President Xi Jinping
-
'అణు శక్తి'తో చైనా అనూహ్య చర్య
-
'అణు శక్తి'తో చైనా అనూహ్య చర్య
బీజింగ్: ప్రపంచంలో ఇప్పటివరకు ఏ దేశమూ చేపట్టని అనూహ్యచర్యకు చైనా ఉపక్రమించింది. అణుశక్తితో దాడులు చేయగల భారీ జలాంతర్గామిని మొట్టమొదటిసారి ప్రదర్శనకు ఉంచనుంది. తద్వారా తన నౌకాదళ సామర్థ్యాన్ని చాటి చెప్పాలనుకుంటున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో తాయరుచేసిన యుద్ధవాహక నౌకను కూడా తన ప్రజలకు చూపనుంది. చైనా కమ్యూనిస్ట్ పార్టీ కీలక ప్లీనం జరగడానికి కొద్ది రోజుల ముందే చైనీస్ నేవీ తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించనుండటం గమనార్హం. షాగ్డాంగ్ ఫ్రావిన్స్ లోని సింగ్టావో తీరంలోగల నేవీ మ్యూజియంలో.. అణు శక్తితో దాడులు చేయగల సబ్ మెరైన్ తోపాటు ఇతర సంపత్తిని ప్రదర్శించబోతున్నట్లు చైనీస్ రక్షణ శాఖ గురువారం ప్రకటించింది. ఈ తరహా ప్రదర్శన ప్రపంచంలోనే మొదటిసారని పేర్కొంది. పౌరుల్లో జాతీయవాద భావనను పురిగొల్పేటందుకే చైనా రక్షణ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నదని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అధ్యక్షుడు జింగ్ పింగ్ నేతృత్వంలో చైనా బలీయమైన శక్తిగా ఎదిగిందని, మున్ముందు తన పాటవాన్ని ఇంకా మెరుగుపర్చుకునే క్రమంలో ఇలాంటి ప్రదర్శనలు ఎంతో అవసరమని విశ్లేషకులు అంటున్నారు. కాగా, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి జలాంతర్గామిలోని అణు పదార్థాలను తొలగించిన తర్వాతే దానిని ప్రదర్శనకు ఉంచుతామని అధికారులు వెల్లడించారు. చైనా నౌకాదళ ప్రదర్శనపై ఎప్పటిలాగే కొన్ని దేశాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. -
మోదీ-జింగ్పింగ్ భేటీ.. ఏం చర్చించారంటే.!
-
మోదీ-జింగ్పింగ్ భేటీ.. ఏం చర్చించారంటే!
హంగ్‌ఝౌ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఆదివారం భేటీ అయ్యారు. చైనాలోని హంగ్‌ఝౌ నగరంలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా జరిగిన వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ స్వభ్యత్వం, ఉగ్రవాదంపై చైనా వైఖరి తదితర అంశాలను వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఎన్ఎస్జీలో భారత్ స్వభ్యత్యానికి చైనా మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా జేఈడీ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్‌కు వ్యతిరేకంగా ఐరాసలో భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని వీటో చేసి చైనా భారత్‌కు ఆగ్రహం కలిగించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు, ఘర్షణాత్మక అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచంలోని 20 అగ్రరాజ్యాల దేశాధినేతలు హంగ్‌ఝౌ నగరానికి చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే తదితరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. సైన్స్ సిటీగా పేరొందిన హంగ్ఝౌలో రెండురోజుల పాటు జీ-20 సదస్సు జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం లాంఛనంగా ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశాధినేతలకు విందు కార్యక్రమం ఉంటుంది.