poor form
-
'మరో రెండు మ్యాచ్‌లు చూస్తారు.. తర్వాత తీసేయడమే'
ఆసియాకప్‌లోనూ టీమిండియా వైస్‌కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతుంది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన కేఎల్ రాహుల్.. ఆ తర్వాత హాంకాంగ్‌తో మ్యాచ్‌లో 34 పరుగులు చేసినప్పటికి నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకున్నాడు. ప్రస్తుతం టీమిండియాలో బ్యాటింగ్ విభాగంలో తీవ్ర పోటీ నెలకొంది. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని బెస్ట్ టీమ్‌ను తయారు చేయాలని భావిస్తున్న బీసీసీఐకి ఎవరికి జట్టులో చోటు కల్పించాలనేది సమస్యగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్ మాత్రం పూర్ ఫామ్‌తో తన స్థానానికి ఎసరు తెచ్చుకునేలా ఉన్నాడు. ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ మాట్లాడాడు. కేఎల్ రాహుల్ ఇలాగే ఆడితే ఒకటి.. రెండు మ్యాచ్‌లు చూస్తారు.. ఆ తర్వాత ఇక జట్టులోంచి తీసేయడమే జరుగుతుందన్నారు.''టీమిండియాలో ఇప్పుడు కాంపిటీషన్ తీవ్రంగా పెరిగిపోయింది. జింబాబ్వే పర్యటనలో, అంతకుముందు వెస్టిండీస్ పర్యటనలో శుబ్‌మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి మెప్పించాడు. కాబట్టి ఏ ప్లేయర్ అయినా వరుసగా ఫెయిల్ అవుతూ ఉంటే అతను ఫామ్‌లోకి వచ్చేదాకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. టి20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నీలకు పెద్దగా సమయం కూడా లేదు. ఈ విషయాలను కేఎల్ రాహుల్ దృష్టిలో పెట్టుకోవాలి. అతనికి రెండు, మూడు మ్యాచుల సమయం మాత్రమే ఉంది. ఆ మ్యాచుల్లో కూడా అతను విఫలమైతే... సెలక్టర్లు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తారు. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా.. ఇలా ఓపెనింగ్ స్లాట్ విషయంలో ఇప్పటికే టీమిండియా ప్రయోగాలు చేసింది. వీరితో పాటు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, సంజూ శాంసన్ కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి కేఎల్ రాహుల్ ఎంత త్వరగా ఫామ్‌లోకి వస్తే అంత బెటర్. ఒకవేళ ఇలాగే ఆడితే మాత్రం జట్టు నుంచి తీసేయడం ఖాయం'' అంటూ పేర్కొన్నాడు. సౌతాఫ్రికా టూర్ తర్వాత లంక, వెస్టిండీస్ టూర్లకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, గాయం కారణంగా స్వదేశంలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ 2022 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్‌కి కెప్టెన్‌గా 616 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, అదే ఫామ్‌ని అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగించలేకపోయాడు. గాయంతో సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కి దూరమైన రాహుల్, ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు దూరమయ్యాడు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సమయానికి కెఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నా... కరోనా వచ్చి అతన్ని ఆడకుండా చేసింది. అనంతరం జింబాబ్వే వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి సక్సెస్ అయిన రాహుల్ బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ప్రస్తుతం అదే చెత్త ఫామ్‌ను ఆసియాకప్‌లోనూ కొనసాగిస్తున్నాడు. చదవండి: సూపర్-4కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్.. గాయంతో జడేజా ఔట్ Asia Cup 2022: 'రోహిత్ శర్మ భయపడుతున్నాడు.. ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండడు' -
Kohli poor form: విరాట్ కోహ్లికి ఏమైంది..?
24 వన్డే ఇన్నింగ్స్‌లలో 45.26 సగటు, 91.39 సగటుతో 1041 పరుగులు...ఇందులో 2 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు... 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాతినుంచి ఇప్పటి వరకు విరాట్ కోహ్లి ప్రదర్శన ఇది. ఎలాంటి, ఏ స్థాయి ప్రమాణాల ప్రకారం చూసినా వన్డేల్లో ఇవి ఎంతో మెరుగైన బ్యాటింగ్ గణాంకాలు...మరి కోహ్లి విఫలమైనట్లా! 21 అంతర్జాతీయ టి20ల్లో 42.18 సగటు, 136.08 స్ట్రైక్‌రేట్‌తో 675 పరుగులు... 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి... 2020 జనవరి నుంచి గణాంకాలు ఇవి. ఇదీ టి20లో ఒక రెగ్యులర్, పూర్తి స్థాయి బ్యాటర్ కోణంలో చూస్తే చక్కటి ప్రదర్శన. కానీ ఇక్కడా విమర్శలే. గత రెండున్నరేళ్లుగా 18 టెస్టుల్లో 27.25 సగటుతో 872 పరుగులు మాత్రమే. ఒక్క సెంచరీ కూడా లేదు. ఇది మాత్రం విమర్శకు అవకాశమిచ్చే అది సాధారణ ప్రదర్శన. కానీ ఇదే సమయంలో ఇతర భారత టెస్టు బ్యాటర్ల స్కోర్లు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. మరి మొత్తంగా కోహ్లిని విఫలమవుతున్నాడని చెబుతూ, అతడిని పక్కన పెట్టాలంటూ వస్తున్న విమర్శల్లో వాస్తవం ఎంత? కోహ్లిలాంటి దిగ్గజం ఆటను కొన్ని ఇన్నింగ్స్‌లతో కొలవగలమా! సాక్షి క్రీడా విభాగం దాదాపు 24 వేల అంతర్జాతీయ పరుగులు...మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటు...సుమారు దశాబ్దకాలం పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన తర్వాత విరాట్ కోహ్లి ఆటపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత అతనిపై ఇలాంటి వ్యాఖ్యలు మరీ ఎక్కువగా పెరిగిపోయాయి. ఇన్నేళ్లుగా దేశం తరఫున అతను చూపిన గొప్ప ప్రదర్శనలు, అందించిన ఘనమైన విజయాలు, చిరస్మరణీయ క్షణాలను కనీసం లెక్కలోకి తీసుకోకుండా కొందరు మాట్లాడుతున్న తీరు నిజంగా ఆశ్చర్యకరం. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లి సాధించిన ఘనతలే ఇప్పుడు అతనికి ప్రతికూలంగా మారినట్లున్నాయి. అద్భుత ప్రదర్శనతో అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లి...ఇప్పుడు వాటితో పోలిక రావడంతోనే విఫలమైనట్లుగా కనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే కోహ్లి కాకుండా మరే బ్యాట్స్‌మన్ అయినా ఈ గణాంకాలతో కొనసాగితే అతను చాలా విజయవంతమైనట్లుగా లెక్క! సెంచరీలే ముఖ్యమా! సగటు క్రికెట్ అభిమాని కోణంలో చూస్తే విరాట్ కోహ్లి సెంచరీ సాధించి చాలా కాలమైంది కాబట్టి అతను విఫలమవుతున్నట్లే అనుకోవాలి. నిజమే...కోహ్లి 2019 నవంబర్‌లో తన ఆఖరి శతకం బాదాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో అతని 70 సెంచరీలు పూర్తయ్యాయి. మరొక్క సెంచరీ చేస్తే రికీ పాంటింగ్ (71)ను సమం చేస్తాడు. గతంలో ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్ సెంచరీల రికార్డు (100) కూడా అలవోకగా సమం చేయగల సత్తా ఉందని అంతా కోహ్లిపై అంచనాలు పెంచేసుకున్నారు. కోహ్లి 71వ సెంచరీ ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. అయితే అది ఇప్పటి వరకు రాలేదు! దాంతో అదే అసహనం సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్ల ద్వారా విమర్శగా మారింది. నిజానికి సెంచరీలు లేకపోయినా కోహ్లి ఆట ఘోరంగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే చక్కటి షాట్లు, కళాత్మక ఆటతీరులో ఎక్కడా తేడా రాలేదు. క్రీజ్‌లో తడబడటం, షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడటం కూడా కనిపించలేదు. నాటింగ్‌హామ్‌లో జరిగిన చివరి టి20లో మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ఫోర్, ఆ తర్వాత నేరుగా కొట్టిన సూపర్ సిక్సర్ కోహ్లి సత్తా ఏమిటో చూపించాయి. పోటీ పెరగడంతోనే... ఇటీవల అవకాశాలు దక్కించుకున్న యువ ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పుడు కోహ్లిని సాధారణ బ్యాటర్‌గా చూపిస్తోంది. దీపక్హుడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టి20లో 17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. కానీ కోహ్లి రాకతో తర్వాతి రెండు మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కలేదు. మరో వైపు సూర్యకుమార్ విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. పంత్, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్లాంటి వాళ్లు బంతులను అలవోకగా గ్రౌండ్ బయటకు కొడుతున్నారు. ఇలాంటి సమయంలోనే కోహ్లిపై విమర్శల జడి ఎక్కువవుతోంది. వీరి దూకుడైన బ్యాటింగ్ ముందు కోహ్లి నమోదు చేస్తున్న 130–135 పరుగుల స్ట్రైక్‌రేట్ తక్కువగా కనిపిస్తోంది. మూడో స్థానంలో వచ్చే కోహ్లి ఆ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. పదే పదే ‘విశ్రాంతి’ తీసుకోవడం కూడా అతనికి చేటు తెస్తోంది. టి20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో దశలవారీగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పు గురించి చర్చ జరుగుతున్న సమయంలో విండీస్‌తో టి20 సిరీస్‌నుంచి కూడా విశ్రాంతి! ఈ నేపథ్యంలో మళ్లీ విమర్శలకు అతను అవకామిచ్చాడు. అసలు ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది. నాకు అస్సలు అర్థం కావడం లేదు. కోహ్లి ఎన్నో ఏళ్లుగా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి వేల పరుగులు చేశాడు. ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. అతనిలాంటి టాప్ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి సలహాలు అవసరం లేదు. ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం, కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. ఒకటి, రెండు మ్యాచ్‌లు బాగా ఆడితే చాలు అంతా చక్కబడుతుంది. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
అప్పుడు హీరోలా కనిపించాడు; ఇప్పుడు విలన్.. ఎందుకిలా!
వెంకటేశ్ అయ్యర్.. గత ఐపీఎల్ సీజన్ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐపీఎల్ 14వ సీజన్లో తొలి అంచె పోటీల్లో వెంకటేశ్ అయ్యర్ పెద్దగా అవకాశాలు లభించలేదు. అయితే కరోనా బ్రేక్ తర్వాత జరిగిన రెండో అంచె పోటీల్లో మాత్రం దుమ్ములేపాడు. కేకేఆర్ ఫస్టాఫ్‌లో రెండే మ్యాచ్‌లు గెలిచి అసలు ప్లేఆఫ్ చేరుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే వెంకటేశ్ అయ్యర్ రాకతో కేకేఆర్ ఆట స్వరూపమే మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా ఫైనల్ చేరిన కేకేఆర్ ఆఖరి మెట్టుపై బోల్తా పడి రన్నరప్‌గా నిలిచింది. సీఎస్కేతో ఫైనల్లో ఓడినప్పటికి కేకేఆర్ తన ఆటతీరుతో ఆకట్టుకుంది. అందుకు ప్రధాన కారణం వెంకటేశ్ అయ్యర్ అని చెప్పొచ్చు. ఆ సీజన్లో ఓపెనర్‌గా వచ్చిన వెంకటేశ్ అయ్యర్ ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరు కనబరిచాడు. మొత్తంగా 10 ఇన్నింగ్స్‌ల్లో 128.47 స్ట్రైయిక్ రేటుతో 41.11 యావరేజ్‌తో 370 పరుగులు చేశాడు వెంకటేశ్ అయ్యర్. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి... బౌలింగ్‌లోనూ 3 వికెట్లు పడగొట్టి ఆల్‌రౌండర్‌గా మెప్పించాడు. Courtesy: IPL Twitter గత సీజన్ ప్రదర్శన కారణంగా వెంకటేశ్ అయ్యర్‌ని ఏకంగా రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది కోల్కత్తా నైట్‌రైడర్స్. అయితే ఈ సీజన్లో అయ్యర్ ఘోర ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచులు ఆడిన వెంకటేశ్ అయ్యర్ కేవలం 132 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో ముంబై ఇండియన్స్‌పై 41 బంతుల్లో చేసిన 50 పరుగులు మినహాయిస్తే... మిగిలిన 8 మ్యాచ్‌లు కలిపి 82 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో తన ప్రదర్శనతో హీరో అనిపించుకున్న వెంకటేశ్ అయ్యర్.. ఈ సీజన్లో కాస్త విలన్‌గా తయారయ్యాడు. Courtesy: IPL Twitter గత సీజన్ ఆరంభంలోనే బౌలర్లపై విరుచుకుపడిన వెంకటేశ్ అయ్యర్ అదే స్పీడును ఇప్పుడు మాత్రం చూపెట్టలేక చతికిలపడుతున్నాడు. కేకేఆర్‌కు ఇది ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులు రావాల్సిన చోట సింగిల్ మాత్రమే తీసి వెంకటేశ్ అయ్యర్ స్ట్రైక్ ఉంచుకున్నాడు. అయ్యర్ చేసిన ఈ పొరపాటు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆ తర్వాతి ఓవర్లో 4 వికెట్లు తీసి హ్యాట్రిక్‌తో మెరిసిన చహల్ కోల్‌కతాను విజయానికి దూరం చేశాడు. గత సీజన్లో విఫలమయిన హార్ధిక్ పాండ్యా ఈసారి కెప్టెన్‌గా, ఫీల్డర్‌గా, బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా దూసుకుపోతుంటే... వెంకటేశ్ అయ్యర్ మాత్రం టీమిండియా ఎంట్రీ తర్వాత ఉన్న నమ్మకాన్ని కాస్తా కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు. చదవండి: IPL 2022: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. తీవ్ర దిగ్బ్రాంతిలో లక్నో సూపర్ జెయింట్స్ Shreyas Iyer: మా ఓటమికి కారణం అదే.. మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే! -
కోహ్లిని పక్కనబెట్టనున్నారా?.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లి ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్లో ఆర్సీబీ తరపున ఆడుతున్న కోహ్లి ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి కేవలం 128 పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లి ఆటతీరుపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న వేళ గంగూలీ కోహ్లి ఫామ్‌లోకి వస్తాడంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. కోహ్లితో పాటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆటతీరుపై కూడా గంగూలీ స్పందించాడు. '' కోహ్లి, రోహిత్‌లు ఇద్దరు గొప్ప ఆటగాళ్లు. వాళ్లిద్దరు కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు. కచ్చితంగా ఫామ్ అందుకొని పరుగులు సాధిస్తారు. ఇక కోహ్లి మైండ్‌లో ఏం ఆలోచనలు తిరుగుతున్నాయో చెప్పలేను కానీ అతను మాత్రం కచ్చితంగా ఫామ్‌ను అందుకుంటాడు. కోహ్లి ఒక మంచి ప్లేయర్.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టి20 ప్రపంచకప్‌కు చాలా సమయం ఉంది. కోహ్లి జట్టులో ఉంటాడా లేదా అనేది అవవసరమైన విషయం. రెస్ట్ పేరుతో సౌతాఫ్రికా సిరీస్‌కు దూరంగా ఉంచే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. కోహ్లి ఒక్కడే కాదు.. రోహిత్, కేఎల్ రాహుల్ సహా మిగతా సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వాలనే యోచనలో ఉన్నాం. కోహ్లిని పూర్తిగా పక్కనబెట్టనున్నాం అనే వార్తల్లో వాస్తవం లేదు. ఒకవేళ అతను దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడాలనుకుంటే ఆడుతాడు. ఏదైనా అతన్ని సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. కరోనా భయంతో ఐపీఎల్లో బయోబబుల్‌ను ప్రవేశపెట్టాం. దేశంలో కరోనా కేసుల్లో పురోగతి లేదనిపిస్తే ఐపీఎల్లో బయోబబూల్‌ను తొలగించే అవకాశం ఉంది. కానీ ఏదైనా వేచి చూస్తే మంచిది. ఎందుకంటే కోవిడ్ మనతో పాటు మరో 10 సంవత్సరాలైనా ఉంటుంది. దానిని మనం అలవాటు చేసుకోవాలి. ఆటగాళ్ల శ్రేయస్సు కొరకే బయోబబూల్. కరోనా తగ్గిందంటే ఆటోమెటిక్‌గా బయోబబుల్ మాయమవుతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: కోహ్లికి విశ్రాంతి; ఒక్క సిరీస్‌కేనా.. పూర్తిగా పక్కనబెట్టనున్నారా?! -
బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారే : కివీస్ కెప్టెన్
మౌంట్ మాంగనుయ్ : చేతిలో బంతి ఉంటే భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంతో ప్రమాదకారి అని, అయితే అతని బౌలింగ్‌లో కాస్త పదును పెరగాల్సిన అవసరం ఉందని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నాడు. మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలై 0-3తో సిరీస్‌ను కోల్పోయి వైట్‌వాష్ అయిన సంగతి తెలిసిందే. కివీస్‌తో జరిగిన సిరీస్‌లో దారుణంగా విఫలమైన బుమ్రాపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు సందిస్తున్న వేళ కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం అతనికి మద్దతుగా నిలిచాడు. (అందుకే ఓడిపోయాం: విలియమ్సన్) 'అన్ని ఫార్మాట్లో ఇప్పటికే బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్‌గా తనేంటో నిరూపించుకున్న విషయం మనందరికి తెలుసు. ప్రస్తుతం అతడు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. చేతిలో బంతి ఉంటే బుమ్రా ఎంతో ప్రమాదకరం. కానీ అతడి బౌలింగ్‌లో కాస్త పదును పెరగాల్సిన అవసరం ఉంది. బుమ్రా విషయంలో టీమిండియాకు ఎలాంటి అనుమానాలు వద్దు. ఏ సమయంలోనైనా పుంజుకోగలడు' అని కేన్ విలియమ్సన్ తెలిపాడు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గుర్తింపు పొందిన బుమ్రా న్యూజిలాండ్ సిరీస్‌లో మాత్రం ఒక సాధారణ బౌలర్లా బౌలింగ్ చేయడం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. భారత్ జట్టులోకి అరంగేట్రం చేసిన తర్వాత ఓ ద్వైపాక్షిక సిరీస్‌లో బుమ్రా కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.గత ఏడాది గాయం కారణంగా మూడు నెలలు క్రికెట్‌కి దూరమైన బుమ్రా.. ఈ ఏడాది ఆరంభంలో తిరిగి జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే పునరాగమనంలో మునుపటిలా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో తన పదునైన యార్కర్లని సంధించడంలో తేలిపోతున్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య ఈ నెల 21 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుండగా.. కనీసం టెస్టుల్లోనైనా బుమ్రా తన మ్యాజిక్‌ను చూసిస్తాడేమో చూడాలి.(అరె! అచ్చం బుమ్రాను దింపేశాడుగా) -
‘సి' గ్రేడ్‌కు యువరాజ్!
ముంబై: పేలవ ఫామ్‌తో జట్టులో చోటు దక్కిం చుకోవడానికి ఇబ్బంది పడుతున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బీసీసీఐ ఆటగాళ్ల కాంట్రాక్టుల్లోనూ దిగజారబోతున్నాడా..? పరిస్థితులు చూస్తే అలాగే ఉన్నాయి. ఇప్పటిదాకా కెప్టెన్ ఎంఎస్ ధోని, కోహ్లి, అశ్విన్, రైనాలతో కూడిన గ్రేడ్ ‘ఎ’లో ఉన్న అతను తాజా ఆటగాళ్ల ఒప్పంద పునరుద్ధరణలో గ్రేడ్ ‘సి’కి పడిపోయే అవకాశాలున్నట్టు బోర్డు వర్గాల సమాచారం. గతేడాది డిసెంబర్లో చివరి వన్డే ఆడిన యువీ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో జాతీ య జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇక ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో సత్తా ని రూపించుకున్న ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ భువనేశ్వర్‌లకు బంపర్ ఆఫర్ లభించనుంది. వీరిద్దరు ఎలైట్ గ్రూప్ అయిన ‘ఎ’లో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక ఇదే గ్రూపులో ఉన్న రైనా టెస్టు జట్టులో లేకపోయినా వన్డేల్లో చూపిన ప్రతిభతో అతడి స్థానానికి ఢోకా లేనట్టే. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ టెండూల్కర్ పేరు త్వరలో వెలువరించే కొత్త జాబితా నుంచి తొలగిపోనుంది. మరోవైపు యువ బ్యాట్స్‌మన్ రహానే, రాయుడు, షమీ మంచి ప్రదర్శన కనబరచడంతో గ్రేడ్ ‘బి’కి రానున్నారు. ఇదే గ్రూపు లో చోటుకు మోహిత్ శర్మ కూడా గట్టి పోటీదారుగా కనిపిస్తున్నాడు. స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా గ్రేడ్ ‘సి’కి పడిపోనున్నాడు. ఇప్పటిదాకా కాంట్రాక్టుల జాబితాలో లేని సంజూ శామ్సన్, పంకజ్ సింగ్, ఈశ్వర్ పాండే, కరణ్ శర్మ భారత్ తరఫున బరిలోకి దిగడంతో నిబంధనల ప్రకారం గ్రేడ్ ‘సి’లో చోటు దక్కించుకుంటారు.