హెచ్‌ఐవీ సోకనివ్వని పిల్
వాషింగ్టన్: ప్రాణాంతక హెచ్‌ఐవీ వైరస్ నిరోధం దిశగా మరో ముందడుగు పడింది. అధ్యయనంలో భాగంగా ట్రువిడా అనే వ్యాధి నిరోధక మాత్ర(పీఆర్‌ఈపీ)ను రెండున్నరేళ్లపాటు తీసుకున్న 600 మందిలో ఎవరికీ ఆ వైరస్ సోకలేదు. వీరు సెక్సు పరంగా జాగ్రత్తలు తీసుకోకపోయినప్పటికీ, వీరిలో కొంత మంది పురుషులు స్వలింగ సంపర్కులైనప్పటికీ వైరస్ సోకకపోవడం గమనార్హం. అధ్యయనంతో తొలి దశలోనూ వీరు పూర్తి ఆరోగ్యవంతులు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని కైజర్ పర్మనెంట్‌లో ఈ అధ్యయనం నిర్వహించారు.
పీఆర్‌ఈపీతో ఇలాంటి పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి. హెచ్‌ఐవీ వైరస్ నిరోధానికి ఇది దోహదం చేసే అవకాశముందని అధ్యయనానికి నేతృత్వం వహించిన జొనాథన్ వోక్ చెప్పారు. అధ్యయన ఫలితాలను ‘క్లినికల్ ఇన్ఫెక్చువస్ డిసీజెస్’ పత్రికలో ప్రచురించారు.