Prabhudas
-
కొంగలను పట్టుకునేందుకు వెళ్లి..
మార్టూరు మండలం గన్నారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కొంగలను పట్టుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ కొక్కిలి కుంటలో పడి చనిపోయారు. మృతులు ప్రభుదాస్(25), సూరయ్య(19)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రైనింగ్ వెళ్లకుండానే ... యువకుడు ఆత్మహత్య
నల్గొండ : ఉద్యోగంలో చేరాల్సిన రోజే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లా వలిగొండ మండలం సుంకిశాలలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ప్రభుదాసు ఇటీవలే ఆర్మీకి ఎంపికయ్యాడు. అందులోభాగా ఈ రోజే ట్రైనింగ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే గ్రామంలోని బావి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం గ్రామస్థులు ప్రభుదేసు మృతదేహాన్ని చూసి ... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మద్యం మత్తులో గొడవ: బావ హత్య
మంచిర్యాల: మద్యం మత్తులో బావ బావమరిది గొడవ పడ్డారు. ఈ ఘటనలో బావ తలపై బావమరిది కర్రతో బాదడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలో జరిగింది. వివరాలు.. ఖమ్మం జిల్లా నాగులంచ గ్రామానికి చెందిన బావ రామ్(25), బావమరిది ప్రభుదాస్ ఇద్దరూ 10 రోజుల క్రితం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పనికి వెళ్లారు. అయితే, ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి విపరీతంగా మద్యం సేవించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఒకరినొకరు నీ అంతు చూస్తానంటే నీ అంతూ చూస్తానని బెదిరించుకున్నారు. అయితే, మద్యం మత్తులో ఉన్న ప్రభుదాస్ ఆవేశంతో బావ రామ్ తలపై కర్రతో గట్టిగా బాదాడు. దీంతో రామ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న కొంతమంది కూలీలు ఇది గమనించి రామ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే, తలపై తీవ్రంగా గాయం కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగానే రామ్ మార్గమధ్యలోనే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. బావ మృతి చెందడంతో ప్రభుదాస్ పరారైనట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి ప్రభుదాస్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: సమ్మెచేస్తున్న ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సికింద్రాబాద్ జేబీఎస్ ప్రాంగణంలోని కంటోన్మెంట్ డిపో ఎదుట ఓ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే పోలీసులు అతన్ని సమయానికి కాపాడారు. కంటోన్మెంట్ డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రభుదాస్ (45) రెండురోజులుగా ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మె రెండో రోజైన గురువారం కూడా ప్రభుత్వం స్పందించడంలేదనే మనస్తాపంతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాగా.. ఇదే డిపోలో తాత్కాలికంగా కండెక్టర్‌గా చేరిన రవీందర్‌పై డిపో ఉద్యోగులు కొందరు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.