private hostels
-
హైదరాబాద్‌లో వాటికి ఫుల్ డిమాండ్.. 30 శాతం వరకు పెరగనున్న చార్జీలు
సాక్షి, హైదరాబాద్: మహానగరంలోని ప్రైవేటు హాస్టల్స్‌కు తాకిడి పెరిగింది. సర్కారు జంబో కొలువుల భర్తీ ప్రకటనతో గ్రామీణ, పట్టణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు నగరానికి క్యూ కడుతున్నారు. దీంతో కోచింగ్ సెంటర్లు గల ప్రాంతాల్లోని హాస్టల్స్ గదులకు డిమాండ్ పెరిగింది. ఫలితంగా హాస్టల్స్ నిర్వాహకులు గదులు, మెస్ చార్జీలు కూడా 20 నుంచి 30 శాతం పెంచేస్తున్నారు. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే నిరుద్యోగ అభ్యర్థులు అద్దె గదుల కంటే హాస్టళ్లలో ఉండటానికి మొగ్గు చూపుతారు. (చదవండి: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే ) రెండువేలకు పైనే హైదరాబాద్ నగరంలో రెండున్నర వేలకు పైగా సాధారణ, లగ్జరీ, డీలక్స్ హాస్టళ్లున్నాయి. ఇందులో వసతి పొందేందుకు సౌకర్యాలకు తగట్టు నెలకు కనీసం రూ.5 వేల నుంచి రూ.12 వేల వరకు చార్జీలుంటాయి. కొన్ని హాస్టళ్లు విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలతో అనుసంధానంగా కూడా నడుస్తున్నాయి. హాస్టళ్లు కనీసం 50 మంది నుంచి 150 మందితో నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు , జవహర్‌నగర్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, హిమాయత్‌నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, సంజీవరెడ్డినగర్, ఎల్లారెడ్డిగూడ, వెంగళరావునగర్తో పాటు కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్పల్లి, గచ్చిబౌలి,మాదాపూర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లో హాస్టళ్లు ఉన్నాయి. గత రెండేళ్లుగా .. కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా ప్రైవేటు హాస్టల్స్ మూతపడ్డాయి. ఇటీవల థర్డ్‌వేవ్‌లో తెరుచుకున్నప్పటికి నిర్వహణ భారంగా తయారైంది. అద్దె చెల్లించలేక సగానికి పైగా ఖాళీఅయ్యాయి. దీంతో హాస్టల్ నిర్వాహకులు నష్టాల్లో మునిగిపోయాయి. కొందరు మాత్రం సగం అద్దె చెల్లిస్తూ నష్టాలను భరిస్తూ వచ్చారు. తాజాగా సర్కారు ఉద్యోగ ప్రకటనలు రానున్నడంతో తిరిగి హాస్టల్స్‌కు పాత కళ వస్తోంది. -
అనుమతి లేకున్నా కరోనా టెస్టులు!
సాక్షి, మంచిర్యాల: ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ముచేసుకుంటున్నాయి. తామూ చికిత్స చేస్తామంటూ వేలకు వేలు గుంజుతున్నాయి. కరోనా చికిత్స చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఒక్క ప్రైవేటు ఆస్పత్రికి మాత్రమే అనుమతి ఉండగా..మరో 10 ఆస్పత్రుల్లో అనధికారికంగా కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటిజెన్ రాపిడ్ టెస్టుల ద్వారా కరోనా పరీక్షలు చేసుకుని, చికిత్స కోసం అధికారికంగా సెలవులు తీసుకుంటున్నారు. ఇక వ్యాపారస్తులు, ఇతరులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిలబడి, కోవిడ్ పరీక్షలు చేసుకునే ఓపిక లేని వారు, పాజిటివ్ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచాలనుకునే వారు ప్రైవేటుకు వెళ్తున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఇప్పటికే రెండు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా టెస్టులు చేస్తామంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టి అనుమతి లేకుండానే టెస్టులు కూడా చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా ఉందని మందులు అందించిన రశీదు ఆర్టీ–పీసీఆర్ టెస్టుల పేరిట దోపిడీ జిల్లాలోని 17 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రితో పాటు, 4 అర్బన్ ఆస్పత్రుల్లో ప్రతీరోజు ర్యాపిడ్ టెస్టులు చేస్తున్నారు. సింగరేణి ఉద్యోగుల కోసం రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్‌లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో మాత్రమే ఆర్టీ–పీసీఆర్ పరీక్షల కోసం శాంపిళ్లు సేకరించి హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. జిల్లాలో మరే ఆస్పత్రికి ఈ టెస్టులు చేసేందుకు అనుమతులు లేవు. కాని ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తామంటూ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సమయంతో సహా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. టెస్టులు కూడా చేస్తూ వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు. టెస్టులు చేసేందుకు ప్రైవేటులో అనుమతులు లేకపోయినా వారి ఆధార్‌కార్డుతో పాటు, డాక్టర్ ప్రిస్కిప్షన్‌ను తీసుకుని రావాలని కండీషన్ పెడుతున్నారు. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్న యాంటిజెన్ ర్యాపిడ్ టెస్టు కిట్లను ఉపయోగించే, ఆర్టీ–పీసీఆర్ టెస్టుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టు చేసుకునేందుకు ఆధార్ నంబర్‌ను వేసి, వారి మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే వారి మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాని ఆధారంగానే ర్యాపిడ్ టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న వారివే కావడం, కోవిడ్‌కు సంబంధించిన ముఖ్యమైన స్థానాల్లో వారు విధులను నిర్వర్తిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న యాంటిజెన్ కిట్లు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. యాంటిజెన్ కిట్ల ద్వారా వంద శాతం కోవిడ్‌కు సంబంధించిన ఫలితం రాదనే విషయం ప్రభుత్వమే ప్రకటించింది. దీంతో ముందస్తుగా సిటీ స్కానింగ్ చేసి, అందులో వచ్చిన రిపోర్టును, యాంటిజెన్ టెస్టు కిట్ల ద్వారా వస్తున్న రిపోర్టుల ఆధారంగానే కోవిడ్ పాజిటివ్, నెగెటివ్ అనే వివరాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. రిపోర్టు ఏది వచ్చినా దోపిడే.. కరోనా భయంతో వచ్చే వారికి సిటీ స్కానింగ్, ఆర్టీ–పీసీఆర్ టెస్టుల పేరిట రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. పాజిటివ్‌గా వచ్చినా, నెగెటివ్ వచ్చినా కరోనా లక్షణాల పేరిట హోం క్వారంటైన్ కిట్‌ను రూ.10 వేలకు అందిస్తున్నారు. ఒకవేళ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలనుకునే వారికి రోజుకు రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. సిటీ స్కానింగ్, ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో వచ్చిన రిపోర్టులను సదరు బాధితులకు ఇవ్వకుండానే మీకు కరోనా ఉందని భయపెడుతున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఓ ఉన్నతాధికారి కరోనా భయంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు ఉన్నాయని.. పది రోజుల పాటు తప్పనిసరిగా మందులు వాడాలని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు సూచించారు. రెండు రోజులు వారి మందులు వాడాకా ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో సదరు వ్యక్తి అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టు చేసుకోగా నెగెటివ్ రావడంతో నిర్ఘాంతపోయాడు. ఎవరికీ అనుమతులు లేవు జిల్లాలోని ఏ ప్రైవేటు ఆసుపత్రికి కరోనా నిర్ధారణ చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. అలా పరీక్షలు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. కోవిడ్ 19 పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించేందుకు మాత్రమే ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుమతి ఉంది. అందులోనూ కోవిడ్ 19 టెస్టులు చేసేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. – డాక్టర్ నీరజ, జిల్లా వైద్యాధికారి -
గడ్డుకాలం... అద్దె భారం!
ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థుల కోసం వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి బీఎన్‌రెడ్డి నగర్లో ఓ హాస్టల్ ఏర్పాటు చేశాడు. మంచి భోజనం, వసతి ఉండటంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో సమీపంలోని మరో రెండుచోట్ల హాస్టళ్లను తెరిచాడు. మూడు హాస్టళ్లలో 320 మంది విద్యార్థులున్నారు. బోర్డర్స్‌ను ఆకర్షించేందుకు హైస్పీడ్ బ్రా డ్బ్యాండ్తో ఉచిత వైఫై, ఎమర్జెన్సీ రైడ్ కోసం 12 మోపెడ్లను ఉచిత సర్వీసు కిం ద ఇస్తున్నాడు. మూడుచోట్ల భవనాలు అద్దెకు తీసుకోగా ప్రతి నెలా రూ. 1.80 లక్షలు చెల్లిస్తున్నాడు. కరోనా దెబ్బకు ప్రస్తుతం ఈ మూడు హాస్టళ్లు మూతబడ్డా యి. ఫలితంగా భవనాల అద్దె భారం కాగా... ఇంటర్నెట్ బిల్, మోపెడ్ల నెలవా రీ ఇన్స్టాల్మెంట్ తడిసిమోపెడవుతోంది. దీంతో రెండుచోట్ల హాస్టల్ భవనాలను ఖాళీ చేశాడు. ఒక హాస్టల్ భవనానికి మాత్రం అప్పు చేసి అద్దె భరిస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంతంలో కొలువొచ్చినా... మంచి విద్యా సంస్థలో సీటొచ్చినా... కొత్త కోర్సును అభ్యసిం చేందుకు నగరంలోని కోచింగ్ సెంటర్‌ను ఎంచుకుని వెంటనే జాయిన్ అయినా... వెంటనే మదిలో మెదిలే ప్రశ్న ‘వసతి ఎలా’ అని. గతంలో రూమ్ అద్దెకు తీసుకోవడమో లేక బ్యాచ్లర్స్ రూమ్‌లో చేరడమో చేసేవారు. కానీ మారిన పరిస్థితుల్లో వెంటనే చక్కని హాస్టల్‌ను చూసి చేరిపోతున్నారు. ఇలాంటి హాస్టళ్లు రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్నట్లు ఓ అంచనా. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఈ హాస్టళ్లు మూతబడ్డాయి. సకల సౌకర్యాలతో వసతి ఇచ్చే హాస్టళ్లకు ఇప్పుడు గడ్డుకాలం నెలకొంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించే క్రమంలో భౌతిక దూరానికి ప్రాధాన్యత ఇవ్వాల ని నిర్ణయించిన నేపథ్యంలో ఈ హాస్టళ్లను ప్రభుత్వం మూసివేసింది. రోజురోజుకూ వైరస్ ప్రభావం తీవ్రమవు తుండడంతో ఈ హాస్టళ్లు మరి కొంతకాలం మూసివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయంతో హాస్టల్ నిర్వాహకులు నష్టాల్లో మునిగిపోయారు. హాస్టళ్లు మూతపడి రెండున్నర నెలలు పూర్తయింది. నిర్వహణ నిలిచిపోయి నప్పటికీ హాస్టల్ కోసం తీసుకున్న భవనానికి అద్దె చెల్లించాలి. నిర్వహణ కోసం తీసుకున్న రుణానికి వా యిదాల చెల్లింపులు, పని మనుషుల వేతనాలు... ఇలా ఆర్థిక భారంతో నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. అద్దె... గుదిబండ... వసతి రంగానికి మంచి డిమాండే ఉంది. ప్రైవేటు రంగంలో పనిచేసే యువత మొదలు విద్యార్థులంతా హాస్టల్లో ఉండటానికే మొగ్గు చూపుతున్నారు. ఖాళీ సమయంలో ఇతర వ్యాపకాలు చేసుకు నేందుకు అవకాశం ఉండటంతో ప్రైవేటు హాస్టళ్లు ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయాయి. హైదరాబాద్ నగరంలో రెండున్నర వేలకు పైగా లగ్జరీ, డీలక్స్ హాస్టళ్లున్నాయి. ఇందులో వసతి పొందేం దుకు నెలకు రూ.3,500 నుంచి రూ.6 వేల వరకు సౌకర్యాలకు తగినట్లు నెలవారీ ఫీజులుంటాయి. కొన్ని హాస్టళ్లు విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయా లతో అనుసంధానంగా కూడా నడుస్తున్నాయి. మెజార్టీ హాస్టళ్లు 50 మంది నుంచి 150 మందితో నిర్వహిస్తున్నారు. సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ఈ యూనిట్లు ఇప్పుడు తీవ్ర కష్టాల్లో చిక్కుకున్నాయి. లాక్డౌన్ కారణంగా వీటిని మూసివే యడంతో బోర్డర్లు ఖాళీ చేశారు. ఫలితంగా హాస్టల్ మూతబడినప్పటికీ అద్దె భవనంలో ఉండడంతో యజమానికి నెలవారీ కిరాయి చెల్లించాల్సిందే. మార్చి, ఏప్రిల్ నెలలో కొంత భారమనుకున్నా చాలా మంది హాస్టల్ నిర్వాహకులు అద్దె చెల్లించగా... మే నెలలో మాత్రం చేతులె త్తేశారు. మరో మూడు నెలలు ఇదే పరిస్థితి ఉండటంతో యజమానిని బతిమాలుకుం టున్నారు. కొందరు అద్దెలో సగం ఇచ్చేం దుకు ప్రతిపాదిస్తుండగా... మరికొందరు నిర్వహణ భారం తో భవనాన్ని ఖాళీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎల్బీ నగర్, బీఎన్‌రెడ్డి నగర్, ఇబ్రహీం పట్నం, సైదాబాద్, ఐఎస్‌సదన్ ప్రాంతాల్లో దాదాపు 37 హాస్టల్ భవనాలు ఖాళీ అయినట్లు సమాచారం. మరోవైపు హాస్టల్ సిబ్బందికి వేతనాలు భారమవుతున్నాయి. ఇతర సిబ్బందిని పని నుంచి తొలగించినప్పటికీ వంట మాస్టర్లకు మాత్రం నెలవారీ వేతనాలు చెల్లిస్తున్నట్లు ఎల్బీనగర్లోని ఓ హాస్టల్ నిర్వాహకుడు తెలిపారు. పరిస్థితి అనుకూలించేందుకు మరో మూడు నెలలుపట్టే అవకాశంఉందని, ఈలోపు చాలా మంది నిర్వాహకులు తప్పుకునే అవకాశం ఉందని ఇబ్రహీంపట్నంకు చెందిన నిర్వాహకుడు రవీందర్ అంటున్నారు. -
వసతి..కిరికిరి
- అనుమతుల్లేకుండా హాస్టళ్ల నిర్వహణ - ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల ఇష్టారాజ్యం - 16 కాలేజీలకు అనుమతులు లేవని నివేదిక - వీటిలో టీడీపీ నాయకుల అనుచరుల కాలేజీలు - త్వరలో షోకాజ్ నోటీస్‌లు జారీ చేస్తామన్న ఇంటర్ బోర్డు అధికారులు కర్నూలు సిటీ: జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలు అడ్డగోలుగా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అనుమతులు లేకుండా, నిబంధలు పాటించకుండా ఇంటర్ విద్యార్థులకు వసతి కల్పిస్తున్నారు. ప్రైవేట్ కళాశాల హాస్టల్ విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో పోలీసుల విచారణ జరపగా..ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థుల బలవన్మరణాలకు ఆయా విద్యా సంస్థలు నిర్వహిస్తున్న హాస్టళ్లలో సరైన సదుపాయలు లేకపోవడమే కారణమని తేలింది. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపకపోవడం, భద్రత కోసం సరైన సిబ్బందిని నియమించక పోవడమూ కారణమని ఇంటర్ బోర్డు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకునేందుకు ఇంటర్ బోర్డు అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఇలా నిర్వహిస్తున్న కాలేజీలు 16 ఉన్నట్లు తేలింది. వీటిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు నివేదిక పంపారు. ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి...! జిల్లాలో కార్పొరేట్, ప్రైవేటు జూనియర్ కాలేజీలు 99 ఉన్నాయి. వీటిలో జిల్లాలో నంద్యాలోని రాపూస్ జూనియర్ కాలేజీకి మాత్రమే హాస్టల్‌తో కూడిన అనుమతి ఉంది. మిగతా వాటికి ఒక్కదానికి అనుమతి లేదు. హాస్టళ్లతో కలిపి కాలేజీలను నిర్వహిస్తున్నవి సుమారు 30 శాతం ఉంటాయి. అయితే ఇంటర్ బోర్డు అధికారులు కేవలం 16 మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఈ వివరాలతో కూడిన నివేదికను బోర్డుకు అందజేశారు. త్వరలోనే ప్రభుత్వం కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలపై తనిఖీ చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనుంది. ఇందుకు ముందే గుర్తించిన కాలేజీలకు నోటీస్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. టీడీపీ నాయకుల అనుచరులకు చెందిన విద్యా సంస్థలు కూడా అనుమతులు లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నాయి. అయితే ఆ కాలేజీలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. తనిఖీలు చేయని బోర్డు అధికారులు...! జిల్లాలో ప్రైవేట్ కాలేజీలకు అనుమతులు ఇస్తున్న అధికారులు కచ్చితంగా తనిఖీ చేయాలి. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో ప్రతి కాలేజీని తనిఖీ చేసిన నివేదికను ఇంటర్ బోర్డుకు అందజేయాలి. అయితే అధికారులు ప్రైవేట్ కాలేజీలను తనిఖీ చేయడంలేదు. కాలేజీల్లో ఏదైనా సంఘటన జరిగినప్పుడే హడావుడి చేసి తూతూ మంత్రంగా నివేదికలు ఇవ్వడం పరిపాటిగా మారింది. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమన్యాలు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క కాలేజీకి మాత్రమే అనుమతి – వై.పరమేశ్వరరెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి జిల్లాలోని ప్రైవేట్ కాలేజీల్లో కేవలం నంద్యాలలోని రావూస్ జూనియర్ కాలేజీకి మాత్రమే హాస్టల్ అనుమతి ఉంది. అనుమతులు లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తున్న కాలేజీల వివరాలను ఇంటర్ బోర్డుకు అందజేశాం. వీరిపై చర్యలు తీసుకునే అంశం కమిషనర్ పరిధిలో పరిశీలనలో ఉంది.