prime
-
ఒకే ఫ్రేమ్‌లో సమంత, ప్రియాంక.. థియేటర్లో సందడి (ఫోటోలు)
-
ఓటీటీకి వచ్చేసిన డబుల్ ఇస్మార్ట్..
-
Prem Sagar Reddy: అగ్రరాజ్యంలో ఆస్పత్రి కట్టిన రైతు బిడ్డ
‘అప్పట్లో.. అనగనగా ఓ ఊరు.. రాత్రయితే కానరాని వెలుతురు.. కిరోసిన్ బుడ్డి కిందే చదువు.. అయినా ఎప్పుడూ ఫస్ట్ ర్యాంకే.. సాధారణ రైతు బిడ్డగా జన్మించి.. అగ్రరాజ్యానికి హృదయ స్పందనై నిలిచారు.. జన్మ భూమిని.. పల్లె ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేదు.. సప్త సముద్రాల అవలి నుంచే సొంతూరి దాహం తీరుస్తూ.. విద్యతోనే ఉన్నతని నిరూపిస్తూ.. గ్రామంలో బాటలు వేస్తూ.. ప్రజలందరితో ఎంతమంచి మా ‘ప్రేమ్’యో అంటూ కీర్తి పొందారు. ఆయన మరెవరో కాదు.. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి..’ సాక్షి,అమరావతి: అమెరికా.. ప్రపంచంలోనే అగ్రరాజ్యం. అక్కడ అడుగు పెట్టాలంటేనే ఎంతో కష్టం. కానీ, ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన యువకుడు మూడు దశాబ్దాల కిందటే అమెరికాలో ఆస్పత్రి కట్టాడు. అప్పటి వరకు ఏ తెలుగువాడికి కూడా ఇంత సాహసం చేయలేదు. అనతి కాలంలోనే ప్రైమ్ హెల్త్‌కేర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. అప్పటి నుంచి ప్రేమ్ అమెరికాకు హృదయ స్పందనగా మారిపోయారు. డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి విద్యుత్ సౌకర్యం కూడా లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకుని వైద్య రంగంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం నిడిగుంటపాళెం అనే ఒక చిన్న గ్రామంలో 1949లో జూన్ 26న ననమాల సుందరామిరెడ్డి, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించారు. నలుగురు సంతానంలో ప్రేమ్ పెద్దవారు. గ్రామంలోనే హైసూ్కల్ వరకు చదువుకున్నారు. విజయవాడలో పీయూసీ, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీలో చేరి 1973లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. వెల్లూరులో హౌస్ సర్జన్ అయ్యాక అమెరికా వెళ్లి న్యూయార్క్‌లోని డౌన్ స్టేట్ మెడికల్ సెంటర్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో రెసిడెన్సీతో పాటు కార్డియాలజీలో ఫెలోషిప్ పూర్తి చేశారు. 1981లో సదరన్ కాలిఫోర్నియాలో మెడికల్ ప్రాక్టీస్ ప్రారంభించారు. అయిదు వేలకుపైగా కార్డియాక్ ప్రొసీజర్స్ చేసి సమర్థుడైన వైద్యుడిగా పేరు తెచ్చుకున్నారు. 1985లో కాలిఫోరి్నయాలోనే ‘ప్రైమ్ కేర్ మెడికల్ గ్రూప్స్’ పేరుతో మల్టీస్పెషాలిటీ మెడికల్ గ్రూప్ ప్రారంభించారు. 1990లో ప్రేమ్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ఇంటర్నేషన్ల్ సంస్థను స్థాపించి వైద్య అవసరాలకు అనుగుణంగా విస్తరించారు. ఇందులో భాగంగానే చినోవ్యాలీలో 126 పడకల చినోవ్యాలి మెడికల్ సెంటర్‌ను, కాలిఫోర్నియాలో సొంతంగా 150 పడకల అక్యూట్ కేర్ హాస్పిటల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రైమ్ హెల్త్‌కేర్ ఆధ్వర్యంలో అమెరికాలోని 14 రాష్ట్రాల్లో 46 ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. 45 వేల మందికిపైగా యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. యూఎస్‌లో అగ్ర వైద్య వ్యవస్థల్లో ఏడాదికి 5 బిలియన్ల డాలర్ల టర్నోవర్‌తో టాప్ 5 స్థానంలో ప్రైమ్ కేర్ గుర్తింపు పొందింది. చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా స్థాపించి విద్యార్థులకు స్కాలర్షిప్లు, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. అమెరికాలోని అనేక స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, స్థానిక ప్రభుత్వం నుంచి అనేక ఉత్తమ సేవా అవార్డులు అందుకున్నారు. సాహితీ సేవలోనూ.. సాహిత్యం అంటే ప్రేమ్‌రెడ్డికి చాలా ఇష్టం. దువ్వూరి రామిరెడ్డి రచించిన గులాబీ తోట, పండ్లతోట అనే ముద్రణకు నోచుకోని రెండు కావ్యాలను సొంతంగా ముద్రించారు. కడపటి వీడ్కోలు కావ్యాన్ని ఇంగ్లిష్‌లో అనువాదం కూడా చేశారు. ఆయని ఇతర రచనలను ద లాస్ట్ ఫేర్వెల్ అండ్ అదర్ పోయెమ్స్ పేరుతో పెద్ద సంపుటిగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇదీ కుటుంబం.. ప్రేమ్ ఎస్.రెడ్డి తనతోపాటు మెడిసిన్‌ను అభ్యసించిన అమ్మాయినే (శాంతిరెడ్డి) వివాహం చేసుకుని జంటగా అమెరికాలో అడుపెట్టారు. ప్రేమ్‌రెడ్డికి ముగ్గురు సంతానం. పెద్దమ్మాయి కవితారెడ్డి అమెరికాలోని పిడియాట్రిక్స్ పూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. రెండో అబ్బాయి అశోక్‌రెడ్డి వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. మూడో సంతానం సునీతారెడ్డి. నేడు ప్రేమ్‌కు పౌర సన్మానం ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు నెల్లూరులో ప్రేమ్‌సాగర్‌రెడ్డికి పౌర సన్మానం చేయనున్నారు. 15 ఏళ్ల తర్వాత సొంత గడ్డకు వస్తున్న నేపథ్యంలో సోమవారం గొలగమూడి రోడ్డులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 4 గంటలకు వేలాది మంది మధ్య ఘనంగా సత్కరించనున్నారు. సొంతూరిని మర్చిపోలేదు ప్రేమ్ ఎస్.రెడ్డి ఎంత ఎదిగినా.. వచ్చిన దారిని మర్చిపోలేదు. అందుకే తన సొంత గ్రామంలో హైసూ్కల్‌ను కట్టించడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేస్తూ ప్రేమను చాటుకుంటున్నారు. దాదాపు 50 చుట్టుపక్కల గ్రామాలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాల్లోని గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కరోనా సమయంలో రూ.కోట్ల విలువైన ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి తన బాధ్యతను చాటుకున్నారు. సంపాదించినదంతా సమాజానికే.. ‘నేనెప్పుడూ పేరు కోసమో, ప్రచారం కోసమో పనిచేయలేదు... సంపాదించినదంతా సమాజానిదే.. అందుకే సమాజసేవకే దానిని ఉపయోగించాలి. ఇక్కడ సంపాదించిన దానిని ఇక్కడే సమాజసేవకు ఉపయోగిస్తున్నాను. జన్మనిచ్చినందుకు మాతృభూమికి కూడా సేవ చేస్తున్నాను‘.. అంటారు డాక్టర్ ప్రేమ సాగర్‌రెడ్డి. -
గతవారం బిజినెస్
నియామకాలు ఐటీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ)గా సంజీవ్ పురి నియమితులయ్యారు. ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్ దేశీ ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) టాప్ ఎంప్లాయర్‌గా నిలిచింది. ఇందులో 3.62 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రకారం.. జూన్ నెల చివరకు.. టీసీఎస్‌లో 3.62 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇన్ఫోసిస్, విప్రోలలో వరుసగా 1.97 లక్షలు, 1.73 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక టాప్-10లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్, ఇంటెలిజెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజీస్ వంటి సంస్థలున్నాయి. భారత్‌లోకి అమెజాన్ సర్వీస్ ‘ప్రైమ్’ ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి పలు ఈ-కామర్స్ ప్రత్యర్థి కంపెనీలను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఆన్లైన్ రిటైల్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’ తాజాగా తన ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్స్‌ను (ప్రైమ్ యూజర్లు) ఉచితంగా 1, 2 రోజుల్లోనే డెలివరీ పొందొచ్చు. కాగా ఈ సర్వీసులు అన్ని వస్తువులకు వర్తించదు. ఈ వెసులుబాటు ఉన్న ప్రొడక్ట్స్‌పై ప్రై మ్ లోగో కనిపిస్తుంది. ఇక ఈ సౌకర్యం దాదాపు 100 పట్టణాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఫోర్బ్స్ ‘సూపర్-50’లో టీసీఎస్, ఇన్ఫీ ఫోర్బ్స్ ఇండియా తాజా ‘సూపర్-50’ జాబితాలో పలు సాఫ్ట్వేర్, ఫార్మా, బ్యాంకింగ్ దిగ్గజాలు స్థానం పొందాయి. ఐటీ కంపెనీల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఫార్మా సంస్థల్లో సన్ ఫార్మా, లుపిన్.. ప్రై వేట్ బ్యాంకుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు జాబితాలో ఉన్నాయి. తాజా జాబితాలో టాటా మోటార్స్, హెచ్‌యూఎల్, ఎంఆర్ఎఫ్, గ్లాక్సోస్మిత్‌క్లిన్ న్సూమర్ హెల్త్‌కేర్, ఫైజర్, డా.రెడ్డీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి సంస్థలు స్థానం కోల్పోయాయి. రూ.59,547 కోట్ల రుణాలు రద్దు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్బీ) 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.59,547 కోట్లమేర రుణాల్ని రద్దు చేశాయని కేంద్రం తెలిపింది. వీటిల్లో ఎస్బీఐ రూ.15,763 కోట్ల రుణాల్ని రద్దు చేసిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ పేర్కొన్నారు. ఇక పీఎన్బీ రూ.7,340 కోట్ల రుణాల్ని, ఐడీబీఐ రూ.5,459 కోట్ల రుణాల్ని, కెనరా బ్యాంక్ రూ.3,387 కోట్ల రుణాల్ని రద్దు చేశాయని తెలిపారు. 5 కోట్లకు చేరువలో ఎంఎఫ్ ఖాతాలు దేశంలో మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఇన్వెస్టర్ ఖాతాలు 5 కోట్లకు చేరువలో ఉన్నాయి. జూన్ త్రైమాసికం చివరకి ఎంఎఫ్ ఖాతాల సంఖ్య కొత్తగా 12.61 లక్షలు పెరిగింది. దీంతో మొత్తం ఖాతాల సంఖ్య 4.89 కోట్లకు ఎగసింది. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ సమాఖ్య యాంఫీ వెల్లడించింది. మొత్తం ఎంఎఫ్ ఖాతాల్లో 95 శాతం వాటాను ఆక్రమించిన రిటైల్ ఖాతాలు వరుసగా ఏడవ త్రైమాసికంలోనూ పెరుగుతూ వచ్చాయి. ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువు పొడిగింపు కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ దాఖలు గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగించింది. పన్ను చెల్లింపుదారులు 2015-16 (2016-17 అసెస్మెంట్ ఏడాది)కు సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్‌ను జూలై 31 లోగా దాఖలు చేయాలి. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఒక రోజు సమ్మె కారణంగా ట్యాక్స్ రిటర్న్స్ గడువును ఆగస్ట్ 5 వరకు పొడిగిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్‌లో పన్ను చెల్లింపుదారులు వారి ట్యాక్స్ రిటర్న్స్‌ను ఆగస్ట్ 31 వరకు దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. విశాఖలో హిందుజా విద్యుదుత్పత్తి హిందుజా గ్రూపునకు చెందిన హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలోని విశాఖపట్నంలో నెలకొల్పిన బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్‌లో గత సోమవారం నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. ఒక్కోటీ 520 మెగావాట్ల సామర్థ్యంతో హిందుజా ఇక్కడ రెండు యూనిట్లను ఏర్పాటు చేసింది. మెర్సిడెస్ నుంచి‘ ఏఎంజీ-43’ మోడల్ మెర్సిడెస్’ తాజాగా ‘ఏఎంజీ ఎస్ఎల్సీ 43’ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకువ చ్చింది. దీని ధర రూ.77.5 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ). ఈ టూ సీట్స్ టాప్‌లెస్ కారులో 3.0 లీటర్ 6 సిలిండర్ ట్విన్ టర్బో ఇంజిన్, 9 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, అత్యాధునిక ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 4.7 సెకన్లలో అందుకుంటుందని పేర్కొంది. బెజోస్ ముందుకు.. బఫెట్ వెనక్కు.. అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ తాజాగా బార్క్‌షైర్ హాత్వే చైర్మన్ వారెన్ బఫెట్‌ను వెనక్కు నెట్టారు. దీంతో బెజోస్ ప్రపంచపు మూడవ అత్యంత సంపన్నుడిగా అవతరించారు. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత బెజోస్ సంపద విలువ 65.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో బఫెట్ సంపద విలువ 64.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ అంశాలను ఫోర్బ్స్ రియల్ టైమ్ వెల్త్ ట్రాకర్ వెల్లడించింది. ఇక ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా 78 బిలియన్ డాలర్ల సంపదతో బిల్ గేట్స్ కొనసాగుతున్నారు. డీల్స్.. ⇒ యాహూ కంపెనీని కొనుగోలు చేసేందుకు వెరిజాన్ కమ్యూనికేషన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం దాదాపు 4.83 బిలియన్ డాలర్లు (సుమారు రూ.32,500 కోట్లు) చెల్లిస్తోంది. కొనుగోలు తర్వాత యాహూ సేవలన్నింటినీ తన అనుబంధ సంస్థ ఏఓఎల్‌తో (అమెరికా ఆన్లైన్) అనుసంధానించనున్నట్లు వెరిజాన్ వెల్లడించింది. ⇒ ఆన్లైన్ ఫ్యాషన్ రిటైల్ స్టోర్ జాబాంగ్ను చేజిక్కించు కుంటున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. తమ అనుబంధ సంస్థ మింత్రా ద్వారా ఈ కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. జబాంగ్ను నిర్వహిస్తున్న గ్లోబల్ ఫ్యాషన్ గ్రూప్(జీఎఫ్జీ)తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. పూర్తిగా నగదు రూపంలో జరిగే ఈ డీల్ విలువ 7 కోట్ల డాలర్లు(దాదాపు రూ.470 కోట్లు). ⇒ చైనీస్ హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లాఇకో అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీ ‘విజియో’ను 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ⇒ హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మాను 1.26 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8,500 కోట్లు) కొనుగోలు చేసేందుకు చైనా కంపెనీ షాంఘై ఫోసన్ ఫార్మాస్యూటికల్ అంగీకరించింది. ఈ డీల్ కింద ఫోసన్ ఫార్మా 86 శాతం వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు గ్లాండ్ ఫార్మా వెల్లడించింది. ⇒ ఎల్ఐసీ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టింది. ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఎంఓయూ ప్రకారం.. ఇకపై యాక్సిస్ బ్యాంక్ తన బ్రాంచీల్లో ఎల్ఐసీ బీమా పాలసీలను విక్రయిస్తుంది. ⇒ ఈ-క్లాసిఫైడ్ సంస్థ క్వికర్, ఆన్లైన్ హైరింగ్ ప్లాట్ఫార్మ్ హైరీని కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ⇒ సాఫ్ట్వేర్ సేవల దిగ్గజ కంపెనీ కాగ్నిజంట్ అమెరికాకు చెందిన ఐడియా కూషర్ కంపెనీని కొనుగోలు చేసింది. -
భారత్‌లోకి అమెజాన్ ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’
1, 2 రోజుల్లోనే వస్తువుల కచ్చిత డెలివరీ న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి పలు ఈ-కామర్స్ ప్రత్యర్థి కంపెనీలను ధీటుగా ఎదుర్కోవడమే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఆన్లైన్ రిటైల్ దిగ్గజ కంపెనీ ‘అమెజాన్’ తాజాగా తన ప్రీమియం సర్వీస్ ‘ప్రైమ్’ను భారత్‌లో ప్రవేశపెట్టింది. ఇందులో ఆర్డర్ ఇచ్చిన ప్రొడక్ట్స్‌ను (ప్రైమ్ యూజర్లు) ఉచితంగా 1, 2 రోజుల్లోనే డెలివరీ పొందొచ్చు. కాగా ఈ సర్వీసులు అన్ని వస్తువులకు వర్తించదు. ఈ వెసులుబాటు ఉన్న ప్రొడక్ట్స్‌పై ప్రైమ్ లోగో కనిపిస్తుంది. ఇక ఈ సౌకర్యం దాదాపు 100 పట్టణాల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. ఈ సేవలకు మినిమమ్ ఆర్డర్ అంటూ ఎలాంటి షరతులు ఉండవు. అలాగే ప్రైమ్ సభ్యులు వివిధ ఆఫర్లు, డిస్కౌంట్లు సహా పలు ఎక్స్‌క్లూజివ్ డీల్స్ వివరాలను ఇతరుల కన్నా ముందే (30 నిమిషాలు) తెలుసుకోవచ్చు. ప్రైమ్ యూజర్లు 1,2 రోజుల డెలివరీతోపాటు స్వల్ప అదనపు చార్జీలతో (ఆర్డర్‌కు రూ.50లు) అదే రోజు, షెడ్యూల్ డెలివరీ వంటి సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. ఈ సేవలు హైదరాబాద్, బెంగళూరు వంటి 20 పట్టణాల్లో అందుబాటులో ఉంటాయి. కాగా అమెజాన్ ప్రైమ్ సర్వీసులు.. ఫ్లిప్‌కార్ట్ ‘ఫ్లిప్‌కార్ట్ ఫస్ట్’ సేవలకు గట్టి పోటీనివ్వనున్నది. ప్రైమ్ సేవలు 60 రోజలు ఉచితం ఇండియన్ ఆన్లైన్ షాపర్స్ తాజా ప్రైమ్ సేవలను ట్రయల్ బేసిస్ పైన 60 రోజులు వరకు ఉచితంగా పొందొచ్చని సంస్థ తెలిపింది. తర్వాత ప్రైమ్ సేవలను అలాగే పొందాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలని పేర్కొంది. దీని ధర రూ.499 (వార్షిక ఫీజు)గా నిర్ణయించామని తెలిపింది. త్వరలో ప్రైమ్ వీడియో సర్వీసులను కూడా దేశంలో ప్రారంభిస్తామని వెల్లడించింది. -
ప్రధాని దిష్టిబొమ్మ దహనం
ఇల్లంతకుంట : బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్‌సింగ్ వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీఎస్పీ నాయకులు శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ప్రధాని నరేంద్రమోడీ, దయాశంకర్‌సింగ్ దిష్టిబొమ్మలను దగ్దం చేశారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ శంకర్‌సింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీకి ఉన్న ఆదరణను ఓర్వలేకనే బీజేపీ నేతలు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కొంపెల్లి పర్శరాం, దేవరాజు, పెద్దొళ్ల శ్రీనివాస్, రవి, బాల్‌రాజు, శ్రీనివాస్, లింగాల శ్రీనివాస్, దేవయ్య పాల్గొన్నారు. -
ది ప్రైమ్ టైమ్ షో 20th Oct 2013
-
ది ప్రైమ్‌టైమ్ షో 15th Oct 2013
-
ది ప్రైమ్‌టైమ్ షో 13th Oct 2013
-
ది ప్రైమ్ టైమ్ షో 12th Oct 2013
-
The Prime Time Show 29th Sept 2013
-
The Primetime Show 9th Sep 2013
-
The Prime Time Show 7th Sept 2013