President Obama
-
ట్రంప్.. నీ టెంపర్ తగ్గించుకుంటే మంచిది: ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి కొత్తగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన టెంపర్ (కోపం) తగ్గించుకుంటే మంచిదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఆయన మునుపటిలాగా వ్యవహరిస్తే బాగోదని చెప్పారు. ఆయన మాట్లాడే ప్రతి మాటను ఇక నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని, ప్రచారంలో మాదిరిగా మాట్లాడొద్దని సూచించారు. శ్వేత సౌదం వద్ద జరిగిన పత్రికా మండలి సదస్సులో ట్రంప్‌కు ఒబామా పలు సూచనలు చేశారు. ’ట్రంప్‌కు తెల్లవారు జామున కూడా ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాటికి ఓపిగ్గా ఆయన బదులివ్వాలి. తన ఆవేశాన్ని కొంత సర్దుకోవాలి. జనవరి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కలుసుకునే వారితో సహనంగా మెలిగాలి. ట్రంప్ కోపానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ, అవి ఆయనకు మంచిది కాదు.. ఒక వేళ ఎప్పుడైనా నోరు జారినా తిరిగి వాటిని గుర్తించి తిరిగి అలాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎన్నికల బరిలో అభ్యర్థిగా ఉన్నప్పుడు ఏదైనా చెప్పొచ్చు.. అది వివాదం కావొచ్చు.. సరికానిది కావొచ్చు.. దానివల్ల ప్రభావం కొంతే ఉంటుంది. కానీ ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారో వెంటనే ప్రపంచమంతా ఇటువైపే చూస్తోంది. అందుకే ట్రంప్ జాగ్రత్తగా వ్యవహరించాలి’ అని అన్నారు. ట్రంప్ చేసుకుంటున్న నియామకాల గురించి మాత్రం ఒబామా స్పందించేందుకు నిరాకరించారు. అది ఆయన వ్యక్తిగతమన్నారు. -
శ్వేతసౌధంలో ఒబామా, డోనాల్డ్ ట్రంప్ భేటీ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కొత్తగా ఎన్నికైన ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీయ్యారు. గురువారం సాయంత్రం వైట్ హౌస్‌లో వీరిద్దరు సమావేశమయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు రావాలని ఒబామా ఆహ్వనించారు. ఒబామా ఆహ్వానంతో ట్రంప్ వైట్ హౌస్ చేరుకుని ప్రత్యేకంగా భేటీయ్యారు. ఎన్నికల సమయంలో ఇరువురు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఒబామా ట్రంప్‌ను ఉద్దేశించి అత్యంత ప్రమాదకారి అని అనగా... అంతే స్థాయిలో ట్రంప్ బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వరస్ట్ ప్రెసిడెంట్ బబామా అని ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యంలో వీరివురి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారం బదలాయింపుపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. -
పరోక్ష యుద్ధానికి ముగింపు పలకాలి
-
పరోక్ష యుద్ధానికి ముగింపు పలకాలి: ఒబామా
న్యూయార్క్: పరోక్ష యుద్ధానికి పాల్పడుతున్న దేశాలు వాటికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు ఒబామా కోరారు. వివిధ వర్గాలు కలసి జీవించేందుకు అనుమతించకపోతే మానవాళికి అంతులేని నష్టం కలిగించేలా ఉగ్రవాద కుంపటి కొనసాగుతుందని, ఇతర దేశాలకు ఉగ్రవాదం వ్యాపిస్తుందని చెప్పారు. ఐరాస సాధారణ సభ సమావేశంలో మంగళవారం ఎనిమిదో, చివరి ప్రసంగం చేస్తూ... ఉగ్రవాదం, మత హింసలు పశ్చిమాసియాను అస్థిరతకు గురి చేస్తున్నాయని చెప్పారు. వివిధ మత వర్గాలు లేదా జాతులు కలిసి జీవించకుండా బయటి శక్తులు ఎక్కువకాలం రెచ్చగొట్టలేవన్నారు. -
అధ్యక్షా.. మీరు అదుర్స్!
అమెరికా అధ్యక్షుడు బరాక్.. ఓ అగ్రరాజ్యానికి అధినేతగానే కాదు.. వ్యక్తిగతంగానూ మనసున్న నేతగా పేరు గడించారు. ఈ కొత్త ఏడాదిలోనే అమెరికా అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ముగియబోతున్నది. ఈ సందర్భంగా 2015లో ఒబామా అధికార హోదాలో నిర్వహించిన కార్యకలాపాలనే కాదు.. వ్యక్తిగతంగా కుటుంబసభ్యులతో, వైట్‌హౌస్ సిబ్బందితో, ప్రజలతో మమేకమై.. ఓ సామాన్యుడిలా పంచుకున్న మధురస్మృతులను పీటీ సౌజా ఫొటోల్లో బంధించారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ అధికారిక ఫొటోగ్రాఫర్ అయిన సౌజా కొత్త సంవత్సరం సందర్భంగా ఒబామాకు చెందిన వందకుపైగా ఫొటోలను ప్రచురించారు. బ్లెడీ సండే 50వ దినోత్సవ వేడుకగా బహిరంగ సభలో భార్య మిషెల్ చేతిని ఆప్యాయంగా పట్టుకోవడం మొదలు.. హలోవీన్ పార్టీ సందర్భంగా వైట్‌హౌస్ సిబ్బంది పిల్లలకు విందు ఇవ్వడం వరకు ఒబామాలోని మానవతా కోణాన్ని పట్టిచ్చే ఎన్నో అందమైన ఫొటోలు ఇందులో ఉన్నాయి. కూతురు మాలియాతో ప్రేమగా గడుపడం, తనకన్నా చాలా పొడగరి అయిన ఎన్బీఏ ఆటగాడు షాక్విల్ ఓనియల్తో నవ్వుతూ ముచ్చట్లు పెట్టడం, పౌరుహక్కుల 50 దినోత్సవం సందర్భంగా కుటుంబ సమేతంగా పౌరులతో చేతులు కలిపి ర్యాలీలో పాల్గొనడం, భార్య మిషెల్‌తో ప్రేమగా గడుపడం వంటి వైవిధ్యభరితమైన ఒబామా ఫొటోలు చూడొచ్చు. అలాగే ఒబామా భార్య మిషెల్ బాక్సింగ్ చేయడం, కుటుంబంతో, బయట ఒబామా సన్నిహితంగా పంచుకున్న అనుభూతులకు చెందిన ఫొటోలను సౌజా ప్రచురించారు. .