pregnancies
-
కడుపుతో ఉన్నానంటూ ఓ మహిళ..ఏకంగా రూ. 98 లక్షలు..!
కొందరూ ప్రభుత్వం ఇచ్చే పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఎంతలా కక్కుర్తిపడుతుంటారో తెలిసిందే. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఎలాంటి పనులైన చేస్తారు. కానీ మరీ ఇలా గర్భాల పేరుతో లక్షల్లో డబ్బు కొట్టేయడం చూసి ఉండరు. పోనీ ఒకటో రెండో ప్రశూతి ప్రయోజనాలు కాదు. ఏకంగా ఎన్నిసార్లు ఇలా బూటకపు గర్భాల గురించి అబద్ధాలు చెప్పిందో వింటే కంగుతింటారు. అలాగే ప్రశూతి ప్రయోజనాలకు సంబంధించిన డబ్బు ఎంత మేర కొట్టేసిందో విన్నా వామ్మో! అంటారు. ఏం జరిగిందంటే.. ఇటలీలోని రోమ్‌కి చెందిన 50 ఏళ్ల బార్బరా నకిలీ గర్భాల పేరుతో దాదాపు రూ. 98 లక్షల దాక ప్రసూతి ప్రయోజనాలను కొట్టేసింది. నిజానికి ఆమె గర్భం దాల్చిన సమయంలో కలిగిన పిల్లల గురించి ఏ ఆస్పత్రిలో నమోదు కాలేదు, అధికారులెవ్వరూ కూడా ఆమె పిల్లలను చూడలేదు కూడా. ఆమె రోమ్‌లో ఉన్న క్లినిక్ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాను దొంగలించి అచ్చం అదే మాదిరిగా తన పేరుతో సర్టిఫికేట్లను సృష్టించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేది. ఇలా 24 ఏళ్ల కాలంలో 12 గర్భస్రావాలు జరిగినట్లు, ఐదు మంది పిల్లలు కలిగినట్లు పేర్కొంది. మొత్తంగా 17 బూటకపు గర్భాలతో అధికారులను మోసం చేసింది. అంతేగాక తాజాగా ఇటీవల గత డిసెంబర్లో తాను మరో బిడ్డను ప్రసవించినట్లు పేర్కొంది. దీంతో అనుమానం వచ్చి ఆ 50 ఏళ్ల మహిళ గురించి గత తొమ్మిది నెలలుగా గట్టి నిఘా పెట్టారు. ఆ విచారణలో ఆమె గర్భం అంతా ఓ బూటకమని తేలింది. బేబీ బంప్‌లా కనిపించేందుకు దిండ్లను ఉపయోగించనట్లు వెల్లడయ్యింది. పైగా పుట్టబోయే బిడ్డను మోస్తున్నట్లుగా చాలా బరువు మోస్తున్నట్లు ఫోజులిచ్చేదని అధికారుల చెబుతున్నారు. ఆఖరికి ఆమె భర్త డేవిడ్ పిజ్జినాటోని కూడా ఈ విషయమై ప్రశ్నించగా..తన భార్య గర్భవతి కాదని విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసుల సదరు మహిళ లోయెల్, ఆమె భర్తపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరు ఇటాలియన్ హెల్త్ అసిస్టెన్స్‌నే మోసం చేశారంటూ మండిపడింది. ప్రజా సంస్థను మోసం చేయడమే గాదు దానికి హాని తలపెట్టారని చివాట్లు పెట్టింది. ప్రజా ప్రయోజనంలో భాగంగా సదరు రాష్ట్రం మహిళలకు అందించే ప్రశూతి ప్రయోజనాలను దుర్వినియో పరిచారని ఫైర్ అయ్యింది. అలాగే తనకు ఐదుగురు పిల్లలు ఉన్నారని పలుసార్లు గర్భస్రావాలు జరిగినట్లు తప్పుడు పత్రాల సమర్పించడమే గాక దాన్నే కొనసాగించే య్నతం చేయడం మరింత నేరం అని స్పష్టం చేసింది. అందుకుగానూ లోయెల్‌కి ఒక ఏడాది ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఈ నేరంలో సహకరించిన ఆమె భర్తకు కూడా శిక్ష విధించింది. (చదవండి: 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!) -
రెండుసార్లు గర్భస్రావం.. తర్వాత ప్రెగ్నెంట్.. నెలలోపే మళ్లీ గర్భం.. కవలలు!
మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలని కోరుకోని మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బిడ్డను ప్రపంచంలోకి తీసుకువస్తుంది తల్లి. అందుకోసం ఎంతటి బాధనైనా పంటిబిగువన భరిస్తుంది. పొత్తిళ్లలో చిన్నారిని చూసుకోగానే తాను పడిన ప్రసవ వేదనను మరిచిపోతుంది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కారా విన్‌హోల్డ్ కూడా అలాంటి కోవకు చెందిన వారే! అయితే, ఇప్పటికే ఒక కుమారుడికి జన్మనిచ్చిన ఆమె.. తనకు తెలియకుండానే కవలలకు ప్రాణం పోశారు. వారిని ఈ లోకంలోకి తీసుకువచ్చారు. ఎన్నో అబార్షన్ల తర్వాత దక్కిన ఈ రెట్టింపు సంతోషంతో విన్‌హోల్డ్ దంపతులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసలేం జరిగింది? వాషింగ్టన్ పోస్ట్, మెట్రో కథనాల ప్రకారం.. విన్‌హోల్డ్, ఆమె భర్త 2018లో ఓ బాబుకి జన్మనిచ్చారు. తమ కుటుంబాన్ని మరింతగా విస్తరించుకోవాలని భావించిన ఆ జంట.. మరో సంతానం కోసం ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో 2019లో విన్‌హోల్డ్ గర్భం దాల్చడంతో ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. అనారోగ్య కారణాల రీత్యా ఆమెకు గర్భవిచ్చిత్తి అయింది. 2020లోనూ ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ఆరోగ్యంపై కూడా ఈ అబార్షన్లు తీవ్ర ప్రభావం చూపాయి. అయినప్పటికీ మరో బిడ్డను కనాలన్న ఆ తల్లి మనసు నిరాశ చెందలేదు. ఈ క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో విన్‌హోల్డ్ మరోసారి గర్భవతి అయింది. అన్నీ సజావుగా సాగడంతో పుట్టబోయే బిడ్డ కోసం ఎదురుచూడసాగింది. అయితే, ఊహించని విధంగా ఏడు వారాల తర్వాత తన కడుపులో మరో శిశువు ఎదుగుతున్నట్లు డాక్టర్లు ఆమెకు చెప్పారు. గర్భం దాల్చిన నెల రోజుల తర్వాతే మరో ప్రెగ్నెన్సీ రావడంతో ఇది సాధ్యమైందని వైద్యులు చెప్పడంతో విన్‌హోల్డ్ దంపతులు ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ నేపథ్యంలో ఆమె కవలలకు జన్మనిచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. (PC: Kennedy News and Media Via Metro) కారణం ఏమిటి? కారా విన్హెల్డ్కు తెలియకుండానే కవలలు జన్మించడానికి కారణం సూపర్ఫెటేషన్. హెల్త్‌లైన్ జర్నల్ ప్రకారం.. ఒకేసారి విడుదలైన రెండు అండాలు వేర్వేరు సమయాల్లో(వారాల వ్యవధి) ఫలదీకరణం చెందితే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. దీనినే వైద్య పరిభాషలో సూపర్ఫెటేషన్ అంటారు. ఎప్పుడూ నిరాశ చెందలేదు.. అయితే ఇలా! ‘చాలా మంది పిల్లల్ని కనాలని.. వారితో అమ్మా అని పిలిపించుకోవాలని నాకు ఆశగా ఉండేది. గర్భస్రావాలు అయినప్పటికీ నేను పూర్తి ఆశావాద దృక్పథంతోనే ఉన్నాను. కచ్చితంగా ఇది జరిగి తీరుందని నమ్మాను. అమ్మగా నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసు. అయినా ఏనాడు నిరాశ చెందలేదు. ఇప్పుడు నా కల నెరవేరింది’’ అని విన్‌హోల్డ్ వాషింగ్టన్ పోస్ట్‌తో వ్యాఖ్యానించారు. తన జీవితంలో అద్భుతం జరిగిందంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా విన్హోల్డ్కు కవలలుగా ఇద్దరు కుమారులు జన్మించారు. ఆరు నిమిషాల తేడాతో ఈ భూమ్మీదకు వచ్చిన ఆ బుజ్జాయిలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ముగ్గురు కుమారుల అల్లరితో ఈ దంపతుల ఇల్లు ఇప్పుడు ఎంతో సందడిగా ఉంది. ఇక గర్భవతికి మరో ప్రెగ్నెన్సీ అంటూ విన్‌హోల్డ్ జీవితంలోని ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్.. -
వైద్యుల నిర్లక్ష్యంపై గర్భిణుల ఆగ్రహం
కదిరి టౌన్ : ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన గర్భిణులపై వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారు భగ్గువున్నారు. నడిరోడ్డుపై గురువారం ధర్నా చేశారు. పట్టణంలోని మారుతీనగర్‌కు చెందిన జమీలా, నల్లచెరువు వుండలం కమ్మవారిపల్లి చెందిన శ్రీదేవి, తనకల్లు వుండలం గొల్లవారిపల్లికి చెందిన కవిత ప్రసవం కోసం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. వీరికి సాధారణ కాన్పు కష్టమవుతుందని, సిజేరియన్ చేయాలని వైద్యులు తెలిపారు. వుత్తు ఇంజక్షన్ ఇచ్చే వైద్యుడు లేడని , వెంటనే అనంతపురం పెద్దాస్పత్రికి గాని ప్రైవేటు నర్సింగ్ హోంకు గాని తరలించాలని చెప్పారు. దీంతో ఆగ్రహించిన గర్భిణులు వారి బంధువులతో కలిసి ప్రభుత్వాసుపత్రి అత్యవసర విభాగం వద్ద ఆందోళనకు దిగారు. తర్వాత ఆస్పత్రి ప్రధాన ద్వారం ఎదుట వచ్చి రోడ్డుపై బైఠాయించారు. వీరికి ఆవాజ్, సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు వూట్లాడుతూ గర్భిణులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టరు విజయలక్ష్మిని సస్పెండ్ చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. గర్భిణుల ఆందోళనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ఆస్పత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ డా.రామక్రిష్ణయ్య, మధుసూదన్ అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయితే వారు ససేమిరా అన్నారు. చివరికి ఎస్ఐలు జయపాల్‌రెడ్డి, రాజేష్ తవు సిబ్బందితో అక్కడికి చేరుకుని నచ్చజెప్పారు. సీజేరియన్ కుదరదన్నా : ఈ విషయమై డాక్టరు విజయలక్ష్మిని వివరణ కోరగా ఈ రోజు మత్తు డాక్టరు సెలవుపై వెళ్లారని, దీంతో సిజేరియన్ చేయడానికి కుదరని చెప్పానన్నారు. అంతేకాని డబ్బు డిమాండ్ చేయలేదన్నారు.