preventions
-
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
నగరజీవితం ప్రతి మారుమూల పల్లెల్నీ తాకాక, జీవితాల్లోకి సెల్‌ఫోన్ దూసుకువచ్చాక ప్రధానంగా మొన్న కరోనా అందరినీ తాకి వెళ్లాక నిద్రలేమి ఓ పెద్ద సమస్యగా మారింది. రాత్రి ఒంటిగంటా, రెండు వరకూ నిద్రపట్టకపోవడం మామూలేంది. వైద్యపరిభాషలో ‘ఇన్సామ్నియా డిజార్డర్’ అని పిలిచే ఈ సమస్య ఆరోగ్యానికి చాలా చేటు చేస్తుంది. నిద్రను దూరం చేసే అంశాలేమిటో, నిద్రపట్టేదెలాగో తెలిపేదే ఈ కథనం. నిద్రలేమి సమస్య అందరిలో ఒకలా ఉండదు. కొందరికి రాత్రి చాలా ఆలస్యంగా నిద్రపట్టవచ్చు. కొందరికి త్వరగా నిద్రపట్టినప్పటికీ, కాసేపటికే మెలకువ వచ్చి... ఇక ఆపైన ఎంత ప్రయత్నించినా నిద్రరాక΄ోవచ్చు. కొందరికి ఏ తెల్లవారుజామున మూడు, మూడున్నరకు మెలకువ వచ్చాక... మళ్లీ ఏ ఆరు, ఏడు గంటలప్పుడో నిద్ర రావడం, కానీ ఎలాగూ తెల్లవారి΄ోయింది కదాని బలవంతంగా నిద్రలేస్తే... రోజంతా డల్‌గానూ ఉండవచ్చు. ఇవన్నీ నిద్రలేమి సమస్యలే. నిద్రలేమి రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది తాత్కాలిక నిద్రలేమి, రెండోది దీర్ఘకాలిక నిద్రలేమి. మొదటిది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అదే మూడువారాల కంటే ఎక్కువకాలంగా బాధిస్తుంటే దాన్ని క్రానిక్ ఇన్‌సామ్నియాగా చెప్పవచ్చు. కారణాలను బట్టి నిద్రలేమిలో మరో రెండు రకాలుంటాయి. అవి... ప్రైమరీ ఇన్సామ్నియా: నిర్దిష్టమైన ఎలాంటి కారణాలూ లేకుండా మామూలుగా నిద్రపట్టక పోవడాన్ని ‘ప్రైమరీ ఇన్సామ్నియా’ అంటారు. సెకండరీ ఇన్సామ్నియా: ఇతరత్రా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉండటం వల్ల వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’ అంటారు. అంటే మానసిక సమస్యలతో బాధపడుతుండటం లేదా గ్యాస్ వల్ల కలిగే ఛాతీలో మంట, ఆస్తమా, క్యాన్సర్ (కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు తీసుకునే చికిత్సల వల్ల కూడా); గుండెజబ్బులు, కీళ్లనొప్పులు లేదా దేహంలో మరెక్కడైనా తీవ్రమైన నొప్పి వల్ల నిద్రపట్టకపోవడం; కొన్ని సందర్భాల్లో మత్తుపదార్థాలను అధికంగాతీసుకున్నప్పుడూ నిద్రకు దూరం కావడం మామూలే. పట్టరాని సంతోషమూ లేదా భరించలేనంత దుఃఖం వల్ల కూడా నిద్రపట్టకపోవచ్చు. ఇలా వచ్చే నిద్రలేమిని ‘సెకండరీ ఇన్సామ్నియా’గా చెప్పవచ్చు. ఇన్సామ్నియాకు కారణాలు చిన్నతనంలో తీవ్రవేదనకు గురికావడం డిప్రెషన్, యాంగై్జటీ వంటి మానసిక సమస్యలు నిద్రమేల్కొని షిఫ్టుల్లో పనిచేయడం ∙వాతావరణ పరిస్థితులు (పెద్ద పెద్ద శబ్దాలు, తీక్షణమైన కాంతి, ఎక్కువ వేడి/చలి) జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు (ప్రియమైన వారి మరణం, అకస్మాత్తుగా ఉద్యోగం మారడం, విడాకుల వంటివి) కొన్నిరకాల మందులతో (ఉదా: అలర్జీ, ఆస్తమా, డిప్రెషన్, బీపీలకు వాడే కొన్ని మందులు).మేనేజ్మెంట్ / చికిత్స: తాత్కాలిక నిద్రలేమికి చికిత్స అవసరం లేదు. కాక΄ోతే వేళకు నిద్రపోవడం వంటి మంచి అలవాట్ల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. కానీ దీర్ఘకాలిక నిద్రలేమి ఉన్నప్పుడు ఏ కారణాల వల్ల ఇలా జరుగుతుందో చూడాలి. అంటే... మానసిక సమస్యల వల్లనా లేదా ఏవైనా శారీరక సమస్యలున్నాయా అని పరీక్షలు జర΄ాల్సిన అవసరముంటుంది. మానసిక సమస్యలతో ఇలా జరుగుతుంటే తగిన చికిత్స తీసుకోవాలి. ∙నిద్రమాత్రలు వాడటం ఒక చికిత్స. అయితే ఇవి తాత్కాలికంగానే వాడాలి. బాధితులు వాటికి అలవాటు పడే (అడిక్షన్‌కు) అవకాశం ఉంటుంది. అప్పుడు వాటిని వదిలించడానికి మరో చికిత్స చేయాల్సిరావచ్చు. అందుకే వాటిని దీర్ఘకాలం వాడటం సరికాదు. అందువల్ల జీవనశైలి మార్పులతో వేళకు నిద్ర΄ోయేలా చేసుకోవడం మంచిది. నిద్రలేమి నివారణ ఇలా... వేళకు నిద్ర΄ోవాలి. నిద్రకు అరగంట ముందర గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది ∙మధ్యాహ్నం నిద్ర ఓ పవర్న్యాప్లా అరగంట చాలు. ఒకవేళ మధ్యానం చాలాసేపు నిద్రపోతే అది రాత్రి నిద్రకు చేటుగా మారవచ్చు కెఫిన్ మోతాదు ఎక్కువగా ఉండే కాఫీతో తోపాటు కొన్ని కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి ∙సిగరెట్లలోని నికోటిన్‌తో కూడా నిద్రను దూరం చేస్తుంది.ఆల్కహాల్‌తో నిద్ర పట్టినప్పటికీ ఒక్కోసారి తెల్లవారుజామున మెలకువ వచ్చి మళ్లీ నిద్రపట్టక΄ోవడం, నిద్ర సమయం తగ్గి΄ోవడం మామూలే. అందుకే మద్యం అలవాటుకు దూరంగా ఉండాలి ∙వ్యాయామంతో అలసిపోతే బాగా నిద్రపడుతుంది. అయితే నిద్రపోవడానికి 4–5 గంటల ముందు వ్యాయామం చేయకూడదు. పడక గదిలో టీవీ ఎట్టిపరిస్థితుల్లో ఉండకూడదు తీవ్రమైన ఉద్విగ్నత, ఆందోళన నిద్రను దూరం చేసే అంశాలు. అందుకే మానసిక ప్రశాంతత అవసరం. ఇందుకోసం యోగా, ధ్యానం చాలావరకు ఉపయోగపడతాయి నిద్ర టైముకు అరగంట ముందర గోరువెచ్చని పాలు తాగాలి. అందులోని ట్రిప్టోఫాన్ అనే ఎసెన్షియల్ అమైనో యాసిడ్ మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రమాత్ర కంటే ఇది చాలా ఆరోగ్యకరమైన అలవాటని గుర్తుంచుకోవాలి. డాక్టర్ కిషన్ శ్రీకాంత్ జువ్వా, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ (చదవండి: మగవాళ్లకు స్టయిలింగ్ చేయడమే కష్టం! ఈశా భన్సాలీ) -
Be Alert: నిర్లక్ష్యం చేస్తే గ్యాస్..‘బాంబే’.. 12 వేల రెట్లు ఎక్కువ వ్యాపిస్తుంది
సాక్షి, హైదరాబాద్: చందానగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే విహార్ కాలనీలో గురువారం జరిగిన దుర్ఘటనలో ఒకరు చనిపోగా ఇద్దరు క్షతగాత్రులయ్యారు.రాంగోపాల్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలోని నల్లగుట్ట జే లైన్లో చోటు చేసుకున్న ఉదంతంలో భార్యభర్తలకు గాయపడ్డారు. .ప్రతి వంటింట్లోనూ ఉండే ఎల్పీజీ గ్యాస్ లీకేజ్ వల్ల జరిగిన పేలుడు ప్రభావాలివి. గత వారం జరిగిన రెండే కాదు.. నగరంలో తరచుగా ఇలాంటి ‘గ్యాస్’ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా పదుల సంఖ్యలో ఉంటున్న వీటి వల్ల ప్రాణనష్టం తక్కువగా ఉంటున్నా..ఆస్తి నష్టం మాత్రం భారీగా ఉంటోంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం వల్లే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇలా జరుగుతోందని నిపుణులు చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్‌లో దాదాపు 14.5 కేజీల బ్యూటేన్, ప్రొఫైన్ వాయువులను అత్యధిక ఒత్తిడితో ద్రవ రూపంలో నిక్షిప్తం చేస్తారు. ఈ బండ వినియోగంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, అవగాహన కొరవడిగా సంభవించే ప్రమాదం బాంబు పేలుడుతో సమానం. సాధారణంగా స్టౌవ్ ఆఫ్ చేసి ఉన్నప్పటికీ..గ్యాస్ లీకేజ్ అనేది సున్నిత ప్రాంతాల నుంచి జరిగే అవకాశం ఉంది. ►సిలిండర్, స్టవ్‌లను కలుపుతూ రబ్బర్ ట్యూబ్ ఉంటుంది. ఇది అటు సిలిండర్‌కు, ఇటు స్టవ్‌కు అతికే ప్రాంతాల్లో ఏదో ఒక చోట నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ►సాధారణంగా స్టవ్‌కు అనుసంధానిచే చోటే వేడి వల్ల ఈ ట్యూబ్ సాగే గుణం కోల్పోతుంది. ఫలితంగా పెళుసుదనం సంతరించుకుని పగుళ్లు ఏర్పడతాయి. కేవలం గుండు సూది మొనంత రంధ్రం ఏర్పడితే చాలు. దీని లోంచి గంటకు ముప్పావు నుంచి కేజీన్నర వరకు గ్యాస్ లీక్ అవుతుంది. చదవండి: సికింద్రాబాద్‌లోని అపార్ట్మెంట్లో పేలుడు.. ►స్టవ్‌కు ఉండే నాబ్స్, రెండు నాబ్స్‌నూ కలిపే పైప్, కొత్త సిలిండర్ బిగించే సమయంలో రెగ్యులేటర్, సిలిండర్ నాబ్‌ల నుంచీ లీక్ అయ్యే అవకాశం ఉంది. నానక్‌రామ్‌గూడ ఉదంతంలో మాత్రం కమర్షియల్ సిలిండర్ నుంచి అనేక కనెక్షన్లు ఇచ్చిన వాల్వ్ లీకేజ్‌కి కారణమైంది. ►వంటింటికి కిటికీలు, వెంటిలేటర్లు ఉంటే లీకైన గ్యాస్ వాటి నుంచి బయటకు వెళ్లిపోతుందనే భావన చాలా మందికి ఉంటుంది. వంట గ్యాస్‌లో ఉండే వాయువులు గాలి కన్నా చాలా బరువైనవి. అందుకే లీకైన తరవాత నేలపైకి చేరతాయి. నాలుగడుగుల కంటే తక్కువ ఎత్తులోనే వ్యాపిస్తాయి. దీంతో కిటికీలు తెరిచి ఉన్నా... వెంటిలేటర్లు ఉన్నా వాటి ద్వారా బయటకు పోయే అవకాశం ఉండదు. ►ఇంట్లో వ్యాపించి ఉన్న గ్యాస్‌కు ప్రేరణ లభించగానే ఒక్కసారిగా అంటుకుటుంది. ఇలా అంటుకున్న సందర్భంలో విస్తరించి ఉన్న గ్యాస్ 12 వేల రెట్లు వ్యాకోచిస్తుంది. అంటే కేజీ గ్యాస్ లీకై ఉంటే... మంట అంటుకున్న వెంటనే అది 12 వేల కేజీల వరకు వ్యాకోచిస్తుంది. ఫలితంగానే గ్యాస్ ప్రమాదం చోటు చేసుకున్న చోట భారీ ఆస్తి నష్టం ఏర్పడుతుంది. ►సమీపంలో ఉన్న వ్యక్తులు మాత్రం ప్రాణాలు కోల్పోవడమో, 60 శాతం వరకు కాలిపోవడమో జరుగుతుంది. అనేక ప్రమాదాల్లో గ్యాస్ సిలిండర్ ఏమాత్రం చెక్కు చెదరదు. దీన్ని చూసి అనేక మంది గ్యాస్ వల్ల జరిగిన పేలుడు కాదని భావిస్తారు. ఇలాంటి బ్లాస్ట్ల్ని కెమికల్ ఎక్స్ప్లోజన్ అని, సిలిండర్ కూడా ఛిద్రం అయిపోతే దాన్ని మెకానికల్ ఎక్స్ప్లోజన్ అని అంటారు. ►గత వారం జరిగిన వాటిలో చందానగర్ పరిధిలోని మొదటి ప్రమాదానికి గ్యాస్ లీకైన గదిలో లైట్ వేయడం కారణమైతే, రామ్‌గోపాల్‌పేట పరిధిలో జరిగిన రెండో దానికి స్టవ్ వెలిగించే ప్రయత్నం చేయడం కారణమైంది. చదవండి: ఆ ఆశతో గణేష్ లడ్డూను దొంగిలించిన పిల్లలు ఇద్దరి పరిస్థితి విషమం రాంగోపాల్‌పేట్: రాంగోపాల్‌పేట్ డివిజన్లోని నల్లగుట్ట జే లైన్లో శనివారం గ్యాస్ లీకై జరిగిన పేలుడులో గాయపడిన దంపతులు సందీప్, అనుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వీరిని పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స ప్రారంభించారు. 55 శాతం కాలిన గాయాలతో ఇద్దరు చికిత్స పొందుతుండగా పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని గాం«ధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
జిమ్ చేసి కండలు పెంచితే చాలా? గుండె కోసం ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: గత 20 ఏళ్లలో యువతలో గుండెపోటు 200 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారిలో దాదాపు 50శాతం మంది భారతీయులే. మరీ ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం గమనార్హం. గుండె సమస్యల కారణంగా 40-50 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా చనిపోతున్నారు. ఫిట్‌గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తూ కూడా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా , నటి మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ వంటి ప్రముఖుల మరణాలే ఇందుకు ఉదాహరణ. ఆహార అలవాట్లు జీవనశైలిలో మార్పులే కారణమని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన శరీరంలో అతి కీలకమైన గుండెకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే.. దాన్ని సరి చేయడం అంత తేలిక కాదు. అందుకే నివారణే ముఖ్యం. రోజులు, నెలలు సంవత్సరాలబడి నిమిషానికి 70-80 సార్లు కొట్టుకునే గుండెను లైట్ తీసుకుంటే మూల్యం చెల్లించక తప్పదు. మన వాహనాల ఇంజీన్లను ఎలారిపేర్ చేస్తామో శుభ్రం చేసుకుంటామో,దాని కోసం ఎంత శ్రద్ధ పెడతామో మన హృదయంపై అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. టైం లేదు లాంటి కుంటి సాకులు చెబితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. టీవీ చూసేందుకు, పేపర్ చదివేందుకు, స్మార్ట్‌ఫోన్ కోసమే కాదు వ్యాయామంకోసం కూడా కొంత సమయాన్ని వెచ్చించాల్సిందే. గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన కారకం ఒత్తిడి. తీవ్రమైన ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందని. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ధమనుల లోపలి పొరల్లో వాపుకు కారణమవుతుంది. అలాగే రక్తం గడ్డకట్టడంతో పాటు గుండెపోటుకు దారితీస్తుందని ప్రఖ్యాత కార్డియాలజిస్ట్‌లు చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో కాలంతో పరిగెడుతున్న క్రమంలో జీవనశైలిలో స్పష్టమైన మార్పులతోపాటు ధూమపానం పెరుగుదలలాంటి ముఖ్యమైన మార్పులను మనం మర్చి పోకూడదు, అంటే వేళా పాళా లేని ఆహార అలవాట్లకు తోడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్, విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, తీవ్ర ఒత్తిడి, డెడ్లైన్లు. దీనికి తోడు కాలుష్యం ముఖ్యంగా మెట్రో నగరాల్లో తన ప్రభావాన్ని భారీగానే చూపుతోంది. కాలుష్యంతో ధమనులవాపు, గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి భారతీయుడు యూరోపియన్ల కంటే మూడు రెట్లు, చైనీయుల కంటే ఆరు రెట్లు ఎక్కువ, జపనీస్ కంటే ఇరవై రెట్లు ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. అందులోనూ మధుమేహం ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువ. ఆరోగ్యకరమైన గుండె కోసం వారానికి ఐదు సార్లు రోజుకు 45 నిమిషాలు వేగంగా నడవడంవల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను 20శాతం తగ్గించవచ్చు. ఒకేసారి 45 నిమిషాలు సాధ్యం కాకపోయినా, ఉదయం 25 నిమిషాలు, సాయంత్రం 25 నిమిషాలుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఒత్తిడిని జయించి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వ్యాయామం కావాలి. గుండె ఆరోగ్యానికి నడక ఉత్తమమైంది. వాకింగ్, సైక్లింగ్‌తోపాటు యోగా, ఏరోబిక్స్‌ను మిక్స్ చేసి ఎక్సర్సైజ్ చేయవచ్చు. లిఫ్ట్ బదులు, మెట్లు ఎక్కండి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఇది మరో బెస్ట్ ఐడియా. టీ విరామాన్ని వ్యాయామ బ్రేక్‌గా మార్చుకోవడం మరో మార్గం. ఇందుకోసం ప్రతి ఆఫీసులో ట్రెడ్మిల్ ఏర్పాటు చేసుకోండి. అయితే రోజూ 10 నుండి -20కి.మీ రన్నింగ్ లేదా జాగింగ్‌కి చేస్తే గుండెకు, శరీరానికి హానికరం ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. జిమ్‌లో విపరీతంగా కసరత్తు చేసి చక్కటి బాడీబిల్డింగ్ పెంచుకున్నంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు అనేది గమనించాల్సిన ముఖ్య అంశం. 25 శాతం గుండె జబ్బులకు ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. 30-40శాతం మంది ఎలాంటి బ్లాక్స్ లేకుండానే గుండెపోటుకు గురవుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో గుండెపోటు వచ్చినా, ఆకస్మిక మరణం సంభవించినా ఆయా కుటుంబాల్లోని వారికి గుండె సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. అలాగే మధుమేహం, రక్తపోటుతో బాధపడేవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ చేయించు కోవాలి. ఇది 20 సంవత్సరాల వయస్సులోనే మొదలు కావాలి. 30 సంవత్సరాల వయస్సులోపు వారు ప్రతి సంవత్సరం బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. -
ఒడిసి పట్టు.. మునగదు ఒట్టు!
సాక్షి, హైదరాబాద్: ఏటా సెప్టెంబర్‌లో 5 సెం.మీ. వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ నిండా మునుగుతోంది. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లు గ్రేటర్ మునకకు అన్నే కారణాలున్నాయి. వందకుపైగా ముంపు ప్రాంతాలున్నాయి. ఇటీవల కురిసిన జడివానకు పలు లోతట్టు ప్రాంతాల్లో నడుములోతు నీళ్లు రావడంతో దారులు ఏరులను తలపిం చాయి. వరద కారణంగా వాహనదారులు విలవిల్లాడారు. నగరంలో 5 వేల కిలోమీటర్ల మేర విస్తరించిన మురుగునీటి కాల్వలు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినవి కావడంతో వాటి సామర్థ్యం సరిపోవడంలేదు. పలు చోట్ల మురుగునీటి పైపులైన్లలో నిర్మాణ వ్యర్థాలు పోగుపడటంతో భారీ వర్షం కురిసిన ప్రతిసారి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతున్నాయి. అలాగే 1,500 కి.మీ. మేర విస్తరించిన నాలాలపై సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించడంలో బల్దియా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జడివాన కురిసిన ప్రతిసారి జనం బయటకు రావద్దని బల్దియా హెచ్చరికలు జారీ చేయడం పరిపాటిగా మారింది. ముంపు సమస్య ఇలా... నగరంలో ఏటా నమోదవుతున్న వర్షపాతంలో సింహభాగం ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతూనే ఉంది. రామంతాపూర్, భండారీ లే అవుట్, నందీకాలనీ.. లాంటి ప్రాంతాలు నీటమునగడం సర్వసాధారణంగా మారింది. ఈ వరద ముప్పును తప్పించేందుకు చక్కటి ప్రత్యామ్నాయం ఉందని ఐఐటీ బాంబే నిపుణుల తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైకప్పుపై పడే వర్షపు నీటిని పదిలంగా ఒడిసిపట్టడమే సమస్యకు పరిష్కారమని స్పష్టం చేసింది. ఇలా చేస్తే ముంపు నుంచి విముక్తి.. గ్రేటర్ విస్తీర్ణం 625 చ.కి.మీటర్లు. నివాసాల సంఖ్య సుమారు 25 లక్షలు. ఏటా నమోదయ్యే వర్షపాతం 800–1000 మిల్లీమీటర్లు. ఏడాదికి సుమారు 50–90 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో 25 లక్షల నివాసాలపై కురిసిన వర్షపు నీటిని వెయ్యి లీటర్ల సామర్థ్యంతో ఇంకుడు గుంతలు తవ్వి నిల్వ చేస్తే 43 శాతం ముంపు ముప్పు తప్పుతుందని ఐఐటీ బాంబే నిపుణుల బృందం స్పష్టం చేసింది. కనీసం ఇంటికి 500 లీటర్ల మేర వర్షపు నీటిని నిల్వ చేసినా.. 35 శాతం వరదముప్పు తప్పుదుందని ఈ నివేదిక వెల్లడించింది. ఇక 200 లీటర్ల నిల్వచేస్తే 22 శాతం.. ఇంటికి వంద లీటర్లయినా నిల్వచేస్తే 11 శాతం ముంపు సమస్య నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడించింది. నేలలోకి ఇంకితే.. నగరంలోని ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, పార్కింగ్ ప్రదేశాలు, లోతట్టు ప్రాంతాల్లో... కాంక్రీట్, టైల్స్, బండరాళ్లతో కప్పివేయకుండా మధ్యలో ఖాళీ స్థలాలు వదిలిపెడితే వర్షపు నీరు నేలలోకి ఇంకుతుందని.. వరద తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొంది. సుమారు 185 చెరువుల్లోకి వరద నీటిని చేర్చే ఇన్ ఫ్లో చానల్స్, నాలాలను ప్రక్షాళన చేస్తే ముంపు నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని, వాటిల్లో నీటి మట్టం కూడా పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. కాగితాలపైనే కిర్లోస్కర్ నివేదిక.. నగరానికి ముంపు సమస్య నుంచి విముక్తి కల్పించేందుకు 2003లో నివేదిక అందించిన కిర్లోస్కర్ కమిటీ వరదనీరు సాఫీగా వెళ్లేందుకు నాలాలను అభివృద్ధి చేయాలని సూచించింది. అలాగే 2007 గ్రేటర్ మొత్తానికీ సమస్య తీరేందుకు ‘సమగ్ర మాస్టర్ ప్లాన్ .. సూక్ష్మస్థాయి వరద నీటి పారుదల నెట్వర్క్ ప్లాన్ .. మేజర్, మైనర్ వరద కాలువల ఆధునీకరణకు సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు’(డీపీఆర్) తయారు చేసే బాధ్యతను ఓయంట్స్ సొల్యూషన్ ్స ప్రైౖ వేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. దాని ప్రాథమిక అంచనా మేరకు గ్రేటర్లో వరద నీటి సమస్య పరిష్కారానికి సుమారు రూ.10,000 కోట్లు అవసరం. బల్కాపూర్ నాలా, కూకట్పల్లి, ముర్కినాలా, పికెట్, ఎర్రమంజిల్, బంజారాహిల్స్, ఎల్లారెడ్డిగూడ, పంజాగుట్ట, యూసుఫ్‌గూడ, నాగమయ్యకుంట, కళాసిగూడ, ఇందిరాపార్కు నాలాలను ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు నిరోధించాలి. కానీ ఈ పనులన్నీ నిధుల లేమితో కునారిల్లుతున్నాయి. తక్షణం చేయాల్సిన పనులివీ.. ► గ్రేటర్లో 1,500 కి.మీ. మేర విస్తరించిన ప్రధాన నాలాలపై ఉన్న సుమారు 8 వేల ఆక్రమణలను తొలగించాలి. ► నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి కావాలంటే.. టౌన్ ప్లానింగ్ విభాగంతో పాటు మరో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ► నాలాల ఆధునీకరణ ఆవశ్యకతను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. దీనికి రాజకీయ పార్టీల, ఎన్జీఓల సహకారం తీసుకోవాలి. ► వరద నీటి కాలువల్లో మురుగునీరు పారకుండా చూడాలి. మురుగునీటి పారుదలకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలి. ► స్టార్మ్ వాటర్ డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్ ను పరిగణనలోకి తీసుకొని టౌన్ ప్లానింగ్ విభాగం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను అనుమతించరాదు. ఇతర మెట్రో నగరాల్లో ఇలా.. చెన్నై, ముంబై మహానగరాల్లో 50 సెం.మీ.పైగా భారీ వర్షాలు కురిసినా ముంపు తప్పించేందుకు అక్కడి నాలా వ్యవస్థలో భారీ సామర్థ్యంగల పైపులైన్ల ఏర్పాటుతో వరదనీటికి చక్కటి పరిష్కారం చూపారు. ఆ నీటిని సముద్రంలోకి మళ్లించడంతో ఆయా నగరాలకు ముంపు ముప్పు తప్పింది. హైదరాబాద్‌కు సముద్రం లేకపోయినా వర్షపు నీటిని చెరువులు, కుంటలకు మళ్లించడంతోపాటు,లోతట్టు ప్రాంతాల్లో ఇంకుడు కొలనుల ఏర్పాటుచేసి వాటిలోకి మళ్లిస్తే ముంపు తప్పుతుందని నిపుణులు సూచిస్తున్నారు. -
అందుకే వస్తోంది.. ఆస్తమా..
సాక్షి, హైదరాబాద్ : ఒకప్పుడు బయటి వాతావరణ కాలుష్యం ఆస్తమాకు కారణమని అంతా భావించేవారు. ఇప్పుడీ ముప్పు నేరుగా ఇంట్లోనే తిష్టవేసుక్కూర్చుంది. ఇండోర్ పొల్యూషన్ (దుప్పట్లు, తలదిండ్లు, పర్ఫ్యూమ్లు, మస్కిటోకాయిల్స్, అగరొత్తులు, పెంపుడు జంతువుల వెంట్రుకలు, బొద్దింకలు, ఎలుకల మలమూత్రాల నుంచి వెలువడే వాయువులు, దుమ్ముధూళి) ఆస్తమాకు ఎక్కువ కారణమవుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సర్వేలో తేలింది. ఇంటా, బయటా కాలుష్య సమస్య వల్ల పట్టణాల్లో 5 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 2 శాతం మంది ఆస్తమాతో బాధపడుతుండగా, బాధితుల్లో 10–12 శాతం మంది చిన్నపిల్లలే ఉన్నట్లు సర్వే తేల్చింది. శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చిన్నపిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఛాతీ వైద్యనిపుణుడు డాక్టర్ విజయ్‌కుమార్ ఆస్తమాకు కారణమవుతున్న అంశాలను వివరించారు. ఇంటా బయటా తంటానే.. ►గ్రేటర్లో 15 ఏళ్ల క్రితం ఉన్న 11 లక్షల వాహనాలు, 2019 నాటికి 55 లక్షలకు చేరాయి. వీటిలో పదిహేనేళ్ల సర్వీసు దాటినవి 10 లక్షలు. వీటి నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలు శ్వాసకోశ సమస్యలకు కారణమవుతున్నాయి. ►40 వేల వరకు ఉన్న పరిశ్రమలు వదిలే పొగ, వ్యర్థాల వల్ల క్యూబిక్ మీటర్ గాలిలో 130–150 మైక్రోగ్రాముల వరకు వివిధ కాలుష్య స్థాయిలు నమోదవుతున్నాయి. ►సల్పర్డయాక్సైడ్, హైడ్రోకార్బన్స్, నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియం, కార్బన్‌మోనాక్సైడ్‌తో కూడిన గాలిని పీల్చడం వల్ల శ్వాస నాళాలు దెబ్బతింటున్నాయి. ►ఇంట్లో వాడే మస్కిటోకాయిల్స్, పర్ఫ్యూమ్స్, పరుపు, తలదిండ్లలో పేరుకుపోయిన దుమ్ము ఆస్తమా కలిగిస్తున్నాయి. ► పోతపాలు, జంక్‌ఫుడ్, అతిగా యాంటీబయాటిక్స్ వాడటం వంటివి ఐదేళ్లలోపు చిన్నారుల శ్వాసనాళాలను దెబ్బతీస్తున్నాయి. వ యసుతో పాటే తెరుచుకోవాల్సిన శ్వాసనాళాలు మూసుకుపోతున్నాయని తేలింది. ►ప్రసవం తర్వాత చాలామంది తల్లులు బిడ్డలకు డబ్బా పాలు పడుతున్నారు. సాధారణ జ్వరానికీ ఖరీదైన యాంటిబయాటిక్స్ వాడుతున్నారు. ఇది పిల్లల్లో ఆస్తమాకు కారణమవుతోంది. శ్వాస సరిగా తీసుకోలేకపోవడం పిల్లల ఎదుగుదల, జ్ఞాపకశక్తి, చదువుపై ప్రభావం చూపుతోంది. నాడీ వ్యవస్థపై ప్రభావం – డాక్టర్ పి.సుదర్శన్‌రెడ్డి, చిన్నపిల్లల వైద్యనిపుణుడు ఆస్తమాకు బయట ఉండే వాహన, పారిశ్రామిక కాలుష్యం, ధూమపానం వంటి వాటి కంటే ఇండోర్ పొల్యూషన్ (మస్కిటో కాయిల్స్, పర్ఫ్యూమ్స్, అగరొత్తులు, పెట్స్, దుప్పట్లు, దిండ్లు) ఎక్కువ ప్రమాదకరం. ఆస్తమా వల్ల శ్వాసనాళాలు మూసుకుపోయి ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు కంటిచూపు, కిడ్నీల పనితీరు మందగిస్తుంది. ఇన్హేలర్తో ఉపశమనం – డాక్టర్ విజయ్‌కుమార్, ఫల్మనాలజిస్ట్, అపోలో ఆస్పత్రి ఇంట్లో ఇన్హేలర్ ఉండాలి. టాబ్లెట్స్, ఇంజక్షన్లు, నెబ్లైజర్తో పోలిస్తే ఇన్హేలర్తోనే ప్రయోజనం ఎక్కువ. వైద్య పరీక్షలతో పని లేకుండా క్లినికల్‌గానూ ఆస్తమాను నిర్ధారించవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి ఆరు నుంచి తొమ్మిది మాసాలు మందులు వాడితే చాలు. ఆస్తమా లక్షణాలివీ.. తరచూ దగ్గడం.. ఆయాసం.. కడుపు ఉబ్బరంగా ఉండటం. వీటికి దూరంగా ఉండాలి.. ఐస్‌క్రీమ్‌లు, శీతల పానీయాలు, కూలర్, ఏసీ, సిగరెట్, సిమెంట్, ఫ్లెక్సీ ప్రింటర్స్, పారిశ్రామిక, వాహన కాలుష్యం.. -
భూకంపాలను ముందుగా గుర్తించలేమా?
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోవున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా పెను భూకంప ప్రమాదాలను ఎందుకు ముందుగా గుర్తించలేక పోతున్నాం? ఎందుకు అపార ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించలేకపోతున్నాం? అన్న ప్రశ్నలు తలెత్తడం సహజమే. ఓ పక్క శాస్త్రవిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిందని, భూకంపాల్లాంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే గుర్తించవచ్చని అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా రుజువు చేస్తున్నా అందుకు తగిన వ్యవస్థ ఎందుకు మనకు అందుబాటులోకి రావడం లేదన్న ప్రశ్న కూడా సహజమే. భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలు ఓ దేశానికో, ఓ ప్రాంతానికో పరిమితం కాదు. వీటిపై పరిశోధనలు మాత్రం ఓ దేశానికో, ప్రాంతానికో పరిమితమవుతున్నాయి. అందుకని పరిశోధనల ఫలాలు అందుబాటులోకి రావడం లేదు. ఇలాంటి వైపరీత్యాలను నివారించేందుకు అంతర్జాతీయ సమన్వయం, కృషి అత్యవసరం. మొన్నటికి మొన్న బ్రిటన్‌లోని ఆంగ్లియా రస్కిన్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ రాచెల్ గ్రాంట్ పెను భూకంపాల ముప్పును వారం, పది రోజుల ముందే అంచనా వేయవచ్చని తేల్చారు. పెను భూకంపాలు రావడానికి 23 రోజుల ముందుగానే బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షుల ప్రవర్తనలో మార్పులు వస్తాయని, 15 రోజుల నుంచి వారం రోజుల ముందు వాటి ప్రవర్తనలో మార్పులు తీవ్రంగా ఉంటాయని, ఆ మార్పులను గుర్తించడం ద్వారా భూకంపాల ముప్పును ముందుగానే గుర్తించవచ్చని ఆయన తేల్చారు. పెరూలో 2011లో సంభవించిన పెను భూకంపంపై పరిశోధనలు చేసిన ఆయన.. పెరూలోని యనచాగ జాతీయ పార్కులో ఏర్పాటు చేసిన రికార్డింగ్ సౌకర్యం కలిగిన కెమేరాలను తెప్పించికొని పరిశీలించారు. ఆ కెమేరాల ఫుటేజ్ ద్వారా పక్షుల్లో, జంతుజాలం ప్రవర్తనలో వచ్చిన మార్పులను లోతుగా అధ్యయనం చేశారు. భూకంపానికి 23 రోజుల ముందుగా వాటి ప్రవర్తనలో స్వల్పంగా మార్పులు వచ్చాయని, ఆ తర్వాత, వారం, పది రోజుల ముందు ప్రళయం రాబోతున్నట్టు అవి అడవిలో కల్లోలం సృష్టించాయని, ఇక రెండు, మూడు రోజుల్లో ముప్పు ముంచుకురాబోతున్న తరుణంలో భయంతో కదలక, మెదలక స్తబ్దుగా కనిపించాయని ఆయన వివరించారు. వాటిలో వచ్చిన ఈ విపరీత మార్పులను ఆయన శాస్త్రీయంగా విడమర్చి చెప్పారు కూడా. భూకంపానికి ముందు భూ పొరల్లో ఏర్పడే కదిలికల వల్ల భూ ఉపరితలంపైనా, భూ వాతావరణంలోని గాలిలో అయాన్ల చలనం ఏర్పడుతుందని, దీనివల్ల పశుపక్షాదుల రక్తంలో సెరటోన్ల స్థాయి హఠాత్తుగా పెరుగుతుందని, ఆ కారణంగా అవి విచిత్రంగా, భయాందోళనలతో ప్రవర్తిస్తాయని ఆయన వివరించారు. రక్తంలో సెరటోన్ల స్థాయి పెరిగితే ముఖ్యంగా బొరియల్లో నివసించే జంతువులు, క్షీరదాలు, పక్షుల్లో తెలియని గుబులు, తీవ్ర అలసట, మానసిక ఆందోళన తలెత్తుతాయని, అందుకని విచిత్రంగా ప్రవర్తిస్తాయని చెప్పారు. వాతావరణంలోని అయాన్ల చలనానికి మానవుల శరీరాలు పెద్దగా స్పందించవని అన్నారు. జంతువుల ప్రవర్తనను గమనించడం ద్వారా ఒకరకంగా ముందే భూకంపాల ముప్పును మానవులు గ్రహించవచ్చన్నారు. భూగర్భంలో ప్రకపనలను ముందుగానే గుర్తించే పరికరాలను అమర్చడం ద్వారా కూడా భూకంపం ముప్పును ముందే గుర్తించవచ్చని మరి కొందరు శాస్త్రవేత్తలు ఇదివరకే నిరూపించారు. - సాక్షి వెబ్ సైట్ ప్రత్యేకం