
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
సాక్షి, ప్రకాశం (గిద్దలూరు) : గోనె సంచిలో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సంఘటన మండలంలోని అంబవరం సమీపంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికలు తెలిపిన వివరాల ప్రకారం.. అంబవరం గ్రామానికి చెందిన ఖాశీంవలి కుమార్తె ఖాశింబీ (7) రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఆమె కోసం గురువారం నుంచి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాశింబీ గ్రామ శివారు చిల్లచెట్ల మధ్య ఓ గోనె సంచిలో మృతదేహమై కనిపించింది. సమాచారం అందుకున్న సీఐ ఫిరోజ్, ఎస్‌ఐ త్యాగరాజులు సంఘటన స్థలానికి చేరుకుని గోనె మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
బావిలో పడి వ్యక్తి మృతి
కొనకనమిట్ల: పాడుబడిన బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల కేంద్రం కొనకనమిట్లలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. కొనకనమిట్లకు చెందిన మువ్వా పోలురాజు(35) స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో పాడుబడిన నేల బావి పక్కన వెళ్తూ ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. దీంతో తీవ్ర గాయాలపాలై పోలురాజు మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. నిచ్చెన సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. సంఘటనా స్థలాన్ని ఎస్సై శివ పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment