praksham district
-
ఏటా రూ.15 వేలు చొప్పున మూడేళ్ళలో రూ.45 వేల ఆర్థికసాయం
-
Aqua Farmers: ఆక్వా రైతులను ముంచేస్తున్నారు..
వ్యాపారులంతా ఒక్కటయ్యారు. సిండికేట్‌గా మారి ఆక్వా రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు. 40 కౌంట్ రొయ్యలను రూ.395కి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. వ్యాపారులు మాత్రం రూ.330కే కొనుగోలు చేస్తున్నారు. నిర్ణీత ధరలకే రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేయాలని స్పష్టం చేసినా.. వారిలో ఎలాంటి మార్పు కనిపించడంలేదు. సంబంధిత శాఖల అధికారులు సైతం దృష్టి సారించకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల తీరుతో సాగుకు పెట్టిన పెట్టుబడి రాక ఆక్వా రైతుల పరిస్థితి దయనీయంగా మారింది సాక్షి ప్రతినిధి, ఒంగోలు: డాలర్ల పంటగా పేరొందిన ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. గత ప్రభుత్వ నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయిన వీరిని ఆదుకునేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ రాయితీలు ప్రకటించారు. వాణిజ్యపరంగా అండగా నిలిచేందుకు ఆక్వా హబ్‌లు, మార్కెట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కానీ, వ్యాపారులు మాత్రం రైతులను అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఎంతగా అంటే.. ఒక్కో రైతు రూ.లక్షల్లో నష్టపోయేంత. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 17వ తేదీ విజయవాడలో అధికారులు, మంత్రులు, రైతులు, వ్యాపారులతో ఉమ్మడిగా సమావేశం నిర్వహించింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే రొయ్యలు కొనుగోలు చేయాలని వ్యాపారులకు దిశానిర్దేశం చేసింది. సమావేశం ముగిసి పదిరోజులు కావస్తున్నా వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల్లో కనీస మార్పు రాలేదు. దానికితోడు జిల్లాలోని అధికారులు సైతం రొయ్యల మార్కెట్‌పై దృష్టి సారించకపోవడం కూడా ప్రధాన కారణమని విమర్శలూ వినిపిస్తున్నాయి. విజయవాడలో వ్యాపారులతో ప్రభుత్వం చర్చలు జరిపి కనీస మద్దతు ధర ప్రకటించినా ఆ ధరలను వ్యాపారులు అమలు చేయడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే వెనామీ రొయ్యలు కేజీకి రూ.30 నుంచి రూ.55 వరకు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. కౌంట్ పేరుతో దోపిడీ... వ్యాపారులు కూటమికట్టి ఇష్టారీతిన దోపిడీ చేస్తున్నారు. వెనామీతో పాటు టైగర్ రొయ్యలను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కౌంట్ రొయ్యలు తీసుకోకుండా లేని కౌంట్ రొయ్యలు కావాలని వ్యాపారులు మెలికపెట్టి మరీ దోచుకుంటున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే మరీ తక్కువ చేసి కొనుగోలు చేయడంతో రైతులు భారీగా నష్టపోవాల్సి వస్తోంది. ఎకరా సాగుకయ్యే ఖర్చు రూ.4.15 లక్షలు... రైతును తీవ్రంగా నష్టపరుస్తున్నారు వ్యాపారులు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు. అధికారుల పట్టించుకోవడం లేదు. దిగుబడి వచ్చిన తర్వాత రొయ్యలను నిల్వ చేసుకునే అవకాశం లేదు. దీనిని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. అధికారులు పట్టించుకుని ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానుల ఎగుమతులను ఆపేయాలి. అప్పుడే వాళ్లకు కష్టం అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే వ్యాపారులు రైతులను అణగదొక్కుతున్నారు. – బత్తుల రమేష్‌రెడ్డి, ఆక్వా రైతు, కొత్తపట్నం అధికారులు నిర్లక్ష్యం వీడాలి రొయ్యల ధరల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వం స్పష్టంగా చెప్పినా రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, వ్యాపారులు రైతులను నిలువునా నష్టపరుస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరల కంటే తక్కువకు కొనుగోలు చేయడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. లేకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారు. – దుగ్గినేని గోపీనాథ్, రొయ్యల రైతుల సంఘ నాయకుడు జిల్లా వ్యాప్తంగా సమావేశం ఏర్పాటు చేస్తాం జిల్లా వ్యాప్తంగా రొయ్యల వ్యాపారులు, రైతులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికే వారికి ప్రకటించిన ధరలకే అమ్మాలని నిర్దేశించింది. అయినా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్దేశించిన ధరలను అమలుచేస్తాం. – ఆవుల చంద్రశేఖరరెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధికారి -
కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ: నమ్మించి.. ముంచేసి!
సాక్షి, చీరాల/వేటపాలెం: వేటపాలెం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో ఒక్కో అక్రమం వెలుగులోకి వస్తోంది. సొసైటీని కొన్నేళ్లపాటు సజావుగానే నడిపారు. వడ్డీ తక్కువ అయినా కష్టపడిన సొమ్ము భద్రంగా ఉంటుందన్న ఆశతో చిరు వ్యాపారులు తమ డబ్బును అందులో దాచుకున్నారు. ఇళ్లలో పాచిపనులు చేసుకొనే నిరు పేదలు తాము సంపదించిన సొమ్మును ఆ సొసైటీలో ఉంచారు. దేవుడి సొమ్ముకు ఇక్కడైతేనే గ్యారంటీ ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని దేవస్థానం కమిటీలు కూడా డిపాజిట్ చేశాయి. మొదటిలో లావాదేవీలన్నీ సజావుగా సాగాయి. సొసైటీ కూడా లాభాల్లోకి వెళ్లింది. కొనేళ్లగా సొసైటీ మేనేజర్‌తో పాటు కమిటీ పెద్దలకు దుర్బుద్ధి పుట్టింది. ప్రజల డిపాజిట్లపై కన్నుపడింది. స్వాహా చేయాలని ప్లాన్ వేశారు. అందుకు మేనేజర్‌ను ఉసిగొల్పారు. అన్ని తానై నడిపిస్తున్న మేనేజర్ ఇందులో కీలకపాత్ర పోషించారు. సొమ్మును స్వాహా చేసి కమిటీ సభ్యులతో చేతులు కలిపి వాటాల రూపంలో పంచుకున్నట్లు సమాచారం. ఇలా చీరాల నియోజకవర్గం పరిధిలో వేటపాలెం, జాండ్రపేట, చీరాల, ఈపుపాలెం, పందిళ్లపల్లి, రామన్నపేట గ్రామాల పరిధిలో 1200 మంది ఖాతాదారులు రూ. 30 కోట్లు పైచిలుక కట్టి ఉన్నారు. ఇందులో చేనేత కార్మికులు కూడా ఉన్నారు. ఇదీ..జరిగింది వేటపాలెంలో ప్రధాన బ్యాంకులు ఏర్పాటు కాక ముందు అంటే 1945 ఆక్టోబర్ 15న కొందరు ప్రైవేటు వ్యక్తులు ఓ సొసైటీని ఏర్పాటు చేశారు. అప్పటిలో అర్బన్ బ్యాంకుగా నామకరణం చేశారు. తదుపరి వేటపాలెం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా మార్చేశారు. ప్రస్తుతం ఉన్న బ్యాంకుల కంటే ఒక్క శాతం ఎక్కువ వడ్డీ ఇస్తామని ఖాతాదారులకు నమ్మకం కలిగించారు. తక్కువ సమయంలోనే నగదు వేయడం.. తీసుకోవడం సులభతరంగా ఉండటంతో పాటు ఒక్క శాతం వడ్డీ అధికంగా వస్తుందని ఎక్కువ మంది తమ నగదు రూ.లక్షల్లో డిపాజిట్లు చేశారు. సొసైటీ ఏర్పాటు చేసి 70 ఏళ్లు దాటడంతో పాలకవర్గంపై ఖాతాదారులకు నమ్మకం కలిగింది. ఎక్కువ మంది డిపాజిట్లు చేశారు. కార్యవర్గ సభ్యులు ప్రతినెలా సొసైటీ కార్యకలాపాలు, లావాదేవీలపై సమావేశాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం గడువు తీరిన డిపాజిట్‌దార్లకు సొసైటీ నెల రోజులుగా నగదు చెల్లించక పోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. డిపాజిట్‌దారులు తమ నగదు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మేనేజర్ తన కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు. బాధితులు వేటపాలెం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సొసైటీ పాలకవర్గ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పరారీలో మేనేజర్ సొసైటీ మేనేజర్ ఆదివారం నుండి పరారీలో ఉన్నాడు. ఎస్ఐ కమలాకర్ కేసు నమోదు చేసుకొని మేనేజర్ కోసం ప్రత్యేక బృదంతో గాలిస్తున్నారు. మేనేజర్ దొరికితేగానీ రూ.30 కోట్లు నగదు ఎమైంది తెలియదు. పాలకవర్గ సభ్యుల ఆస్తులు విక్రయించి తమ నగదు తమకు ఇప్పిచాలని ఎస్పీ మలికా గర్గ్‌ను బాధితులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే కరణానికి వినతిపత్రం వేటపాలెం సొసైటీలో తాము దాచుకున్న డిపాజిట్లు గల్లంతు చేసి మేనేజర్ పారిపోయాడని బాధితులు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తికి దృష్టికి తీసుకెళ్లారు. తాము కష్టపడి కూలినాలీ చేసుకొని, చిన్నాచితకా వ్యాపారాలు చేసుకొని దాచుకొన్న డబ్బులు స్వాహా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దాచుకున్న నగదు తమకు ఇప్పించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు. బాధితులకు న్యాయం చేస్తాం: ఎస్పీ వేటపాలెం: వేటపాలెం కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో డిపాజిట్లు చేసిన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ మలికా గర్గ్ భరోసా ఇచ్చారు. గురువారం వేటపాలెం పోలీసుస్టేషన్ సందర్శనకు వచ్చిన ఆమెను బాధితులు కలిసి తమ సమస్య విన్నవించుకున్నారు. వివిధ రకాల వృత్తులపై ఆధారపడి జీవనం సాగించుకుంటున్న దాదాపు 1200 మంది రూ.30 కోట్లకుపై చిలుకు సొసైటీలో డిపాజిట్ల రూపంలో నగదు దాచుకున్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో వివిధ దేవస్థానాలకు చెందిన రూ.30 లక్షలు డిపాజిట్లు సైంతం సొసైటీలో ఉన్నాయన్నారు. డిపాజిట్ల కాలపరిమితి ముగిసినా డబ్బులు ఇవ్వకుండా కార్యదర్శి(మేనేజర్) పారిపోయాడని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సొసైటీలో దాచుకున్న నగదు తిరిగిరాని పక్షంలో కొంత మంది ఆత్మహత్యలు చేసుకోనే పరిస్థితి ఉందని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. తమ డబ్బులు తమకు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ సొసైటీ నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. పారిపోయిన మేనేజర్‌ను పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కేసును అధికారులు సీరియస్‌గా తీసుకున్నారని ఎస్పీ మలికా గర్గ్ తెలిపారు. ఆమెతో పాటు చీరాల డీఎస్పీ శ్రీకాంత్ ఉన్నారు. -
ఇద్దరూ ప్రాణ స్నేహితులు.. ఒకేసారి ఆత్మహత్య
సాక్షి, అద్దంకి: ఇద్దరు స్నేహితులు వేర్వేరు సమస్యలతో ఒకేసారి.. ఒకే చోట మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన మండలంలోని ధర్మవరంలో బుధవారం జరిగింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దేవరాల శ్రీను (38)కు బల్లికురవ మండలం కొణిదెన గ్రామానికి చెందిన అంకమ్మతో పదహారేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. భర్త తాగుడుకు బానిస కావడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అంకమ్మ ఆరేళ్ల క్రితం భర్తను వదిలేసి కుమార్తెతో పుట్టింట్లో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన మేడగం పాపిరెడ్డి(55)కి భార్య ధనలక్ష్మి, ఇద్దరు పెళ్లయిన కుమారులు ఉన్నారు. పాపిరెడ్డికి 10 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయం చేస్తుంటాడు. కొన్నేళ్లుగా వ్యవసాయం కలిసి రాక నష్టాలు రావడం.. సంపాదన కోసం చేసిన ఇతర వ్యాపారాలు అచ్చిరాక అప్పులు పాలయ్యాడు. పొలం అమ్మి అప్పులు తీర్చేందుకు కుటుంబ సభ్యులు ససేమిరా అన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరూ ఒకేసారి ఆత్మహత్య పాపిరెడ్డి, శ్రీను స్నేహితులు కావడంతో బాధలను ఒకరికొకరు చెప్పుకుంటూ కలిసి తిరుగుతుండే వారు. ఈ క్రమంలో ఇద్దరూ బైకుపై తెల్లవారు జామున గ్రామంలో చక్కర్లు కొట్టారు. తెల్లవారిన తర్వాత ఊరి పొలిమేరల్లోని చెరువు గట్టు వద్ద ఒకరి పక్కన ఒకరు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీన్ని గ్రామస్తులు గమనించి 108కి ఫోన్ చేశారు. సిబ్బంది అక్కడి చేరుకునేలోపే వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మహేశ్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల భార్యలు, అంకమ్మ, ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లుౖ ఎస్ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
రెండు రోజుల క్రితం చిన్నారి అదృశ్యం.. గోనె సంచిలో శవమై..
సాక్షి, ప్రకాశం (గిద్దలూరు) : గోనె సంచిలో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సంఘటన మండలంలోని అంబవరం సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం.. అంబవరం గ్రామానికి చెందిన ఖాశీంవలి కుమార్తె ఖాశింబీ (7) రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గురువారం నుంచి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాశింబీ గ్రామ శివారు చిల్లచెట్ల మధ్య ఓ గోనె సంచిలో మృతదేహమై కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ ఫిరోజ్, ఎస్ఐ త్యాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని గోనె మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. బావిలో పడి వ్యక్తి మృతి కొనకనమిట్ల: పాడుబడిన బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం కొనకనమిట్లలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కొనకనమిట్లకు చెందిన మువ్వా పోలురాజు(35) స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో పాడుబడిన నేల బావి పక్కన వెళ్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలై పోలురాజు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నిచ్చెన సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై శివ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
కరువు నేలపై జలసిరి..
ప్రతి ఇంటి ముంగిటా ఆ అభివృద్ధి వెలుగులే.. ప్రతి పేద గుండెలో ఆ నిండైన రూపమే బీడువారిన నేల తల్లికి జలసిరులందించిన భగీరథునిలా.. కరువు నేలపై హరిత సంతకమయ్యాడు .దగాపడిన బడుగు జీవికి.. లయ తప్పిన పేద గుండెకు ఊపిరిలూదిన దైవంలా నిలిచాడు చదువు ‘కొనలేక’ పేదింటి అక్షరం చిన్నబోతే.. వయసుడిగిన నాడు ఆసరా లేక వృద్ధాప్యం ఉసూరుమంటే ఇంటికి పెద్దకొడుకై ఆపన్న హస్తం అందించాడు. మహానేత దూరమైనా ఆయన ఇచ్చిన అభివృద్ధి ఫలాలు నిత్యం గుర్తుచేస్తూనే ఉన్నాయి నేడు వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆ రాజశేఖరుని స్మరించుకుంటున్నారు. సాక్షి,ప్రకాశం: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జిల్లా అభివృద్ధిలో చెరగని ముద్ర వేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అభివృద్ధిని పరుగులు పెట్టించారు. ఆ మహానేత కనుమరుగై పుష్కర కాలం కావస్తున్నా జిల్లా ప్రజలు మాత్రం ఆయన జ్ఞాపకాలను గుండెల్లో పదిలం చేసుకున్నారు. డాక్టర్ వైఎస్సార్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవంగా జరుపుతోంది. గురువారం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుందాం.. నిత్యం కరువుతో అల్లాడే జిల్లా రూపు రేఖలు మార్చేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా సాగు, తాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. జిల్లాలో ఆయన ఆలోచనలతో జీవం పోసుకున్న ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి. కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం.... యర్రం చినపోలిరెడ్డి కొరిశపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కూడా వైఎస్సార్ రూపొందించిందే. గుండ్లకమ్మ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి కొరిశపాడు, నాగులుప్పలపాడు మండలాల్లో ప్రజలను ఆదుకునేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టారు. రెండు మండలాల్లోని 20 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా 1.33 టీఎంసీల సామర్ధ్యంతో ప్రాజక్టుకు రూపకల్పన చేశారు. మొత్తం రూ.177 కోట్ల వ్యయ అంచనాలతో ప్రాజెక్టును రూపొందించారు. వైఎస్సార్ అకాల మరణం తరువాత పనులు నిలిచిపోయాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మళ్లీ పనులు వేగం పుంజుకున్నాయి. ►పాలేరు రిజర్వాయర్‌ను కూడా వైఎస్సార్ మంజూరు చేశారు. కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు మండలం పాలేరుపై చెన్నుపాడు వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 0.584 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టును మధ్యలో టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయటానికి రూ.210 కోట్లతో కొత్తగా వ్యయ అంచనాలను మార్చి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ►జిల్లాలో సాగర్ ఆయకట్టు దాదాపు 4.40 లక్షల ఎకరాల్లో ఉంది. సాగు, తాగునీరు సక్రమంగా వచ్చేందుకు కాలువల మరమ్మతులు ఏళ్ల తరబడి చేపట్టకపోవటంతో సాగర్ నుంచి రావాల్సిన వాటా నీటిని కూడా వినియోగించుకునే పనిలేకుండా పోయింది. దీంతో అప్పట్లో రూ.400 కోట్లు ఖర్చు చేసి సాగర్ కాలువల అభివృద్ధిని చేపట్టారు. ► జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేకపోవటాన్ని గుర్తించిన వైఎస్సార్ జిల్లా కేంద్రం ఒంగోలులో రిమ్స్ మెడికల్ కళాశాలను మంజూరు చేయించారు. మెడికల్ కాలేజి నిర్మాణానికి రూ.250 కోట్లు మంజూరు చేశారు. ► కందుకూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యలను తీర్చేందుకు రూ.110 కోట్లతో సమ్మర్ స్టోరేజీ(ఎస్ఎస్) ట్యాంకును మంజూరు చేశారు. సాగర్ నీటితో రామతీర్థం జలాశయాన్ని నింపి తద్వారా కందుకూరు ఎస్ఎస్ ట్యాంకుకు తాగునీటిని సరఫరా చేయించేందుకు పూనుకున్నారు. ► రాళ్లపాడు ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగాన్ని ఆదుకునేందుకు నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి నీటిని రాళ్లపాడుకు మళ్లించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకోసం రూ.80 కోట్లతో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధికి పూనుకున్నారు. ► ఫ్లోరైడ్ సమస్యతో అల్లాడిపోతున్న కనిగిరి ప్రాంత ప్రజల తాగునీటి అవస్థలు తీర్చేందుకు రూ.175 కోట్లతో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం ఫ్లోరైడ్ సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ► వీటితో పాటు మార్కాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు జిల్లాలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వెలిగొండ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయటానికి వైఎస్సార్ 2004 నుంచే పూనుకున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా వరద నీటిని మళ్లించి జిల్లాలోని 23 మండలాల్లో 3,36,100 ఎకరాలకు, వైఎస్సార్ కడప జిల్లాలోని రెండు మండలాల పరిధిలోని 27,200 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలకు చెందిన 84 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా రూపొందించారు. అదేవిధంగా 15.25 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లు మార్చారు. అప్పటి నుంచి ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులు పెట్టించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు... గుండ్లకమ్మ నది నుంచి నీరు వృథాగా సముద్రం పాలు కావటాన్ని గమనించిన వైఎస్సార్ మద్దిపాడు మండలం మల్లవరం వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందు కోసం రూ.543.43 కోట్లు కేటాయించారు. 3.859 టీఎంసీల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. 9 మండలాల పరిధిలో 84 వేల ఎకరాలకు సాగు నీరు, జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు 43 గ్రామాల పరిధిలోని 2.56 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 నవంబర్ 24న డాక్టర్ వైఎస్సార్ ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. -
ప్రజల సహకారంతోనే కరోనాపై విజయం
-
కరోనాపై ఆధునిక పోరు
సాక్షి, ఒంగోలు: కరోనాపై ఆధునిక పరికరాలతో అధికార యంత్రాంగం పోరు సాగిస్తోంది. వైరస్ విరుగుడుకు సరికొత్త అ్రస్తాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే ఫైరింజన్, డ్రోన్ల ద్వారా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రేయింగ్ చేయించిన నగర పాలక సంస్థ, తాజాగా చెన్నైలోని బీహెచ్ఈఎల్ నుంచి ప్రత్యేక స్ప్రేయింగ్ వాహనాన్ని తెప్పించనుంది. రూ.3.50 లక్షలతో ఈ వాహనానికి నగర పాలక సంస్థ ఆర్డర్ పెట్టింది. సోమవారం ఈ వాహనం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వాహనం వచ్చిన వెంటనే రెడ్‌జోన్ ప్రాంతాల్లో హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించేందుకు నగర పాలక సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రకాశం జిల్లాకు సంబంధించి తొలి కరోనా కేసు ఒంగోలులోని ఎన్జీఓ కాలనీలో నమోదైంది. రోజుల వ్యవధిలో రాజీవ్‌గృహకల్పలో మరో కేసు నమోదైంది. అనంతరం ఇస్లాంపేటలో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇస్లాంపేట, బండ్లమిట్ట, రాజీవ్‌గృహకల్ప ప్రాంతాలను నగర పాలక సంస్థ రెడ్జోన్లుగా ప్రకటించి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. కరోనా వైరస్‌ను నిర్మూలించేందుకు నగర పాలక సంస్థ అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఇస్లాంపేటలోని ప్రతి ఇంట్లోని ప్రతి భాగాన్ని హైపోక్లోరైట్ ద్రావణంతో స్ప్రే చేయించింది. ఫైరింజన్లతో కూడా స్ప్రే చేయించింది. ఇంటి పైభాగం, చెట్లపైన కరోనా వైరస్ క్రిములేమైనా ఉంటాయన్న ఉద్దేశంతో డ్రోన్‌ను కూడా ప్రయోగించింది. తాజాగా బీహెచ్ఈఎల్ నుంచి ప్రత్యేక వాహనాన్ని రప్పిస్తోంది. ఈ వాహనం ద్వారా హైపోక్లోరైట్ ద్రావణాన్ని చల్లితే ఎలాంటి క్రిములైనా నాశనం కానున్నాయి. ఆ వాహనం కోసం నగర పాలక సంస్థ అధికారులు ఎదురు చూస్తున్నారు. -
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి
-
క్వారంటైన్ నుంచి 293 మంది డిశ్చార్జి
సాక్షి, మార్కాపురం: మార్కాపురంలోని జార్జి ఇంజినీరింగ్ కళాశాలలో 74 మంది, కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలల్లో 91 మంది కరోనా వైరస్ అనుమానితులను పరీక్షల అనంతరం శనివారం విడుదల చేసినట్లు విద్యాశాఖమంత్రి సురేష్, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, ఆర్డీవో ఎం.శేషిరెడ్డి, తహసీల్దార్ రమేష్ తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలైన జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో, ఇతర ప్రాంతాల నుంచి రావటంతో అధికారులు క్వారంటైన్ సెంటర్లలో వైద్య పరీక్షలు నిర్వహించిన నెగటివ్ రావడంతో స్వగృహాలకు పంపుతున్నట్లు తెలిపారు. (ఏపీలో 190కి చేరిన పాజిటివ్‌లు) అద్దంకి రూరల్: అద్దంకి క్వారంటైన్ సెంటర్లో ఉన్న కరోనా వైరస్ అనుమానితులను శుక్రవారం 111 మందిని డిశ్చార్జి చేసినట్లు తహసీల్దార్ సీతారామయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కరోనా అనుమానితులుగా గుర్తించిన వారిని క్వారంటైన్ సెంటర్లో 10 రోజులుంచి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోవటంతో కలెక్టర్ ఆదేశాల మేరకు 111 మందిని శనివారం డిశ్చార్జి చేశారు. కందుకూరు: కరోనా అనుమానితులుగా క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచిన పలువురిని వైద్య పరీక్షల అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఇంటికి పంపించారు. ఓగూరులోని వైఎస్సార్ ఉద్యానవన కాలేజీలో ఉన్న క్వారంటైన్ కేంద్రంలో దాదాపు 60 మంది వరకు ఉన్నారు. వీరి నుంచి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షల కోసం పంపారు. వీరిలో 17 మందికి సంబంధించి కరోనా నెగటివ్ రిపోర్టులు రావడంతో శనివారం ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి, ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్ శ్రీనివాసరావు దగ్గర ఉండి వారిని ఇళ్లకు పంపించారు. రెండు కుటుంబాలు క్వారంటైన్‌కు తరలింపు : హనుమంతునిపాడు: మండల పరిధిలోని హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన రెండు కుటుంబాలు, సీతారంపురం ఎస్సీ కాలనీకి చెందిన ఒక వ్యక్తికి కరోనా వైరస్ సోకిందేమని అనుమానంతో కనిగిరి మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు హాజీపురం ఎస్సీ కాలనీకి చెందిన గూడూరి సలోమి, గూడూరి సంతమ్మ ఎస్సీ కమిషనర్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లి మార్చి 15వ తేదీన స్వగ్రామం హాజీపురం వచ్చారు. సీతారాంపురం ఎస్సీ కాలనీకి చెందిన కస్తాల గురువయ్య ఢిల్లీ ఏపీ భవన్లో ఉద్యోగం చేస్తూ స్వగ్రామం వచ్చారు. దీంతో కరోనా సోకిందేమోనని అనుమానంతో వైద్యలను కల్సి స్వచ్ఛందంగా కనిగిరి క్వారంటైన్లో చేరినట్లు డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, ఎస్సైలు వై.శ్రీహరి తెలిపారు. వారి రక్త నమూనాలు తీసి కరోనా పరీక్షలకు పంపించినట్లు తెలిపారు. అనుమానిత కేసు ఐసోలేషన్‌కు చినగంజాం: మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్లో కరోనా అనుమానిత మహిళ కేసును గుర్తించిన టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం ఆమె ఇంటిని సందర్శించి పరిశీలించారు. మహిళకు దగ్గు, జలుబుతో ఉండటంతో ఆమెను చీరాల ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. -
సాక్షి సెలబ్రేషన్ ఆఫర్
-
కిడ్నాప్ కథ సుఖాంతం!
-
పల్లెల వాకిట్లో మానసిక చీకట్లు!
సాక్షి, అమరావతి: ప్రశాంతతకు నిలయాలైన పల్లెల్లో ఇప్పుడు మానసిక అశాంతి అలజడి సృష్టిస్తోందనడానికి పై రెండు కేసులు ఉదాహరణలు. రక్తపోటు, మధుమేహానికి తోడు తాజాగా మానసిక సమస్యలూ ఇప్పుడు గ్రామసీమల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు పట్టణాలు, నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ పోకడ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ పాకుతోందని.. ఇది ప్రమాదకర సంకేతమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. నగరాలు, పట్టణాల్లోని ఆధునిక జీవనశైలి పల్లెలపైనా పెనుప్రభావం చూపుతున్నాయంటున్నారు. సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు జ్వరాలు వంటి చిన్నచిన్న సమస్యలకు వస్తుంటారు. కానీ, గత కొంతకాలంగా మానసిక సమస్యలతో వస్తున్న వారు ఎక్కువగా ఉంటుండడంతో ప్రభుత్వాస్పత్రుల్లో ఇటీవల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో గ్రామీణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు విస్తుపోయేలా ఉన్నాయి. రకరకాల మానసిక రుగ్మతలున్న వారు వేలాది మంది ఉన్నట్లు బయటపడింది. వీటిలో స్క్రీజోఫీనియా, డిప్రెషన్ (కుంగుబాటు), తనలో తాను మాట్లాడుకోవడం, ఎక్కువగా మాట్లాడడం, అకస్మాత్తుగా తీవ్రంగా స్పందించడం (మానిక్ డిజార్డర్స్) వంటి మానసిక రోగాలతో సతమతమవుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. రాష్ట్రంలో ఇలా బాధపడుతున్న వారిలో ప్రకాశం జిల్లా వాసులు అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానంలో అనంతపురం, నెల్లూరు, విశాఖ, ప.గోదావరి జిల్లాల పల్లెవాసులు ఉన్నారు. సగటున చూస్తే పురుషుల్లోనే ఈ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇదిలా ఉంటే.. వీరికి సరైన వైద్యం అందించేందుకు అవసరమైన క్లినికల్ సైకియాట్రిస్టులు రాష్ట్రంలో కరువయ్యారు. దేశవ్యాప్తంగా వీరు 5,500 మంది ఉంటే రాష్ట్రంలో కేవలం 150 మంది మాత్రమే ఉన్నారు. 2 దశాబ్దాల్లో పెనుమార్పులు కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, సామాజిక మాధ్యమాల వలలో పడిపోవడంవల్ల ఒంటరితనం బాగా పెరిగిపోతోంది. దీంతో మానసిక ఒత్తిడికి లోనై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు దశాబ్దాల కిందట ఈ పరిస్థితి లేదు. యువకుల్లో మద్యం, మత్తు మందు వినియోగం పెరగడంతో పరిస్థితి చేయిదాటిపోయింది. దీనివల్ల బలవన్మరణాలు ఎక్కువవుతున్నాయి. మెంటల్ హెల్త్‌ను కాపాడుకోవాలంటే ప్రత్యేక యంత్రాంగాన్ని తయారు చేసుకోవాల్సి ఉంది. – డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, విజయవాడ తల్లిదండ్రుల తీరూ కారణమే తల్లిదండ్రుల పెంపకం కూడా సరిగ్గాలేక పెడదారి పడుతున్న వారూ ఉన్నారు. సెల్‌ఫోన్‌ను బాగా వాడే చిన్నారిని చూసి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ఇది సరికాదు. పిల్లలు ఏ దారిలో వెళ్లాలో తల్లిదండ్రులే తికమక పెడుతున్నారు. చదువు నుంచి స్థిరపడే వరకూ ఇదే పరిస్థితి ఉంది. వీటన్నింటికీ మించి మన విద్యావిధానం వల్ల పిల్లలపై ఎంత ఒత్తిడి ఉందో అందరికీ తెలిసిందే. – డా. మురళీకృష్ణ, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రీ, గుంటూరు ప్రభుత్వాసుపత్రి ►ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వెంకట సుబ్బయ్యకు 38 ఏళ్లు. ఓ కిరాణాషాపులో పనిచేస్తాడు. పిల్లల చదువులకు తన సంపాదన ఏమాత్రం సరిపోకపోవడంతో తీవ్రంగా మథనపడుతున్నాడు. ఒక్కోసారి తనలో తానే గొణుక్కోవడం, ఎవరితో మాట్లాడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుండడంతో కుటుంబ సభ్యులు అతన్ని దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఇదొక రకమైన మానసిక జబ్బు అని, దీనిని ప్రాథమిక దశలో గుర్తిస్తే మెరుగైన ఫలితం ఉండేదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ►శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన 33 ఏళ్ల మనోహర్ ఇంట్లో ఎప్పుడెలా వ్యవహరిస్తాడో తెలీదు. ఒక్కోసారి బాగా ఉంటాడు. మరోసారి అకస్మాత్తుగా తీవ్రంగా స్పందిస్తాడు. ఇంట్లోని వారు అతన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సమాచారం అంతా డాక్టర్ తెలుసుకుని మానసిక జబ్బుల్లో ఒకటైన స్క్రిజోఫీనియాతో రోగి బాధపడుతున్నాడని చెప్పారు. భార్యతో సరిగ్గా పొసగకపోవడం ప్రధాన కారణంగా ఆయన తేల్చారు. మానసిక రుగ్మతలకు వైద్యులు చెబుతున్న కారణాలు.. ►కుటుంబ వ్యవస్థ చిన్నదిగా మారడం.. చదువులు, ఉద్యోగాల పేరిట పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ►మద్యం వినియోగంతో పెరుగుతున్న సమస్యలు గ్రామాల్లో ఆరేళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారిపై సామాజిక మాధ్యమాలు, మితిమీరిన సినిమాలు, టీవీల ప్రభావం ఎక్కువగా ఉండటం.. ఉద్యోగాల్లోనూ ఒత్తిడి కారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు.. విడిపోవడం కారణంగా మానసిక ఆందోళన పెరగడం.. ఈ ప్రభావం గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులపై పడడం.. ఉద్యోగరీత్యా గ్రామీణ యువకులు విదేశాలకు వెళ్లడంవల్ల సొంతూళ్ల్లలోని తల్లిదండ్రుల్లో మానసిక ఆందోళన.. ఆధునిక జీవనశైలి కారణంగా యుక్త వయసులోనే మానసిక సమస్యలకు గురవడం.. -
ఇంటింటా కంటి వెలుగు
సాక్షి, ఒంగోలు: ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకం కింద ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి 16వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 4,80,405 మందికి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 4402 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 911 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఒక ఆరోగ్య కార్యకర్త, ఒక ఆశ కార్యకర్త ఉంటారు. రోజుకు 100 నుంచి 150 మందికి పరీక్షలు నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రతి విద్యార్ధికి ఒక కార్డు.. వైఎస్సార్ కంటి వెలుగులో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక కార్డు ఇవ్వనున్నారు. ఆ కార్డులో విద్యార్థి పేరు, ఆధార్‌కార్డు నంబర్, తల్లిదండ్రుల పేర్లు, పాఠశాల పేరు ఉంటాయి. విద్యార్థికి కంటి పరీక్ష నిర్వహించిన అనంతరం ఎలాంటి సమస్య ఉందో ఆ కార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. నార్మల్, అబ్ నార్మల్, కంటి చూపు సమస్య ఉంటే ఆ వివరాలను కార్డులో నమోదు చేస్తారు. కంటి చూపు సమస్యతో విద్యార్థులు బాధపడుతుంటే తదుపరి స్టేజీకి సంబంధించి రిఫర్ చేసే వివరాలను కూడా ఆ కార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రెండవ దశలో మరింత సూక్ష్మంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ల జోళ్లు అవసరమైన వారికి వాటిని అందిస్తారు. ఒకవేళ శస్త్ర చికిత్సలు అవసరమైతే అలాంటి వారిని ఆసుపత్రికి సిఫార్సు చేస్తారు. ఉపాధ్యాయుని సంతకం తప్పనిసరి.. కంటి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రతి విద్యార్థికి ఒక కార్డును సిద్ధం చేశారు. పాఠశాలల వారీగా విద్యార్థులకు కార్డులను అందించనున్నారు. పరీక్ష వివరాలను నమోదు చేసిన ప్రతిసారీ ఆ కార్డుపై సంబంధిత వి«ధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సంతకం చేయాలి. ఉపాధ్యాయులకు టీఏ.. వైఎస్సార్ కంటి వెలుగు కింద విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు నియమితులైన ఉపాధ్యాయులకు టీఏ అందించనున్నారు. ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులు వెళ్లి కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కానుండటంతో వారికి టీఏ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ వెల్లడించారు. ఒంగోలులో బాలినేని, వైపాలెంలో సురేష్... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని రాంనగర్ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తుండగా, రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించనున్నారు. ఇంటింటా కంటి వెలుగు సీఎం జగన్ ధ్యేయం : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెం: డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటింటా కంటి వెలుగు ను నింపాలన్న బృహత్తర ఆలోచనతో ఉన్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆది మూలపు సురేష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం గురువారం ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన యర్రగొండపాలెంలోని స్వగృహంలో బుధవారం సంబంధిత డాక్టర్లు, విద్యాశాఖాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. చిన్న పిల్లలు కావడం వలన విజన్ సక్రమంగా చెప్పలేక పోవచ్చని, వారిని ముందుగా అవగాహన పరచి విజన్‌ను తీయాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు అనంతరం అవసరం ఉన్నవారికి మందులు, కంటి అద్దాలు ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందని, మరింతగా కంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు తదుపరి దశలో సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయంలో డాక్టర్లకు ఆయా పాఠశాలల హెడ్మాష్టర్లు, ఆశా వర్కర్లు సహకరించాలని ఆయన ఆదేశించారు. హెచ్ఎంలు హాజరు కావాలి.. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో గురువారం ఉదయం 10.30 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీశైలం ఐటీడీఏ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలల హెడ్మాష్టర్లు విద్యార్థులను సమన్వయపరచుకొని కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, తహశీల్దార్ కె.నెహ్రూబాబు, ఎంఈఓ పి.ఆంజనేయులు, పాలుట్ల, వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సురేష్, ఎంఆర్ఐ వీరయ్యలు పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో మాదిగల ఆత్మగౌరవ సభ
-
విలువలకు,విశ్వసనీయతకు పట్టంగట్టండి
-
తనిఖీల్లో పట్టుబడిన రూ.2కోట్ల నగదు
-
పాదయాత్ర చేయనున్న మాజీ ఎంపీ
సాక్షి, ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పాదయాత్ర చేయనున్నట్లు ఆదివారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను వైఎస్సార్సీపీ నేతలు సమావేశమై ఖరారు చేశారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు కోసం జిల్లా ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ ప్రభుత్వంలోనే వెలిగొండ 70శాతం పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు వచ్చాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసే గడువు ప్రతి ఏడూ చంద్రబాబు మార్చుకుంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు తాగు నీటి కోసం అల్లాడుతున్నారని వివరించారు. చంద్రబాబు ఎన్నిసార్లు జిల్లా ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. సంక్రాంతి కానుకగా వెలిగొండ ప్రాజెక్టు ఇస్తా అంటూ జిల్లా ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేయబోతున్నారని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. వెలిగొండపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తోందో ప్రజలకు వివరించేందుకు ఆగస్టు 15 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. జగన్‌ని ఎదుర్కొనే దుమ్ములేకే ఆయన సతీమణిపై టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. కోర్టులో డాక్యుమెంట్స్ దాఖలు చేయకుండానే పచ్చ పత్రికలు ఎలా రాశాయని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు కేసులకు, బెదిరింపులకు తాము బయపడమని స్పష్టం చేశారు. అన్నీ ఎదుర్కొంటామని, ఎలాంటి కేసులయినా చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. -
దళిత విద్యార్ధుల్ని కొట్టిన టీడీపీ నాయకులు
-
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న చంద్రబాబు
సీఎస్‌పురం: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతోందని కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి పాశం వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు. గురువారం సీఎస్‌పురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని అయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాబోవు రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నేలటూరి రమణారెడ్డిని ఎన్నుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మెంబర్ ఎస్బీకే సాయి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హనుమంతునిపాడు, వెలిగండ్ల మండలాల అధ్యక్షులు తానిగుండాల తిరుపతిరెడ్డి, ఎస్కే మహబూబ్‌బాషా, ఖాశిం, రంగనాయకులు, ఏసోబు, ప్రసాదరెడ్డి, టీబీకే సుబ్బారావు, మీరామొహిద్దీన్, శివ పాల్గొన్నారు. -
ప్రకాశం జిల్లాలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు
-
ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి