prices wings
-
టొమాటో కిలో రూ.150, క్యారెట్ కిలో రూ. 490
కొలంబో: శ్రీలంక సంక్షోభం చరిత్రలో ఒక గుణపాఠంగా నిలుస్తోంది. దేశ ఆర్థిక, రాజకీయ సంక్షోభం అక్కడి ప్రజలను అష్టకష్టాల్లోకి నెట్టేసింది. మునుపెన్నడూ లేని విధంగా కిరాణా వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కనీసం తినడానికి తిండి లేక సామాన్యులు అల్లాడి పోతున్నారు. దీనికి తోడు పెట్రోలు సంక్షోభం పట్టి పీడిస్తోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో 1990 అత్యవసర అంబులెన్స్ సేవ కూడా నిలిపివేశారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ‘1990’ అత్యవసర అంబులెన్స్ సర్వీస్ నంబర్‌కు కాల్ చేయవద్దని సువా సేరియా అంబులెన్స్ సర్వీస్ ప్రజలను కోరింది. కొలంబోలోని పేటలోని ఫెడరేషన్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ మార్కెట్ (FOSE మార్కెట్)లో కిలో టమోటా శ్రీలంక రూపాయల్లో 150కి అమ్ముడవుతోంది. కిలో ఉల్లి శ్రీలంక రూపాయల్లో 200కు విక్రయిస్తుండగా, కిలో బంగాళదుంపలు శ్రీలంక రూపాయల్లో 220కి విక్రయిస్తున్నారు. కిలో క్యారెట్ రూ.490కి, పావుకిలో వెల్లుల్లి రూ.160కి విక్రయిస్తున్నారు. సరఫరా కొరతతోపాటు, రవాణా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయిందని కూరగాయల విక్రయదారులు వాపోతున్నారు. ఫైల్ ఫోటో కాగా 1948లో స్వాతంత్య్రం వచ్చిన తరువాత తొలిసారి ద్వీపం దేశం అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, మందులు, వంటగ్యాస్ ఇంధనం లాంటి నిత్యావసర వస్తువుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుకు ఒప్పందం కుదిరిన తర్వాత శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేయనుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే బుధవారం తన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. నిరసనకారులు రాజపక్సే అధికారిక నివాసంపై దాడి చేయడం, ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే వ్యక్తిగత నివాసానికి నిప్పు పెట్టడం లాంటి పరిణామాలు తెలిసినదే. -
ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ల దిగుమతి సుంకాన్ని 2.5 శాతం పెంచింది. విడిభాగాల పరికరాలకు కస్టమ్స్ డ్యూటీని 10 నుంచి 15 శాతానికి పెంచడంతో వీటి ధరలు పెరుగుతాయని నగర సెల్‌ఫోన్ దుకాణ నిర్వాహకులు అంటున్నారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల ధరలు మాత్రం ఏప్రిల్ నుంచి మరింత ప్రియమవుతాయని చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులైన రిఫ్రిజ్రేటర్, ఎయిర్ కండిషన్ కంప్రెషర్లలపై ఉన్న కస్టమ్స్ డ్యూటీని 12.5 నుంచి 15 శాతానికి పెంచడం కూడా ఆయా వస్తువుల ధరలపై ప్రభావాన్ని స్పష్టంగా చూపెడుతుందని వ్యాపారులు అంటున్నారు. నగరంలో వేలల్లో సెల్‌ఫోన్ దుకాణాలతో పాటు వందల్లో ఎలక్ట్రానిక్ షోరూమ్‌లు రూ.వందల కోట్లలో వ్యాపారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎలక్ట్రానిక్ వస్తువుల ధరల పెంపు మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలపై మరింత భారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత భారమే.. స్మార్ట్ఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి. ప్రతి ఒక్కరికీ సమాచార మార్పిడికి ఫోన్లు తప్పనిసరి కావడంతో ధరలు పెరిగినా కొనడం మాత్రం ఆగడంలేదు. అయితే అతి కష్టంమీద సెల్‌ఫోన్ కొనుగోలు చేసేవారికి మాత్రం ఈ నిర్ణయం గుదిబండలా మారింది. – ఎల్.నరేష్, ఆర్పీ మొబైల్ షాప్, వనస్థలిపురం తప్పదు వాడకం.. ఎలా కొనడం? కరోనా నేపథ్యంలో పాఠశాలలు, కాలేజీలు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తుండడంతో ప్రతి ఒక్కరూ స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఇన్నాళ్లూ కేవలం తల్లిదండ్రులు మాత్రమే వాడగా.. ఇప్పుడు పిల్లలకు చదువు కోసం కొనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మధ్య, పేద తరగతి ప్రజలకు భారమే. – రితిక, సీబీఐటీ కాలేజీ విద్యార్థిని, గండిపేట సామాన్యుడిపై భారమే... ఇంట్లో అవసరాల కోసం రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్లు కొనుగోలు చేసేవారికి భారమే. వచ్చే జీతం ఇంటి అద్దెకు, అవసరాలకు, పిల్లల చదువులకే సరిపోతున్నాయి. కేంద్రం తాజా బడ్జెట్‌తో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలకు రెక్కలు రానుండడంతో సామాన్యుడిపై మరింత భారం పడనుంది. – పి.శేఖర్, ఎల్బీనగర్ -
ఆశలు చెధరే
కొవ్వూరు/తణుకు : ప్రస్తుతం గృహ నిర్మాణాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. బ్యాంకులూ రుణాల మంజూరును సులభతరం చేశాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు సొంతింటి కలను నిజం చేసుకునే బాట పట్టారు. అయితే వారి ఆశలు అంతలోనే చెదిరిపోయాయి. నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వరుసగా సిమెంట్, ఐరన్, కంకర ధరలు పెరుగుతుండడంతో గృహనిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. 25శాతం భారం పదిరోజుల వ్యవధిలో సిమెంటు బస్తా ధర ఏకంగా రూ.100 నుంచి 120 వరకూ పెరిగింది. నెల రోజు వ్యవధిలో ఐరన్ ధర టన్నుకు రూ.8 వేల మేరకు పెరిగింది. దీంతో నిర్మాణ వ్యయం 20 నుంచి 25 శాతం పెరిగింది. ఫలితంగా రియల్ ఎస్టేట్‌తోపాటు భవన నిర్మాణదారులు కుదేలయ్యే పరిస్థితి తలెత్తింది. గతంలో ఓ ధరకు నిర్మాణ ఒప్పందాలు చేసుకున్న వారు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ధరల పెరుగుదలతో ఎక్కడికక్కడ నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి నియంత్రణకు అధికారులు, సర్కారు చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిమెంట్ బస్తా రూ.120 సిమెంటు వ్యాపారులు సిండికేట్‌గా మారి కృత్రిమ కొరత సృష్టించడంతో ధరలకు రెక్కలొచ్చాయి. పదిరోజుల వ్యవధిలో బస్తా సిమెంటు ధర సరాసరి రూ.100 నుంచి 120 వరకు పెంచేశారు. ఈనెల ఆరంభంలో లారీల సమ్మెకు ముందు రూ.220 నుంచి రూ.230 వరకూ ఉన్న బస్తా సిమెంటు ధర ఇప్పుడు ఏకంగా రూ.350 నుంచి 360 వరకూ పలుకుతోంది. చిన్న పట్టణాలు, పల్లెల్లో ఈ ధర రూ.380 నుంచి రూ.390 వరకూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ ప్రభావం రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంపై తీవ్రంగా పడింది. ఇటుకదీ అదే దారి ఇటుక ధర కూడా అమాంతంగా పెరిగింది. ఈ సీజ¯ŒS ఆరంభంలో వెయ్యి ఇటుకల ధర రూ.3,500 నుంచి 3,800 మధ్య ఉండేది. ప్రస్తుతం డిమాండ్ భారీగా పెరగడంతో రూ.5,300 నుంచి రూ.5,500 వరకూ విక్రయిస్తున్నారు. కేవలం నెలరోజుల వ్యవధిలో ఏకంగా వెయ్యి ఇటుకల ధర సుమారు రూ.రెండు వేలు పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వేసవిలో ఇటుక ధర స్వల్పంగా పెరగడం సహజం. ఈ సారి మాత్రం అనూహ్యంగా పెరగడంతో నిర్మాణదారులు బెంబేలెత్తుతున్నారు. కంకర ధరకూ రెక్కలు కంకర ధరలూ గత పదిరోజుల్లో యూనిట్‌కి రూ.500 వరకు పెరిగింది. ఈనెల ఆరంభంలో రూ.2,000 ఉన్న యూనిట్ కంకర ధర ప్రస్తుతం రూ.2,500 నుంచి రూ.2,600 వరకూ పలుకుతోంది. దీనిలో నాసిరకం కంకర ధరకు రూ.వంద వ్యత్యాసం ఉంటుంది. రెండు యూనిట్ల లారీ రూ.4వేల నుంచి రూ.5వేలకు పెరిగింది. ఇనుము టన్ను రూ.8 వేలు నెల రోజుల వ్యవధిలో ఇనుము ధర టన్ను రూ.8వేల వరకూ పెరిగింది. ఇటీవల ఇనుము ధర రోజువారీగా టన్ను రూ.200 నుంచి రూ.300 పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. నెల క్రితం టన్ను ఇనుము రూ.33 వేల నుంచి రూ.34,500 మధ్య ఉండేది. ప్రస్తుతం రూ.42 వేల నుంచి రూ.44,500 వరకు పలుకుతోంది. వైజాగ్ స్టీల్ టన్ను మరో రూ.రెండు వేలు అదనంగా పలుకుతోందని వ్యాపారులు చెబుతున్నారు. కంపెనీల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న సిమెంట్ ధరలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. కంపెనీల నిర్ణయాలపైనే వ్యాపారం చేస్తుంటాం. అన్ని కంపెనీల నుంచి తక్కువ ధరకు సిమెంటు విక్రయించవద్దని ఒత్తిళ్లు వస్తున్నాయి. వారు నిర్ణయించిన ధరలకు అమ్మక తప్పడంలేదు.– టి.వెంకటేశ్వరరావు, సిమెంట్ డీలర్, తణుకు ధరలు అదుపు చేయాలి ఒక్కసారిగా సిమెంట్ ధరలు పెరిగాయి. ఇసుక కొరత తీరినా ధరలు మాత్రం దిగి రావడంలేదు. ఇతర నిర్మాణ సామగ్రి ధరలూ పెరిగాయి. వీటిని భరించలేక నిర్మాణాలు నిలిపేసుకున్నాం. కంపెనీలు ఇష్టానుసారం ఇలా ధరలు పెంచుకుంటూ పోతే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. పెరిగిన ధరలను అదుపు చేయాలి.– ఎం.కోటేశ్వరరావు, గృహనిర్మాణదారుడు, తణుకు