
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలు విచారకరమని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తావా? పాతబస్తీ హైదరాబాద్లో లేదా భారత దేశంలో లేదా అంటూ ప్రశ్నించారు. ఇటు సర్జికల్ స్ట్రైక్ అంటూ, అటు వెళ్లి బాగ్యలక్ష్మి అమ్మవారి అలయంలో పూజలు చేస్తాడంటూ ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదన్నారు. వక్ఫ్ భూములు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు చేస్తున్నా ఎంఐఎం ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎన్నికలు గుర్తుకు రాగానే ఆక్రమణలు గుర్తొస్తున్నాయా? పీవీ ఘాట్,ఎన్టీఆర్ ఘాట్ తొలగించాలని ఇప్పుడు చెప్తున్నారు..ఏనాడైనా పార్లమెంట్లో పాతబస్తీ గురించి మాట్లాడారా? అంటూ పొన్నాల ఫైర్ అయ్యారు. (సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. పాతబస్తీలో సర్టికల్ స్ట్రైక్)
Comments
Please login to add a commentAdd a comment