population day
-
World Population Day 2024 : ఆసక్తికర విషయాలు (ఫోటోలు)
-
మానవ జనాభా విస్ఫోటాననికి సైన్స్ కారణమా..?
1950 - 2020 యుద్ధాలు , కరువు కాటకాలు , అంటు రోగాలు - మానవ జాతి చరిత్ర లో అది ఏ ప్రాంతమైనా, ఏ కాలమైనా మరణాలు ఎక్కువగా సంభవించేవి . ఒకప్పుడైతే వైద్య సదుపాయాలు కూడా పెద్దగా ఉండేవి కావు . గర్భస్థ దశలోనే మరణించే శిశువులు , పుట్టినా అంటు రోగాలతో , పోషకాహార లోపాలతో మరణించే వారు .... ప్లేగు , కలరా లాంటి అంటు రోగాలు కరువులు , యుద్ధాలు ..... వెరసి మరణాలు నిత్యకృత్యాలు. సగటు జీవనాయుర్దాయం 40 - 50. అరవై ఏళ్ళు బతికితే అదో పండుగ . పుట్టిన పది మందిలో తొమ్మిది మంది ఆ లోపే పోయేవారు . 20 వ శతాబ్దంలో సైన్స్ అభివృద్ధి చెందింది. వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత వియత్నాం యుద్ధం లాంటి చిన్న యుద్ధాలు జరిగిన మాట వాస్తవం. కానీ గతం తో పోలిస్తే యుద్ధాల సంఖ్య , మరణాలు రెండూ తక్కువే . బహుశా మానవ జాతి చరిత్ర లో 1950 - 2020 కాలం అత్యంత శాంతియుత కాలం . మరణాలు తక్కువ . హరిత విప్లవం లాంటి వాటి వల్ల తిండికి కొరత లేకుండా పోయింది . ప్రపంచం లోని వివిధ దేశాలు సంక్షేమ పథకాలు అమలు చేసి తిండికి పెద్దగా కొరత లేకుండా చేసాయి (కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాత్రం... పాపం .. ఇంకా అదే స్థితి ) 1950లో ప్రపంచ జనాభా 250 కోట్లు . ఇప్పుడు 800 కోట్లు . అంటే 70 ఏళ్లలో ప్రపంచ జనాభా మూడు రెట్లు దాటి పెరిగింది . అటుపై గేట్ల తాత రంగంలోకి దిగాడు . మానవ జనాభా విస్ఫోటాననికి కారణం సైన్స్ . ముల్లును ముల్లుతోనే తీయాలి అనేది అతని పద్దతి ... మరో వందేళ్లకు మన వారసులు చరిత్ర పుస్తకాల్లో (పుస్తకాలూ ఉండవు.. క్లౌడ్స్ .. వెబ్ పేజీ లు .. ఇంకా ఇలాంటివి) ఇలాంటి పాఠాన్ని చదువుతారేమో . అన్నట్టు ఇప్పుడు అన్ని వేరియెంట్లకు కలిపి ఒక కొత్త బూస్టర్ వస్తోంది . అంటే నిన్నటి దాకా ఇచ్చిన బూస్టర్ పనికిరానిదా ? టీకాలపైనా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు అంటూ ఒక సంఘం కోర్ట్ ను ఆశ్రయించింది . గత వారం రోజుల్లో నేను కనీసం మూడు వీడియో లు / పోస్ట్ లు చూసాను . డాక్టర్లే టీకాల అసలు బాగోతాన్ని బట్టబయలు చేస్తున్నారు . మరి ఎవరి పై కేసులు పెడుతుందో ఆ సంఘం ! సైన్స్ అంటే ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలి . పరీక్షకు నిలవాలి . అంతే కానీ మేము ఏమి చెప్పినా ఎవరూ ప్రశ్నించకూడదు .. గుడ్డిగా మేము చెప్పిందే వినాలి అంటే ? ఇది సైన్స్ కాదు . మధ్య యుగం నాటి మతం . పోనీ ఒక పని చెయ్యండి . ఊరూరా ఉచిత టెస్టింగ్ కేంద్రాలు పెట్టండి . ఇంటింటికి తిరిగి బలవంతంగా సూదులు పొడిచినట్టే అందరికీ టెస్ట్ చేయండి . సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే బాధ్యత వహించాలి . లేదని గ్యారంటీ ఇవ్వాలి . దాన్ని తయారు చేసినవాడు ఎలాంటి గ్యారెంటీ ఇవ్వడు. ఎవడో వచ్చి పొడిచిపోతాడు . ఎవడైనా పొతే దానికి గాలి నీరు నిప్పు కారణం అని బొంకులాట. జనాల అజ్ఞానికి అంతం లేదు . ప్రపంచం మరో వందేళ్లల్లో ఎంత జనాభా భారాన్ని తగ్గించుకోనుందో . - అమర్నాద్ వాసిరెడ్డి ప్రముఖ ఉపాధ్యాయులు, పరిశోధకులు, మనస్తత్వ పరిశీలకులు -
పెరిగిపోతున్న జనాభా..ఇక తగ్గదా!
విశాఖ రోజురోజుకూ విస్తరిస్తోంది. విభిన్న శాఖలతో విరాజిల్లుతోంది. బహుముఖరంగాలకు కేంద్రంగా నిలుస్తోంది. చిన్న మత్స్యకార గ్రామం నుంచి మహా నగరంగా రూపుదిద్దుకుంది. ‘స్మార్ట్’ సిటీగా ప్రయాణం సాగిస్తోంది. జనాభా పరంగా చూస్తే 21.1లక్షల మంది విశాఖలో జీవిస్తున్నారు. శివార్లను కలుపుకుంటే ఆ సంఖ్య 24,48,405కు చేరుకుందని గణాంక శాస్త్ర నిపుణుల అంచనా. నేడు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం... – ఏయూక్యాంపస్ (విశాఖతూర్పు) సాక్షి, విశాఖపట్టణం : జిల్లా పరిధిలో గణాంకాలను పరిశీలిస్తే 2011 నాటికి 42.91 లక్షలు. 2001నాటికి ఇది కేవలం 38.32 లక్షలు మాత్రమే. ప్రతీ చదరపు కిలోమీటరుకు 384 మంది జీవిస్తున్నారు. విశాఖ జిల్లా 11,161 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. లెక్కల్లో నగరం... 2011 లెక్కల ప్రకారం నగరంలోని మొత్తం జనాభా 17,28,128 వీరిలో పురుషులు 8,73,599 మంది, స్త్రీలు 8,54,529 మందివీరిలో అక్షరాస్యులు 12,79,137.. నగరంలో అక్షరాస్యత 81.79% పురుషుల్లో అక్షరాస్యత 87.25%.. మహిళల్లో అక్షరాస్యత 76.22%.. ఆరేళ్ల లోపు చిన్నారులు 1,64,129.. బాలురు 84,298.. బాలికలు 79,831 ఆందోళనకరం... విద్యావంతులు నివసించే నగరంలో లింగ నిష్పత్తి ఆందోళన కలిగించే విధంగా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు కేవలం 978 మహిళలున్నారు. చిన్నారుల లింగ నిష్పత్తి కేవలం 947 మంది మాత్రమే ఉండడం విచారకరం. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1003 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణాలకంటే గ్రామీణ ప్రాంతంలోనే స్త్రీల జనాభా ఎక్కువగా ఉందనేది గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది. పట్టణవాసుల ఆలోచన విధానంలో మార్పురావాలనే విషయాన్ని లింగ నిష్పత్తి స్పష్టం చేస్తోంది..జలంతోనే జీవనం. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన నీటి వనరుల్ని అందించడం ఎంతో అవసరం. నాణ్యమైన నీటిని నిత్యం అందించేందుకు ప్రస్తుతం ఉన్న జలవనరులు సరిపోవు. వీటిని శుభ్రం చేయకపోవడం, పూడికలు తొలగించి నిల్వ సామర్థ్యాలను పెంచే చర్యలను కాలానుగుణంగా చేపట్టాలి. దశాబ్ధాలుగా తూతూ మంత్రంగానే వీటి పునరుద్ధరణ జరుగుతోంది. ప్రధాన నీటి వనరులైన మేఘాద్రిగెడ్డ, ముడసర్లోవ వంటి జలాశయాలను సంరక్షించే చర్యలకు ప్రత్యేక ప్రాధాన్యమివ్వాలి. వర్షాభావ పరిస్థితులు తలెత్తినపుడు వీటి విలువ, ఆవశ్యకతను గుర్తించడం కంటే ముందుగానే మేలుకోవడం మంచిది. అదే విధంగా ప్రతీ ఇంటిలో వాననీటి సంరక్షణ విధానాల్ని కచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్తులో నగరం నీటికొరతతో విలవిల్లాడాల్సిన పరిస్థితి. విభజన తరువాత విశాఖపై ఒత్తిడి... ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండటంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రతీ సంవత్సరం పెద్దసంఖ్యలో ప్రజలు నగరానికి వలస వస్తున్నారు. కొందరు ఉపాధిని వెతుక్కుంటూ వస్తుంటే, మరికొందరు తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్ధేశ్యంతో ఇక్కడ స్థిరపడుతున్నారు. విభజన తరువాత విశాఖపై ఒత్తిడి పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రధాన నగరం కావడం, రోడ్డు, విమాన, జల రవాణా సదుపాయాలు కలిగి ఉండటం, భారీ పరిశ్రమల కారణంగా జనాభా పెరుగుతూ వస్తోంది. విశాఖ తొలి నుంచి పారిశ్రామికంగా ముందువరుసలో ఉంది. పరిశ్రమలు లక్షలాది మంది ప్రజలకు ఉపాధిని, దేశానికి అవసరమైన వాణిజ్యాన్ని అందిస్తున్నాయి. దీనితో ఉపాధి ఆశించి పెద్దసంఖ్యలో ప్రజల ఇక్కడ స్థిరపడుతున్నారు. పెరిగిన విద్య, వైద్య సదుపాయాలు... కేవలం కొద్దిపాటి ప్రభుత్వ పాఠశాలలు, ఏవీఎన్, వీఎస్ కృష్ణా ప్రభుత్వ కళాశాలలతో ప్రారంభమైన విశాఖ విద్యా వ్యవస్థ నేడు శరవేగంగా విస్తరించింది. నగరంలో ప్రస్తుతం ముప్ఫైకి పైగా ఇంజినీరింగ్, వందల సంఖ్యలో డిగ్రీ కళాశాలు, అదేస్థాయిలో ఇంటర్ కళాశాలలు, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలున్నాయి. నవ్యాంధ్రకు పెద్ద దిక్కుగా నిలుస్తోన్న ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఐఐఎం, ఐఐపీఈ, మేరిటైం వర్సిటీ, దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో పాటు వివిధ ప్రైవేటు విద్యాసంస్థలు విశాఖను విద్యల రాజధానిగా నిలుపుతున్నాయి. వైద్య రంగంలో సైతం విశాఖ విస్తరణ దిశగా అడుగులేస్తోంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన హెల్త్ సిటీ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చేదిగా నిలుస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం మెరుగైన వైద్యం కోసం నిత్యం ఎంతోమంది విశాఖకు వస్తున్నారు. నగరం ప్రాధాన్యాన్ని పెంచుతున్నారు. మురికివాడల నిర్మూలనతోనే.. నగరం నానాటికీ పెరిగిపోతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనలో గత ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే నగరంలో మురికివాడలను పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలి. వీటి స్థానంలో ప్రజలకు పక్కా ఇళ్లను నిర్మించాలి. ప్రస్తుతం మురికివాడల సహితంగా ఉన్న విశాఖను మురికివాడల రహితంగా మలచేందుకు ప్రణాళికలు రూపొందించాలి. నగరంలో 900 పైగా మురికివాడలు ఉన్నట్లు అంచనా. నేర, ప్రమాదాల నిలయం.. సాంకేతికంగా స్మార్ట్ నగరంగా రూపాంతరం చెందుతున్న విశాఖ అదే స్థాయిలో నేరాలకు రాజధానిగా మారిపోతోంది. ఇటీవల కాలంలో నగరంలో ఆర్థిక నేరాలు, హత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగించే విషయం. అదే సమయంలో సైబర్ నేరాలకు నిలయంగా మారుతోంది. సాంకేతికతను లాభదాయకంగా మార్పుచేసుకుంటూ నేరాలను నియంత్రించే దిశగా పోలీసు యంత్రాంగం పయనించాల్సిన అవసరం ఉంది. ట్రాఫికర్ పెరుగుతున్న వాహనాలు, ప్రజల అవసరాల కారణంగా నగరంలో ట్రాఫిక్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ట్రాఫిక్ నియంత్రణలో సరైన సాంకేతికత వినియోగించకపోవడం, ఇరుకు రోడ్డు వెరసి ప్రజలకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. నగరంలో పెరుగుతున్న జనాభాకు సరిపడా పోలీస్ స్టేషన్లు, సిబ్బంది సైతం లేక పోవడం మరో ప్రధాన సమస్య. ప్లానింగ్ అవసరం... నగరం రోజురోజుకీ పరిధిని పెంచుకుంటోంది. జనాభా ఏటా పెరుగుతోంది. వీటికి అనుగుణంగా అవసరమైన మౌలిక వసతుల్నిప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కచ్చితమైన విధానాలను అనుసరించాలి. – ఆచార్య బి.మునిస్వామి, గౌరవ సంచాలకులు, ఏయూ పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ -
'జన' గణనీయం
సాక్షి, గుంటూరు: దేశాభివృద్ధి జనాభా ఆధారపడి ఉంటుంది. కొన్ని దేశాలు అత్యధిక జనాభాతో అల్లాడిపోతుంటే మరికొన్ని జనాభా లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో జనాభా పెరుగుదల రేటు గణనీయంగా పెరుగుతూ ఉంది. 2001లో జిల్లా జనాభా 44,65,144 ఉండగా 2011లో 48,87,813కు పెరిగింది. ప్రస్తుతం 2019 నాటికి జిల్లా జనాభా 52,54,570కు చేరుకుంది. ప్రతి ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అధిక జనాభా వల్ల కలిగే అనర్థాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రపంచ వ్యాప్తంగా దీనిని నిర్వహిస్తున్నారు. ఐదేళ్లలో పెరుగుతూ వస్తున్న జనాభా.. 2001లో పురుషులు 22,50,279 మంది ఉండగా స్త్రీలు 22,14,865 మంది ఉన్నారు. 2011లో 24,40,521 మంది పురుషులు ఉండగా 24,47,292 మంది స్త్రీలు ఉన్నారు. జనాభా పెరుగుదల రేటు 8.72 శాతం ఉండగా 2011 నాటికి 9.47కు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 2011లో జనాభా (66.19శాతం ) 32,35,075 మంది ఉండగా పట్టణ ప్రాంతాల్లో (33.81శాతం) 16,52,738 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష జనాభా దాటిన నగరాల జాబితాలో చిలుకలూరిపేట, నరసరావుపేట, తెనాలి, గుంటూరు ఉన్నాయి. జిల్లాలో జనసాంద్రత ఉన్న గ్రామాలు 691 ఉండగా గుంటూరు, నరసరావుపేట పట్టణాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉంది. 2014–15లో 50,22,250 మంది జనాభా జిల్లాలో ఉన్నారు. 2015–16లో 50,67,879 మంది, 2016–17లో 51,13,922 మంది, 2017–18లో 51,60,384 మంది, 2018–19లో 52,07,268 మంది జిల్లాలో జనాభా ఉన్నారు. గతంలో ఆరుసార్లు రాష్ట్ర అవార్డులు.. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అత్యధికంగా చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచి ఆరుసార్లు వరుసగా రాష్ట్ర అవార్డులు అందుకుని డబుల్ హ్యాట్రిక్ సాధించింది. డాక్టర్ మీరావత్ గోపీనాయక్ ఆధ్వర్యంలో 2009–10లో తొలిసారిగా జిల్లా వైద్యారోగ్యశాఖకు ఈ అవార్డు లభించింది. వైద్య ఆరోగ్యశాఖ ఏర్పడిన 50 ఏళ్లలో గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అవార్డు రావటం ఇదే ప్రథమం. నాటి నుంచి వరుసగా 2010–11లో, 2011–12లో, 2012–13లో, 2013–14లో, 2015–16లో వరుసగా అవార్డు పొంది ఇప్పటివరకు ఏ జిల్లా కూడా సాధించని డబుల్ హ్యాట్రిక్ రికార్డును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సాధించి రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది. రాష్ట్ర విభజన నాటి నుంచి జనాభా నియంత్రణ అవార్డులను టీడీపీ ప్రభుత్వం నిలిపివేసింది. ఉచితంగా ఆపరేషన్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా చేస్తున్నాం. పెళ్ళైన వెంటనే గర్భం రాకుండా నిరో«ధ్‌లు వినియోగించేలా ప్రోత్సహించటం, నోటి మాత్రలు మింగటం ద్వారా త్వరగా గర్భం రాకుండా నిలువరించటం వంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు ప్రజలు పాటించేలా వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే స్త్రీలకు రూ.600, పురుషులకు రూ.1,100 ప్రోత్సాహకంగా ఇస్తున్నాం. - డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ప్రతినెలా 200 కు.ని ఆపరేషన్లు గుంటూరు జీజీహెచ్ కుటుంబ నియంత్రణ విభాగంలో ప్రతినెలా 200 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నాం. జిల్లాలో అత్యధికంగా కు.ని. ఆపరేషన్లు చేస్తున్నందుకు ప్రతి ఏడాది మా వైద్య విభాగానికి అవార్డును ఇస్తున్నారు. ఆపరేషన్ చేసేందుకు కేవలం ఐదు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. ఆపరేషన్ చేసిన రోజే ఇంటికి వెళ్లిపోవచ్చు. కేవలం పదిరోజులపాటు బరువులు ఎత్తకుండా విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. - డాక్టర్ మండవ శ్రీనివాసరావు, జీజీహెచ్ కుటుంబ నియంత్రణ విభాగం మెడికల్ ఆఫీసర్ -
అనంతపురం జన ప్రభంజనం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లాలో జనాభా ఏటా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 40,81,148కు (అనధికారికంగా ఈ సంఖ్య 44 లక్షలకు చేరుకున్నట్లు అంచనా) చేరుకుంది. ఇందులో 20,64,495 మంది పురుషులు, 20,16,653 మంది మహిళలు ఉన్నారు. దీని ప్రభావంతో ప్రజలకు కనీస సౌకర్యాలు అందకుండా పోయాయి. పెరిగిన జనాభాకు తగ్గట్లు అవసరాలు తీర్చే వనరులు లేకుండా పోయాయి. ఆశలు, ఆకాంక్షలు అపరిమితమైపోతున్నాయి. తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు అంతరించి పోతున్నాయి. పర్యవసానం జన విస్ఫోటనం. ప్రజలు భూమికి భారమై, శాపమై పోతున్నారు. కనుకనే దేశాల మధ్య జల, జన యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, భూమి, సహజ సంపదలను దోచుకోవడాలు, దాచుకోవడాలు జరుగుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభా తద్వారా తలెత్తే దుష్పరిణామాలను వివరించేందుకు, సమస్యలపై అవగాహన కలిగించేందుకు ఐక్యరాజ్య సమితి ఆదేశాల మేరకు 1989 నుంచి ఏటా జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2001 సంవత్సరంలో అప్పటి లెక్కల ప్రకారం జిల్లా జనాభా 31 లక్షలుండేది. జనాభా పెరుగుదలకు తగ్గట్లు వైద్య సేవలను అందించడంలో గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. 500 పడకల ఆస్పత్రిగా పేరున్న ప్రభుత్వ సర్వజనాస్పత్రిని ఇటీవల 750 పడకల ఆస్పత్రిగా మార్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో రోజూ 3వేల మంది వైద్య సేవలు పొందుతున్నారు. ఐదు మంది రోగులకు ఒక్క స్టాఫ్‌నర్సు పని చేయాల్సిన చోట వంద మంది రోగులకు ఒక్కరు పనిచేయాల్సి వస్తోంది. ఇక పీహెచ్‌సీల్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. జిల్లాలోని 88 పీహెచ్‌సీలు, సీడీ ఆస్పత్రి, హిందూపురంలోని జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, 15 సీహెచ్‌సీల్లో రోజూ 70 వేల నుంచి 80 వేల ఓపీ ఉంటుంది. కానీ వైద్యులు, స్టాఫ్‌నర్సులు, క్లాస్ 4 సిబ్బంది ఆశించిన స్థాయిలో లేరు. దీంతో పాటు మందుల కొరత తీవ్రంగా ఉంది. దక్కని ఉపాధి ఉద్యోగావకాశాలు జనాభా పెరుదుల ప్రభావం ఉపాధి, ఉద్యోగావకాశాలపై ప్రత్యక్షంగా చూపుతోంది. ఉపాధి కోసం యువత ఎదురు చూడాల్సి వస్తోంది. మానవ వనరులను ఉపయోగించుకోవడంలో గత టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. డిగ్రీలు, పీజీలు చేసిన వారు సైతం క్లాస్ 4 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాలు లేకపోలేదు. గత ప్రభుత్వం లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని భరోసా ఇచ్చి.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టింది. ఉపాధి దొరకపోవడంతో ఎంతో మంది వ్యసనాలకు బానిసలుగా మారి పక్కదారి పడుతున్నారు. నేర ప్రవృత్తి పెరిగిపోయింది. -
జనాభా దినోత్సవం సందర్భంగా లక్కీడిప్
సంగారెడ్డి టౌన్ : ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక బిడ్డ, ఇద్దరు ఆడ పిల్లల తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిం చుకున్న వారిని ప్రోత్సహించడంలో భాగంగా మంగళవారం కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తన చాంబర్లో లక్కీడిప్ తీశారు. ఒకే బిడ్డ గల జహీరాబాద్ మండలం శేఖాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మి, రాములు దంపతులు, పటాన్చెరు మండలం లక్డారం గ్రామానికి చెందిన వి.కళావతి, శేఖర్ దంపతులు లక్కీడిప్‌లో గెలుపొందారు. వీరికి ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున బహుమతి ప్రదానం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మోజిరాం రాథోడ్, డాక్టర్ గాయత్రీదేవి, డాక్టర్ శశాంక్ తదితరులు పాల్గొన్నారు. నేడు ర్యాలీ.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మోజిరాం రాథోడ్ తెలిపారు. కార్యక్రమాన్ని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభిస్తారని, అనంతరం కార్యాలయంలో సమావేశం ఉంటుందని వివరించారు. -
ఐదేళ్లలో మహాభారత్!
మంది ఎక్కువైతే మజ్జిగ పలచనౌతుంది. మజ్జిగేనా.. అన్నీ పలచనవుతాయి. ఆఖరికి మనిషే పలచన అవుతాడు. ప్రకృతి ఇవ్వగలిగినంత ఇస్తుంది. ఇవ్వలేనంత మంది పుట్టుకొచ్చేస్తుంటే ఉన్నదాన్నే సర్దుకోమంటుంది. ఈ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం. కానీ ఉత్సవం కొన్ని దేశాలకే. మన లాంటి పెద్ద దేశాలకు (జనాభాలో పెద్ద) ఉత్సవం కాదు. ఉపద్రవం. ఈ ఉపద్రవం ఎంత త్వరగా ముంచుకురాబోతున్నదంటే.. ఇంకో ఐదేళ్లలో.. అంటే 2022 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను మించిపోతుందట! ఆలోచించాల్సిన విషయమే. 2028 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను మించిపోతుంది అని 2013లో ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే అంతకు ఆరేళ్ల ముందే 2022లో మనం చైనాను దాటేయబోతున్నామన్నమాట! మన పాపులేషన్ ఎంత ఫాస్ట్‌గా పెరిగిపోతోందో చూడండి! (ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లు. భారత్ జనాభా 130 కోట్లు. మొత్తం ప్రపంచ జనాభా 750 కోట్లు.) -
చెరువుంది.. చేపల్లేవ్!
నేడు పాపులేషన్ డే జనాభా పెరిగే చోట పెరుగుతూ పోతుంటే, తగినంత జనాభా లేక బాధపడుతున్న దేశాలూ ప్రపంచంలో ఉన్నాయి. అధిక జనాభా గల దేశాలు.. ఇద్దరు లేక ఒక్కర్ని మించి పిల్లల్ని కంటే.. ‘మీకు అవి కట్ చేస్తాం, ఇవి కట్ చేస్తాం’ అని హెచ్చరిస్తుంటే.. జనాభా కొరతగా ఉన్న దేశాలు.. ‘పిల్లల్ని కనండి బాబూ.. మీకు అవి చేస్తాం, ఇవి చేస్తాం’ అని తమ ప్రజల్ని ప్రోత్సహిస్తున్నాయి. అలా ప్రోత్సహిస్తున్న దేశాలేవో, అవి ఎలా ప్రోత్సహిస్తున్నాయో చూస్తే విడ్డూరంగా అనిపిస్తుంది. ఏడున్నరకే లైట్స్ ఆఫ్! దక్షిణ కొరియా కష్టించి పనిచేసే దేశం. 24 గంటలు కష్టపడినా అక్కడి ఆఫీసులలో పని ఒక కొలిక్కి రాదు. కారణం.. ఆ దేశంలో తగినంత జనాభా లేకపోవడం. ఉద్యోగాలుంటాయి. చేసేందుకు మనుషులుండరు. సకల సౌకర్యాలూ ఉంటాయి. అనుభవించేందుకు మనుషులు ఉండరు. దాంతో అక్కడి గవర్నమెంట్ ఓ ప్లాన్ వేసింది. నెలలో ప్రతి మూడవ బుధవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సాయంత్రం ఏడున్నరకే ౖలñ ట్స్ ఆఫ్ చేసి ఉద్యోగులను ఇంటికి పంపించేస్తోంది. అలాగైనా కొద్ది గంటలు దాంపత్య జీవితం గడిపితే జనాభా కరువు తీరుతుందని దక్షిణ కొరియా ఆలోచన. అలాంటప్పుడు మూడో బుధవారమే ఎందుకు? అన్ని బుధవారాలూ ఇవ్వొచ్చు కదా! ఐడియా బాగానే ఉంది కానీ, ఆఫీస్ పని ఆ మాత్రమైనా జరక్కపోతే మళ్లీ అదో ప్రాబ్లం. మొదటి బిడ్డకు లక్షా పదివేలు! జపాన్ ప్రభుత్వం పనిగట్టుకుని మరీ.. పిల్లల్ని కనేవాళ్లకు డబ్బూదస్కం ఇవ్వడం లేదు కానీ, స్థానిక సంస్థలు వాటికై అవే ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. మొదటి బిడ్డకు లక్షా పదివేల రూపాయలు (మన రూపాయల లెక్కలో), రెండో బిడ్డకు 65 వేలు, మూడో బిడ్డకు 75 వేలు, నాలుగో బిడ్డకు కొన్ని వార్డుల్లోనైతే మూడు లక్షల రూపాయల దాకా ‘ఎంకరేజ్మెంట్ మనీ’ అందుతుంది. కంటూ ఉంటేనే దేశభక్తి ఉన్నట్లు! సింగపూర్‌లో పన్నులు (టాక్సెస్) పేలిపోతాయి. అయితే ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, పిల్లల్ని కంటూ ఉండేవాళ్లకు ఆ.. పన్నులలో మినహాయింపు ఉంటుంది. డిస్కౌంట్ ఉంటుంది. ‘పిల్లల్ని కనండి ప్లీజ్’ అని ప్రభుత్వం ఎంత ప్రాధేయపడినా లాభం లేకపోవడంతో జనాభా అధికారులు ఆఖరికి ‘దేశభక్తి’ని సీన్లోకి తెచ్చారు. ఒక వీడియోను తయారు చేసి యూట్యూబ్‌లోకి ఎక్కించారు. ఆ వీడియోలోని ఒక లైన్ ఇలా ఉంటుంది: ‘‘నేను దేశభక్తి ఉన్న భర్తను. నువ్వు దేశభక్తి ఉన్న నా భార్యవు. జీవితాన్ని ఉత్పత్తి చేయడం అనే పౌరధర్మాన్ని మనిద్దరం కలిసి నిర్వర్తించుదాం’’. వర్కింగ్ ఉమన్ అని చెప్పుకోకండి 2016లో ఈజిప్టు అధ్యక్షుడు ఎర్డోగన్ దేశ మహిళలకు ఒక విజ్ఞప్తి చేశారు. ‘‘అమ్మలాలా.. మీకు దండం పెడతాను. కనీసం ముగ్గురు పిల్లల్నైనా కనండి’’ అని. అక్కడితో ఆయన ఆగిపోలేదు. ‘‘మీరు వర్కింగ్ ఉమన్ అని చెప్పుకోకండి. అలా చెప్పుకుంటే మీరు మాతృత్వాన్ని నిరాకరిస్తున్నారని మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు’’ అని ఒక వివాదాస్పద కామెంట్ కూడా చేశారు. అయితే ఈజిప్టు పౌరులెవరూ దీనిపై విరుచుకుపడలేదు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు? దేశానికి తగినంత జనాభా కావాలి కదా అని సర్ది చెప్పుకున్నారు. అన్నట్లు... ఫస్ట్ టైమ్ బిడ్డను కంటే ఈజిప్టు ఓ గోల్డ్ కాయిన్ని కూడా గిఫ్టుగా ఇస్తోంది. మీరు కనండి.. మేం పెంచుతాం ఆహా! ఫ్రాన్స్ ఎంత గొప్ప దేశం! íపిల్లల్ని, పిల్ల తల్లుల్ని అపురూపంగా చూసుకోవడంలో ఫ్రాన్స్ తర్వాతే ఏ దేశమైనా. తల్లికి ఆరు నెలల ప్రసూతి సెలవు ఇస్తుంది. తల్లి ఆరోగ్యానికి అవసరమైన అన్ని వైద్యసేవల్నీ ఉచితంగా అందిస్తుంది. ఇక బిడ్డనైతే తనే తల్లై పెంచుతుంది. అంటే.. పెంపకంలో ఇబ్బందుల్లేకుండా ఆర్థికంగా చేయూతనిస్తుంది. -
ఆగని జన విస్ఫోటం
నేడు జనాభా దినోత్సవం ఫలితమివ్వని పథకాలు మౌలిక వసతులపై పెనుభారం న్యూఢిల్లీ: మహా నగరాల్లోని మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లను ఒక్కసారి పరిశీలిస్తే మనదేశంలో జనాభా ఉధృతి ఎంత భారీగా ఉందో సులువుగా అర్థమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా శనివారం జనాభా దినోత్సవాన్ని పాటిస్తున్న నేపథ్యంలో.. జాతీయస్థాయిలో అందరికీ నాణ్యమైన వైద్య సదుపాయాలు అందజేయడానికి మార్గదర్శక ప్రణాళిక రూపొందించడం విధానకర్తల ఎదుట ఉన్న ప్రధాన విధి. భారత్‌లో 2011లో నిర్వహించిన లెక్కల ప్రకారం మనదేశ జనాభా 121.2 కోట్లు. ప్రస్తుతం జనాభా విషయంలో అగ్రస్థానంలో ఉన్న చైనాను భారత్ 2025 నాటికి అధిగమిస్తుందని భావిస్తున్నారు. పదుల సంఖ్యలో జనాభా నియంత్రణ, సామాజిక సంక్షేమ పథకాలను ప్రభుత్వాలు అమలు చేసినా, ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. అత్యాధునిక వైద్యవిధానాల వల్ల అన్ని రాష్ట్రాల్లోనూ మరణాల సంఖ్య చాలా వరకు తగ్గినా, జననరేటు మాత్రం తగ్గడం లేదు. పేదల్లోనే జనాభా ఎక్కువ.. పేద కుటుంబాల్లోనే జనాభా అధికమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. జనాభా నియంత్రణ ప్రాధాన్యం, గర్భనిరోధక సాధనాలపై అవగాహన లేమే ఇందుకు కారణమని డాక్టర్లు అంటున్నారు. భారత్‌లోని అభివృద్ధి చెందిన రాష్ట్రాల కుటుంబాల్లో సంతానసాఫల్య రేటు 2.1గా ఉన్నట్టు 2009లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది. అభివృద్ధి చెందిన దేశాల్లోని జనాభా ప్రమాణాలతో చూస్తే ఇది చాలా ఎక్కువ. చైనా ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఒక జంట-ఒక సంతానం’ విధానం మానవ హక్కులకు వ్యతిరేకమనే విమర్శలున్నా, అక్కడ జన విస్ఫోటాన్ని నియంత్రించడంలో ఈ పద్ధతి విజయవంతమైంది. భారత్‌లో జననాల సంఖ్య నిరోధానికి చేసిన ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో, మన జనాభా త్వరలోనే 170 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇంత మందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలను ఎలా కల్పిస్తాయన్నది చాలా విలువైన ప్రశ్న. నిపుణులు చేస్తున్న ముఖ్య సిఫార్సులు 1.మహిళలు, బాలికల సంక్షేమం, చదువుపై శ్రద్ధ చూపడం 2.గర్భనిరోధక సాధనాలు, కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించడం 3.లైంగిక విద్యకు ప్రాధాన్యం పెంచడం 4.పురుషులకు కూడా సంతాన నిరోధక ఆపరేషన్లను ప్రోత్సహించడం 5.తొలి కాన్పునకు మలికాన్పునకు మధ్య వ్యవధి పెంచడం 6.పేదలకు కండోమ్‌ల వంటి గర్భనిరోధక సాధనాలను నిస్సంకోచంగా పంచాలి 7.వైద్యరంగ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి. డాక్టర్లు కరువు గత రెండు సంవత్సరాల్లో కొత్తగా 7,500 ప్రైవేటు ఆస్పత్రులు, మూడు లక్షల మంది డాలర్లు అందుబాటులోకి వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన మందుల దుకాణాల వల్ల గ్రామస్థాయిల్లోనూ సాధారణ మందులతోపాటు గర్భనిరోధక సాధనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే జనాభా అసాధారణ రీతిలో పెరుగుతుండడంతో రోగులకు సరిపడినంత మంది డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారంపై ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉందని ఢిల్లీ యశోదా హాస్పిటల్ డాక్టర్ రజత్ అరోరా అన్నారు. అట్టడుగు స్థాయిలోనూ నాణ్యమైన వైద్యం అందించే వ్యూహాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు.