శ్వేతసౌధంలో ఒబామా, డోనాల్డ్ ట్రంప్ భేటీ
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కొత్తగా ఎన్నికైన ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేటీయ్యారు. గురువారం సాయంత్రం వైట్ హౌస్లో వీరిద్దరు సమావేశమయ్యారు.
అధ్యక్ష ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ట్రంప్‌తో సమావేశమయ్యేందుకు రావాలని ఒబామా ఆహ్వనించారు. ఒబామా ఆహ్వానంతో ట్రంప్ వైట్ హౌస్ చేరుకుని ప్రత్యేకంగా భేటీయ్యారు. ఎన్నికల సమయంలో ఇరువురు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. ఒబామా ట్రంప్ను ఉద్దేశించి అత్యంత ప్రమాదకారి అని అనగా... అంతే స్థాయిలో ట్రంప్ బదులిచ్చారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వరస్ట్ ప్రెసిడెంట్ బబామా అని ట్రంప్ అన్నారు. అగ్రరాజ్యంలో వీరివురి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారం బదలాయింపుపై వీరిద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో ట్రంప్ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.