ్యారంటే అది కాంగ్రెస్ చలవతోనే అని, ఆ విషయం మర్చిపోయి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయాత్నాల గురించి పొన్నాల మాట్లాడుతూ ‘అబద్దాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అది చాలదన్నట్లు ఇప్పుడు దేశం మీద పడ్డారు. కేసీఆర్ బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోదీకి కోవర్టు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకే కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. కానీ ఆయన ఫెడరల్ ఫ్రంట్‌కు ఆదిలోనే పలు అవాంతరాలు ఎదురవుతున్నాయి. నిన్న డీఎంకే నేత స్టాలిన్ ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదని కేసీఆర్ మొహం మీదనే కాదని తేల్చేశారు. కాంగ్రసేతర ప్రత్యామ్నాయం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని తేల్చి చెప్పిన స్టాలిన్, కావేరి సమస్య పై బీజేపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండగా జేడీఎస్‌కు ( బీజేపీ , జేడీఎస్‌ల అవగాహన నేపధ్యంలో ) మద్దతు పలుకుతున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ విషయంలో మా మద్దతు ఎలా ఆశిస్తారు అని ప్రశ్నించారు. దీనిక కేసీఆర్ ఏం బదులిస్తారు’ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి కేసీఆర్ ...మమత బెనర్జీని కలిస్తే కాంగ్రెస్ లేకుండా బీజేపీ ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా సాధ్యం అన్నారు. కేసీఆర్ హేమంత్ సొరేన్ ను కలిసిన మరుసటి రోజే ఆయన సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఇక నవీన్ పట్నాయక్ అయితే, ‘కేసీఆర్‌నును నేను ఆహ్వానించలేదు ఆయన వస్తా అంటే రమ్మన్నాను. రాజకీయాలు ఏమి లేవు’ అని కొట్టి పారేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి మరో అడుగు ముందుకేసి ‘కేసీఆర్ మూడో ఫ్రంట్ మూసి లాంటిది, కంపు కొడుతుంది’ అని మరింత ఘాటుగానే విమర్శించారు అని పొన్నాల ఈ సందర్భంగా గుర్తు చేశారు. మూడో ఫ్రంట్‌ను అడ్డం పెట్టుకొని తన పార్టీలోని అంతర్గత రాజకీయాలను అధిగమించాలని కేసీర్ అడుగులు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. -
అది అధికార ఆరాట ఆవేదన సభ: పొన్నాల
హైదరాబాద్: టీఆర్ఎస్ వరంగల్ సభను 16 ఏళ్ల ప్రగతి నివేదన సభ అనేకంటే అధికార ఆరాట ఆవేదన సభ అనాలి అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. మరోసారి అధికారం కోసం ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఆయనిక్కడ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రసంగం పేలవంగా ఉందని.. ప్రజలలోనూ స్పందన లేదని అన్నారు. ఉస్మానియా శత వసంతాల సంబరాలకు రాష్ట్రపతి రావడం గర్వకారణం అయితే తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడే అవకాశం తీసుకోకపోవడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. మరోవైపు భూసేకరణ చట్టం 2013 అమలు చేయకుండా కొత్త చట్టం తెస్తే కేంద్రం నుండి తిరిగి పంపారు.. ఇది ఆయన పరిపాలనకు అద్దం పడుతోందన్నారు. 144వ సెక్షన్ విధించి బలవంతంగా భూసేకరణ చేస్తే కోర్టు స్టేలు ఇస్తోందని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు కోర్టు అభ్యంతరాలు చెప్పిందన్నారు. వరంగల్ సభ కన్నా 48 గంటల ముందు ఈ సంఘటనలు జరిగాయని, ఆ భయంతో పేలవంగా మాట్లాడారని అన్నారు. మీ వాళ్ళు గంటలు కూలి చేస్తే లక్షలు వస్తాయి కానీ ఉపాధి హామీ కూలీలకు మూడు నెలలు అయినా 150 రూపాయలు ఇవ్వరా అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి తూతూ మంత్రంగా ఇచ్చారు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమైంది..ఎక్కడ మొదలుపెట్టారు.. ఎక్కడ ఇచ్చారు.. మీ బడ్జెట్ కేటాయింపు ఎంత.. ఇవ్వి మోసపూరిత మాటలు కాదా అని నిలదీశారు. మద్దతు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడని కేసీఆర్ వారికి ఎరువుల ఆశ చూపుతున్నారన్నారు. కాంగ్రెస్‌ను నిందించకుండా కేసీఆర్‌కు రోజు గడవదన్నారు. తెలంగాణ ద్రోహుల సంగతి చూస్తానంటారు.. మరి మీ కేబినెట్లో ఎవరున్నారు.. మీరు ఎవరికి టిక్కెట్లు ఇచ్చారో ప్రజలకు తెలియదా అని పొన్నాల ప్రశ్నించారు.