private clinics
-
పల్లె నాడి పట్టని డాక్టర్
సాక్షి, హైదరాబాద్: నగరాలకు సమీపంలోని ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో అనేకచోట్ల పూర్తిస్థాయిలో వైద్యులు, ఇతర సిబ్బంది ఉంటున్నారు. కానీ సుదూర ప్రాంతాల్లోని అవే కేటగిరీ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత భారీగా ఉంది. హైదరాబాద్ సమీపంలో పనిచేసే వారంతా సొంత క్లినిక్‌లు లేదా కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఉన్నవారు కూడా హైదరాబాద్‌లోనో ఇతర నగరాల్లోనో ఉంటూ అప్పుడప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వస్తున్నారు. డాక్టర్ కృష్ణమోహన్ (పేరు మార్చాం) సూర్యాపేట జిల్లాలోని ఓ పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లో ఉంటూ అప్పుడప్పుడూ వెళ్లి వస్తుంటారు. వారానికి రెండుసార్లకు మించి వెళ్లరు. హైదరాబాద్‌లో క్లినిక్ నడుపుతున్నందున దీనిపైనే దృష్టి అంతా. దీంతో ఆ పీహెచ్సీ పరిధిలోని రోగులు ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. 90 శాతం మంది అంతే.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వారిలో 90 శాతం మంది వైద్యులు ఇతర ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. 40 శాతం మంది వైద్య సిబ్బంది విధులకు గైర్హాజరు అవుతున్నారని, సమయ పాలన లేకుండా డ్యూటీలకు హాజరవుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటీవల నిర్వహించిన సమీక్షలో జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. అంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు సుదూర ప్రాంతాల్లో ఉండటంతో రోగులకు అవసరమైనప్పుడు వైద్య సేవలు అందట్లేదు. ఒకవేళ డాక్టర్లకు ఇష్టం కాని ప్రాంతాలకు పోస్టింగ్ ఇస్తే అంతే సంగతులు.. దీర్ఘకాలిక సెలవులపై వెళ్తున్నారు. విచిత్రమేంటంటే గతేడాది వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల కోసం 919 మంది స్పెషలిస్టు వైద్యుల పోస్టులను భర్తీ చేస్తే, తమకు ఇష్టమైన చోట పోస్టింగ్ ఇవ్వలేదని ఏకంగా 200 మంది తమ ఉద్యోగాలను వదిలేసుకున్నారు. ఆ తర్వాత 90 మంది స్పెషలిస్టులు సమాచారం లేకుండా గైర్హాజరవుతున్నారని షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అయినా మార్పు లేకపోవడంతో వారిని విధుల నుంచి తొలగించారు. పేరుకుపోయిన ఖాళీలు.. రాష్ట్రంలో 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) ఉన్నాయి. 30 నుంచి 40 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ) 41 ఉన్నాయి. అలాగే ఏరియా ఆసుపత్రులు, జిల్లా కేంద్ర ఆసుపత్రులు, బోధనాసుపత్రులు ఉన్నాయి. పీహెచ్‌సీలకు మంజూరైన పోస్టులకు, వాస్తవంగా పనిచేస్తున్న సిబ్బందికి మధ్య తేడా కనిపిస్తోంది. ఒక్కో పీహెచ్‌సీకి ఒక మెడికల్ ఆఫీసర్, ఒక స్టాఫ్ నర్సు సహా ఇతర పారామెడికల్ సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది ఉండాలి. 24 గంటలు పనిచేసే పీహెచ్‌సీల్లో ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు సహా ఇతర పారామెడికల్ సిబ్బందితో కలిపి 12 మంది ఉండాలి. ఇక 30–40 పడకలున్న సీహెచ్‌సీల్లో ఒక సూపరింటెండెంట్, ముగ్గురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఆరుగురు స్టాఫ్ నర్సులు సహా మొత్తం 14 మంది ఉండాలి. ఏరియా ఆస్పత్రుల్లో గైనిక్, పీడియాట్రిక్, జనరల్ సర్జన్, అనస్థీషియా స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉండాలి. జిల్లా ఆస్పత్రుల్లో దాదాపు అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలు ఉండాలి. కానీ ఖాళీలు మాత్రం చాలా ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు మొత్తం కలిపి 26,404 మంది ఉండాలి. అందులో 17,148 మంది పనిచేస్తుండగా.. 9,256 ఖాళీలున్నాయి. అందులో వైద్య ఖాళీలే ఏకంగా 4,201 ఉండటం గమనార్హం. అందులో వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో 4,500 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, 2,100 మంది మాత్రమే ఉన్నారు. 2,400 ఖాళీలు ఉండటం గమనార్హం. ఈస్థాయిలో ఖాళీలు ఏర్పడటంతో ఎక్కడికక్కడ వైద్య సిబ్బంది కొరత రోగులపాలిట శాపంగా మారింది. సర్కారు వర్సెస్ వైద్యాధికారులు.. ఖాళీలను ఇప్పటికిప్పుడు నింపే పరిస్థితి లేదు. కాబట్టి ఉన్న వైద్యులను, ఇతర వైద్య సిబ్బందిని సర్దుబాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల పదేపదే చెబుతున్నారు. హేతుబద్ధీకరించడం ద్వారా వైద్యుల కొరతను తాత్కాలిక తీర్చొచ్చని ఉన్నతాధికారులను ఆదేశించారు. పీహెచ్సీ, సీహెచ్‌సీలకు నిబంధనల ప్రకారం 1512 స్టాఫ్ నర్సులు కావాలి. కానీ 1276 మాత్రమే ఉన్నారు. ఇంకా 236 మంది స్టాఫ్‌నర్సుల కొరత ఉంది. వారిలో కొందరిని అవసరం లేని చోట నుంచి అవసరమున్న చోటకు తరలించాలని ఆదేశించారు. అయితే హేతుబద్ధీకరణకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. మంత్రి ఆదేశాలను అమలు చేయాల్సిన వైద్యాధికారులే అడ్డంకులు సృష్టిస్తున్నారు. ‘ప్రైవేటు ప్రాక్టీస్ అలవెన్స్ 20 శాతం వరకు ఇస్తే, అప్పుడు వైద్యులను ఒప్పించడానికి వీలుంటుందని’ఓ కీలక వైద్యాధికారి వ్యాఖ్యానించారు. ఎంబీబీఎస్ డాక్టర్లే పరిష్కారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రుల్లో ఎలాగూ స్పెషలిస్టులు పని చేయడానికి ముందుకు రావట్లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పేద ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ఎంబీబీఎస్ డాక్లర్లను నియమిస్తే బాగుంటుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. జ్వరం, కడుపునొప్పి, విరేచనాలు వంటి చిన్న చిన్న జబ్బుల చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్తులకు వెళ్లాల్సి వస్తోందని, దీన్ని నివారించేందుకు ఎంబీబీఎస్ డాక్టర్ల నియామకం అత్యవసరమని అభిప్రాయపడ్డారు. ఎంతో మంది ఎంబీబీఎస్ వైద్యులు తక్కువ వేతనాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తున్నారని, వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ప్రజలకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్లే పరిస్థితి లేదు: డాక్టర్ రమేశ్‌రెడ్డి, వైద్య విద్య డైరెక్టర్ వైద్యుల హేతుబద్ధీకరణ నిర్ణయం మంచిదే. కానీ స్పెషలిస్టు వైద్యులు తమకు నచ్చని చోటకు బదిలీ చేస్తే వెళ్లడానికి ముందుకు రావట్లేదు. అవసరమైతే తమ ఉద్యోగాలను వదిలేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సర్దుబాటు చేయడం అంత సులువైన వ్యవహారం కాదు. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేయాలి. వైద్యులతో మాట్లాడి కౌన్సిలింగ్ చేసి వారిని ఒప్పించి పంపాలి. ఒత్తిడి చేస్తే వెళ్లే పరిస్థితి ఉండట్లేదు. ఎందుకంటే సొంత ప్రాక్టీసు వారికి ముఖ్యం. ఆ ధీమాతోనే వారు ఎక్కడికీ వెళ్లట్లేదు. -
పెళ్లి కాకుండానే గర్భందాల్చిన యువతికి అబార్షన్..
షాద్‌నగర్‌టౌన్: పెళ్లి కాకుండానే గర్భందాల్చిన ఓ యువతికి ప్రైవేటు క్లినిక్‌లో వైద్యుడు అబార్షన్ చేసిన సంఘటన గురువారం ఉదయం షాద్‌నగర్ పట్టణంలో వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన యువకుడు, కేశంపేటకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. అయితే యువతి పెళ్లికాకుండానే గర్భం దాల్చడంతో యువతి కుటుంబ సభ్యులు, ప్రియుడు షాద్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న సాయిమైత్రి పాలీ క్లినిక్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డిని ఆశ్రయించారు. గర్భందాల్చి మూడు నెలలు కావొస్తుందని, వెంటనే అబార్షన్ చేయాలని వైద్యుడు సూచించాడు. బుధవారం రాత్రి క్లినిక్‌లో నిబంధనలకువిరుద్ధంగా అబార్షన్ చేసిన సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్, హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాసులు క్లినిక్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. అయితే అప్పటికి క్లినిక్‌లో డాక్టర్, ఆపరేషన్ చేయించుకున్న యువతి, వారి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం గమనార్హం. క్లినిక్ నిర్వాహకులు, నర్సుల నుంచి అధికారులు వివరాలు సేకరించారు. సమగ్ర విచారణ చేపడుతాం:చందునాయక్ సాయి మైత్రి పాలీ క్లినిక్‌లో యువతికి అబార్షన్ చేసిన ఘటనపై సమగ్ర విచారణ చేపడుతామని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ చందు నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన క్లినిక్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. నిబంధనలకు ఉల్లంఘించిన వైద్యుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యుడు శ్రీనివాస్‌రెడ్డి యువతికి అబార్షన్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. సాయి మిత్ర క్లినిక్ నిర్వహించేందుకు కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, గత రెండు నెలల క్రితం తనిఖీల చేసి క్లినిక్ నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. -
డబ్బు జబ్బు..!
వైద్య పరీక్ష... ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు కొలమానం. లోపాలను నిర్ధారించేందుకు ఆధారం. ల్యాబ్‌లో ఇచ్చిన నివేదిక అనుగుణంగా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. అవే... నివేదికలు తప్పుడువైతే.. ఇక అంతే. ఎన్నిసార్లు పరీక్షలు చేయించుకున్నా.. ఎన్ని మందులు మింగినా, ఎంత డబ్బు ఖర్చయినా వ్యాధులు నయంకావు. ఇల్లుగుల్లకావడమే తప్ప ఆరోగ్యం కుదుటపడదు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఇదే పరిస్థితినెలకొంది. అనుమతులు లేని ల్యాబ్‌లు, క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. తప్పుడు నివేదికలతో బెంబేలెత్తిస్తున్నాయి. పరీక్షల పేరిట డబ్బులు దోచేస్తున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. విజయనగరం ఫోర్ట్: ‘గంట్యాడ మండలానికి చెందిన ఎస్. శ్రీను అనే వ్యక్తి కొద్ది రోజుల కిందట జ్వరం రావడంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన వెంటనే అతనిని పరీక్షించిన వైద్యులు వైద్య పరీక్షలకు రిఫర్ చేశారు. అక్కడే ఉన్న ల్యాబ్‌లో అతను పరీక్షలు చేయించుకోగా రూ.1000 తీసుకున్నారు. మందులు, ఫీజు నిమత్తం మరో రూ.1200 వరకు ఖర్చ యింది. జ్వరం మాత్రం తగ్గలేదు. మరో ఆస్పత్రికి వెళ్తే నివేదికలు తప్పు అని సెలవివ్వడంతో నిశ్చేస్టుడయ్యాడు’. ‘విజయనగరం మండలానికి చెందిన ఎస్. శంకర్ అనే యువకుడు కొద్ది రోజుల కిందట జ్వరం రావడంతో విజయనగరం పట్టణంలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు పరీక్షించగానే వైద్య పరీక్షలు రాసి అక్కడే ఉన్న ల్యాబ్‌లో చేయించుకోమని సెలవిచ్చాడు. రక్త పరీక్షల కోసం రూ.1200 వసూలు చేశారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉందంటూ అదే ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేర్చుకున్నారు. మూడు రోజులకు రూ.15 వేలు వసూలు చేశారు.’ ఇది ఒక్క వీరి పరిస్థితే కాదు. జిల్లాలో అనేక మందిది. రోగులు ఆర్థికదోపిడీకి గురవుతున్నారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ లేని ల్యాబ్‌లలో విద్యార్హతలు లేనివారుపరీక్షలు నిర్వహించి నివేదికలు ఇచ్చేస్తున్నారు. వైద్యులు సైతం వాటినే కొలమానంగా తీసుకుని మందులు రాసేస్తున్నారు. మరిన్ని పరీక్షలు రాసే స్తున్నారు. ప్లేట్లెట్స్ తగ్గాయని, ఆరో గ్యం విషమంగా ఉందంటూ కొందరు భయపెడుతున్నారు. డబ్బుకోసమే వైద్యం అన్న ధోరణితో దోపీడీ చేస్తున్నారని రోగులు చెబుతున్నారు. ఒంటిలో నలతగా ఉందని చెప్పినా అరవైఆరు పరీక్షలు రాసేస్తున్నారని, శరీరంలో ఉన్న రక్తాన్ని కాస్త పరీక్షల కోసం సూదులుతో లాగేస్తున్నారంటూ వాపోతున్నారు. పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న క్లినిక్‌లు, ల్యాబ్‌లు.. జిల్లాలో ప్రభుత్వ అనుమతి ఉన్న ల్యాబ్‌లు 38 మాత్రమే. వాస్తంగా అయితే జిల్లాలో 150 వరకు ల్యాబ్‌లు ఉన్నాయి. జిల్లాలో ప్రైవేటు క్లినిక్‌లు 200 వరకు ఉన్నాయి. వీటిలో అనుమతి ఉన్నవి కేవం 120 మాత్రమే. రిజిస్ట్రేషన్ లేకుండా క్లినిక్‌లు, ల్యాబ్‌లు చాలా మంది నిర్వహిస్తున్నారు. రోగులకు అవసరం లేకున్నా వైద్యపరీక్షలు రాసేసి దోచుకుంటున్నారు. సాధారణ జ్వరాలకు సైతం రూ. 5 వేలు నుంచి రూ.10 వేలు వరకు దోచుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒక్కో పరీక్షకు ప్రైవేటు ల్యాబ్‌లో రూ.200 నుంచి రూ.600 వరకు వసూలు చేస్తుండగా, కొన్ని పరీక్షలకు రూ.1000 నుంచి రూ.1200 వరకు తీసుకుంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలుతీసుకుంటాం ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాబ్‌లు, క్లినిక్‌లు నిర్వహించకూడదు. వైద్య ఆరోగ్య శాఖ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. అనుమతి లేకుండా ఎటువంటి బోర్డులు కూడా పెట్టకూడదు. ఎవరైనా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.– డాక్టర్ వరాల వెంకటరావు,డీఎంహెచ్ఓ -
ప్రకాశం రిమ్స్‌లో ప్రైవేటు దందా
-
ప్రై'వేటు' ప్రాక్టీసులకు ఇక చెక్
► ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ప్రభుత్వ వైద్యులపై వేటుకు రంగం సిద్ధం ► నోటీసులిస్తామన్న మంత్రి కామినేని ప్రకటనతో డాక్టర్ల షాక్ ► వైద్యరంగంలో కలకలం సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్న ప్రభుత్వ వైద్యులకు నోటీసులిస్తున్నాం. మొత్తం 600 మందిని గుర్తించి వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశా’ మన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటన జిల్లా వైద్యరంగంలో కలకలం రేపుతోంది. ఒంగోలు రిమ్స్‌తో పాటు పలు ఏరియూ వైద్యశాలలు, పీహెచ్‌సీల్లో పనిచేస్తూనే ప్రైవేటుగా ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు, ఏకంగా నర్సింగ్‌హోంలు నిర్వహిస్తున్న వైద్యులను షాక్‌కు గురిచేసింది. ప్రధానంగా ప్రభుత్వ ఆస్పత్రుల పనివేళల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ చేస్తున్న వారిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానిలో భాగంగా గతంలో సిద్ధం చేసిన నివేదికకు ఇప్పుడు బూజుదులిపి బయటకు తీసినట్లు తెలుస్తోంది. జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైద్యవర్గాల్లో అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. నివేదికలో రిమ్స్ వైద్యులే అధికం... రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న నివేదికలో మన జిల్లాకు సంబంధించి ఒంగోలు రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులే అధికంగా ఉన్నట్లు సమాచారం. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉంటామని సర్వీసులో చేరేముందు వైద్యులంతా అంగీకరించారు. ఆ మేరకు వారి నుంచి ప్రభుత్వం అంగీకారపత్రం తీసుకుంది. అరుుతే, అందుకు విరుద్ధంగా ప్రభుత్వాస్పత్రుల పనివేళల్లో కూడా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం ఏడాది క్రితమే నిఘా పెట్టింటి. నివేదిక తయారుచేసి వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్యకు అందజేసింది. దాని ఆధారంగానే ఇప్పుడు వైద్యారోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులకు రంగం సిద్ధం... ప్రభుత్వాస్పత్రుల పనివేళల్లో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్న వారందరికీ జిల్లా కలెక్టర్ ద్వారా షోకాజ్ నోటీసులివ్వడానికి రంగం సిద్ధం చేశారు. అలాగే ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తూనే నర్సింగ్ హోమ్‌లు నిర్వహిస్తున్న వైద్యుల వివరాలను, ప్రభుత్వాస్పత్రుల్లో విధులు నిర్వహించకుండా ఆరు నెలలకుపైగా సెలవులో ఉన్న వైద్యుల జాబితాను కూడా రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. పీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల పరిధిలో పనిచేసే వైద్యుల వరకూ ఈ జాబితా పరిధిలోకి తెచ్చారు. మంత్రి తీరుపై వైద్యుల విమర్శలు... ప్రభుత్వాస్పత్రుల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో విఫలమైన మంత్రి కామినేని శ్రీనివాస్.. తన పదవిని కాపాడుకోవడం కోసం హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ వైద్యులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రి పనివేళల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేయరాదన్న నిబంధనను తామంతా స్వాగతిస్తున్నామని, కానీ, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రైవేటు ప్రాక్టీసుకు అనుమతి ఉందని అంటున్నారు. ఇదే విధానం అమలుచేయాలని చూస్తే రిమ్స్‌లో స్పెషలిస్టులెవరూ ఉండే అవకాశం లేదంటున్నారు. రిమ్స్‌లో స్పెషలైజేషన్ చేసిన వారికి ఇస్తున్న వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రైవేటు ప్రాక్టీస్ కూడా లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి చదివి వచ్చినవారు తక్కువ జీతానికి పనిచేయరన్న వాదన వినిపిస్తోంది. వైద్యులకు నోటీసులు జారీ అయితే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే అంశంపై అప్పుడే చర్చించుకుంటున్నారు. దీనిపై రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ రాజకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటిదాకా తమకు అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు అందలేదని తెలిపారు. ఇప్పటికే ఐదుగురు వైద్యులకు నోటీసులతో ఆందోళన... ఏపీ వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహిస్తున్న ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్న ఐదుగురు వైద్యులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో ఒకరు గుంటూరుకు బదిలీపై వెళ్లిపోవడంతో మిగిలిన నలుగురికి నోటీసులు అందించారు. ఈ నేపథ్యంలో రిమ్స్‌లో పనిచేస్తున్న వారికి కూడా నోటీసులు వస్తాయన్న ప్రచారం సాగుతోంది. రిమ్స్‌లో పనిచేస్తున్న వైద్యులంతా ఏదోక ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తుండటం, లేకుంటే సొంతంగా నర్సింగ్‌హోం నిర్వహిస్తుండటమే అందుకు కారణం.