Power outages
-
Hurricane Milton: మిల్టన్ ధాటికి ఫ్లోరిడా అతలాకుతలం
మిల్టన్ తుఫాను ఫ్లోరిడాలో బీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలులు, వర్షంతో నగరాలను అతలాకుతలం చేసింది. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మరణించారు. విద్యుత్ లేక 30 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. బుధవారం రాత్రి 3 కేటగిరీగా తీరం దాటిన తుఫాను తరువాత ఒకటో కేటగిరీకి బలహీనపడింది. అయినా ముప్పు ఇంకా పొంచి ఉందని అధికారులు పునరుద్ఘాటించారు. టంపా: మిల్టన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు ఫ్లోరిడా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. బుధవారం ఉదయం దక్షిణ ఫ్లోరిడాలోని కొన్ని ప్రాంతాల్లో టోర్నడోలు సంభవించాయి. సెయింట్ లూసీ కౌంటీలో టోర్నడోల ధాటికి ఐదుగురు మృతి చెందారు. ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలోని ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫోర్ట్ మైయర్స్లో మరో టోర్నడో ధాటికి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్థంభాలు నేలకొరగడంతో రాష్ట్రవ్యాప్తంగా 33 లక్షల మంది అంధకారంలో ఉండిపోయారు. హార్డీ కౌంటీ, హైలాండ్స్ కౌంటీతో సహా పలు ప్రదేశాల్లో 90% మందికి విద్యుత్ అంతరాయం కలిగింది. సానిబెల్ నగరంలో రోడ్లన్నీ వరదతో ముంచెత్తాయి. రహదారులపై 3 అడుగుల మేర నీరు చేరింది. వరదలతో టంపా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. నేపుల్స్లో రికార్డు స్థాయిలో నీరు నిలిచింది. తుఫాను ధాటికి తీవ్ర ప్రాణ నష్టం జరిగి ఉంటుందని, అయితే ఎంత మంది చనిపోయారనేది చెప్పలేమని అధికారులు వెల్లడించారు. అత్యధిక వర్షపాతం... సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 41 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వెయ్యేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈదురు గాలులు ట్రోపికానా ఫీల్డ్ పైకప్పును చీల్చాయి. తుపాను ధాటికి పలు క్రేన్లు కూడా కూలిపోయాయి. మంచి నీటి సరఫరాను సైతం నిలిపేశారు. సుదీర్ఘ విద్యుత్ అంతరాయాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ సైతం మూతపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఓర్లాండోలో వాల్ డిస్నీ వరల్డ్, యూనివర్సల్ ఓర్లాండో, సీ వరల్డ్ సంస్థలు గురువారం మూతపడ్డాయి. పలు ఫ్లోరిడా విమానాశ్రయాలను నిరవధికంగా మూసివేశారు. హరికేన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. పొంచి ఉన్న ముప్పు.. హెలెన్ హరికేన్‌తో ఇప్పటికే దెబ్బతిన్న ఫ్లోరిడాను మిల్టన్ మరింత దుస్థితిలోకి తీసుకెళ్లింది. ఈ ఏడాది అమెరికాను తాకిన ఐదో హరికేన్ ఇది. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ తీరానికి 75 మైళ్ల దూరంలో మిల్టన్ కేంద్రీకృతమై ఉందని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ)తెలిపింది. దీని ప్రభావంతో తూర్పు మధ్య, ఈశాన్య ఫ్లోరిడాలో ఈదురుగాలులు వీస్తాయని, ఫ్లోరిడా, జార్జియా, దక్షిణ కరోలినా తూర్పు తీరం వెంబడి తుఫాను ముప్పు ఇంకా ఉందని వెల్లడించింది. అధికారులు ఫ్లోరిడా, ఇతర రాష్ట్రాలకు చెందిన 9,000 మంది నేషనల్ గార్డ్ సభ్యులతో సహాయక చర్యలు చేపట్టారు. కాలిఫోరి్నయా వరకు 50,000 మందికి పైగా యుటిలిటీ కారి్మకులను అందుబాటులో ఉంచారు. టంపా, సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని 60 శాతానికి పైగా గ్యాస్ స్టేషన్లలో బుధవారం రాత్రే గ్యాస్ నిండుకోవడంతో గ్యాసోలిన్ ట్యాంకర్లను తరలించడానికి సైరన్లతో హైవే పెట్రోలింగ్ కార్లు పనిచేస్తున్నాయి. -
కరెంటు అంతరాయాలకు కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలోని తూర్పు, దక్షిణ, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో 2019–20లో 3,90,882 విద్యుత్ అంతరాయాలు చోటు చేసుకుంటే, 2020–21లో ఇప్పటివరకు 2,54,414 మాత్రమే నమోదు కావడం గమనార్హం. గతంలో విద్యుత్ వాడకం పెరిగినా అందుకు తగ్గట్టుగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచలేదు. అలాగే గతంలో నాలుగు గ్రామాలకొక లైన్‌మ్యాన్ ఉండేవారు. దీంతో ఫీడర్ల పరిధిలో కరెంట్ పోతే లైన్‌మ్యాన్ వచ్చే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో అంతరాయాలు ఏర్పడేవి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఈ అంతరాయాలు సుదీర్ఘ సమయం పాటు కొనసాగేవి. ‘తూర్పు’లో భారీ మార్పు రాష్ట్రంలో ఉన్న మూడు డిస్కమ్‌లలో గ్రామీణ ప్రాంతం, గిరిజన ఆవాసాలు ఎక్కువగా ఉండే తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలో భారీ మార్పు కన్పిస్తోంది. ఈ డిస్కమ్ పరిధిలో గత ఏడాది 1,24,035 అంతరాయాలు ఏర్పడితే ఈ ఏడాది ఇప్పటివరకు చాలా తక్కువగా 28,663 మాత్రమే నమోదయ్యాయి. ఏళ్లనాటి విద్యుత్ స్తంభాలు, లైన్లు మార్చడంపై విద్యుత్‌శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అనధికారిక కనెక్షన్లు క్రమబద్ధీకరించి, లోడ్‌కు తగినట్టు మారుమూల ప్రాంతాల్లో సైతం కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఈ చర్యలన్నీ సరఫరాలో అంతరాయాలు తగ్గించడానికి తోడ్పడ్డాయి. చక్కదిద్దేందుకు చర్యలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ పరిస్థితిని మార్చేందుకు చర్యలు చేపట్టింది. ఫీడర్ల బలోపేతానికి ప్రత్యేకంగా రూ.1,700 కోట్లు కేటాయించింది. దీంతో గ్రామీణ విద్యుత్ సరఫరా జరిగే లైన్ల సామర్థ్యాన్ని పెంచారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుతో పాటు అధిక లోడ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఆధునీకరించారు. వాడకాన్ని తట్టుకునేలా కండక్టర్లను మార్చారు. ఇంధనశాఖ క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇదంతా ఆన్లైన్ ద్వారానే గమనించేలా పారదర్శక విధానం తీసుకొచ్చారు. ఏ సమయంలో అంతరాయం కలిగింది? ఎంతసేపట్లో పరిష్కరించారు? అనేది తెలుసుకుంటుండటంతో సిబ్బందిలో జవాబుదారీతనం మరింత పెరిగింది. మరోవైపు గ్రామ సచివాలయ వ్యవస్థ విద్యుత్ అంతరాయాలు తగ్గించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రతి గ్రామ సచివాలయంలోనూ ఒక్కరు చొప్పున ఇంధన సహాయకులను ఏర్పాటు చేశారు. సుశిక్షితులైన ఈ సిబ్బంది అందుబాటులో ఉండటం వల్ల అంతరాయం వచ్చిన వెంటనే వారు హాజరవుతున్నారు. అంతేగాకుండా సమస్యను గుర్తించి సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ అంతరాయం ఏర్పడకుండా నివారిస్తున్నారు. (చదవండి: ప్రేమికుల దినోత్సవం రోజున పెళ్లి పుస్తకం) హతవిధీ.. ‘గుర్తు’ తప్పింది! -
ఇంకా వీడని అంధకారం..
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. మూసీ పరీవాహక ప్రాంత బస్తీలు విలవిలలాడాయి. ఈ బస్తీల్లోకి వరద పోటెత్తింది. దీనికితోడు కరెంట్‌లేక అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. హయత్‌నగర్, తట్టి అన్నారం, నిమ్స్, కందికల్ గేట్, పెద్ద అంబర్పేట్, కొత్తపేట, రంగారెడ్డి కోర్టు, హనుమాన్‌నగర్, ఎంజీబీఎస్, అత్తాపూర్ తదితర 33 కేవీ సబ్స్టేషన్లను వరదనీరు ముంచెత్తింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ లైన్లపై పడటంతో 686 ఫీడర్లు ట్రిప్పయ్యాయి. 59 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 312 విద్యుత్ స్తంభాలు నెలకూలాయి. దీంతో ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం రాత్రి వరకు 35 ఫీడర్లు, 63 విద్యుత్ స్తంభాలు మినహా మిగిలినవాటిని పునరుద్ధరించినట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటించింది. అయితే రోడ్‌సైడ్ బ్రేకర్లలోకి వరద చేరడంతో ఆన్ చేసిన వెంటనే సుమారు 200పైగా ఫీడర్లు మళ్లీ ట్రిప్పయ్యాయి. ఫలితంగా ఆయా ఫీడర్ల పరిధిలోని వినియోగదారులకు రెండోరోజు కూడా అంధకారం తప్పలేదు. చార్జింగ్ లేక సెల్ఫోన్లు కూడా మూగబోయాయి. ఇప్పటికీ అంధకారంలోనే ఆ కాలనీలు ►బంజారాహిల్స్‌లోని ఫిలింనగర్, ఎన్బీటీ నగర్, ఎమ్మెల్యే కాలనీ, కమలాపురి కాలనీ, ఇందిరానగర్, పంజగుట్ట, సోమాజిగూడ, ఖైరతాబాద్, చింతల్బస్తీలకు ఇప్పటివరకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. జూబ్లీహిల్స్ రహమత్‌నగర్ డివిజన్‌లోనూ కరెంటు సరఫరా లేదు. ►ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గడ్డిఅన్నారం డివిజన్ కోదండరామ్‌నగర్, పీఎన్టీ కాలనీ, బీఎన్‌రెడ్డినగర్ డివిజన్లోని హరిహరపురం, ఎస్కేడీ నగర్ పార్ట్, గాంధీనగర్, హయత్‌నగర్ డివిజన్లోని రాఘవేంద్రనగర్, పద్మావతీనగర్, బంజారాకాలనీ, అంబేడ్కర్‌నగర్, రంగనాయకులగుట్ట కాలనీలో విద్యుత్ సరఫరా లేదు. ►హుస్సేన్ సాగర్ నాలాను ఆనుకుని ఉన్న నల్లకుంట డివిజన్ రత్నానగర్, సత్యానగర్లలోకి వరద నీరు భారీగా చేరడంతో ఆయా బస్తీలకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ►ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గూడెం చెరువు, పర్వతాపూర్ చెరువు తెగి చెరువుల కింద ఉన్న రామకృష్ణనగర్, కృష్ణానగర్, బాలాజీనగర్, ఆదర్శనగర్, సాయికృష్ణనగర్ తదితర ప్రాంతాలు పూర్తిగా జల మయమవడంతో ఆయా కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. -
కృష్ణమ్మ చెంత.. తాగునీటి చింత
ఈ నగరానికి ఏమైంది!? - అరకొరగా మంచినీటి సరఫరా - కాటేస్తున్న నీటి కాలుష్యం - నీటి వృథాను అరికట్టలేని అధికారులు విజయవాడ సెంట్రల్ : కృష్ణమ్మ చెంతనే ఉన్నా నగరంలో దాహం కేకలు తప్పడం లేదు. మంచినీళ్లు అరకొరగానే అందుతున్నాయని శివారు ప్రాంతాల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్ కోతలు లేకపోయినప్పటికీ ఆశించిన స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదు. పాయకాపురం, సింగ్‌నగర్, పూర్ణానందంపేట, మధురానగర్, మొగల్రాజపురం తదితర ప్రాంతాల్లో కుళాయిల నుంచి వస్తున్న సన్నటి నీటి ధారలు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. కొండప్రాంతాలు, జక్కంపూడి వైఎస్సార్ కాలనీల్లో ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తున్నారు. భవానీపురం హెడ్ వాటర్ వర్క్స్ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం మహిళలు మండుటెండల్లో బిందెలతో ఎదురుచూపులు చూడాల్సిన దుస్థితి. ఎండలు అదరగొడుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరాలు మరింతగా పెరిగాయి. ట్యాంకర్ల ద్వారా ఇచ్చే నీరు చాలడం లేదని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. అన్నీ కాకిలెక్కలే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి మనిషికీ రోజుకు 150 లీటర్ల నీరు కావాలి. నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారుల లెక్కల ప్రకారం 164 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో మరే ప్రాంతంలో చేయని విధంగా నగరంలో నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే అవన్నీ కాకిలెక్కలే అని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జరి గిన కౌన్సిల్ సమావేంలో పాలక, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన నీటి ఎద్దడి అంశంపై ఇంజినీరింగ్ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయారు. కాలుష్యం కాటు.. నీటి సరఫరా కోసం రూ. 27 కోట్లను నగరపాలక సంస్థ ఖర్చు చేస్తున్నప్పటికీ నాణ్యమైన నీరు ప్రజలకు అందడం లేదు. రంగుమారిన, పురుగులున్న నీరు కుళాయిల ద్వారా వస్తోంది. రామలింగేశ్వరనగర్లో రూ.25 కోట్లతో నిర్మించిన 10 ఎంజీడీ ప్లాంటు అధ్వానంగా మారింది. ప్లాంట్ నుంచి నదీగర్భంలోకి విడుదల చేసే మురుగునీరు దిగువకు వెళ్లకుండా ఆయా ప్రాంతాల ప్రజలు అడ్డుచెప్పడంలో ప్లాంట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్ నుంచి విడుదలయ్యే రక్షిత మంచినీటితో మురుగునీరు మిళితం కావడంతో ఆ ప్లాంట్ పరిధిలోని నాలుగు లక్షల మంది ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో రక్షిత నీటి సరఫరా పథకాల ఏర్పాటు కోసం రూ.110 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇవి కార్యరూపం దాలిస్తేనే కాలుష్య సమస్య తీరుతుంది. నీటి సరఫరా ఇలా.. హెడ్ వాటర్ వర్క్స్‌లోని 16, 11, 8, 5 ఎంజీడీ (మిలియన్ గ్యాలన్ పర్డే) ప్లాంట్ల ద్వారా రోజుకు 40 ఎంజీడీ సామర్థ్యానికి గాను 36 మిలియన్ గ్యాలన్ల తాగునీరు సరఫరా చేస్తున్నారు. గంగిరెద్దులదిబ్బ వద్ద 10 ఎంజీడీ ప్లాంటు ద్వారా రోజుకు 2.50 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ఉత్పత్తి అవుతున్న మంచినీటిలో 20 శాతం వృథాగా 36 ఎంజీడీ (164 ఎంఎల్డీ) మంచినీటిని 62 రిజర్వాయర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు నగరపాలక సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. నీటి వృథాను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. సర్కిల్ 3 పరిధిలోని పలు ప్రాంతాల్లో కుళాయిలకు హెడ్స్ లేకపోవడంతో నీరు వృథాగా పోతోంది. దీనిపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ పరిష్కారం కావడం లేదు. -
ముందుంది కరెంట్ కోతల కాలం
విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థికలోటు భర్తీపై సర్కారు కోత వేసిన ఫలితం.. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ పొదుపు లక్ష్యంగా ఇంధనశాఖ భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక లోటు భర్తీపై ప్రభుత్వం కోత విధించిన నేపథ్యంలో అంతర్గత సంస్కరణలపై దృష్టి పెట్టింది. ఒకవైపు విద్యుత్ పొదుపునకు చర్యలు చేపట్టడంతోపాటు.. మరోవైపు పలు రంగాలకిస్తున్నవిద్యుత్లో కోతలు పెట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా గృహాలు, వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో సబ్సిడీ ఇచ్చే గృహ, వ్యవసాయ విద్యుత్ పంపిణీలో దుర్వినియోగాన్ని అరికట్టాలని భావిస్తోంది. ఇందుకోసం కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. ఈ విషయమై ఇంధనశాఖ కార్యదర్శి ఇటీవల జిల్లా డీఈలు, ఏఈలతో చర్చించారు కూడా. అంతర్గత సంస్కరణలకు సమాయత్తం.. విద్యుత్ పంపిణీ సంస్థల ఆర్థిక లోటు భర్తీపై ప్రభుత్వం కోత విధించడంతో అంతర్గత సంస్కరణలపైనే విద్యుత్ సంస్థలు ఆశలు పెట్టుకున్నాయి. రూ.6,455 కోట్లు సబ్సిడీ కావాలని కోరితే, కేవలం రూ. 4,360 కోట్లు మాత్రమే అందిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. దీంతో మిగిలిన మొత్తాన్ని పూడ్చుకునేందుకు అంతర్గత సంస్కరణలు చేపట్టడం తప్ప వాటికి మరోమార్గం కన్పించడం లేదు. దీంతో కొనుగోలు విద్యుత్‌ను కూడా కొంతమేరకు తగ్గించుకునేందుకు ఇంధనశాఖ కసరత్తు చేస్తోంది. ఈ సంవత్సరం 58,191 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉంది. లభ్యత మాత్రం 54,884 మిలియన్ యూనిట్లే. ఫలితంగా 3,307 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ లోటు ఏర్పడే అవకాశముంది. ఫలితంగా ఈ ఏడాది 11,087 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలుకు సిద్ధపడ్డారు. దీనివల్ల విద్యుత్ సంస్థలపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,200 కోట్ల భారం పడే వీలుంది. ఈ భారాన్ని సగానికిపైగా తగ్గించుకోవాలనేది లక్ష్యం. ఈ నేపథ్యంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, కేంద్ర సంస్థల నుంచి వచ్చే విద్యుత్‌తోపాటు గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలపై ఆధారపడాలని ఇంధనశాఖ నిర్ణయించింది. అదే సమయంలో విద్యుత్ పొదుపు చర్యలతోపాటు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది. రంగాలవారీగా కఠిన నిర్ణయాలు ఇలా.. వ్యవసాయం ఈ రంగంలో రోజుకు 30 మిలియన్ యూనిట్లున్న సగటు వాడకాన్ని 22 నుంచి 25 మిలియన్ యూనిట్లకు పరిమితం చేయాలని భావిస్తున్నారు. అధికారికంగా ఉన్న 2 లక్షల వ్యవసాయ కనెక్షన్లను కుదించడంతోపాటు ఐఎస్ఐ పంపుసెట్లు వాడాలనే నిబంధనను విధించే యోచనలో ఉన్నారు. పదివేల సోలార్ పంపుసెట్లను అందించడం మరో మార్గం. ఫీడర్లవారీగా టార్గెట్లు పెట్టడం, ఆశించిన ఫలితాలు రాని ప్రాంతాలపై కేంద్ర కార్యాలయం నుంచే ప్రత్యేక బృందాలను పంపే ఆలోచనలో ఉన్నారు. గృహాలు గృహ విద్యుత్ వినియోగంలో 20 శాతం పొదుపును లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణ బల్బుల స్థానంలో ఎల్ఈడీలు అమర్చడం ఒక మార్గమైతే.. 12 శాతం పంపిణీ నష్టాలున్న ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యాన్ని నివారించడం మరోమార్గం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 వేల మీటర్లలో రీడింగ్ తక్కువగా వస్తోందనే విషయం ఉన్నతాధికారుల దృష్టికొచ్చింది. ఇక మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, గ్రామపంచాయతీల్లోనూ పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టడం పొదుపులో భాగం. ఇప్పటికే వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులు అమరుస్తున్నారు. దీనికితోడు తెల్లవారాక కూడా వీధి దీపాలు ఆపకుండా విద్యుత్‌ను దుర్వినియోగం చేయడాన్ని అడ్డుకునేందుకు వీలుగా టైమర్‌తో కూడిన స్విచ్‌లను అమర్చి, వాటంతటవే ఆగిపోయే విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. వాణిజ్యం, పరిశ్రమలు మొత్తం విద్యుత్‌లో పారిశ్రామిక వాడకం 30 శాతంగా ఉంది. ఈ రంగంలో పెద్దఎత్తున విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్టు అనుమానాలున్నాయి. ఇందులో కిందిస్థాయి సిబ్బంది అవినీతి ఒక కారణంగా భావిస్తున్నారు. దీన్నిదృష్టిలో ఉంచుకుని సిమ్‌కార్డుల ద్వారా ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఫీడర్లవారీగా వచ్చే రీడింగ్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఇందుకోసం ఏ ఫీడర్ నుంచి ఏయే పరిశ్రమలకు విద్యుత్ వెళుతుంది? ఎంత వినియోగం జరుగుతోంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. గృహావసరాలకు వినియోగించే విద్యుత్‌తోనూ వాణిజ్య కార్యకలాపాలు జరుగుతున్నాయనేది అంతర్గత నివేదికల సారాంశం. -
బలిపీఠంపై అన్నదాత!
* విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు * రోజురోజుకూ ఆవిరవుతున్న ఆశలు * అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణాలు * వారం రోజుల్లో ఐదుగురు రైతుల ఆత్మహత్య సాక్షి, రంగారెడ్డి జిల్లా: రోజుకో రైతు బలిపీఠం ఎక్కుతున్నాడు. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక తనువులు చాలిస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం నుంచే రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల జిల్లాలో 15 రైతులు ఆత్మహత్య చేసుకోగా కేవలం వారం వ్యవధిలో ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సాధారణంగా రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోతే.. తక్షణమే స్థానిక రెవెన్యూ అధికారులు ఆ వివరాలు నమోదు చేసుకుని జిల్లా యంత్రాంగానికి సమర్పించాలి. అనంతరం జిల్లాస్థాయిలో ఉండే ప్రత్యేక కమిటీ ఆత్మహత్యపై విచారణ పూర్తిచేసి అనంతరం ప్రభుత్వానికి నివేదించాలి. ఈ వివరాల ఆధారంగా ప్రభుత్వం పరిహారం మంజూరు చేస్తుంది. ఇదంతా క్రమం పద్దతిలో జరగాలి. కానీ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యంతో ఈ పద్దతి గాడి తప్పింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనప్పటినుంచీ ఈ కమిటీ భేటీ కాకపోవడం గమనార్హం. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ అధికారులు రైతు మరణాల వివరాలు నమోదు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగానికీ వివరాలు అందించలేదు. దీంతో ఇప్పటివరకు జిల్లాలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెబుతుండడం గమనార్హం. వారం రోజుల్లోనే ఐదుగురు.. * వికారాబాద్ మండలం దన్నారం గ్రామానికి చెందిన ఆలూరి బాలయ్యకు రెండేళ్లుగా దిగుబడులు ఆశాజనంకంగా లేకపోవడం.. ఇటీవలి ఖరీఫ్‌లో సాగుచేసిన పత్తి, మొక్కజొన్న పంటలు ఎండుముఖం పట్టడాన్ని చూసి ఈనెల 24న పొలం సమీపంలోని పశువుల పాకలోని దూలానికి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. * వికారాబాద్ మండలంలోని పులుసుమామిడి గ్రామంలో కౌలురైతు ఎండీ బురాన్ పదెరాల్లో క్యారెట్, టమాట, క్యాబేజీ పంటలు సాగుచేస్తుండగా.. కరెంటుకోతలు, వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనతో ఉన్న బురాన్ ఈనెల 24న గుండెపోటుతో మృత్యువాతపడ్డాడు. * వర్షాభావ పరిస్థితులతో దిగుబడి రాదనే ఆందోళనతో పరిగి మండలం సయ్యద్‌పల్లి గ్రామానికి చెందిన మల్లిగారి రామస్వామి ఈనెల 23న తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. * ఒకవైపు వర్షాలు లేక పొలం ఎండిపోవడం.. మరోవైపు అప్పు ఇచ్చిన వ్యాపారులు ఒత్తిడి చేస్తుండడంతో ఈనెల 23న షాబాద్ మండలం కుమ్మరిగూడకు చెందిన రైతు కుమ్మరి సత్తయ్య తన ఇంట్లోనే ఉరివేసుకుని తనువు చాలించాడు. * మంచాల మండలం ఆగపల్లి, గోసుల దశరథ ప్రైవేటు అప్పులు తీసుకుని రెండు బోర్లు వేయగా.. చుక్కనీరు పడకపోవడం, పంట ఎండిపోవడంతో ఈనెల 21న తనపొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా.. బుధవారం సాయంత్రం మృతిచెందాడు. -
పార్లమెంటుకు, సుప్రీం కోర్టుకు కరెంట్ కట్
పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి కార్యాలయాలు భారీ మొత్తంలో విద్యుత్ బకాయీలు చెల్లించకపోవడంతో వాటికి విద్యుత్ సరఫరా నిలివేశారు. ఈ మూడే కాదు. మరో ప18 ప్రధాన కార్యాలయాలకు కూడా విద్యుత్ సరఫరా ఆపేశారు. ఇదంతా ఇండియాలో అనుకుంటున్నారా? కాదండీ.... ఇది మన దాయాది పాకిస్తాన్ లో పరిస్థితి. విద్యుత్ బకాయీలు చెల్లించని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలపై కొరడా ఝళిపించమని ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. అయితే మధ్యాహ్నానికే ఆయన సుప్రీంకోర్టుకి, చీఫ్ జస్టిస్ ఇంటికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించమని ఆదేశించారు. ప్రతి వేసవిలోనూ పాకిస్తాన్ లో పవర్ కట్ పెద్ద సమస్యగా మారుతుంది. దేశమంతటా గంటల పాటు కరెంటు సరఫరా ఉండదు. చాలా గ్రామాలు, కొన్ని పట్టణాలు కూడా నిరంతరం చీకటిలో ఉండాల్సిందే. దీనికి వ్యతిరేకంగా ప్రతి సారీ పాకిస్తాన్ అంతటా భారీగా నిరసన ప్రదర్శనలు జరుగుతాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్ చౌర్యం, ప్రభుత్వ కార్యాలయాల బిల్లు బకాయీలు. అందుకే ప్రజా నిరసనను తట్టుకునేందుకే ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు దాదాపు 12 లక్షల డాలర్లు, ఇస్లామాబాద్ టౌన్ హాల్ 36 లక్షల డాలర్లు, బాకీ పడ్డాయి. పాకిస్తానీ విద్యుత్ శాఖ విద్యుత్ సరఫరా చేసే కంపెనీలు 5000 మిలియన్ డాలర్లు బాకీ ఉంది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని నవాజ్ షరీఫ్ చెబుతున్నారు. -
మళ్లీ విద్యుత్ కోతలు
వరంగల్, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా గృహావసరాలకు అధికారికంగా... వ్యవసాయ విద్యుత్‌కు అనధికారికంగా కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. గ్రామాల్లోనైతే పగలంతా విద్యుత్‌ను మరిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రిళ్లు సైతం సరఫరా నిలిపివేస్తుండడం గమనార్హం. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్ పవర్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిందనే సాకుతో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోడ్ రిలీఫ్ కోసం కరెంట్ అధికారులు ప్రధానంగా గ్రామాలపైనే దృష్టి పెట్టి కోతల సమయూన్ని పెంచడం గమనార్హం. ఇక వరంగల్ కార్పొరేషన్లో విద్యుత్ మరమ్మతుల నెపంతో ఏరియాలను బట్టి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. మునిసిపాలిటీ, మండల కేంద్రాలు, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో కూడా కోతలను ఒక్కసారిగా పెంచారు. అంతేకాదు... ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న వ్యవసాయ విద్యుత్‌కు సైతం కోత పెడుతున్నారు. ఈ మేరకు సర్కారు లోపాయికారిక ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ఉచిత విద్యుత్‌ను 5 గంటలకే పరిమితం చేయాలని డిస్కంలకు ఆదేశాలిచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యుత్ సిబ్బంది గంటలో పదిసార్లు ట్రిప్ చేస్తూ విద్యుత్‌ను ఆదా చేసే పనిలో పడ్డారు. దీంతో పొట్టకు వచ్చిన వరికి నీళ్లు పెట్టేందుకు విద్యుత్ సరఫరా సరిపోక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం కరెంట్ లేకపోగా... రాత్రిపూట వచ్చే విద్యుత్ గంటలో పదిసార్లు ట్రిప్ అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రిళ్లు వ్యవసాయ బావుల వద్దే జాగారం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. గ్రామాల్లో 12 గంటలు... గ్రామాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండడం లేదు. వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ ఇచ్చినప్పుడు మూడు గంటలు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నా... పొద్దంతా కరెంట్ ఉండడం లేదని గ్రామాల ప్రజలు చెబుతున్నారు. దీంతో విద్యుత్‌తో సాగే యంత్రాలు, వ్యాపారాలు మూతపడుతున్నాయి. గ్రామాల్లో రాత్రిపూట కూడా విద్యుత్ సరఫరాకు బ్రేక్ వేస్తున్నారు. లోడ్ రిలీఫ్ పేరిట అర్ధరాత్రి గంటపాటు సరఫరా నిలిపివేస్తున్నారు. మండల కేంద్రాల్లో 6 గంటలు... మండల, సబ్‌స్టేషన్ కేంద్రాల్లో ఆరు గంటలపాటు విద్యుత్ కోత విధిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. మండల కేంద్రాల్లో సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు... లేదా ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అనధికారికంగా విద్యుత్ సరఫరా తీసేస్తున్నారు. మునిసిపాలిటీల్లో 4 గంటలు మునిసిపాలిటీ, ముఖ్య పట్టణాల్లో 4 గంటల అధికారిక కోతలు విధిస్తున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు సరఫరా నిలిపివేస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో అధికారికంగా కోతల్లేకున్నా... లైన్ల మరమ్మతులంటూ రోజుల తరబడి ఏరియాల వారీగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా అపేస్తున్నారు. త్వరలోనే అధిగమిస్తాం రెండు రోజుల నుంచి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కోతలు విధించాల్సి వస్తోంది. త్వరలోనే కోతలు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తాం. - మోహన్‌రావు, ఎస్ఈ -
మళ్లీ విద్యుత్ కోతలు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : మండుతున్న ఎండలకు తోడు ఆదివారం నుంచి విద్యుత్ కోతలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. విజయవాడ నగరం మినహా జిల్లా అంతటా విద్యుత్ కోతలు విధించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. జిలా ్లకేంద్రమైన మచిలీపట్నంలో రోజుకు రెండు గంటలు కోత విధిస్తారు. మున్సిపాలిటీలు, మండల కేంద్రాలలో మూడు గంటలు, గ్రామాల్లో ఆరు గంటలు విద్యుత్ కోత విధించాలని ఏపీఎస్పీడీసీఎల్ నుంచి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు అందాయి. మండల కేంద్రాలు, మున్సిపాలిటీలలో ఉదయం 6 నుంచి 7.30 వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1.30 వరకు రెండు విడతలుగా కోత విధిస్తారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఉదయం 6 గంటల నుంచి 7 వరకు, మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు విద్యుత్ కోత అమలు చేస్తారు. గ్రామాల్లో రెండు విడతలుగా ఆరు గంటల కోత విధిస్తారు. విజయవాడ నగరంలో విద్యుత్ కోత విధించకుండా సడలించారు. మండుతున్న ఎండలు.. విద్యుత్ కోతలు ఇప్పటికే ఎండలతో అల్లాడుతున్న ప్రజలు విద్యుత్ కోతలతో బెంబేలెత్తుతున్నారు. అధికారులు ఆదివారం నుంచి కోత విధిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ శనివారం నుంచే కోతలు మొదలయ్యాయి. ఇప్పటికే కొద్ది రోజులుగా విజయవాడ నగరంలో రాత్రింబవళ్లు అప్రకటిత విద్యుత్ కోత అమలు చేస్తున్నారు. రానున్న కొద్దిరోజుల్లో విజయవాడ నగరంలో కూడా కోత విధిస్తారని భావిస్తున్నారు. -
విద్యుత్తు కోతలకు స్వస్తి?
సాక్షి, విజయవాడ : రాబోయే మూడు నాలుగు నెలలు విద్యుత్తు కోతల బాధలు తప్పే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంతో పాటు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నీటితో నిండడంతో విద్యుత్తు ఉత్పత్తి పూర్తిస్థాయికి చేరినట్లు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) చీఫ్ ఇంజనీర్ రాజబాపయ్య ‘సాక్షి’కి తెలిపారు. ఈ నెలాఖరు వరకు విద్యుత్ కోతలు ఉండబోవని, ఆ తర్వాత పరిస్థితుల్ని బట్టి వచ్చే జనవరి వరకు నిరంతరాయంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. రోజూ 11 మిలియన్ల యూనిట్లు వినియోగం జిల్లాలో రోజూ 11 మిలియన్ యూనిట్లు వినియోగం ఉంది. ఎన్టీటీపీఎస్తో పాటు ఇతర ధర్మల్ పవర్ స్టేషన్లు పూర్తిసామర్థ్యంతో పనిచేయడం, వాతావరణం చల్లబడటంతో విద్యుత్తు వినియోగం తగ్గిందని అధికార లెక్కలు చెబుతున్నారు. ప్రసుత్తం రోజుకు సరాసరి 9.8 మిలియన్ యూనిట్లు మాత్రమే ఖర్చవుతోంది. డిమాండ్ కంటే సప్లయి ఎక్కువగా ఉండడంతో కోతలకు స్వస్తి పలికినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైతులకు కూడా రోజుకు ఏడు గంటలపాటు క్రమం తప్పకుండా సరఫరా ఇస్తున్నట్లు వారు వివరిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా 72గంటల సమ్మెకు విద్యుత్తు ఉద్యోగులు దిగడంతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు తొలుత కంగారు పడ్డారు. ఎన్టీటీపీఎస్లోని ఇంజినీరింగ్ అధికారులు సమ్మెలోకి వెళ్లకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీటీపీఎస్లోని ఏడు యూనిట్లు పూర్తి స్థామర్థ్యంతో పనిచేస్తూ 1760 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాయి.