జాబితాపై 50 మంది ఐఏఎస్, ఐపీఎస్లు అభ్యంతరం
న్యూఢిల్లీ: ప్రత్యూష్ సిన్హా కమిటీ మంగళవారం సమావేశమై చర్చించింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.
ఇరు రాష్ట్రాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీకి సంబంధించి అధికారుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై చర్చించారు. ప్రస్తుత జాబితాపై దాదాపు 50 మంది అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోలేదు. మరోసారి సమావేశమయ్యే అవకాశముంది.