Prep
-
మళ్లీ పునర్వ్యవస్థీకరణ!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖను మళ్లీ పునర్వ్యవస్థీకరణ చేసే దిశగా కాంగ్రెస్ సర్కార్ యోచి స్తోంది. 2020 డిసెంబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నీటిపారుదలశాఖను పునర్వ్యవస్థీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిర్లక్ష్యం, నిరాదరణకు గురైన విభాగాలు, ప్రాజెక్టులను గుర్తించి బలోపేతం చేయాలని ప్రస్తుత సర్కారు నిర్ణయించింది. తెలంగాణ వచ్చాక చేపట్టిన ప్రాజె క్టులు, తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర నీటిపారుదలశాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నాణ్యత ప్రశ్నార్థకంగా మారడంతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ నైపుణ్యం, పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. శాఖ పునర్వ్యవస్థీకరణ తర్వాత జరిగిన లాభనష్టాలపై నివేదిక అందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అవసరమైతే మళ్లీ శాఖను పునర్వ్యవస్థీకరించి గాడిలో పెట్టాలని భావిస్తోంది. ప్రభ కోల్పోయిన ‘సీడీఓ’ కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అక్రిడిటేషన్ ఉన్న ప్రతిష్టాత్మక సంస్థల్లో మన రాష్ట్ర నీటిపారుదల శాఖలోని ‘సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్’(సీడీఓ) ఒకటి. దేశంలోని కొన్ని రాష్ట్రాల సీడీఓలకు మాత్రమే ఈ గుర్తింపు ఉంది. సాగునీటి ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్లకు సీడీఓ ఆమోదిస్తూ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తేనే, ఆయా ప్రాజెక్టుల అంచనాలను కేంద్ర జల సంఘం ఆమోదిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఇంజనీర్(సీఈ) నేతృత్వంలో ‘సీడీఓ’స్వయంప్రతిపత్తి గల సంస్థగా పనిచేసేది. అప్పట్లో నిష్ణాతులైన ఇంజనీరింగ్ నిపుణులను మాత్రమే నియమించేవారు. ప్రాజెక్టుల డ్రాయింగ్స్, డిజైన్ల రూపకల్పన, ఆమోదానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో సీడీఓ స్వతంత్రంగా వ్యవహరించేది. దానిపై నీటిపారుదలశాఖ ఈఎన్సీల అజమాయిషీగానీ, ఒత్తిడి గానీ ఉండేది కాదు. 2020 చేపట్టిన నీటిపారుదల శాఖ పునర్వ్యవస్థీకరణలో సీడీఓ స్వతంత్రతను కోల్పోయింది. ఈ విభాగాన్ని ఈఎన్సీ(జనరల్) పర్యవేక్షణ కిందకు తెచ్చి అందులో పనిచేసే ఇంజనీర్ల సంఖ్యనూ సగానికి పైగా కుదించేశారు. తర్వాత సరైన అధ్యయనాలు లేకపోయినా అత్యవసరంగా ఆమోదించాలని ఒత్తిడి పెంచి తమ వద్ద ప్రాజెక్టుల డిజైన్లు, డ్రాయింగ్స్కు ఆమోదం పొందారని ఆరోపిస్తూ సీడీఓ చీఫ్ ఇంజనీర్ ఇటీవల ఈఎన్సీ(జనరల్)కి లేఖ రాయడం విశేషం. ఈఎన్సీ(జనరల్)కు సర్వాధికారాలు కట్టబెట్టే రీతిలో పునర్వ్యవస్థీకరణ జరగడంతో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే విభాగాలు ప్రాధా న్యం కోల్పోయాయి. హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర జలవనరులు, ఆయకట్టు అభివృద్ధి సంస్థ(కాడా)లు సైతం గతంలో స్వతంత్రంగా పనిచేసేవి. మళ్లీ ఈ విభాగాలకు స్వతంత్రత ఇస్తే ప్రాజెక్టుల డిజైన్లు, నీటిలభ్యత అధ్యయనాలను స్వేచ్ఛగా నిర్వహించే అవకాశముంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఐడీసీ లిఫ్టులకు తాళాలు కాల్వల ఆధునీకరణ, ఆయకట్టు అభివృద్ధి, సత్వర సాగునీటి ప్రయోజన పథకం(ఏఐబీపీ), ప్రపంచ బ్యాంకు పథకాలు, నీటి సంఘాల నిర్వహణ చూసే కాడాకు గతంలో ఐఏఎస్‌లు బాస్‌లుగా ఉండేవారు. ఇప్పుడు సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయికి పరిమితం చేశారు. సాగునీటి అభివృద్ధి సంస్థ పరిధిలో 4.56లక్షల ఎకరాలకు నీరందించే 637 చిన్న ఎత్తిపోతల పథకాలున్నాయి. అందులో 216 పూర్తిగా, 137 పాక్షికంగా పనిచేస్తున్నాయి. 193 పూర్తిగా దెబ్బతిన్నాయి. 91 లిఫ్టులు అవసరం లేదని తాళాలు వేశారు. ప్రస్తుతం 2.18 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. పునర్వ్యవస్థీకరణలో ఐడీసీ ప్రాజెక్టులు 19 మంది చీఫ్ ఇంజనీర్ల పరిధిలోకి వెళ్లగా, చిన్న లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ గందరగోళం పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో గందరగోళం నెలకొందని ఆ శాఖ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ► గతంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టును ఒక చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షించేవారు. ఎడమకాల్వ ద్వా రా విడుదల చేసే నీరు ఏపీలోని పశి్చమగోదావరి జిల్లాకు చేరేవరకు ఆయనే పర్యవేక్షించేవారు. ప్రస్తుతం సాగర్ ఎడమ కాల్వ నిర్వహణను సూర్యాపేట చివరి వరకు నల్లగొండ సీఈ, ఆ తర్వాత నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఖమ్మం సీఈ పర్యవేక్షిస్తున్నారు. ► అడ్మిన్ కమ్ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉండేది. ఇప్పుడు నిజామాబాద్, జగిత్యాల, వరంగల్, ములుగు, సూర్యాపేట, రామగుండం(పెద్దపల్లి) చీఫ్ ఇంజనీర్ల నిర్వహణలోకి ఈ ప్రాజెక్టు వెళ్లింది. ► కాళేశ్వరం ఈఎన్సీ(గజ్వేల్) పరిధి సిద్దిపేట వరకు మాత్రమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఈఎన్సీ(రామగుండం) పరిధిలోకి వస్తాయి. ► పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ నాగర్‌కర్నూలు సీఈ పరిధిలో ఉండగా, వన పర్తి, మహబూబాబాద్, హైదరాబాద్ సీఈలు కాల్వలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ► ఒకే ప్రాజెక్టుకు సంబంధించిన సమీక్ష చేయాలన్నా, ఏదైనా నిర్ణయం అమలు చేయాలన్నా అందరూ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లతో మాట్లాడాల్సిందే. గతంలో మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్యేక విభాగాల వారీగా పర్యవేక్షించేవారు. ఇప్పుడు అన్ని ప్రాజెక్టులను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంతో క్షేత్రస్థాయిలో ఆయా ప్రాజెక్టుల నిర్వహణలో గందరగోళం ఏర్పడింది. ► మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నిర్వహణలోపం కూడా ఒక కారణంగా తేల్చగా, నిర్వహణను ఓఅండ్ఎం విభాగానికి అప్పగించారా? లేదా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. డిఫెక్ట్ లయబిలిటీ కాలం పూర్తయ్యిందని, నిర్మాణ సంస్థ పట్టించుకోలేదని, నిర్మాణ సంస్థదే బాధ్యత అని నీటిపారుదలశాఖ నిర్లక్ష్యం చేసిందని ఆరోపణలున్నాయి. -
వాంటెడ్ క్రిమినల్‌గా ‘మార్క్ జుకర్‌బర్గ్’.. పట్టిస్తే రూ.22కోట్లు
బొగోటా: లోకంలో మనుషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఏడుగురి సంగతి ఏమో కానీ అప్పుడప్పుడు మనుషుల్ని పోలిన మనుషులు అక్కడక్కడ ఎదరుపడతారు. వారు మంచి వారైతే పర్లేదు.. కానీ నేరస్తులు, పోలీసులు హిట్ లిస్ట్‌లో ఉన్నవారైతేనే ఇబ్బంది. తాజాగా ఫేస్బుక్ ఫౌండర్, అమెరికన్ మీడియా మాగ్నేట్ అయిన మార్క్ జుకర్‌బర్గ్‌కి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఆయన పోలికలతో ఉన్న ఓ నేరస్తుడి కోసం కొలంబియా పోలీసులు గాలిస్తున్నారు. అతడిని పట్టిస్తే 3 మిలియన్ డాలర్లు(రూ.22,30,23,000) బహుమతి ఇస్తామని ప్రకటించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫేస్‌బుక్‌లోనే ఈ ప్రకటన చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. గతవారం కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. ఆ సమయంలో హెలికాప్టర్లో కొలంబియా అధ్యక్షుడు డ్యూక్‌తో పాటు రక్షణ మంత్రి డియెగో మొలానో, అంతర్గత మంత్రి డేనియల్ పలాసియోస్, నార్టే డి శాంటాండర్ సిల్వానో సెరానోతో సహా కొందరు అధికారులున్నారు. అదృష్టం కొద్ది ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఈ ఘటన దర్యాప్తులో భాగంగా కొలంబియా పోలీసులు నిందుతుల స్కెచ్ గీయించారు. వీరిలో ఒక వ్యక్తి అచ్చం ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్లానే ఉన్నాడు. కొలంబియా పోలీసులు నిందుతుల ఊహాచిత్రాలను ఫేస్బుక్లో షేర్ చేస్తూ.. ‘‘ఈ ఫోటోలో ఉన్నవారిని పట్టుకోవడంలో మాకు సాయం చేయండి. మిస్టర్ ప్రెసిడెంట్ ఇవాన్ డ్యూక్, అతని పరివారం ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌పై దాడి చేసిన నేరస్థుల చిత్రాలు ఇవి. వీరిని పట్టించినవారికి 3మిలియన్ డాలర్ల బహుమతి అందిస్తాం. వీరి గురించి సమాచారం తెలిసినవారు ఈ నంబర్లకు 3213945367 లేదా 3143587212 కాల్ చేయండి’’ అని మెసేజ్ చేశారు. ఈ ఫోటోలో ఓ వ్యక్తి అచ్చు మార్క్ జుకర్‌బర్గ్‌లా ఉండటంతో అది అందరిని దృష్టిని ఆకర్షించింది. ఇది చూసిన నెటినులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘‘కొంపతీసి జుకర్‌బర్గ్‌ని అరెస్ట్ చేస్తారా ఏంటి’’.. ‘‘ఒకవేళ నిందితుడు దొరికినా నేను జుకర్‌బర్గ్‌ని అంటే ఏంటి పరిస్థితి’’ అంటూ నెటిజనులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: తొలి ట్రిలియనీర్‌గా చరిత్ర సృష్టించబోతోందెవరు..? -
హెచ్ఐవీ సోకనివ్వని పిల్
వాషింగ్టన్: ప్రాణాంతక హెచ్ఐవీ వైరస్ నిరోధం దిశగా మరో ముందడుగు పడింది. అధ్యయనంలో భాగంగా ట్రువిడా అనే వ్యాధి నిరోధక మాత్ర(పీఆర్‌ఈపీ)ను రెండున్నరేళ్లపాటు తీసుకున్న 600 మందిలో ఎవరికీ ఆ వైరస్ సోకలేదు. వీరు సెక్సు పరంగా జాగ్రత్తలు తీసుకోకపోయినప్పటికీ, వీరిలో కొంత మంది పురుషులు స్వలింగ సంపర్కులైనప్పటికీ వైరస్ సోకకపోవడం గమనార్హం. అధ్యయనంతో తొలి దశలోనూ వీరు పూర్తి ఆరోగ్యవంతులు. శాన్ఫ్రాన్సిస్కోలోని కైజర్ పర్మనెంట్లో ఈ అధ్యయనం నిర్వహించారు. పీఆర్ఈపీతో ఇలాంటి పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. హెచ్ఐవీ వైరస్ నిరోధానికి ఇది దోహదం చేసే అవకాశముందని అధ్యయనానికి నేతృత్వం వహించిన జొనాథన్ వోక్ చెప్పారు. అధ్యయన ఫలితాలను ‘క్లినికల్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్’ పత్రికలో ప్రచురించారు. -
సైన్స్ సమాహారం.. మెరుగైన స్కోర్‌కు సోపానం!
సివిల్స్ మెయిన్స్‌లో విజయం సాధించేందుకు కీలమైనవి జనరల్ స్టడీస్ పేపర్లు. జీఎస్ మూడో పేపర్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య సంరక్షణ, మేధో సంపత్తి హక్కులు, విపత్తు నిర్వహణ తదితర అంశాలున్నాయి. వీటి నుంచి2013 జీఎస్-3 ప్రశ్నపత్రంలో 25 ప్రశ్నలకు 9 ప్రశ్నలు వచ్చాయి. ఇంతటి ప్రాధాన్యమున్న ఈ అంశాలపై పట్టు సాధించేందుకు వ్యూహాలు.. మెయిన్స్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించిన ప్రిపరేషన్‌ను పూర్తిచేసి ఉంటారు. గత మెయిన్స్ జనరల్ స్టడీస్-3 పేపర్లో కొన్ని 200 పదాల సమాధాన ప్రశ్నలు, మరికొన్ని 100 పదాల సమాధాన ప్రశ్నలు వచ్చాయి. ఈసారి కూడా ఇదే విధానంలో ప్రశ్నలు ఉండొచ్చు లేదంటే స్వల్ప, దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. కాబట్టి ఈ కోణంలోనూ ప్రిపరేషన్ తప్పనిసరి. ఏ అంశానికి సంబంధించి అయినా 20, 50, 75, 150, 250 పదాల్లో సమాధానం రాసేలా సన్నద్ధం కావాలి. ఒకే ప్రశ్నలో వివిధ విభాగాలుంటే వాటి సరళిని బట్టి పద పరిమితిని నిర్దేశించుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్, టెక్నాలజీ విభాగంలో ముఖ్యంగా అంతరిక్ష పరిజ్ఞానం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్, నానో టెక్నాలజీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి. ఇటీవల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక ప్రయోగాలు నిర్వహించింది. ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్, మంగళ్యాన్ వంటి అద్భుత యాత్రలు చేపట్టింది. వీటిపై ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. వీటికి సంబంధించి నిగూఢంగా ఉన్న అంశాలపైనా ప్రశ్నలు రావొచ్చు. ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి విశిష్ట సేవలు అందిస్తూ, ఎన్నో విదేశీ ఉపగ్రహాలు, వైవిధ్యభరిత ప్రయోగాలు నిర్వహించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)పై అభ్యర్థులు దృష్టిసారించాలి. భారత అంతరిక్ష కార్యక్రమంలో పీఎస్ఎల్వీ నిర్మాణం వెనుక ఉద్దేశం, అది చేపట్టిన వైవిధ్యభరిత ప్రయోగాలు, విదేశీ ఉపగ్రహాల ప్రయోగాలు ద్వారా భారత అంతరిక్ష సేవల విస్తరణ, వరుస విజయవంత ప్రయోగాల జైత్రయాత్ర, బలహీనతలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ముఖ్యాంశాలు మంగళ్యాన్ ప్రయోగంలో ప్రత్యేకతలు- భారత్ సాధించిన ప్రగతి. టెర్రా ఫార్మింగ్ అంటే ఏమిటి? అంగారక గ్రహ యాత్రలు భవిష్యత్తులో టెర్రా ఫార్మింగ్‌కు ఎలా ఉపయోగపడతాయి? వాయేజర్ ఇంటర్ స్టెల్లార్ మిషన్- సాధించిన ప్రగతి ఏమిటి? ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్), జీఎస్ఎల్వీ- మార్క్ 3, క్రయోజెనిక్ ఇంజిన్ ప్రాధాన్యత, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం, భారత్ డీప్ స్పేస్ నెట్వర్క్, క్యూరియాసిటీ రోవర్, జీఎస్ఎల్వీ బలహీనతలు. టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్, అంతరిక్ష టెక్నాలజీ ద్వారా గ్రామీణాభివృద్ధి తదితర అంశాలు. ఐటీ, కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్స్ రంగంలో డిజిటల్ ఇండియా, నేషనల్ ఈ-గవర్నెన్స్ ప్రాజెక్టు, మెడికల్ ఇన్ఫర్మేటిక్స్, గ్రామీణాభివృద్ధిలో ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, నెట్ న్యూట్రాలటీ- ప్రయోజనాలు, బిగ్ డేటా, ఓపెన్ గవర్నమెంట్ డేటా తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. నానో టెక్నాలజీ రంగంలో అనేక అనువర్తనాలున్నాయి. వీటిని తెలుసుకోవాలి. గతేడాది నిర్మాణరంగానికి సంబంధించి కాంపొజైట్స్పై ప్రశ్న అడిగారు. పర్యావరణ కాలుష్యం నిర్మూలనలో, వైద్య రంగంలో నానో టెక్నాలజీ ప్రయోజనాలపై దృష్టిసారించాలి. అదే విధంగా నానో టెక్నాలజీ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో అనువర్తనాలపై ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. రోబోటిక్స్ రంగంలో కేవలం రోబోటిక్స్ సూత్రాలు, వాటి రకాలు, ఉపయోగాలు మాత్రమే కాకుండా రోబోటిక్ కాళ్లు, చేతులు తయారీ ప్రక్రియపై అవగాహన పెంపొందించుకోవాలి. రోబోటిక్స్‌ను బయోనిక్స్కు అనుసంధానిస్తూ అధ్యయనం చేయాలి. బయోనిక్స్ అంటే ఏమిటి? దాని అనువర్తనాలు ఎలా ఉంటాయి? వైద్య రంగంలో వాటి ప్రాధాన్యం ఏమిటి? తదితర అంశాలను చదవాలి. బయోటెక్నాలజీ బయోటెక్నాలజీ రంగం నుంచి ఈసారి ప్రశ్నలు వచ్చేందుకు చాలా అవకాశాలున్నాయి. ముఖ్యంగా జన్యుమార్పిడి పంటల సాగు, క్షేత్ర పరీక్షలపై దేశంలో గందరగోళ పరిస్థితులపై ప్రశ్నలు అడగొచ్చు. జన్యు మార్పిడి పంటల సాగుపై వ్యతిరేకత ఎందుకు? దాని వల్ల లాభాలు, నష్టాలు ఏమిటి? మరీ ముఖ్యంగా బీటీ ట్రాన్స్‌జెనిక్స్‌పై అభ్యంతరాలు ఏమిటి? జీఎం లేబ్లింగ్ అంటే ఏమిటి? అది భారత్‌లో ఎలా అమలవుతోంది? తదితర అంశాలపై అభ్యర్థులు పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవడం అవసరం. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, సుప్రీంకోర్టు టెక్నికల్ ఎక్స్పెర్ట్ కమిటీ బీటీ పంటల క్షేత్ర పరీక్షలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? ఇలాంటి అంశాలపై అభ్యర్థి అభిప్రాయాలను తెలుసుకునేలా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. మూలకణాల చికిత్సను నియంత్రించే ఐసీఎంఆర్-డీబీటీ మార్గదర్శకాలు, రీప్రోగ్రామింగ్, కార్డ్ బ్యాంకింగ్, మూలకణాల అనువర్తనాలను అధ్యయనం చేయాలి. ఆర్ఎన్ఏ, ఇంటర్‌ఫెరాన్స్, జన్యు థెరఫీ, మానవ జీన్ పేటెంటింగ్, జీవ ఎరువులు, జీవ క్రిమిసంహారకాలు, ఆర్గానిక్ వ్యవసాయం, బయోరెమిడియేషన్, ఇతర ఇంధనాలు తదితర అంశాలపై అధ్యయనం చేయాలి. పర్యావరణం మెయిన్స్‌లో మరో ముఖ్యమైన అంశం పర్యావరణ నష్టం. తాజాగా దేశంలో స్వచ్ఛ భారత్‌పై బాగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణపై ప్రశ్న రావొచ్చు. ముఖ్యంగా ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణలో లోపాలు, మీ సూచనలు? అనే కోణంలో అధ్యయనం చేయాలి. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణలో సమస్యలు, లాభాలను తెలుసుకోవాలి. పట్టణీకరణలో ఘన వ్యర్థ నిర్వహణ పాత్రపై అవగాహన పెంపొందించుకోవాలి. బయో మెడికల్ వ్యర్థాలు, రీసైక్లింగ్ పద్ధతులు, భారత్‌లో ఘన వ్యర్థ నిర్వహణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు వంటి వాటిని చదవాలి. వాతావరణ మార్పుల ప్రభావం ముఖ్యంగా సముద్ర ఆమ్లీకరణ వల్ల వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థలకు వాటిల్లే నష్టాలను గురించి తెలుసుకోవాలి. శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలను ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధత, వాతావరణ మార్పుపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీసీసీ), అందులో భాగంగా అమలవుతున్న ఎనిమిది జాతీయ మిషన్లు, లక్ష్యాలు, ప్రగతి తదితరాల గురించి తెలుసుకోవాలి. కాంతి కాలుష్యం, భారలోహ కాలుష్యం, గంగానది ప్రక్షాళన, అటవీ నిర్మూలనను అరికట్టడం ద్వారా ఉద్గారాలను తగ్గించే కార్యక్రమం (ఆర్ఈడీడీ)పై అవగాహన పెంపొందించుకోవాలి. జీవ వైవిధ్య పరిరక్షణ అంశంలో జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ముప్పు, సంరక్షణ చర్యలపై దృష్టిసారించాలి. పులి, ఖడ్గమృగం, ఏనుగు, గంగానది డాల్ఫిన్ వంటి వాటి పరిరక్షణ సమస్యల్ని తెలుసుకోవాలి. పశ్చిమ కనుమల పరిరక్షణకు గాడ్గిల్, కస్తూరిరంగన్ కమిటీల సిఫార్సులు, వాటి మధ్య భేదాలను తెలుసుకోవడం మంచిది. భారత్‌లో అభివృద్ధి చర్యల ద్వారా జీవ వైవిధ్యం ఎలా దెబ్బతింటోంది? సుస్థిరాభివృద్ధి విధానాలను ఎలా అమలు చేయాలి? అటవీ హక్కుల అమల్లో సమస్యలపై దృష్టి సారించాలి. అదనంగా నగొయ ప్రొటోకాల్ సమాచారాన్ని తెలుసుకోవాలి. మేధో సంపత్తి మేధో సంపత్తి హక్కుల అంశంలో భారత్, అమెరికాల మధ్య నెలకొన్న వివాదం, యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) స్పెషల్ 301 కేటగిరీ, భారత్‌లో ఐపీఆర్ విధానం ఎలా ఉండాలి? అమెరికా వంటి దేశాలు భారత మేధోసంపత్తి రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి? తదితర అంశాలపై దృష్టిసారించాలి. అమెరికా ఇటీవల భారత్ విషయంలో అమలు చేయాలని నిర్ణయించిన cycle review విధానం గురించి తెలుసుకోవాలి. దీంతోపాటు మేధోసంపత్తి రకాలు, సంబంధిత చట్టాలు, జియోగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ద్వారా ఏ విధంగా సంప్రదాయ ఉత్పత్తులకు సంరక్షణ కల్పించవచ్చు అనే అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి. -
బిట్‌శాట్‌లో గెలుపు ఇలా..
బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్.. సంక్షిప్తంగా బిట్‌శాట్! దేశంలో ప్రతిష్టాత్మకమైన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ క్యాంపస్‌లలో బ్యాచిలర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఆన్లైన్ విధానంలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ పరీక్ష. ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ప్రవేశానికి ఎంత పోటీ ఉంటుందో.. అంతేస్థాయి పోటీ నెలకొన్న పరీక్ష బిట్‌శాట్. జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా పోటీ ఏటేటాపెరుగుతోంది. బిట్‌శాట్‌ను రాసేవారిలో మన రాష్ట్ర విద్యార్థుల సంఖ్య అధికమే. వచ్చే నెల 14 నుంచి జూన్ 1 వరకు ఆన్లైన్ విధానంలో జరగనున్న బిట్‌శాట్‌లో విజయానికి సలహాలు.. బిట్స్-పిలానీలో సీటు.. ఉజ్వల భవితకు రూటు: బిట్స్-పిలానీలో సీటు లభిస్తే ఉజ్వల భవిష్యత్ సొంతమైనట్లేననే అభిప్రాయం ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల ఔత్సాహిక విద్యార్థుల్లో నెలకొంది. దాంతో బిట్‌శాట్‌కు పోటీపడుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. గతేడాది బిట్స్-పిలానీ మూడు క్యాంపస్‌లలో(పిలానీ, గోవా, హైదరాబాద్) అందుబాటులో ఉన్న రెండు వేల సీట్ల కోసం 1.36 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో మన రాష్ట్ర విద్యార్థులు 30 నుంచి 35 శాతం మధ్యలో ఉంటారని అంచనా. మన రాష్ట్ర విద్యార్థులకు సబ్జెక్టులపై అవగాహన ఉన్నప్పటికీ.. చివరి నిమిషంలో పొరపాట్లు చేస్తూ అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి.. ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ విధానంపై ముందు నుంచీ సరైన పట్టు లేకపోవడం కాగా, రెండోది.. ఇతర ఇంజనీరింగ్ ఎంట్రెస్ట్ టెస్ట్‌లకు భిన్నంగా బిట్‌శాట్‌లో ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌ల నుంచి కూడా ప్రశ్నలు అడగడం. చాలామంది విద్యార్థులు గ్రూప్ సబ్జెక్టుల్లో పట్టు సాధించడంపైనేదృష్టిపెట్టి.. ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌లను కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇదే తుది జాబితాలో చోటుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఈ నేపథ్యంలో.. విద్యార్థులు ఆన్లైన్ ఆధారిత పరీక్ష విధానంపై అవగాహన పొందుతూనే.. సబ్జెక్ట్‌లలోనూ రాణించాలని నిపుణులు సూచిస్తున్నారు. గత గణాంకాలను పరిశీలిస్తే 300కుపైగా స్కోర్ వస్తేనే బిట్స్‌లో ప్రవేశం లభిస్తుంది. ఇందుకోసం ప్రస్తుతమున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సిలబస్- ప్రిపరేషన్ ఇలా: బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష. మొత్తం నాలుగు విభాగాల్లో 150 ప్రశ్నలలో.. 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. బిట్‌శాట్‌లో ఫిజిక్స్ నుంచి 40 ప్రశ్నలు; కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు; మ్యాథమెటిక్స్ నుంచి 45 ప్రశ్నలు; ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ నుంచి 15 ప్రశ్నలు; లాజికల్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది. బిట్‌శాట్‌కు నిర్దిష్ట సిలబస్ నిర్దేశించారు. దాన్ని అనుసరించి ప్రిపరేషన్ సాగించాలి. ఈ సిలబస్ ఎన్సీఈఆర్టీ 11, 12వ తరగతుల స్థాయిలో ఉంటుంది. కాబట్టి మన ఇంటర్ బోర్డ్ విద్యార్థులు తమ అకడెమిక్ సిలబస్‌లో లేని.. ఎన్సీఈఆర్టీ సిలబస్‌లో మాత్రమే ఉన్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇప్పటికే ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయ్యాయి. జేఈఈ-మెయిన్ పరీక్ష కూడా ముగిసింది. ఇక ఇంజనీరింగ్ విద్యార్థులు బిట్శాట్తోపాటు సమాంతరంగా ఎదుర్కోనున్న పరీక్షలు ఎంసెట్, జేఈఈ అడ్వాన్స్డ్. వీటిని దృష్టిలో ఉంచుకుని మూడు పరీక్షల సిలబస్‌ను బేరీజు వేసుకుంటూ ముందుకుసాగాలి. జేఈఈ-అడ్వాన్స్డ్, బిట్‌శాట్ సిలబస్ దాదాపు ఒకే మాదిరిగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పెద్దగా ఆందోళన చెందక్కర్లేదు. కానీ బిట్శాట్తోపాటు ఎంసెట్ మాత్రమే లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించాలి. మన ఇంటర్ బోర్డు సిలబస్‌ను అనుసరించి నిర్వహించే ఎంసెట్‌లో ఉన్న అంశాలు, ఎన్సీఈఆర్టీ సిలబస్ ఆధారంగా జరిగే బిట్శాట్లోని ఉమ్మడి అంశాలను ఒకే సమయంలో పూర్తి చేసుకోవాలి. బిట్‌శాట్‌లో మాత్రమే ఉన్న టాపిక్స్‌కు ప్రతిరోజూ ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలి. ప్రస్తుతం ఇంటర్మీడియెట్ బోర్డు సిలబస్‌ను సైతం దాదాపు ఎన్సీఈఆర్టీ సిలబస్ మాదిరిగానే మార్పులు చేశారు. కాబట్టి ఇంటర్మీడియెట్ సబ్జెక్ట్లపై పట్టు సాధించిన వారికి బిట్‌శాట్ సిలబస్ ఏమంత కష్టం కాదు. బిట్‌శాట్‌కు మరో నెలరోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఇప్పుడు కొత్త అంశాలు, లేదా చదవని చాప్టర్స్‌పై ఎక్కువ సమయం కేటాయించకపోవడమే మంచిది. మరీ ముఖ్యమైనవని భావిస్తే.. ఏప్రిల్ నెలాఖరు నాటికి వాటిని పూర్తి చేయాలి. ఏప్రిల్ చివరి వారం నుంచి ఆన్లైన్ పరీక్ష మొదలయ్యే వరకు రివిజన్‌కు కేటాయించడం శ్రేయస్కరం. తమ ఆన్లైన్ టెస్ట్ తేదీకి కనీసం 15 రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ఆయా సబ్జెక్టులకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు షార్ట్‌కట్ మెథడ్స్‌తో సొంత నోట్స్ రూపొందించుకుంటే రివిజన్ సులభం అవుతుంది. కెమిస్ట్రీలో ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ రియాక్షన్స్‌ను ఒక జాబితాగా రూపొందించుకోవాలి. ఫిజిక్స్‌లో.. వర్క్ అండ్ ఎనర్జీ, న్యూటన్స్ లా ఆఫ్ మోషన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మ్యాగ్నటిజం అండ్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ యూనిట్లలో ముఖ్య అంశాలతో నోట్స్ రూపొందించుకోవాలి. మ్యాథమెటిక్స్‌లో.. హైపర్బోలా, పారాబోలా, రెక్టాంగులర్ పారాబోలా, ట్రిగ్నోమెట్రీ, వెక్టార్స్, 3-డి, ఇంటెగ్రల్ కాలిక్యులస్ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్ పూర్తి చేయాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం రెండు గంటల చొప్పున ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా అందుబాటులోని సమయంలో సిలబస్‌లోని అన్ని అంశాలను పూర్తి చేసుకోవచ్చు. బిట్‌శాట్ ఆన్లైన్ పరీక్ష వివరాలు: నాలుగు విభాగాల్లో 150 ప్రశ్నలతో 450 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే బిట్‌శాట్‌లో విభాగాలవారీగా అడిగే ప్రశ్నల సంఖ్య బిట్‌శాట్ ఆన్లైన్ టెస్ట్ ముఖ్య తేదీలు: హాల్‌టికెట్ డౌన్లోడ్: ఏప్రిల్ 15, 2014 నుంచి ఏప్రిల్ 30, 2014 వరకు ఆన్లైన్ టెస్ట్ తేదీలు: మే 14, 2014 నుంచి జూన్ 1, 2014 వరకు బిట్‌శాట్ ఫలితాల వెల్లడి: మే చివరి వారం బిట్స్‌లో ప్రవేశానికి దరఖాస్తు : మే 20, 2014 నుంచి జూన్ 30, 2014 వరకు వివరాలకు వెబ్సైట్: www.bitsadmission.com ఆన్లైన్ టెస్ట్ - అనుసరించాల్సిన వ్యూహాలు ఆన్లైన్ టెస్ట్ మూడు గంటలపాటు ఎలాంటి విరామం లేకుండా జరుగుతుంది. కాబట్టి ఇప్పటినుంచే ఆ విధానానికి అలవాటుపడేలా మాక్‌టెస్ట్‌లకు హాజరు కావాలి. కనీసం అయిదు మాక్‌టెస్ట్‌లకు హాజరై, వాటి ఫలితాలను విశ్లేషించుకోవడం ద్వారా ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవచ్చు. ఇప్పటికే విద్యార్థులకు తమ ఆన్లైన్ టెస్ట్ సెంటర్ సమాచారం తెలిసుంటుంది. కాబట్టి ఆ సెంటర్లో ఉండే వాతావరణాన్ని పరిశీలించి.. అలాంటి పరిస్థితుల్లో పరీక్ష రాసేందుకు సన్నద్ధత పొందేలా వ్యవహరించాలి. విద్యార్థుల మానసిక, శారీరక అంశాల కోణంలో ఈ వ్యూహం విజయానికి ఎంతో దోహదం చేస్తుంది. ఆన్లైన్ టెస్ట్ సమయంలోనూ ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలి. మూడు గంటలపాటు నిర్వహించే పరీక్షలో ప్రథమార్థంలో ఒక్కో ప్రశ్నకు కేటాయించే సమయాన్ని ఒక నిమిషానికి పరిమితం చేయాలి. బిట్‌శాట్ ఆన్లైన్ టెస్ట్‌లో సెక్షన్లవారీగా ఎలాంటి సమయ నిబంధన లేదు. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ముందుగా బాగా అవగాహన ఉన్న ప్రశ్నలు లేదా సెక్షన్లను సాధించాలి. మిగతా విభాగాలతో పోల్చితే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లలో అంచెలవారీ (స్టెప్‌వైజ్) సొల్యూషన్స్తోనే సమాధానాలు రాబట్టే ప్రశ్నలు ఎక్కువ. కాబట్టి ఈ రెండు విభాగాలను ముందుగా ఎంపిక చేసుకోవడం మంచిది. సెక్షన్లవారీగా ఎలాంటి నిబంధన లేకున్నప్పటికీ విద్యార్థులు స్వీయ సమయ నిబంధన విధించుకోవాలి. దీన్ని ప్రిపరేషన్ దశ నుంచే అమలు చేసుకోవాలి. మొత్తం 180 నిమిషాల్లో 30 నిమిషాలు కెమిస్ట్రీకి; 20 నిమిషాలు ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్‌కు; 40 నిమిషాలు ఫిజిక్స్‌కు; 70 నిమిషాలు మ్యాథమెటిక్స్‌కు కేటాయించడం మంచిది. మిగతా 20 నిమిషాలు తాము రాసిన సమాధానాలు సరిచూసుకోవడానికి కేటాయించాలి. బిట్‌శాట్‌లో నిర్దేశిత 180 నిమిషాల్లోపు 150 ప్రశ్నలను పూర్తిచేస్తే బోనస్ కొశ్చన్స్ పేరుతో అదనంగా మరో 12 ప్రశ్నలకు సమాధానం రాసే అవకాశం కల్పిస్తారు. ఈ ప్రశ్నలు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ నుంచి నాలుగు చొప్పున ఉంటాయి. కానీ ఈ బోనస్ కొశ్చన్స్‌ను ఎంపిక చేసుకునే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఒకసారి బోనస్ కొశ్చన్స్‌ను ఎంపిక చేసుకుంటే.. అప్పటికే రాసిన 150 ప్రశ్నల సమాధానాలను సరిచూసుకునే వీలుండదు. అంతేకాకుండా ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు కూడా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు బోనస్ కొశ్చన్స్ కంటే ముఖ్యంగా తాము రాసిన ప్రశ్నల సమాధానాలు- కచ్చితత్వం విషయంలో శ్రద్ధ చూపడం శ్రేయస్కరం. కచ్చితంగా 100 నుంచి 120 ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే 300 నుంచి 360 మార్కులు సొంతం చేసుకోగలుగుతారు. బిట్స్ క్యాంపస్‌లలో కటాఫ్‌ల స్థాయికి చేరుకుంటారు. కౌన్సెలింగ్ లెటర్‌ను అందుకునే అవకాశం లభిస్తుంది. కంగారు లేకుండా.. కచ్చితత్వమే ప్రధానంగా.. బిట్‌శాట్‌లో విజయంలో కీలక పాత్ర సమయ పాలన. విద్యార్థులు పరీక్ష సమయంలో ఎలాంటి కంగారు లేకుండా సమాధానాల్లో కచ్చితత్వం ఉండేలా చూసుకోవాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా ఉన్నాయని వందశాతం రూఢీ చేసుకున్న తర్వాతే బోనస్ ప్రశ్నలను ఎంచుకోవాలి. బిట్‌శాట్ మెరిట్ జాబితాలో నిలిచి బిట్స్ క్యాంపస్‌లలో అడుగుపెట్టిన విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే పరిశోధనల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నాం. అంతేకాకుండా పలు సంస్థల స్పాన్సర్‌షిప్‌తో నిర్వహిస్తున్న పరిశోధనల్లోనూ అవకాశం కల్పిస్తున్నాం. ప్రస్తుతం దేశంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పరిశోధనలు, పీహెచ్డీలవైపు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే ఆకర్షితులయ్యేలా చేస్తున్నాం. తద్వారా భవిష్యత్తులో సైన్స్, ఇంజనీరింగ్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు మార్గం వేస్తున్నాం. బిట్‌శాట్‌లో మెరిట్‌తోపాటు ఆయా డిగ్రీ ప్రోగ్రామ్‌లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆసక్తి, అభిరుచి మేరకు కోర్సును ఎంచుకుంటే నిత్యనూతనంగా ఉండగలుగుతారు. - ప్రొఫెసర్ వి.ఎస్.రావు, డెరైక్టర్, బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్